జీవితం గతంలో ఆగిపోతే ఏం చేయాలి – Happy Life Tips in Telugu
ఇవ్వాల్టి టాపిక్ లో జీవితం గతంలో ఆగిపోతే ఏం చేయాలి – Happy Life Tips in Telugu గురించి తెలుసుకుందాం అండి.
మనలో చాలా మంది చేసే అతి పెద్ద తప్పు ఏంటో తెలుసా? గతంలోనే ఆగిపోవడం గతంలో జరిగినటువంటి నష్టాల గురించి ఎదురైనటువంటి చేదు అనుభవాల గురించి కష్టాల గురించి కన్నీళ్ల గురించి పదే పదే గుర్తు చేసుకుంటూ గతంలోనే ఆగిపోతూ వర్తమానాన్ని కూడా గతంలో కలిపేసుకుంటూ భవిష్యత్తుని హరింప చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది కనపడుతుంటారు. కానీ ఎవరైతే ఆ గతకాలపు చేదు జ్ఞాపకాల నుంచి బయటపడి ఆ కష్టాల నుంచి నష్టాల నుంచి పాఠాలను గుణపాఠాలను నేర్చుకొని వాటిని భవిష్యత్తుకి పునాదులుగా మార్చుకుంటారో వారదిగా మార్చుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ లో వాళ్ళు అనుకున్నది సాధిస్తారు ఉన్నత శిఖరాలని అధిరోహిస్తారు. గతం అంటేనే గతించిపోయింది మన కళ్ళ ముందు లేదు ఇప్పుడు అది గతం ఎక్కడ ఉంటుంది చెప్పండి మనకి జ్ఞాపకాలలో ఉంటుంది మన ఆలోచనల్లో ఉంటుంది మరి అవి మన నుంచి దూరం కావాలంటే మనం చేయాల్సింది ఏంటి ఆ ఆలోచనలను వదిలేయడం ఆ జ్ఞాపకాలను వదిలేయడం ఈజీ కదా. గతం నుంచి బయట పడటం మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది ఒకవేళ గతంలో మనం నష్టపోయాం చాలా కష్టాలు ఎదురైనాయి. మనకు అన్ని చేతి జ్ఞాపకాలే ఉన్నాయి, అన్ని అవమానాలే ఉన్నాయి, అన్ని దుఃఖాలే ఉన్నాయి, ఇప్పుడు మనం ఏం చేయాలి. ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకొని నాకెందుకు ఈ ప్రాబ్లం ఎదురైంది, నాకెందుకు ఈ ఫెయిల్యూర్ ఎదురైంది, ఇక్కడ నా తప్పేంటి నా ఆలోచన విధానం తప్పు ఉందా నా నిర్ణయాలు తప్పు ఉన్నాయా నేనేమన్నా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నానా నేను సరిగ్గా కష్టపడలేదా నేను సరిగ్గా ఆలోచించలేదా నేను తొందర పడ్డానా. ఇలా ఒక్కసారి మనకి మనం సెల్ఫ్ రియలైజేషన్ చేసుకొని దాని నుంచి మనం పాఠాలను నేర్చుకోవాలి. మనలో ఏమైనా మార్చుకోవాల్సినవి ఉంటే మార్చుకొని ఆ గతాన్ని వదిలేసి ఆ సరిదిద్దుకున్నటువంటి ఆలోచనలతోటి మనం భవిష్యత్తును మొదలు పెట్టాలి. వర్తమానంలో కష్టపడాలి ఏవైతే మనం మార్చుకున్నామో ఆ మార్పు తోటి ఈ వర్తమానాన్ని ఉపయోగించుకోవాలి. నిన్న జరిగిన తప్పును సరిదిద్దుకొని ఈరోజు కష్టపడితే రేపు బాగుంటుంది ఈరోజు అంటే