జీవితంలో సంతోషంగా ఉండడం ఎలా – Happy Life Tips in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Happy Life Tips in Telugu గురించి తెలుసుకుందాం.
జీవితం లో సంతోషం గా జీవించాలి అంటే
ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి జీవితం అయినా చాలా సంతోషంగా ఉండాలని చెప్పి అనుకుంటాడు. కానీ చాలా మందికి అసలు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో తెలియదు. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ కూడా అదే ఒక మనిషి జీవితాంతో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి.
ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే ఏ మనిషి అయినా సరే జీవితం అంతా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఒక కోరిక ఉంటుంది. కానీ మన జీవితంలోకి ఆ సంతోషం ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఆ తెలియని వాళ్ళకి ఈ రోజు నేను కొన్ని పాయింట్లు చెప్తాను కేవలం నాలుగు అంటే నాలుగే పాయింట్లు చెప్తాను. ఆ నాలుగు పాయింట్లు గనుక మీరు ప్రాపర్ గా పాటిస్తే కచ్చితంగా మీరు మీ జీవితంలో ఆనందంగా ఉంటారు. కానీ ముఖ్యంగా ముందే చెప్తున్నాను నేను ఈ నాలుగు పాటించడం అంత ఈజీ కాదు. కానీ తలుచుకుంటే పెద్ద కష్టం ఏమి కూడా కాదు కాబట్టి ఈ నాలుగు పాయింట్లు గనుక ప్రాపర్ గా పాటిస్తే మీరు జీవితాంతం హ్యాపీగా ఉంటారు.
POSITIVE RELATIONSHIPS
ఈ నాలుగు పాయింట్లో నేను మొట్టమొదట పోయే పాయింట్ ఏంటంటే పాజిటివ్ రిలేషన్షిప్స్. బేసికల్ గా ప్రతి ఒక్క మనిషి ఇంకొక మనిషితో మాట్లాడక తప్పదు అంటే మనుషులు చెట్లతో పొట్టలతో మాట్లాడతారా కచ్చితంగా మనిషి మనిషితోనే కదా మాట్లాడాల్సింది. కానీ మనం ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడితే మన జీవితంలో ఉన్న సంతోషం కచ్చితంగా పోతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రపంచాలు వేరుగా ఉంటాయి మన ప్రపంచాలు వేరుగా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. కాబట్టి మనకు తగినట్టు పాజిటివ్ గా ఉండే వాళ్ళతోనే మనం రిలేషన్ లో ఉన్నాం అనుకోండి కచ్చితంగా మన జీవితం కూడా పాజిటివ్ గా ఉంటుంది ఉంటుంది ఎప్పుడు చూసినా నెగిటివ్ గా ఆలోచిస్తూ అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి ఎక్కడెక్కడో సంబంధం లేని విషయాలు మన దగ్గర తీసుకొచ్చి మనతో మాట్లాడే వాళ్ళతో మనం రిలేషన్ లో ఉండటం వల్ల వాడికి మనశాంతి ఉండదు మన జీవితంలో సంతోషం అస్సలు ఉండదు. కాబట్టి పాజిటివ్ గా ఉంటూ పాజిటివ్ విషయాలు మాట్లాడుతూ నిజం చెప్పాలంటే కొంచెం మంచి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మన జీవితం కూడా చాలా పాజిటివ్ గా ఉంటుంది. లేదు కాదు అని చెప్పేసి మీకు నచ్చిన వాళ్ళతో మీరు రిలేషన్ లో గనక ఉంటే అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే మిమ్మల్ని ఎవ్వడు కాపాడలేడు.
