ధనవంతులయ్యే వాళ్ళకి ఉండే లక్షణాలు – Rich Habits in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Rich Habits in Telugu గురించి తెలుసుకుందాం.
ధనవంతులయ్యే వాళ్ళకి ఉండే లక్షణాలు
ఈ భూమి మీద ఏ మనిషి ఏ పని చేసినా సరే దాని ఎండింగ్ వచ్చేసి కేవలం డబ్బు మాత్రమే. ఒక మనిషి బాగా చదువుకొని ఒక ఉద్యోగం చేసిన ఒక అతను బాగా కష్టపడి ఒక సినిమా తీసినా అది వాళ్ళ జీవిత లక్ష్యం అవ్వచ్చు ఆ పని మీద ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ అవ్వచ్చు కానీ దాని ఎండింగ్ మాత్రం కచ్చితంగా డబ్బే ఉంటుంది. ఎందుకంటే ఏ మనిషి అయినా సరే కష్టపడి పని చేసేది వర్క్ మీద ప్యాషన్ అవ్వచ్చు కానీ డబ్బులు రాకపోతే ఇక్కడ ఏ మనిషి పని చేయడు. ఎందుకంటే ఒక మనిషి ఈ భూమి మీద ప్రశాంతంగా బతకాలంటే చక్కగా నిద్ర పోవాలంటే తనకంటూ కచ్చితంగా డబ్బులు కావాలి. మీకు ఇంకో హైలైట్ విషయం చెప్పనా ఈ భూమి మీద దేనికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది. మనం కడుపు నిండా అన్నం తింటాం చక్కగా కడుపు నిండా మంచి తాగుతాం. ఆ తర్వాత రోజంతా తిరుగుతాం ఇంకా ముఖ్యంగా నిద్ర వస్తే ప్రశాంతంగా నిద్రపోతాం. ప్రతి పనికి ఒక లిమిట్ ఉంటుందన్నమాట కానీ డబ్బు సంపాదించడానికి లిమిటే ఉండదు డబ్బు ఎంతైనా సంపాదించుకోవచ్చు డబ్బు ఎంత ఉంటే అంత ఆనందంగా మనం ఉండొచ్చు కేవలం మనం మాత్రం ఉండగలం. కాకపోతే చాలా మందికి ఏంటంటే ఈ డబ్బు సంపాదించే వాళ్ళు అసలు ఎలా సంపాదిస్తారు అసలు వాళ్లకు ఉండే లక్షణాలు ఏంటి వాళ్ళు ఏం చేయటం వల్ల వాళ్ళు ధనవంతులు అవుతున్నారు అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ టాపిక్ అదే బేసికల్ గా డబ్బు సంపాదించే వాళ్ళకి అంటే ధనవంతులు అయ్యే వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి వాటిని నేను మీకు ఈరోజు చెప్తాను.
AMBITION AND VISION
ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే ధనవంతులు అయ్యే వాళ్ళకి ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆంబిషన్ అండ్ విజన్. బేసికల్ గా ధనవంతులు అయ్యే వాళ్ళందరికీ ప్రాపర్ విజన్ ఉంటుంది దానికి మనం ఎలా కష్టపడాలి అని చెప్పేసి ప్రాపర్ ప్లాన్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఆ లక్ష్యం కోసం ఒక ప్రాపర్ విజన్ తో వెళ్ళిపోతూ ఉంటారు కష్టపడుతూనే ఉంటారు అప్పుడప్పుడు కొన్ని భయంకరమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్లకున్న పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్లకున్న విజన్ లో ఏంటంటే ఈ మార్పులు చేస్తే కచ్చితంగా మనం జీవిత లక్ష్యాన్ని చేదిస్తాం అని చెప్పేసి వాళ్లకంటూ ప్రాపర్ ఒక ఐడియా ఉంటుంది. అవసరమైతే అప్పటివరకు ఎంచుకున్న ఒక రొటీన్ మార్చుకొని కూడా వేరే కొత్త రూట్లో వెళ్లి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని వాళ్ళు సాధిస్తారు. కానీ చాలా మంది ఏంటంటే కంఫర్ట్ జోన్ లో ఉండి ధనవంతులు అవ్వకుండానే అలాగే ఉండిపోతారు. కంఫర్ట్ జోన్ అంటే నెలకి ఇంత జీతం వస్తే చాల్లే ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటారు కానీ కానీ వాళ్ళు ధనవంతులు ఎందుకు అవుతారు కూలీలు కదా అయ్యేది. కానీ ఎప్పుడైతే లైఫ్ లో కొంచెం రిస్క్ తీసుకొని దాన్ని ప్రాపర్ విజన్ తో గనక డీల్ చేయగలిగితే కచ్చితంగా జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తాము ధనవంతులం తప్పకుండా అవుతాము.
