విజయానికి రహదారి కష్టపడటమొక్కటే | Life Changing Telugu Motivation
ఇవ్వాల్టి టాపిక్ లో Life Changing Telugu Motivation – విజయానికి రహదారి కష్టపడటమొక్కటే గురించి తెలుసుకుందాం అండి
లైఫ్ లో ఎవరికైనా సరే ఏ కోరిక ఉంటుంది చెప్పండి సక్సెస్ సాధించాలి విజేతగా నిలబడాలి విజయం సాధించాలి జీవితంలో హ్యాపీగా ఉండాలి ఇదే కోరిక ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా అవునా కాదా మరి విజేత నిలబడాలి అంటే విజయం సాధించాలి అంటే ఏదైనా షార్ట్ కట్ రూట్ ఉంటుందా ఎవరైనా చెప్పగలరా ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయానికి షార్ట్ కట్ రూట్స్ అంటూ ఏమీ ఉండవు ఉన్నదల్లా ఒకటే రూట్ ఏంటిది ఆ రూట్ అంటే నమ్మకంతో అంతకు మించినటువంటి అంకిత భావంతో అంతకు మించినటువంటి పట్టుదలతో హార్డ్ వర్క్ చేయడమే హార్డ్ వర్క్ ఒక్కటే సక్సెస్ సాధించడానికి ఉన్నటువంటి ఏకైక రహదారి అంతే ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో మంచి పొజిషన్ లో ఉండాలనే కలలు కంటారు అవునా కాదా కలలు లేకుండా ఎవరైనా ఉంటారా ఏ నా లైఫ్ బాగుండొద్దు నేనేదో పిచ్చోడిలాగా గడిపేస్తాను అని ఎవరైనా అంటారా ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో మంచిగా ఉండాలి మంచి పొజిషన్ లో ఉండాలనే కలలు కంటారు అయితే ఈ కలల్ని సహకారం చేసుకోవడానికి మనం ఏం చేయాలి అనేది మొట్టమొదటి ప్రశ్న కొన్నిటిని సాధించాలి అంటే కొన్నింటిని పక్కన పెట్టాలి కలల్ని సహకారం చేసుకోవడం అనేది అంటే విజేతగా నిలబడటం అనేది ఒక యుద్ధంతో సమానం ఆ యుద్ధాన్ని మనం గెలవాలి అంటే నిరంతరం పట్టు వదలకుండా కష్టపడేవాడే విజేతగా నిలబడతాడు కష్టపడే నిరంతరం పట్టు వదలకుండా కష్టపడుతూ యుద్ధం చేసేవాడే విజేత అవుతాడు అయితే ఈ యుద్ధంలో మనం విజేతగా నిలబడే వరకు మన జీవితంలో కొన్ని మార్పులు కొన్ని పెను మార్పులు కూడా మనకు అవసరం మనం గెలవాలి అంటే మనం కొన్నింటిని కోల్పోవాలి మనం కొన్నింటిని మార్చుకోవాలి కొన్ని అలవాట్లను చేర్చుకోవాలి కొన్ని అలవాట్లను వదిలించుకోవాలి కొంత మనలో మనం మార్పు తెచ్చుకోవాలి కొన్ని మనలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులను ఓడించాలి కొంతమందిని దూరం పెట్టాలి ఇంకా ఒక్క ఒకటే ఒక మాటలో చెప్పాలి అంటే మనం గెలవాలి అంటే గెలిచేదాకా యుద్ధం కొనసాగించగలగాలి సక్సెస్ ఫుల్ గా అంటే మనం అజ్ఞాతవాసం చేయాలి అంతే అప్పుడే మనం గెలుస్తాం అన్నీ కావాలి నేను ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి నాకు టైం పాస్ కావాలి మిత్రుల్ని కలవాలి మొబైల్స్ చూడాలి సినిమాలు చూడాలి షికార్లు చేయాలి ముచ్చట్లు పెట్టాలి గాసిప్పులు మాట్లాడుకోవాలి నేను సక్సెస్ కావాలి అంటే మాత్రం నడవదు ఒకటి కావాలి అంటే ఎన్నింటిలో త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ త్యాగము అనేది ఇక్కడ కొన్ని మన విజయానికి అడ్డుగా నిలిచేటటువంటి మన లక్షణాలు ఉంటాయి అవి తెలియదు అవి మన లోపాలుగా పెరిగి పెద్దగా అవుతాయి ముందుగా