సమాజంలో మీ విలువను ఎలా పెంచుకోవాలి – Personality Development in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Personality Development in Telugu గురించి తెలుసుకుందాం.
సమాజంలో మీ వ్యాల్యూ పెంచే మార్గాలు
మన జీవితంలో ప్రతి ఒక్కళ్ళం సమాజంలో మనకంటూ ఒక వాల్యూ ఉండాలి మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలని చెప్పేసి మనం ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాము. కోరుకుంటం వరకు అయితే ఓకే దాన్ని సాధించడం ఎలాగా అనేది మాత్రం చాలా మందికి తెలియదు. ఒక ముక్కలో చెప్పాలంటే మనం పంచి బట్టలు వేసుకునేది ఆ సమాజంలో ఉన్న వాళ్ళకి నచ్చాలని మనం మంచిగా చదువుకొని ఉద్యోగం చేసేది మనకంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉండాలని చెప్పేసి ఇవన్నీ ఏంటంటే మన కంట్రోల్ లో ఉంటాయి మనం ఒక మంచి ఉద్యోగం చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తే ఇవన్నీ ఊరకనే వచ్చేస్తాయి సమాజంలో మనకి రెస్పెక్ట్ వద్దనే ఇచ్చేస్తారు. కానీ వాల్యూ అనేది మనం చేసే ఈ నాలుగు పనుల మీదే డిపెండ్ అయి ఉంటుంది. నీ దగ్గర డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు నువ్వు బాగా డబ్బులు సంపాదించిన అవసరం అంతకన్నా లేదు. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఒక మనిషిగా మనకి ఈ సమాజం వాల్యూ ఇవ్వాలంటే అందులో
1. SELF DEVELOPMENT
మొట్టమొదటి మార్గం ఏంటంటే సెల్ఫ్ డెవలప్మెంట్ ముందు మీరు అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందడం అంటే డబ్బుల పరంగా కాదు ఉద్యోగ పరంగా కాదు అవి సపరేట్ కానీ నేనేమంటానంటే మీరు అభివృద్ధి చెందటం అంటే మనకు బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం బూతులు తిడతాం అసలు తిట్టకుండా ఉండటమే అభివృద్ధి మనకు బాగా చిరాకు వచ్చినప్పుడు పక్క వాళ్ళ మీద కోపం చూపిస్తాం అలా చూపించకుండా ఉండగలగటమే అభివృద్ధి. ఒక్క ముక్కలో చెప్పాలంటే చక్కగా పుస్తకాలు చదువుకుంటూ మంచి మంచి విషయాలు నేర్చుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీకు మీరు ఇన్స్పిరేషన్ గా ఉన్నారనుకోండి మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకున్నారు అనుకోండి మీకు వద్దన్నా సరే గౌరవం అనేది సమాజంలో క్రియేట్ అవుతుంది. ఎందుకంటే రోడ్డు మీద మీద నుంచుని సిగరెట్ కాల్చే వాడికిను రోడ్డు మీద మామూలుగా నడుచుకుంటూ పోయేవాడికిను కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అదే విధంగా ఈ సమాజంలో ఉంటూ చక్కగా నాలుగు పుస్తకాలు చదువుకుంటూ ఎంత కోపం వచ్చినా సరే బూతులు తిట్టకుండా మన పని మనం చేసుకుంటూ అవతల వాడు చిరాకు పెట్టినా కూడా మనం చిరాకు పడకుండా మన పని మాత్రమే మనం చేసుకుంటూ తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేసుకుంటూ ఉంటే మీకు వద్దన్న వాల్యూ ఇస్తారండి.
