మౌనంగానే ఎదుగు – Best Personality Development Story in Telugu
ఇవ్వాల్టి టాపిక్ లో Best Personality Development Story in Telugu గురించి తెలుసుకుందాం అండి.
మీరంతా కూడా నా టాపిక్ చూస్తూ నా మాటలను మౌనంగా వింటారని నేను ఆశిస్తున్నాను. మౌనం ఒక గొప్ప భాష్యం, మౌనం ఒక గొప్ప శక్తివంతమైన ఆయుధం, మౌనం ఒక అంతర్గత సర్దుబాటు, మౌనం నీ అంతరాత్మకి నీ బాహ్యానికి జరిగే అంతర్గత యుద్ధం, మౌనం ఎన్నో యుద్ధాలను రాకుండా ఆపేసే ఒక శాంతి సంకేతం, ఒక శాంతి ఒప్పందం, మౌనం నీ మాటకు విలువ లేని చోట నీ విలువనిపించి ఒక ఆత్మీయ నేస్తం, మౌనం నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళ దగ్గర అసలు నువ్వే అర్థం కాకుండా చేసే తెలివైన అస్త్రం, మౌనం కొన్ని ఒప్పందాలకి శాంతి కపోతం నిజంగా మౌనంతో ఎన్నో సమస్యల్ని మన దగ్గరికి రాకుండా చేసుకోవచ్చు. మౌనంతో ఎన్నో యుద్ధాలను ఆపేయొచ్చు మౌనంతో ఎన్నో సమస్యలకి పరిష్కారాన్ని కనుక్కోవచ్చు. మౌనంతో ఎన్నో ప్రణాళికలు వేసుకోవచ్చు మౌనంతో ఎన్నో మంచి మంచి నిర్ణయాలను తీసుకోవచ్చు. తెలివైన నిర్ణయాలను తీసుకోవచ్చు అంతేకాదు మౌనంతో మన శత్రువులను సైతం జయించవచ్చు. అందుకే మౌనం ఎంత గొప్పది కదా ఎంత శక్తివంతమైనది కదా చాలా సందర్భాలలో మౌనం ఒక ఆయుధం మౌనం ఒక అస్త్రం మరి మౌనంగా ఉండడం మనం నేర్చుకుంటే మనకే మంచిది కదా మరి ఎలాంటప్పుడు మౌనంగా ఉండాలి అన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాలా ఎప్పుడు మౌనంగా ఉండాలి.
ఎప్పుడు మౌనంగా ఉండకూడదు ఈ విచక్షణ గనుక మనకు తెలిసినట్లయితే మన మనసును మనం ప్రశాంతంగా ఉంచుకోవచ్చు మన జీవితాన్ని మనం సాఫీగా వెళ్లదీయొచ్చు మన మనసులో ఎలాంటి అలజడులు లేకుండా మనమే కాపాడుకోవచ్చు. అయితే ముందుగా మనం ఎప్పుడు మౌనంగా ఉండాలి అనేది నేర్చుకోవాలి ఒక్కొక్కసారి మనం ఎంత వాదించిన గెలవకపోవచ్చు. ఎదుటి వాళ్ళు కనీసం వాళ్ళకి విచక్షణ లేకుండా న్యాయ అన్యాయాలను పట్టించిచుకోకుండా కింద పడ్డ మాదే పై చేయి మేము పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనే మనస్తత్వం ఉన్నవాళ్ళు అయితే అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళతో పోటీ పడి మనం కూడా వాదిస్తూ పోతే ఇక వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది. ఒక్కసారి ఆలోచించండి మనం వాదించాలి అన్నా మనం మాట్లాడాలి అన్నా ఎదుటి వాళ్ళకి కూడా ఒక విలువ ఉండాలి. ఎదుటి వాళ్ళకి ఒక అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి, ఎదుటి వాళ్ళకి ఒక విచక్షణ జ్ఞానం ఉండాలి. ఒక తెలివైనటువంటి మాటల్ని మాట్లాడే వాళ్ళై ఉండాలి మరి ఇవేవి కాకుండా మూర్ఖత్వంతో వాదించే వాళ్ళ దగ్గర మనము వాదిస్తే ఏంటి లాభం ఇలాంటి వాదనల్ని మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. మన చుట్టుపక్కల కూడా కొంతమంది ఉంటారు వాళ్లకున్న పనుల్లో వాదించడమే అడ్డాల దగ్గర కూర్చుంటారు, టీ కొట్ల దగ్గర కూర్చుంటారు, మనం ఇండ్ల పక్కన ఉండొచ్చు, మనం పని చేసే ప్లేసెస్ లో ఉండొచ్చు, వాదిస్తూనే ఉంటారు వాళ్ళు అనవసరమైన రాజకీయాలు మాట్లాడుతుంటారు అనవసరమైనటువంటి విషయాల్లో తలదూరుస్తుంటారు. ఒక్కొక్కసారి మనల్ని అనవసరంగా విమర్శిస్తుండొచ్చు అనవసరంగా వేరే వాళ్ళ మీద గాసిప్పులు క్రియేట్ చేస్తుంటారు. అనవసరంగా మూడో వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడుతూనే ఉంటారు. మరి వాళ్ళ దగ్గర వాళ్ళు