అందుకనే మీరు ఏదైనా లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు ఏదైనా సాధించాలి అని గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు ఒక్కసారి మీ లోపలికి మీరు తొంగి చూసుకోండి మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారా ఏమైనా మార్చుకోవాల్సినవి ఉన్నాయా మీరు కరెక్ట్ గా ఆలోచిస్తున్నారా కాన్ఫిడెంట్ గా ఉన్నారా నమ్మకంగా ఉన్నారా ఆత్మవిశ్వాసంతో ఉన్నారా హార్డ్ వర్క్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారా మీలో ఏమైనా లోపాలు ఉన్నాయా ఆ లోపాలను ముందు వదిలించుకోండి దుమ్ము దులిపినట్టుగా మీ బ్రెయిన్ అంతా క్లీన్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష్య సాధన కోసం కూసోవడానికంటే మనం ఒక కూసోవడాని కంటే ముందు మనం ఒక పండగ వచ్చినప్పుడు ఏం చేస్తాం చెప్పండి ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం అవునా కాదా చక్కగా చక్కగా కొత్త బట్టలు వేసుకొని పూజలు చేసుకుంటాం ఇప్పుడు మీ లక్ష్య సాధన కోసం మీరు ఉపక్రమించడం అనేది కూడా ఒక పూజతో సమానం దానికి ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా ఇల్లు దులపడం కాదు మీ మెదడును దులిపేయాలి మెదడులో ఉన్నటువంటి అన్ వాంటెడ్ వేస్ట్ ఆలోచనల్ని వేస్ట్ అలవాట్లని మీ విజయానికి దోహదం చేయనటువంటి ప్రతి దాన్ని కూడా దులిపి తీసి బయట పడేసేయాలి ఇప్పుడు క్లీన్ బ్రెయిన్ తోటి మీరు యుద్ధానికి సన్నంతం కావాలి అలాంటి టైం లో మాత్రం మనం అనుకున్నది సాధించడానికి యుద్ధం చేయడానికి మనకి శక్తి అనేది వస్తుంది లేకపోతే మన మనసు నిండా డస్ట్ బిన్ లాగా వేస్ట్ అన్ని ఆలోచనలు పెట్టుకొని మనం లక్ష్యం కోసం పోరాడితే అంటే మాత్రం అడుగడుగున మనకి అవాంతరాలు ఎదురవుతాయి మన మనసు మన మాట వినదు మనం ఒక సైడ్ పోతామంటే అది ఇంకొక సైడ్ పోదాం అంటే ఉంటుంటది కాబట్టి ముందు మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇలా మనం ఉపక్రమించేటప్పుడు ఇలా కొన్నిటిని కోల్పోయేటప్పుడు ఒక్కొక్కసారి కొంత అసంతృప్తి చెందుతారు మీరు 100% ఇది నిజం ఈ అసంతృప్తి తోటే మీరు సాధించాలి అనే అంశం పట్ల మీకు కాస్త ఆసక్తి కూడా తగ్గిపోతది మీ కలలు కూడా నెమ్మదిగా బలహీనమైపోతుంటాయి ఫైనల్ గా మీకు వచ్చే రిజల్ట్ ఏంటి చెప్పండి చేయం మరి మీరు అపజయాన్ని కోరుకుంటారా తాత్కాలికంగా మీరు కొన్నింటిని త్యాగం చేస్తారా ఈ విషయంలో మీరు చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంటే తప్ప మీరు గెలవలేరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరం కూడా కలలు కంటాం కానీ కొంతమంది సహకారం చేసుకుంటున్నారు మరి మీరు ఎందుకు విజేతల లిస్టులో ఉండలేకపోతున్నారు అనే విషయం మీద ఫస్ట్ మీరు ఫోకస్ చేయండి మనం కలలు కనాలి ఖచ్చితంగా మనకంటూ కొన్ని లక్ష్యాలు ఆశయాలు ఉండాలి అయితే మనం ఈ కలలకు భయపడితే ఆగిపోతాం అదే విధంగా మనల్ని భయపెట్టలేని కలలు కన్నా కూడా మనం సక్సెస్ కాలేము కల ఎలా ఉండాలి అంటే మనల్ని భయపెడుతూనే