సంతోషం వెంట పడకండి – Santhosam Venta Padakandi in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Santhosam Venta Padakandi in Telugu గురించి తెలుసుకుందాం రండి
బేసిక్ గా మన జీవితంలో మనం కొన్ని క్షణాల్లో మాత్రం ఎంతో సంతోషంగా ఉంటాము. అలా సంతోషంగా ఉన్నప్పుడు ఈ జీవితం ఎంత అందమైనది అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ జీవితం మీద ఈ శరీరం మీద ఈ ప్రాణం మీద విపరీతమైన ప్రేమ కూడా పెరిగిపోతుంది. కాకపోతే మరి కొన్ని క్షణాల్లో మనలో ఉన్న సంతోషం దూరమైపోతుంది. జీవితం అంటే కొంచెం చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు పుట్టాం రా బాబు మనం అని చెప్పేసి మన మీద మనకు డౌట్ వచ్చేస్తుంది ఇంకెంత కాలం బతకాలి అని చెప్పేసి చిరాకు వస్తుంది. దీనికి కారణం మీలో ఉన్న సంతోషం మీ నుంచి వెళ్ళిపోవటం అలా వెళ్ళిపోయిన తర్వాత అందరం ఏం చేయాలి. మనం సంతోషాన్ని వెతుక్కుంటూ మనం వెళ్ళాలి అసలు మనలో ఏ ఎమోషన్ పోవడం వల్ల సంతోషం మనకు దూరమైంది అని చెప్పేసి మనల్ని మనం అనాలసిస్ చేసుకోవాలి. కానీ చాలా మంది అలా చేయరు కానీ నేను చెప్పవచ్చేది ఏంటంటే మీరు దాన్ని వెతికే ప్రయత్నం అయినా చేయాలి. అసలు నాలో సంతోషం ఎందుకు దూరమైంది నేను ఎందుకు సంతోషంగా లేను అని చెప్పేసి మిమ్మల్ని మీరు అనాలసిస్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే సంతోషం వెతుక్కోండి అది ఎక్కడ ఉందో కనుక్కోండి అంటే దాని కోసం మీరు పరిగెత్తాల్సిన అవసరం లేదు. సంతోషం అనేది కేవలం మన లోపల మాత్రమే ఉంటుంది. మనం క్యాజువల్ గా సంతోషం అంటే ఏమనుకుంటాము మంచి ఉద్యోగం కొత్త కారు ఒక ఇల్లు ఇలాంటి వాటిలో నుంచి మనకు సంతోషం వస్తుంది అవి ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అని చెప్పేసి మీరు అనుకుంటారు. కానీ కొన్ని కొన్ని రోజులకి అవి బోర్ కొట్టేస్తాయి. కానీ నిజానికి సంతోషం మన మనసులోనే ఉంటుంది. అది మన ఆలోచనలు మన దృష్టి మన ఎమోషన్స్ పై ఆధారపడి ఉంటుంది. మనం సంతోషాన్ని బయట వెతికిన దొరకదు కాకపోతే మన లోపల చూసుకుంటే మాత్రం మనకి సంతోషం అక్కడే కనిపిస్తుంది. డబ్బు ఉద్యోగం కొత్త కారు ఇవన్నీ మీకు కొన్ని సౌకర్యాల్ని కల్పించొచ్చు కానీ సంతోషాన్ని మాత్రం అస్సలు కల్పించలేవు. అంతెందుకండి కోట్లు సంపాదించిన తర్వాత కూడా చాలా మంది జీవితంలో ఆనందంగా ఉండరు. కేవలం వాడిలో ఉన్న సంతోషాన్ని వాళ్ళు కనుక్కున్నప్పుడు మాత్రమే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు మనం సంతోషాన్ని కోల్పోవడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? మనం ఇతరులతో పోల్చుకోవడం వాళ్ళ జీవితాలను చూసి మనం కూడా జీవితంలో అలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళతో పోల్చుకొని మనలో ఉన్న సంతోషాన్ని మనం దూరం చేసుకుంటాము. ఒక ఒకలా చెప్పాలంటే ఇక్కడ ఎవడి జీవితం వాడిది. బాగా డబ్బులు ఉండి మనం అనారోగ్యంగా ఉన్నాం అనుకోండి సంతోషంగా ఉంటామా మన దగ్గర అసలు డబ్బులే లేవు అలా అని చెప్పేసి డబ్బులు లేని వాళ్ళందరూ బాధలో ఉన్నారంటే మాత్రం నేను అస్సలు నమ్మను డబ్బులు ఉన్నా లేకపోయినా ఆరోగ్యం ఉన్నా లేకపోతే అనారోగ్యంగా ఉన్నా సరే సిచుయేషన్ ని అర్థం చేసుకొని సంతోషంగా ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. కానీ అవతలి వాళ్ళ లైఫ్ స్టైల్ ని చూసి నేను కూడా అలా ఉండాలి అలా ఉంటే నాకు కూడా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు మోసం చేసుకొని వాళ్ళ సంతోషాన్ని వాళ్లే కిల్ చేసుకొని ఎప్పుడు బాధపడుతూ ఉండే వాళ్ళు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళకి చెప్పవచ్చేది ఏంటంటే సంతోషం అనేది ఎక్కడో ఉండదు ఒక వస్తువులు ఉండదు డబ్బులు ఉండదు కేవలం మనలో మాత్రమే ఉంటుంది. మనం పని చేసుకోబోయే ప్రాసెస్ లో ఉంటుంది. మన పనిని మనం ఎంజాయ్ చేయడంలో ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని తీసుకోవడంలో కూడా ఉంటుంది. అంతేగాని వాళ్ళలాగా ఉండాలి మనకు అసలు కష్టాలే రాకూడదు. నా జీవితం ఏంటి ఇలా ఉందని చెప్పేసి మీ దగ్గర ఉన్న దాన్ని కూడా మర్చిపోయి లేని దాని కోసం ఆరాటపడితే మీకు సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి,ఉన్న సంతోషం కూడా పోతుంది. అంతేకాకుండా మెయిన్ ఇంపార్టెంట్ మనం సంతోషంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే గతాన్ని వదిలేయపోవడం అంటే నా ఉద్దేశం ఏంటంటే మనల్ని ఎవరో ఏదో ఎప్పుడో ఒక మాట అంటారు దాన్ని తలుచుకొని తలుచుకొని బాధపడుతూ ఉంటాం. అంతేకాకుండా మనల్ని ఒకళ్ళు తక్కువ అంచనా వేస్తున్నారని ఇంకొకళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచించుకొని మీ గతంలో జరిగిన విషయాలు తలుచుకొని తలుచుకొని బాధపడటం వల్ల మీరు సంతోషాన్ని దూరం చేసుకుంటారు. కాబట్టి ఎవరు ఏమన్నా సరే జీవితంలో ఎటువంటి సమస్య ఎదురైనా సరే అది గతంలో అయినా సరే రేపు పొద్దునైనా సరే ఎదురవుతున్నా సరే మీరు మీ సంతోషాన్ని కోల్పోకూడదు. ఇక్కడ ఎవడు ఏ పని చేసినా సంతోషంగా ఉండటానికి కాబట్టి గతాన్ని తలుచుకొని బాధపడమాకండి అలా అని చెప్పేసి రాబోయే కాలాన్ని తలుచుకొని భయపడమాకండి ఏది జరిగినా సరే మీరు అనే వాళ్ళు సంతోషంగా ఉండటానికే మీరు ఏ పనైనా చేస్తారు. మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవు అనుకోండి డబ్బులు సంపాదిస్తూ ఆనందంగా ఉండండి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి కొంచెం ఆరోగ్యంగా ఉంటూ ఆనందంగా ఉండండి. ఏది ఏమైనా సరే మనిషి జీవితంలో లో ఆనందం అనేది చాలా ముఖ్యం అది కేవలం డబ్బుతోనే వస్తుందంటే మాత్రం నేను అస్సలు నమ్మను. కాబట్టి పోయిన సంతోషం ఎక్కడుందో తెలుసుకోవాలంటే మనం మన మనసులోకి చూస్తే చాలు దాన్ని కనుక్కోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే అసూయతో గాని అసంతృప్తిగా గాని లేకపోతే వాడేంటి అలా ఉన్నాడు వీడేంటి ఇలా ఉన్నాడు అని చెప్పేసి 24 గంటలు ఆలోచిస్తే మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా మీరు ఎంత ధనవంతులైనా సరే మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే మీలో సంతోషం అనేది ఉండదు. సంతోషం అనేది మన మనసులోనే ఉంటుంది అది కూడా మనం సంతోషంగా ఉండాలి అనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఉంటుంది. కాబట్టి సంతోషంగా ఉండండి అంతకు మించి ఏం కావాలి చెప్పండి జీవితానికి అంతేనండి.
1 thought on “సంతోషం వెంట పడకండి | Santhosam Venta Padakandi in Telugu”