మూర్ఖులు అని మనకు తెలుసు వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని మనకు తెలుసు. నువ్వు చేసేది తప్పు అని మనం చెప్పినా వాళ్ళు వినరు అని తెలిసినప్పుడు మనం వాదించి ఏం లాభం ఉంటుంది చెప్పండి. “మూర్ఖులతో వాదన కన్నా మౌనమే” మిన్న అక్కడ వాదిస్తే వాళ్ళకి మనకి తేడా ఏమీ ఉండదు ఎట్టి పరిస్థితుల్లో మన వాదన కరెక్ట్ అని వాళ్ళు ఒప్పుకోరు. అలాంటప్పుడు గుండె పగిలేటట్టుగా అలసిపోయేటట్టుగా వాదించి మన ప్రశాంతతను కోల్పోవడం కన్నా మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించడమే మంచిది. మూర్ఖులతో వాదన అర్థం చేసుకోలేని వాళ్ళతో వాదన అనవసరం.
ఇక ఒక్కొక్కసారి మన ఫ్యామిలీ మెంబర్సే మనల్ని అర్థం చేసుకోరు కుటుంబంలో రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. నెగిటివిటీ అనేది బయట ఎక్కడో కాదు మన ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు. భార్యా భర్తల మధ్యన ఉండొచ్చు, అన్నదమ్ముల మధ్యన ఉండొచ్చు, అక్కచెల్లెల మధ్యన ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఫ్రెండ్స్ మధ్యన ఉండొచ్చు, ఎక్కడైనా నెగిటివిటీకి ఛాన్సెస్ ఉన్నాయి. అందరూ ఒకే రకమైనటువంటి మనస్తత్వం తో ఉండరు కదా మనం ఆలోచించినట్టుగానే ఎదుటి వాళ్ళు ఆలోచించాలని లేదు కదా ఎవరి పర్సెప్షన్ వాళ్లకు ఉంటది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్లకు ఉంటది అలాంటప్పుడు మనం ఒకసారి చెప్పి చూడాలి ఇది కాదు ఇది అని లేదు వాళ్ళు వినట్లేరు అర్థం చేసుకోవట్లేరు వదిలేయండి మౌనంగా ఉండండి అక్కడ వాదించడం వల్ల ఒక్కొక్కసారి మన ఇంట్లో మనం వాదించడం వలన మన కుటుంబ సభ్యులు మన రక్త సంబంధం లేదా మన భార్య భర్తల మధ్యన మనలో మన ఫ్యామిలీ మధ్యనే ఒక ఆ ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటది. ఫ్యామిలీలో అంతా డిస్టర్బ్ అయిపోతారు పిల్లలు డిస్టర్బ్ అవుతారు పెద్దలు డిస్టర్బ్ అవుతారు సో మనం ఎలాగో కలిసి ఉండాల్సిందే ఆ రిలేషన్ ని ఎలాగో మెయింటైన్ చేయాల్సిందే. ప్రతి గొడవకి మనం రిలేషన్స్ ని వదులుకొని వెళ్ళిపోలేము కదా మరి కలిసి ఉండక తప్పదైనప్పుడు కొనసాగించక తప్పదైనప్పుడు అన్ని చోట్ల వాదన ఎందుకు ఓకే గెలవనీయండి కాసేపు ఎదుటి వాళ్ళని నష్టం లేదు కదా ఒక్కొక్కసారి వెనకడుగు వేయడం కూడా గెలుపే ఒక్కొక్కసారి కాదు నాకు తెలిసి చాలా సందర్భాల్లో మనం తగ్గాము అంటే ఓడిపోయామని కాదు నెగ్గాము మనకు వెనక మనం ఒక వెనక అడుగు వేయడం ద్వారా ఎదుటి వాళ్ళ ఈగో సాటిస్ఫైడ్ అవుతది. ఆ టైం కి కానీ అండి మనకు వచ్చే నష్టం లేదు కదా అన్ని సందర్భాల్లో నేనే అన్న అహాన్ని కూడా ఒక్కొక్కసారి మనకు ఆటంకంగా మారుతుంటది కాబట్టి మనది కరెక్ట్ అయినప్పటికీ ఎదుటి వాళ్ళది తప్పైనప్పటికీ కొన్ని చోట్ల ముఖ్యంగా కుటుంబంలో వాదించకుండా ఉండడమే మంచిది మౌనంగా ఉండడమే మంచిది. ఒకసారి మనం చెప్పి చూస్తాం నో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అంగీకరించట్లేదు ఓకే వదిలేద్దాం. అలా కాకుండా నాదే కరెక్ట్ నాదే కరెక్ట్ అనుకుంటూ వాదించుకుంటూ ఉంటే కుటుంబంలో తలు తప్ప కలహాలు తప్ప స్నేహ వాతావరణం ఉండదు. అలాంటి వాతావరణంలో మనం ప్రశాంతంగా ఉండం సంతోషంగా ఉండం మనం ఎన్నో కోల్పోతాం అలాంటి వాతావరణంలో మన పిల్లలు సరిగ్గా ఉండరు సో ఎందుకు కొన్ని చోట్ల మనం మౌనంగా ఉండడం వలన వాతావరణం సద్గుమగుతుంది అని అనిపించినప్పుడు మౌనంగా ఉండడమే బెస్ట్.