2. సేవ భావన
ఇంకా రెండో మార్గం ఏంటంటే సేవ భావన. మనిషి అన్నాక ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఇక్కడున్న సౌకర్యాలని అనుభవించడమే కాదు మన తోటి వారికి సేవ చేయాలనే భావన కూడా మీ గౌరవాన్ని పెంచుతుంది. అంతేకాకుండా దీనివల్ల కూడా మన సర్కిల్ పెరుగుతుంది ఎందుకంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకి హెల్ప్ చేయడానికి ఎవరైనా వస్తున్నారా లేదా అని చూసుకునే ముందు అసలు మనం ఇంతకు ముందు ఎవరికైనా హెల్ప్ చేసామా లేదా లేకపోతే చేయాలా అని చెప్పేసి మనం ప్రాపర్ గా మనల్ని మనం అనాలసిస్ చేసుకొని మనలో అసలు సేవా భావన ఉందా లేదా అని చెప్పేసి మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా చేసుకొని సేవా భావన పెంచుకొని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీ స్థాయి మేరకే మీరు సేవ చేయండి అలా చేయటం వల్ల సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది మీకంటూ ఒక గౌరవం ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీకు మీరు కొత్తగా కనిపిస్తారు ఎందుకంటే మీరు ఇంకొకళ్ళకి ప్రాబ్లం అయినప్పుడు వచ్చారు అనుకోండి మీకు ఏదైనా ప్రాబ్లం అప్పుడు కూడా ఇంకొకళ్ళు వస్తారు కదా. అలా కాకుండా మీకు సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి తిట్టుకుంటూ చుట్టూ ఉన్న జనాన్ని తిట్టుకుంటూ మీరు మాత్రం ఎవరికి హెల్ప్ చేయనంటే చెప్పండి ఎలా ఉంటుంది కాబట్టి మీలో సేవా భావన పెరగాలి.
3. CLEAR VISION
ఇంకా మూడో మార్గం ఏంటంటే క్లియర్ విజన్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే మన రూట్ అనేది అనేది మనకు తెలియనప్పుడు మనం ఎలా ప్రయాణిస్తాం అది కూడా గమ్యం లేని ప్రయాణం లాగా ఉంటుంది. కాబట్టి మన విజన్ అనేది చాలా క్లియర్ గా ఉండాలి మన లక్ష్యం ఏంటి మనం దేని కోసం పని చేస్తున్నాము ఎన్ని రోజులు కష్టపడితే మనం మన లక్ష్యానికి చేరుకుంటాం అని చెప్పేసి ప్రాపర్ విజన్ ఉండాలి. మన లక్ష్యం కోసం మనం పని చేసుకుంటూ పోతే కూడా ఈ సమాజంలో గౌరవం వస్తుంది. అలా కాకుండా ఏదో చూద్దాం అని చెప్పేసి సెల్ ఫోన్ ఓపెన్ చేసి అది కాకుండా ఇంకో రీల్లో లేకపోతే స్టేటస్ లో చూసుకుంటూ మన టైం వేస్ట్ చేసుకుంటూ పోతే వెనక పడేది మనమే. కాబట్టి మీ లక్ష్యం పట్ల మీకు ఒక క్లియర్ కట్ విజన్ అనేది ఉండాలి. అది లేకపోయినా కూడా మీకు సమాజంలో రెస్పెక్ట్ అనేది ఉండదు ఎందుకు ఉంటుందంటే వీడు ఏం చేస్తున్నాడు ఏమవుతున్నాడు చివరికి రేపు పొద్దున వయసు అయిపోయిన తర్వాత వీడి జీవితం ఏంటి అని చెప్పేసి అందరూ మనల్ని చూసి నవ్వుకుంటారు. ఎందుకంటే తాత్కాలికమైన పనుల కోసం మన జీవితాన్ని సాక్రిఫైస్ చేయకూడదు.
ఉదాహరణకి కొంతమంది ఏంటంటే రీల్స్ చూడటానికి షాట్స్ చూడటానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. కానీ మీరు అలా చూడటం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా అంటే నాకు తెలిసినంత వరకు షాట్స్ రీల్స్ చూస్తే ఉపయోగం ఉండదు. మొదట మనం ఎంటర్టైన్ అవుతాం బానే ఉంటుంది ఉంటుంది ఎందుకంటే కష్టపడి పని చేసుకున్న తర్వాత మనం చూసి ఆనందించడంలో తప్పే లేదు కానీ అదే పనిగా కూర్చుంటే మనం మన జీవితానికి మన లక్ష్యానికి దూరమైపోతాం. కాబట్టి మనకి మన జీవితం పట్ల ప్రాపర్ విజన్ అనేది ఉండాలి.