నడుస్తున్న కాలం వర్తమానం ఈరోజు నువ్వు సరిగ్గా పని చేస్తే రేపు బాగుంటుంది కానీ నిన్నటి తప్పులోనే ఆగిపోతే నిన్న ఎదురైన ఫెయిల్యూర్ లోనే ఆగిపోతే నిన్నటి గతంలోనే ఆగిపోతే, నిన్న కలిగిన దుఃఖంలోనే మునిగి తేలుతూ ఉంటే ఈరోజు అనేది కూడా వేస్ట్ అయిపోతుంది కదా. ఇక భవిష్యత్తు ఎలా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కచ్చితంగా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో బయటికి చెప్పినా చెప్పకపోయినా బయట పడ్డా పడకపోయినా ఏవో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే ఉంటారు. ఎక్కడో ఒక కొన్ని తప్పులు జరిగే ఉంటాయి, కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురయ్యే ఉంటాయి, కొన్ని అవమానాలు ఎదురయ్యే ఉంటాయి, కొన్ని విమర్శలు ఎదురయ్యే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్ కాదు మనకి తెలుసో తెలియకో ఎక్కడో మనం కొన్ని మిస్టేక్స్ చేసే ఉంటాం ఆ మిస్టేక్స్ వల్ల మనకి కొన్ని నష్టాలు ఎదురై ఉండొచ్చు కొన్ని బాధలు కష్టాలు కన్నీళ్లు ఎదురై ఉండొచ్చు మన నమ్మకం వల్ల కొన్ని బాధలు ఎదురై ఉండొచ్చు. మనం ఒకరిని బాగా నమ్మాం కానీ నమ్మిన వాళ్లే మనల్ని మోసం చేశారు. ఆ నమ్మిన వాళ్ళ వల్లనే మనకు నష్టం కలిగింది అక్కడే ఏడుస్తూ కూర్చుంటావా లేదు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని రియలైజేషన్ లోకి రావడం.
మనం సరిగ్గా కష్టపడలేదు ఎగ్జామ్స్ రాశాం ఫెయిల్యూర్స్ ఎదురైనాయి అక్కడ ఏడుస్తూ కూర్చుంటామా లేదు నేను కష్టపడలేదు కాబట్టి ఫెయిల్యూర్ అయినా అనే నిజాన్ని అంగీకరించి ఎప్పుడు కష్టపడాలి. కానీ నేను ఫెయిల్యూర్ అయినా అని అక్కడే ఏడుస్తూ కూర్చుంటావా లేదు కదా మనం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం మన వ్యాపారంలో నష్టం కలిగింది ఏడుస్తూ కూర్చుంటామా లేదు ఆ నిర్ణయాలను సరిదిద్దుకోవాలి ఎక్కడ పోగొట్టుకున్నాము అనేది ఆలోచించి దాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది వర్తమానం మన భవిష్యత్తు బాగుండాలి అంటే గతాన్ని వదిలేసి వర్తమానంలో కష్టపడాలి ఇది జగమెరిగినటువంటి సత్యం అంతే కానీ అప్పుడు అలా చేసి ఉండాల్సి ఉంటే కాదు అప్పుడు అలా జరిగి ఉండాల్సింది కాదు అప్పుడు అలా బాధపడకుండా ఉండాల్సింది కాదు అప్పుడు నేను వాళ్ళని నమ్మకుండా ఉండాల్సింది కాదు అని ఇప్పుడు గుర్తు చేసుకుంటూ పదే పదే బాధపడితే ఇక మనకు భవిష్యత్తే ఉండదు.