అక్కడ నిజంగా చెప్పాలి అంటే మనమే గెలిచినట్టు మనమే ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసినట్టు కాబట్టి మూర్ఖుల దగ్గర వాదన అనవసరం ఒక్కొక్కసారి మన కుటుంబంలో కూడా వాదన అనవసరం నీ బాధను ఎవరు అర్థం చేసుకోవట్లేరు ఒకసారి చెప్పి చూస్తావ్ ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేరు ఓకే మన ఆయుధం ఉంది కదా మౌనం వహించండి. ఒక్కొక్కసారి మౌనమే సమస్యలకి పరిష్కారాన్ని చూపిస్తది మౌనమే నువ్వంటే ఏందో ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేస్తది మౌనంగానే ఎదగమని అనే ఒక సాంగ్ ఉంది చూసారా. నిజంగా చాలా సందర్భాల్లో మనం గెలిచేదాకా మౌనంగా ఉండాలి మనల్ని ఎన్నో వెక్కిరింతలు వెక్కిరిస్తుంటాయి మౌనంగా ఉండండి. నువ్వు గెలిచేదాకా నీ గెలుపు చప్పట్లే నీ గెలుపు సప్పుడే వాళ్ళ నోర్లు మూయించేదాకా మీరు మౌనంగా ఉండండి. ఒక్కొక్కసారి అవమానాలు ఎదురవుతుంటాయి పర్వాలేదు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు కదా మౌనంగా ఉండండి. నిన్ను అన్నవాళ్లే బాధపడే రోజు ఒక రోజు వస్తది కచ్చితంగా ప్రతి కర్మకి ప్రతిఫలం ఉంటది ఇవాళ నిన్ను బాధ పెడుతుంటే నువ్వు వాళ్ళతో యుద్ధం చేసి గెలవలేవు గెలిచి నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం నీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవడం నీ సమయాన్ని నీ లక్ష్యం మీద పెట్టు. నువ్వు సాధించే దాని మీద పెట్టు నీ కోసం నువ్వు వెచ్చించు నీ సమయాన్ని అనవసర వాదనలకి అనవసరమైనటువంటి కామెంట్లకి అవసరమైన అనవసరమైనటువంటి మనుషులకి మనం సమాధానం ఇచ్చుకుంటూ పోతే వాళ్లకు మనం విలువిచ్చిన వాళ్ళం అవుతాం. వాళ్ళని మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం ఈరోజు ఒక మాట అన్నారు అని మనం సమాధానం ఇచ్చి కూర్చుంటే రేపు రెండు అంటారు మళ్ళా రేపు రెండిటికి సమాధానం ఇవ్వాలి ఎల్లుండి ఒక ఐదు అంటారు ఆ ఐదింటికి సమాధానం ఇవ్వాలి. మనం మాట్లాడటం మొదలు పెడితే నిరంతరం మనం ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటూ పోవాల్సి ఉంటది కాబట్టి చాలా చోట్ల నిన్న అనవసరంగా ఒక మాట అంటే ఒక చిరునవ్వు తోటి నవ్వుకుంటూ పోండి అంతే పోయేది ఏమీ లేదు వాళ్లే ఆశ్చర్యపోతారు ఏంది మనల్ని కొంతమంది మనల్ని రెచ్చగొట్టాలని చూస్తుంటారు. మన టైం వేస్ట్ చేయాలి మన మనశ్శాంతిని డిస్టర్బ్ చేయాలి మన మనసును డిస్టర్బ్ చేయాలి మనల్ని గాయపరచాలని చూసేవాళ్ళు కొంతమంది మంది వాంటెడ్లీ మనల్ని రెచ్చగొడుతుంటారు. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకండి మౌనంగా ఉండండి ఇంకా టైం మనది కాదు ఒక్కొక్కసారి మనం ఎన్ని సార్లు ప్రయత్నించిన ఓటమి ఎదురవుతుంటది కష్టాలు గొలుసుకట్టు లాగా మనల్ని వెంటాడుతుంటాయి. ఒక్క కష్టం నుంచి మరొక కష్టంలోకి అడుగేసినట్టుగా ఉంటది ఇలాంటి సందర్భాలు నేను చాలా సార్లు ఫేస్ చేశాను తెలుసా వరుసగట్టి మనం మన వెంట పరిగెత్తుకుంటూ వచ్చినట్టుగా ఉంటాయి ఒక సమస్య నుంచి మరొక సమస్యలోకి అడుగు పెట్టినట్టుగా ఉంటది కాలం కక్ష కట్టినట్టుగా ఉంటది అన్ని ఒడిదుడుకులే ఎటు చూసినా సమస్యలే ఎటు చూసినా బాధలే ఉంటాయి. ఇలాంటి టైం లో మనం చేయాల్సింది అల్లా ఒకటే మౌనంగా ఉండడం కాలం మళ్ళీ మనకు అనుకూలంగా మారేదాకా కాలం అనుకూలంగా మారడం నిజంగా కాలం అనుకూలంగా మారుతుందా ఎప్పుడు మారుతుంది నువ్వు నిబ్బరంగా ఉన్నప్పుడు మారుతుంది.
నువ్వు నీ కష్టాలకి కృంగిపోయినప్పుడు కాలం నీకు అనుకూలంగా మారుతుంది. నువ్వు కష్టపడ్డప్పుడు నీ హార్డ్ వర్క్ నువ్వు వదలకుండా ఉన్నప్పుడు నీ సంకల్పాన్ని నువ్వు వదలకుండా ఉన్నప్పుడు నీ మనోనిబ్బరాన్ని నువ్వు కోల్పోకుండా ఉన్నప్పుడు మాత్రమే కాలం నీకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి ఎన్నైనా రానియండి ఎన్నైనా పోనీయండి మనం ఒక్కొక్కసారి మన పరిస్థితి బాలేదు మన టైం కాదు మౌనంగా ఉందాం ఆ మౌనమే ఎన్నో వాటిని పరిష్కరిస్తది కాబట్టి చాలా సందర్భాల్లో మౌనమే మనల్ని గెలిపిస్తుంది అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. అదేవిధంగా మనం మాట్లాడటం ద్వారా కొన్ని బంధాలు దూరం అవుతాయి అనుకున్నప్పుడు మౌనమే మంచిది. మనం మాట్లాడటం ద్వారా సమస్య పెరుగుతుంది అనిపించినప్పుడు మౌనమే మంచిది. మనం మాట్లాడటం ద్వారా సమస్య పరిష్కారం కాదు అనిపించినా కూడా మౌనమే మంచిది. మనం మాట్లాడటం ద్వారా అక్కడ జరిగే లాభం ఏమీ లేదు అనిపించినప్పుడు మౌనమే మంచిది. మనం మాట్లాడటం ద్వారా మన విలువ పెరగదు అనిపించినప్పుడు కూడా మౌనమే మంచిది. నిజంగా అంటే చాలా సందర్భాల్లో చూడండి గొప్ప గొప్ప వాళ్ళందరూ అంతా కూడా మౌనంగా ఉంటారు వాళ్ళు ప్రతిదీ నవ్వుతూ స్వీకరిస్తారు ప్రతి దాన్ని కూడా మౌనంగా స్వీకరిస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది బయటికి చెప్పరు. వాళ్ళ గెలుపు శబ్దాలే పెద్ద పెద్ద ఉరుము లాగా ప్రతిధ్వనిస్తాయి కానీ వాళ్ళు మాత్రం మౌనమునులాగానే ఉండిపోతారు. నిజంగా మనం ఎంత మౌనంగా ఉంటే మన మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటే మన బ్రెయిన్ అంత షార్ప్ గా పనిచేస్తుంది మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది బ్రెయిన్ కి గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది బ్రెయిన్ అనేది చురుకుగా ఉంటుంది. కాబట్టి ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మనం ఎందుకబ్బా మాట్లాడటం ఎందుకబ్బా పోట్లాడటం ఎందుకబ్బా వాదించడం మౌనంగానే ఉందాం.