4. COMMUNICATION SKILLS
ఇంకా నాలుగో మార్గం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. మామూలుగా ఏ మనిషినైనా సరే ఒక మనిషిని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలన్న లేకపోతే పాతాళానికి దించేయాలన్న సరే అతని కమ్యూనికేషన్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే టాలెంట్ ఉన్నా లేకపోయినా ప్రతి మనిషికి కమ్యూనికేషన్ అనేది అనేది చాలా అవసరం.
ఒక ఉదాహరణ చెప్పనా మీకు చదువు వచ్చినా రాకపోయినా మీరు ఒక లక్ష రూపాయలు జీతం సంపాదించిన సంపాదించకపోయినా మీరు మాత్రం అవతల వాళ్ళు చెప్పేది ప్రాపర్ గా విని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నీట్ గా మాట్లాడి అక్కడి నుంచి వచ్చేసారు అనుకోండి వాళ్ళు మిమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తారు. కాకపోతే మీకు ఉద్యోగం ఉందా లేదా మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని చెప్పేసి ఇవేం చూడరు ఎందుకంటే మనిషి అనేవాడు డబ్బుని ఏదో ఒక రోజు సంపాదించుకుంటాడు. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంటర్నల్ గా క్రియేట్ అయ్యాయి మనం అవతల వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నామో ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా విని మీ ఆలోచన విధానం అక్కడున్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు వాళ్ళల్లో కూడా కొంచెం ఉన్నతమైన వారిగా బిహేవ్ చేశారు అనుకోండి వాళ్ళు మీకు ఇచ్చే వాల్యూ అంతా ఇంత కాదు. అలా కాకుండా మీరు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఎంత బాగా డబ్బులు సంపాదించిన సమాజం అనే ఆస్పెక్ట్ లో మీరు ఒక్కసారి నోరు జారారు అనుకోండి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం బ్యాడ్ గా ఉండి అవతల వాళ్ళ మీద ఒక మాట అన్నారే అనుకోండి వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారు. కాబట్టి ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మనిషికి చాలా అవసరం మనం 10 మంది తో ఎలా మాట్లాడుతున్నాము 10 మందితో ఏ మాటలు మాట్లాడుతున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోండి అలా చేయటం వల్ల కూడా మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది.
ఇంకొకసారి ప్రాపర్ టాపిక్ ని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన విలువను పెంచే నాలుగు ముఖ్యమైన మార్గాలు ఏంటంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఆ తర్వాత సేవా భావన అంతే కాకుండా మన జీవితం పట్ల మనకి క్లియర్ కట్ విజన్ అనేది ఉండాలి ఇంకా ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ప్రాపర్ గా ఉండాలి. ఈ నాలుగింటిని మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేయగలిగితే మీకు సమాజంలో విలువ వద్దన్న పెరుగుతుంది. మీరు విలువగా ఉంటారు మీ కుటుంబ సభ్యులు విలువగా ఉంటారు నిజం చెప్పాలంటే మనల్ని బట్టే మన పిల్లలకు కానీ మన తల్లిదండ్రులకు కానీ విలువ వద్దన్న వస్తుంది.
ఈ టాపిక్ అయిపోయింది మీకు ఈ టాపిక్ నిజంగా నచ్చితే మాత్రం కచ్చితంగా షేర్ చేయండి. అంతే కాకుండా నిజంగా నచ్చితేనే కామెంట్ చేయండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే నా కంటెంట్ మీకు నచ్చితేనే ఈ వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేయండి..
3 thoughts on “సమాజంలో మీ విలువను ఎలా పెంచుకోవాలి | Personality Development in Telugu”