ఉండాలి ముందుకు నడిపించాలి అంటే నిద్ర లేని రాత్రుల్ని గడపగలిగే అంత కలలు మనం కలగలగాలి అప్పుడే మనం సక్సెస్ సాధించగలుగుతాం అంటే ఆట అనేది ఎప్పుడూ కూడా చిన్న చిన్న గేమ్స్ కాదు మనం ఆడాల్సింది పెద్ద గేమ్ ఆడాలి లక్ష్యం ఎప్పుడూ కూడా శిఖరం అంత ఎత్తులో ఉండాలి అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మనం చూడాల్సింది నక్షత్రాలని అంతే కానీ అరికాళ్ళని కాదు అరికాళ్ళను చూస్తే మనం ఏంటి మన చూపులు ఎక్కడ ఉంటాయి కింది వైపుకి ఉంటాయి మనం ఎక్కడ ఆగిపోతాం నేల మీదనే ఆగిపోతాం నక్షత్రాలనే చూడగలగాలి నక్షత్రాలను అందుకోలేకపోవచ్చు కానీ అందుకోవడానికి చేసే ప్రయత్నంలో ఎన్నో మైలు రాళ్లను మనం దాటొచ్చు కాబట్టి మన అంబిషన్స్ ఎప్పుడూ కూడా హై లెవెల్ లో ఉండాలి నేను ఇప్పుడు హై లెవెల్ అంటే అందరూ ఐఏఎస్ ఆఫీసర్స్ కాలేరు అందరూ అంబానీలో కాలేరు అవునా కాదా కాకపోతే నేను అనుకున్న దాంట్లో మీకంటూ ఒక డెస్టినేషన్ మీరు పెట్టుకొని ఓకే ఫలానాది నేను రీచ్ కావాలి ఫలానాది నేను సాధించాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రభుత్వం ఉద్యోగం కోసం ఒక కాంపిటీటివ్ స్టేట్ లెవెల్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం మీరు పోటీ పడుతున్నప్పుడు ఫస్ట్ ర్యాంక్ అనేది మీ హై లెవెల్ టార్గెట్ ఫస్ట్ ర్యాంక్ టార్గెట్ గా పెట్టుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా కనీసం ఉద్యోగం అయినా వస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీరు ఒక లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నప్పుడు ముందుగా మీ చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనేది చూసుకోండి మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళు ఉండకూడదు మీ టైం వేస్ట్ చేసే వాళ్ళు కూడా ఉండకూడదు మీరు తో ఎక్కువ సమయాన్ని గడపాలి అని కోరుకునే వాళ్ళు అసలే ఉండకూడదు ఎందుకు అంటే మనతో ఎక్కువ సమయం గడపాలి అనుకుంటున్నారు అంటే దాని అర్థం మన టైం ని వాళ్ళు కోరుకుంటున్నారు ఎప్పుడైతే వాళ్ళకి ఇవ్వడం మొదలు పెడతామో మన లక్ష్యానికి మన లక్ష్యాన్ని సాధించడానికి మనకు టైం సరిపోదు మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం అనేది మన మీద చాలా పడుతుంది నెగిటివ్ పీపుల్ ఉంటే నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళు మన చుట్టూ ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మనం తీసుకునే నిర్ణయాల మీద వాళ్ళ ప్రభావం వాళ్ళ ఆలోచనల ప్రభావం చాలా ఉంటుంది వాళ్లకు తగ్గట్టుగా మనం డిసైడ్ అయిపోతుంటాం అందుకనే ముందుగా మీరు ఏదైనా సాధించాలి అంటే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల వ్యక్తులను నివారించి సానుకూల వ్యక్తులని మీ చుట్టూ చేర్చుకోండి పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళని మీ చుట్టూ చేర్చుకోండి అదేవిధంగా ఒక్కొక్కసారి మనం ఫెయిల్యూర్ అవుతుండొచ్చు కానీ చాలా మంది పెద్దలు చెప్పారు చాలా మంది గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు మనకు ఉదాహరణగా మన కంటి ముందు కనిపిస్తున్నాయి ఏంటది ఫెయిల్యూర్స్ అనేటివి విజయానికి సోపానాలు అని ఆ ఫెయిల్యూర్ ని మనం ఎలా తీసుకుంటాము అనేది మన భవిష్యత్తు నిర్ధారిస్తుంది కాబట్టి అనుభవాలే జీవిత పాఠాలు అని మీరు గుర్తించాలి ఫెయిల్యూర్స్ కూడా జీవిత పాఠాలే ఫెయిల్యూర్ అయినంత మాత్రాన జీవితం ఆగిపోయినట్టు కాదు దాన్నే మళ్ళీ మీరు విజయానికి సోపానంగా మార్చుకోవాలి చాలా మంది ఇంకొక చేసే పెద్ద మిస్టేక్ ఏముంటుంది అంటే అందరూ వెళ్లే మార్గంలోనే మేము వెళ్తాము అంటారు గుర్తుపెట్టుకోండి మీరు లైఫ్ లో సక్సెస్ సాధించాలి అంటే అందరూ వెళ్లే మార్గంలో కాదు వెళ్లాల్సిందే కొద్దిమంది వెళ్లే మార్గంలో వెళ్ళాలి దీనికి చాలా సార్లు నేను చాలా వీడియోస్ లో ఎగ్జామ్పుల్స్ చెప్పాను ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే వేలల్లో పోస్టులు ఉంటే ఉద్యోగం వస్తది అని చాలా మంది అనుకుంటారు నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను తక్కువ సంఖ్యలో పోస్టులు ఉన్నప్పుడు కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుందన్న విషయం చాలా మందికి ఆ లాస్ అర్థం కాదు అదేవిధంగా అందరూ పోయే రూట్లో ఉద్యోగాలు కూడా తక్కువ అంటే కాంపిటీషన్ అందరూ ఒకటే రంగాన్ని ఎంచుకున్నప్పుడు ఆ రంగంలో పోటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త భిన్నంగా ఆలోచించండి అందరూ పోయే మార్గంలో కాదు మీకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని ఏర్పరచుకొని మీ వెనక కొంతమంది రావడానికి మీరు మార్గదర్శకులుగా మారాలి కాబట్టి ఒక లక్ష్యాన్ని ఎంచుకునే విషయంలో కూడా మీరు చాలా లాజిక్ గా చాలా సక్సెస్ సక్సెస్ఫుల్ గా ఆలోచించగలగాలి థింక్ డిఫరెంట్ థింక్ బిగ్ అనే విషయము మీరు మర్చిపోకండి మనం డిఫరెంట్ గా ఆలోచించినప్పుడే తొందరగా విజేతలుగా నిలబడగలుగుతాం గొర్రెల్లాగా అందరి పోయే మార్గంలో కాదు మీకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని మీరు ఎంచుకొని ఆ ఎంచుకునే విధంగా మీరు ఆలోచించగలగాలి అదేవిధంగా సక్సెస్ కావాలి అంటే సక్సెస్ అయినటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రను చదవండి వాళ్ళ అలవాట్లను పరిశీలించండి సక్సెస్ అయినటువంటి ఏ విషయమే ఉద్యోగ వ్యాపార రంగాలలో సక్సెస్ గా ఉన్నటువంటి విజేతల యొక్క జీవన విధానాన్ని పరిశీలించండి వాళ్ళ అలవాట్లు ఏంటి ఒక పెద్దాయన చెప్పేవాడు నీ సక్సెస్ కి కారణం ఏంటి అంటే నేను తలను దువ్వుకునేటప్పుడు నా తల వెంట్రుకల గురించి ఆలోచిస్తాను పళ్ళు తోవ్వుకునేటప్పుడు నా పళ్ళ గురించి ఆలోచిస్తాను అంటే ఒక పని చేసేటప్పుడు ఆ పని మీద ఎంత ఫోకస్ ఉంటుంది అనేది ఆ మాటల్లో మనకు అర్థమవుతుంది చదువుకునేటప్పుడు చదువు గురించి ఆలోచించాలి ఇది ఏకాగ్రతకి ఒక సింబల్ మనం ఫోకస్డ్ గా ఉండడానికి ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు ఒక గొప్పైన మాట ఇది అదేవిధంగా వాళ్ళ యొక్క అలవాట్లు వాళ్ళ జీవిత చరిత్రల మీద మీరు ఫోకస్ చేయండి వాళ్ళ యొక్క ఆత్మ కథలు చదవండి వాటి నుంచి ప్రేరణ పొందండి కలలు కనగానే సరిపోదు గొప్ప గొప్ప ఆశయాలు లక్ష్యాలు ఉండగానే సరిపోదు ప్రణాళిక వాటిని సాధించడానికి ప్రణాళికలు అనేటివి చాలా అవసరం గొప్ప గొప్ప కార్యాలు గొప్ప గొప్ప సక్సెస్ లు అన్నీ కూడా మంచి ప్రణాళికల నుంచి పుట్టుకొచ్చినయే ఈ విషయం మర్చిపోకండి ప్రణాళిక మిమ్మల్ని నడిపించగలగాలి వాయిదా వేసుకొని ప్రణాళికలు మీకు కావాలి అదేవిధంగా మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా నిరంతరము మార్చుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఏ మార్చుకోకండి అవసరమైనప్పుడు మార్చుకోగలగాలి ఆహ్వానించగలగాలి పాజిటివ్ గా ఉండాలి మీ బాధ్యత మీదే గెలిచేదాకా మీ బాధ్యత మీదే మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి మీ సమయాన్ని కాపాడుకోవాలి మీ ఆత్మ స్థైర్యాన్ని కాపాడుకోవాలి మీ పట్టుదలని కాపాడుకోవాలి మీ విల్ పవర్ ని పెంచి పోషించుకోవాలి మీ లక్ష్యాన్ని సాధించేంత వరకు మీ ఫోకస్ మొత్తం కూడా మీ మీదనే ఉండాలి ఆ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి మీరు చేసే లైఫ్ మీ లైఫ్ లో ఎక్కువ భాగము అనేది మీకు సంతోషాన్ని ఇస్తూ మీ చుట్టూ ఉన్నటువంటి నలుగురికి మీ వల్ల సంతోషం కలిగే విధంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి గెలుపు అంటే డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు మనం గెలుస్తూ నలుగురిని మనతో పాటుగా గెలిపించగలగాలి నలుగురు మన వైపు తిరిగి మనల్ని ఆదర్శంగా తీసుకోగలగాలి మన ఆలోచనలు కూడా నలుగురికి ఆదర్శంగా ఉండాలి మన అలవాట్లు కూడా నలుగురికి ఆదర్శంగా ఉండాలి మన సక్సెస్ కూడా నలుగురికి ఆదర్శంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి మనం గెలవాలి అంటే మనం చాలా మారాలి చాలా మార్చుకోవాలి సో విజేతలు గా నిలుస్తారు అని ఆశిస్తున్నాను మీరంతా కూడా సక్సెస్ సాధించడానికి మిమ్మల్ని మీరు కొత్తగా మలుచుకుంటారు అని కూడా నేను ఆశిస్తున్నాను ముందుగా ఏది ఈ మార్పును మనం ఆహ్వానించగలగాలి సక్సెస్ గా నిలబడగలగాలి అంటే ముందుగా మన మైండ్ సెట్ అనేది పాజిటివ్ గా ఉండాలి సానుకూల దృక్పదం అనేది ఉండాలి మీరు ఎంత పాజిటివ్ గా ఉంటే అంత విశాలంగా ఆలోచించగలుగుతారు ఆలోచనలు ఎంత విశాలమైతే సమస్య అంత చిన్నది అవుతుంది త్వరగా మీరు మారడానికి మీకు ప్రేరణగా పనిచేస్తుంది తొందరగా మీరు గెలవడానికి ప్రేరణగా పనిచేస్తుంది అనవసరమైనటువంటి విషయాలపై ఫోకస్ ని తగ్గిస్తుంది పాజిటివ్ నెస్ అనేది సో అనవసరమైనటువంటి వ్యక్తుల యొక్క సాన్నిహిత్యాన్ని తగ్గిస్తుంది మీకు నష్టం చేసే అలవాట్లనే మీకు దూరం చేస్తుంది కాబట్టి ముందుగా మీరు గెలవాలి అంటే బి పాజిటివ్ చాలా చాలా పాజిటివ్ గా ఉండడం అనేది చాలా అవసరం. ఓకేనా మరొక టాపిక్ తోటి మిమ్మల్ని కలుస్తాను
4 thoughts on “విజయానికి రహదారి కష్టపడటమొక్కటే | Life Changing Telugu Motivation”