PRACTICE GRATITUDE DAILY
ఇంకా రెండో పాయింట్ ఏంటంటే ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ డైలీ. బేసికల్ గా ప్రతి ఒక్క మనిషి ఏంటంటే ఉదయాన్న నిద్ర లేచిన తర్వాత సెల్ ఫోన్ తీసుకొని అందులో పనికిమాలిన చెత్త అంతా చూస్తారు పనికిమాలిన చెత్త మొత్తాన్ని తన బ్రెయిన్ లోకి ఎక్కించుకుంటారు. కానీ నేను చెప్పవచ్చేది ఏంటంటే మనం ఉదయాన్నే నిద్ర లేచామంటే చాలా అదృష్టవంతులం ఎందుకంటే మనతో పాటు నిద్రపోయిన వాళ్ళు చాలా మంది చనిపోయి ఉంటారు ఈ ప్రపంచంలో అలాంటిది మనం నిద్ర లేచామంటే మన జీవితానికి ఒక పర్పస్ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మనకంటూ ఈ భూమి మీద ఒక పని ఉంటుంది. వాటన్నిటిని వదిలేసి సెల్ ఫోన్ చూసుకుంటూ instagram రీల్స్ చూసుకుంటూ రకరకాల వీడియోలు చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకోవడం కన్నా మనకి ఇంకొక రోజుని గిఫ్ట్ గా ఇచ్చిన ఆ భగవంతుడికి ఒక్కసారి కృతజ్ఞత భావంతో ఆయన స్మరించుకొని ఆ తర్వాత మన జీవితంలో మనం ఏం చేయాలి. ఆ రోజుని అంటే మనకి భగవంతుడు ఇచ్చిన ఆ గిఫ్ట్ ని ఎలా యూస్ చేసుకోవాలి అని చెప్పేసి ప్రాపర్ గా మీరు గనక గ్రాటిట్యూడ్ తో గనక ఉండగలిగితే ఇక మీ జీవితాన్ని ఎవడు చెడగొట్టలేడు అన్నమాట. ఎందుకంటే నువ్వు నిద్ర లేచిన వెంటనే నీ పర్పస్ నువ్వు తెలుసుకున్నప్పుడు నిన్ను మాత్రం ఎవడు చెడగొడతాడు నీ విజయాన్ని ఎవడు మాత్రం ఆపగలుగుతాడు. కాబట్టి ప్రతి ఒక్కల జీవితానికి ఒక అర్థం ఉంటుంది ఆ అర్థానికి పరమార్థం వెతుక్కుంటూ మీ జీవితానికి ఒక సార్ధకతను తీసుకురావాలంటే కచ్చితంగా మీకు భగవంతుడు ఇచ్చిన ఈ జీవితం పట్ల కనీసం గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి భగవంతుడి పట్ల మరింత ఉండాలి.
PERSONAL GROWTH
ఇంకా మూడో పాయింట్ వచ్చేసి పర్సనల్ గ్రోత్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి అన్నమాట. మామూలుగా మనం ప్రతి రోజు పని చేస్తూ ఉంటాం పని చేసిన తర్వాత డబ్బులు సంపాదిస్తూ ఉంటాం అసలు మన జీవితంలో మనం అసలు గ్రోత్ అవుతున్నామా. ఒకవేళ ఇంతకు ముందు ఉండాల్సిన పొజిషన్ కన్నా ఇప్పుడు తక్కువ పొజిషన్ లో ఉన్నామా ఒకవేళ ఉంటే మళ్ళీ ఆ పొజిషన్ రావడానికి మనం ఏం చేయాలని చెప్పేసి మనల్ని మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి. పర్సనల్ గ్రోత్ మీద మనకంటూ ఒక ఐడియా ఉండాలి అది గనుక లేదనుకోండి కచ్చితంగా మీ జీవితంలో సంతోషం అనేది మీకు చెప్పకుండానే వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీరు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతారు కదా. కాబట్టి మన జీవితాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి మరి ముఖ్యంగా ఎదుగుదలని ప్రాపర్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి.
LIVE IN THE PRESENT MOMENT
ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇది చాలా ఇంపార్టెంట్ లివ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ మామూలుగా మన మనసు ఏంటంటే ఉంటే ఫ్యూచర్ లో ఉంటుంది లేకపోతే పాస్ట్ లో ఉంటుంది ప్రెసెంట్లో మాత్రం అస్సలు ఉండదు. బేసికల్ గా బ్రెయిన్ చేసే పని ఏంటంటే ఫ్యూచర్ లో ఇలా జరిగిద్దేమో అలా జరిగిద్దేమో నేను ఇలా అయిపోతానేమో అని చెప్పేసి మనల్ని భయపెడుతూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా పాస్ట్ లో జరిగిన విషయాలన్నీ మనకు గుర్తు చేసి వాడు మనల్ని అలా చేశాడు కదా వాడు మనల్ని ఇలా చేశాడు కదా ఆ రోజు నాకు అలా అవమానం జరిగింది కదా అని చెప్పేసి జరిగిపోయిన విషయాలు మళ్ళీ మనకు గుర్తు చేసి మనల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి మన మనసుకి మన బ్రెయిన్ కి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న విషయాల గురించి ఆలోచించాలి జరిగిపోయిన దాని గురించి ఆలోచించకూడదు జరగవలసిన దాని గురించి ఆలోచించాలి భయపడకూడదు. ప్రెసెంట్ మనం ఏం చేయాలి అనే ఒక ప్రాపర్ పాయింట్ ని గనక మనం ఆలోచించగలిగితే కచ్చితంగా మన జీవితంలో ఆనందాన్ని ఎవ్వడు తీసుకోలేడు మన జీవితాంతో ఆనందంగా ఉంటాం జరిగిపోయిన దాని గురించి బాధపడొద్దు జరగవలసిన దాని గురించి భయపడొద్దు.
అదండి సంగతి ఈ నాలుగు పాయింట్లు గనుక మీరు ప్రాపర్ గా పాటిస్తే కచ్చితంగా జీవితాంతం సంతోషంగా ఉంటారు. వీటిలో ఏది మిస్ అయినా సరే సంతోషం కాదు కదా ఈ జీవితం మీద వ్యర్థ వస్తుంది.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.