గతం అంటేనే ఎండిపోయిన బావి లాంటిది దాని నుంచి మనం ఎంత తోడిన నీళ్లు రావు మనం మార్చలేం గతంలోకి వెళ్ళలేం అవునా కాదా. కానీ గతంలోని అనుభవాలని సారాంశంగా ఆ సారాంశాన్ని బట్టి మన జీవితాన్ని ఇప్పుడు సరిదిద్దుకొని వర్తమానాన్ని ఉపయోగించుకుంటే వర్తమానాన్ని కరెక్ట్ గా మనం సెట్ చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. గడిచిపోయిన కాలం నుంచి మనం నేర్చుకోవాలి ఆ నేర్చుకున్న దాన్ని బట్టి ఇప్పుడు కొత్త ఎజెండా చేసుకోవాలి. మన జీవితానికి కొత్త ప్రణాళిక వేసుకోవాలి కొత్త మార్పులు చేసుకోవాలి ఆ మార్పులతోటి ఈ వర్తమానంలో ఈరోజు మనం కష్టపడాలి. అప్పుడు కచ్చితంగా భవిష్యత్తు బాగుంటుంది దాన్ని మనం ఒక బాసటగా మార్చుకోవాలి తప్ప పదే పదే గుర్తు చేసుకుంటూ మనం అక్కడే ఆగిపోతే మనకి ఫ్యూచర్ లో ఇంకేమీ ఉండదు. ఫెయిల్యూర్స్ తప్ప వెనక్కి తిరిగి చూసుకున్న ఫెయిల్యూర్స్ ఏ ఉంటాయి ఆ ఫెయిల్యూర్స్ ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటే భవిష్యత్తు కూడా ఫెయిల్యూర్స్ ఉంటాయి. కాబట్టి విజేతలు ఎప్పుడు కూడా ఎంత త్వరగా గతం నుంచి బయట పడితే అంత త్వరగా లైఫ్ లో అనుకున్నది సాధించాలి గలుగుతారు. భవిష్యత్తును నిర్మించుకోగలుగుతాం బంగారం గతాన్ని మార్చలేము గాని ఆ గతం నుంచి నేర్చుకుని ఆ గతం నుంచి బయటపడి వర్తమానాన్ని ఉపయోగించుకుంటే మాత్రం భవిష్యత్తుని బంగారం లాగా నిర్మించుకోగలుగుతాం.
ఇది ప్రతి ఒక్కరి యొక్క లైఫ్ లో కూడా ఎదురైనటువంటి విషయాలే ఎక్కడో అక్కడ మనం జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాం కానీ ఆ ఆలోచనల్ని తీసివేస్తే అసలు మనలో గతం అనేదే ఉంటుంది. మనలో ఎంత గుర్తు చేసుకుంటూ ఉంటామో అంతగా ప్రతికూల భావాలు ప్రతికూల ఆలోచనలు అనేటివి పెరిగిపోతాయి. మన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఎంత బాధపడుతూ ఉంటామో పరిష్కార మార్గాలు అంతగా కనిపించకుండా పోతాయి. ఎప్పటికప్పుడు మనం నొప్పించినటువంటి కారణాలని వేధించిన బాధలని కష్టాలని, నష్టాలని మర్చిపోతే వర్తమానాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మనం అనుకున్నది సాధించగలుగుతాం. జీవితంలో ఆనందం అనేది అందరికీ ఇమిడియట్ గా అందదు. అందరికీ జీవితం వర్ధించినటువంటి విస్తరి కాదు విజయం కూడా అందరికీ ఇమిడియట్ గా అందదు. ఒక్కొక్కసారి కొంతమంది తక్కువ కష్టపడతారు కొంతమంది ఎక్కువ కష్టపడతారు కొంతమందికి కరెక్ట్ మార్గంలో కరెక్ట్ టైం కి కరెక్ట్ మార్గం దొరుకుతది. ఆ మార్గంలో వెళ్లడం ద్వారా వాళ్ళు విధేతలు కావచ్చు కొంతమందికి మార్గాన్ని అన్వేషించుకునే దగ్గరనే మనకి టైం వేస్ట్ అవుతుండొచ్చు. మొత్తానికి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ముందు వెనక కష్టపడే తత్వాన్ని బట్టి తీసుకున్న నిర్ణయాలను బట్టి ఆలోచించిన విధానాన్ని బట్టి విజయం అనేది తలుపు తడుతుంటుంది. అయితే ఒక్కొక్కసారి మనకి లైఫ్ లో అన్ని ఫెయిల్యూర్స్ ఎదురవుతుంటాయి. దుఃఖమే ఉంటది ఎటు చూసినా బాధలే ఉంటాయి కానీ మనం ఆలోచించం ఎంతసేపు నాకు అన్ని బాధలు నాకు అన్ని ఫెయిల్యూర్స్ అని ఆలోచిస్తుంటాం. దీనికి గల కారణాల గురించి మనం అన్వేషించం ఎప్పుడూ కూడా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ద్వారాలు మూసుకున్న మనకి అన్ని మార్గాలు క్లోజ్ అయిపోయినా కూడా ఎక్కడో ఒక మార్గం మనకు తెరిచే ఉంటది. మనం ఏం చేస్తాము అంటే మనిషి సహజ లక్షణం ఆ మూసుకున్న ద్వారం వైపే చూస్తూ ఏడుస్తూ కూర్చుంటాం కానీ ఎక్కడో అక్కడ ద్వారం నా కోసం తెరుచుంది అన్న ఆలోచనని మర్చిపోతాం.