మరి అన్ని చోట్ల మౌనం మంచిదేనా నీ ఆత్మ గౌరవం దెబ్బతినేటప్పుడు మాత్రం మౌనంగా ఉండకు ఒక్కసారి గట్టి వార్నింగ్ ఇవ్వాలి అలా అని చెప్పేసి కొంతమంది మూర్ఖులు ఎంత వార్నింగ్లు ఇచ్చిన వాళ్ళ మనసు మారదు వాళ్ళు ఏమంటారు కదా కుక్క తోక వంకర అన్నట్టుగా ఉంటారు మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ వంకర తోకని మనం స్ట్రెయిట్ చేయలేం కదా అలాంటప్పుడు మళ్ళీ మనం వాదించి వేస్ట్.
కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడం మంచిది కాదు ముఖ్యంగా అన్యాయం తప్పు జరిగిపోతుంది ఎదుటి వాళ్ళకి వేరే వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. ఇంకొకరిని ఇంకొకరు బాగా ముంచేస్తున్నారు ఇంకొకరిని బాధ పెడుతున్నారు అప్పుడు కూడా మౌనమే మంచిది అని ఇవేవి నాకు పట్టట్లేదు ఇవన్నీ నాకు సందర్భం నాకు సంబంధించినవి కావు అని ఊరుకుంటే అన్యాయాన్ని చేసే వాళ్ళ కంటే తప్పు చేసే వాళ్ళ కంటే తప్పును చూస్తూ సహనంగా ఉండే వాళ్లే గొప్ప నేరం చేసినట్టు లెక్క. ఒకరిని కాపాడే కాడ మనం నోరు తెరుద్దాం. ఒకరికి న్యాయం చేసే దగ్గర నోరు తెరుద్దాం. ఒకరి వైపు సపోర్ట్ గా నిలబడే దగ్గర నోరు తెరుద్దాం. కానీ ఆ నోరు సమస్యను పెంచే విధంగా ఉండకూడదు సమస్యను జటిలం చేసే విధంగా ఉండకూడదు లేని యుద్ధాలను తీసుకొచ్చే విధంగా ఉండకూడదు. ఒక శాంతి కపోతం లాగా సంధిని చేకూర్చే విధంగా ఉండాలి. ఒక శాంతి కపోతం లాగా రాయబారిగా ఉండాలి. కాబట్టి విచక్షణ తోటి ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి కానీ సాధ్యమైనంత వరకు మనం మౌనంగానే ఉండాలి, మౌనంగా ఎదగాలి. మనం ఎదుగుతూ వెళ్ళిపోతుండాలి అంతే మనల్ని విమర్శించిన వాళ్ళు నోర్లు మూసుకుంటారు వాళ్ళు మన వెనకే ఎక్కడో ఉండిపోతారు. మనల్ని అవమానించిన వాళ్ళు కళ్ళు తేలేస్తారు మనల్ని అనవసరంగా అన్నవాళ్ళు బాధపడతారు బాధపడనియండి బాధపడకపోనియండి మనకు అనవసరం కాబట్టి మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ పోతూ మీ ఫోకస్ అంతా మీ మీదనే ఫోకస్ అనేది మన మీదనే ఉండాలి.
ఇతరుల మీద కాదు అనవసరమైన విషయాల మీద కాదు అనవసరమైన వాదన మీద కాదు కాబట్టి మిమ్మల్ని మీరు గెలిపించుకునే విధంగా అవసరమైనప్పుడు మౌనాన్ని ఆశ్రయించి మీరు ఎవరికీ అర్థం కానట్టుగా అర్థమయ్యి అర్థం కానట్టుగానే ఉండాలి. పిడికిలు ఓపెన్ చేస్తే పిడికిలు బిగించినంత సేపే అందులో ఏముందో అన్న ఆన్సైటి ఉంటది ఓపెన్ చేస్తే ఎవ్వరికీ కూడా దాని మీద క్యూరియాసిటీ ఉండదు. కాబట్టి ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటూ ఒక్కొక్కసారి తగ్గాల్సినప్పుడు తగ్గుతూ మనల్ని మనం ముందుకు నడిపించుకుంటూ ముందుకు తోసుకుంటూ మౌనంగానే ఎదగాలి. మౌనంగానే ముందుకు వెళ్ళిపోవాలి! ఓకేనా ఆల్ ది బెస్ట్
1 thought on “మౌనంగానే ఎదుగు | Best Personality Development Story in Telugu”