FINANCIAL EDUCATION
ఇక ధనవంతులకు ఉండే రెండో లక్షణం ఏంటంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పని చేయాలి ప్రతి మనిషి డబ్బులు సంపాదించాలి. కానీ కొంతమంది మాత్రమే కోటీశ్వరులు ఎందుకు అవుతున్నారు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల. మనం నెలంతా పని చేసి సరదాగా సినిమాలకు వెళ్ళటం సరదాగా టూర్లకు వెళ్టం ఇంకా ముఖ్యంగా వస్తువుల మీద మొక్కువతో చేసి మరి ఐఫోన్ కొనటం లేకపోతే పెద్ద పెద్ద టీవీలు కొనటం ఇంకా ముఖ్యంగా మన స్థాయికి మించి కార్లు బైకులు కొనటం ఇలాంటివి చేస్తూ ఉంటాం. కానీ ధనవంతులు అయ్యే వాళ్ళు ఏం చేస్తారు చెప్పనా వాటన్నిటిని పక్కన పెట్టేసి డబ్బుతో డబ్బుని సంపాదించడం మొదలు పెడతారు. అంటే ఎక్కడైనా రోడ్డు పక్కన ఒక చిన్న ల్యాండ్ కొంటారు దాని కోసం అప్పు చేస్తారు. ఆ అప్పుని రోజు రోజు కట్టుకుంటూ వాళ్ళు ఒక ల్యాండ్ ని ఓన్ చేసుకుంటారు. ఆ ల్యాండ్ ఖాళీగా ఉంటుందే ఎవరైతే దాన్ని కొన్నారో వాళ్ళకి వాళ్ళు సంపాదించే సంపాదనతో పాటు ఈ ల్యాండ్ కూడా డబ్బులు సంపాదిస్తూనే ఉంటుంది. ధనవంతులే వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఉంటుందన్నమాట వాళ్ళు ఉత్తిపోయిన డబ్బులు ఖర్చు పెట్టరు ఒకవేళ డబ్బులు ఖర్చు పెట్టారంటే కచ్చితంగా ఆ డబ్బే ఇంకొంత డబ్బును సంపాదించి పెడుతుంది. ధనవంతులకు ఉండే రెండో లక్షణం అది.
PRSEVERANCE
ఇంకా ధనవంతులకు ఉండే మూడో లక్ష్యం గురించి చెప్పుకుంటే ప్రిజర్వేన్స్ అనేది వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది అంటే పట్టుదల అన్నమాట మామూలుగా చాలా మంది నేను సినిమా యాక్టర్ అవ్వాలనుకుంటారు. కానీ కొంత ప్రయత్నించి వదిలేస్తారు చాలా మంది నేను క్రికెటర్ అవ్వాలనుకుంటారు కానీ కొంత ప్రయత్నించి వదిలేస్తారు. కానీ ధనవంతులు అవ్వాలనుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏది అవ్వాలన్నా సరే జీవితంలో ఏది చేయాలన్నా సరే ఎంతో పట్టుదలగా అవసరం వస్తే ప్రాణాలకు తెగించి మరి వాళ్ళ జీవిత లక్ష్యం కోసం వాళ్ళు పోరాడుతారు. చాలా మందికి ఇది ఉండదన్నమాట ఇది ఉండకపోవడం వల్లే వాళ్ళ వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతారు.
STRATEGIC NETWORKING
ఇంకా ధనవంతులు అయ్యే వాళ్ళకి ఉండే నాలుగో లక్షణం చాలా ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే స్ట్రాటజిక్ నెట్వర్కింగ్. బేసికల్ గా మనందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు అవ్వచ్చు కొత్తగా పరిచయమైన వాళ్ళు అవ్వచ్చు అందరికీ ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. కానీ ధనవంతులు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారంటే తెలివైన వాళ్ళతో వీడు కచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతాడు అనుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళతో మాత్రమే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇంకా ముఖ్యంగా అవతల వాళ్ళు వాడి దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ వాడు హార్డ్ వర్క్ చేసే పర్సన్ ఉంటే మాత్రం వాడిని పిచ్చి పిచ్చిగా లైక్ చేస్తారు వాడితోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు టైం వేస్ట్ చేసే వాళ్ళని అస్సలు పక్కన ఉంచుకోరు బురద తక్కువ మాటలు మాట్లాడే వాళ్ళు ఇంకా ముఖ్యంగా ఎటువంటి లక్ష్యం లేకుండా ప్రశాంతంగా ఖాళీగా తిరిగే వాళ్ళతో మాత్రం అస్సలు వాళ్ళు మాట్లాడరు వాళ్ళు టైం వేస్ట్ చేసుకోరు అన్నమాట. ఎందుకంటే ఏ లక్ష్యం లేని వాడి వల్ల వాడికే ఉపయోగం లేదు ఇంకా పక్కనోడికే ఉంటుంది. కాబట్టి ఎవడైతే జీవిత లక్ష్యంతో ముందుకు వెళ్తాడో ఎవడైతే కష్టపడే తత్వంతో ఉంటాడో వాడితో మాత్రం ధనవంతులయ్యే వాళ్ళు ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాడు ఎదుగుతాడు వీడు ఎదుగుదలకి ఉపయోగపడతాడు. అందుకని ధనవంతులు ఎప్పుడు అలాంటి వాళ్ళతో ఫ్రెండ్ చేస్తూ ఉంటారు.
ఓవరాల్ గా అదండి ధనవంతులు అయ్యే వాళ్ళకి కచ్చితంగా ఈ నాలుగు లక్షణాలు ఉంటాయి. మీలో ఈ లక్షణాలు గనుక లేదనుకోండి కచ్చితంగా అలవాటు చేసుకోండి. మీకే మంచిది బేసికల్ గా ఒక మనిషికి వయసులో ఉన్నప్పుడు డబ్బు అవసరం లేదేమో కానీ తను ముసలోడు అయిపోయినప్పుడు తన పిల్లలందరికీ పెళ్లి అయిపోయి వేరు వేరు ప్రాంతాలకి వెళ్ళినప్పుడు కచ్చితంగా ఆ మనిషికి డబ్బు చాలా అవసరం. డబ్బు ఉంటేనే ఆ మనిషి ఒక మనిషిలా బతకగలడు లేకపోతే ఆ మనిషి జీవితం ఎలా ఉంటుందో మీ అందరికీ నేను సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. కాబట్టి ఈ నాలుగు లక్షణాలను పాటించండి జీవితంలో ఆనందంగా ఉండండి.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.