మనం చూడండి మన కార్లో ఎప్పుడైనా వెహికల్ లో ప్రయాణించేటప్పుడు నేను చాలా సార్లు అబ్సర్వ్ చేశాను. మనం డోర్స్ అన్ని వేసుకుంటాం కూర్చుంటాం ఒక ఈగనో, కందిరి ఈగనో, దోమనో లోపల ఉండిపోయింది. అది తిరుగుతా ఉంటది అది బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉంటది ముందుకెళ్లి ఆ గ్లాస్ కి తగులుతా ఉంటది గట్టి గట్టిగా ఎగురుకుంటూ పోయి మళ్ళీ కింద పడతది మళ్ళీ లేసి ట్రై చేస్తా ఉంటది. మనం దాన్ని గమనించి విండో ఓపెన్ చేస్తాం బయటికి వెళ్ళిపోవాలి అని కానీ అది విండో ఓపెన్ చేస్తే విండో వైపు వెళ్ళదు. మళ్ళీ ఆ మూసుకున్న విండో గ్లాస్ వైపే వెళ్లి మళ్ళీ దాన్ని గట్టిగా తగులుతుంటది. మనం కాస్త ప్రయత్నించి గట్టిగా దాన్ని బయటికి పంపించాల్సిన అవసరం ఏర్పడుతుంటది అంటే మనిషి లక్షణం కూడా అంతే మూసుకున్న దారం మీదనే మనం ఫోకస్ చేస్తాం, మూసుకున్న మార్గాల మీదనే ఫోకస్ చేస్తాం, జరిగిన నష్టాల మీదనే ఫోకస్ చేస్తాం, జరిగిన ఎదురైన ఫెయిల్యూర్స్ మీదనే ఫోకస్ చేస్తాం. కానీ నా కోసం ఇంకేదో తెరుచుకొని ఉంది ఇంకేదో మార్గం ఓపెన్ అయ్యి ఉంది అన్న విషయాన్ని అంటే పరిష్కార మార్గం వైపు ఆలోచించం. ఎవరైతే ప్రతి దాని నుంచి నేర్చుకుంటూ పరిష్కారం దిశలో అడుగులు వేస్తారో కచ్చితంగా వాళ్ళ లైఫ్ లో సక్సెస్ సాధిస్తారు. లైఫ్ లో వాళ్ళు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. కాస్త ముందు వెనక అంతే కాబట్టి జీవితంలో గతంలో గతించినటువంటి కాలంలో మనకు ఏమి ఎదురైంది అనేది పక్కన పెట్టేసేయాలి. అందులో మంచి జ్ఞాపకాలు ఉంటే అవి తీవ్ర జ్ఞాపకాలు నెమరేసుకుందాం నష్టం లేదు మంచిదే అవి ఒక్కొక్కసారి మనకు ప్రేరణ కూడా కానీ మనల్ని బాధించే జ్ఞాపకాలు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు వదిలేసేయాలి. నేర్చుకునేటివి ఉంటే గతం ఒక గురువు లాంటిది ఏం చేస్తే మనం సంతోషంగా ఉంటాము అని నేర్పేది కూడా. మనకు గతమే గతించిన కాలం మనకు చాలా నేర్పిస్తది నేర్పించాలే గాని మనల్ని ఆపేయొద్దు మనల్ని ముందుకు నడపాలే గాని మనల్ని ఆపేసి చేసే విధంగా ఉండకూడదు. మన భవిష్యత్తు కాబట్టి ఎప్పటికప్పుడు గతం నుంచి నేర్చుకుంటూ వర్తమానాన్ని సద్వినయం చేసుకుంటూ భవిష్యత్తుకు బాట వేసుకోవాలి..
2 thoughts on “జీవితం గతంలో ఆగిపోతే ఏం చేయాలి | Happy Life Tips in Telugu”