అనుకున్నది సాధించేంతవరకు చావును కూడా లెక్క చేయకండి – Success Mindset in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Success Mindset in Telugu గురించి తెలుసుకుందాం రండి
ఈ భూమి మీద మనిషి పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కడికి సమస్యలు వస్తూనే ఉంటాయి. అంతే కాకుండా సమస్యలు కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు మనం అనుకున్న రంగంలో మనం ఖచ్చితంగా ఓడిపోతాం. అలా ఓడిపోయినప్పుడు ఇంకా జీవితం ముగిసిపోయింది జీవితం అనేది ఇంక అంతే అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. కానీ నేనేమంటానంటే మనం బ్రతికున్నంత వరకు అంటే మనం చనిపోకుండా ఉన్నంత వరకు ఓటమని మనం అస్సలు లెక్క చేయకూడదు. మన కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి అంటే మన శ్వాస ఇంకా ఆగలేదంటే మనం బ్రతికున్నామనే కదా. మనం ఇంకా బ్రతికున్నామంటే ఇంకొక్కసారి ప్రయత్నిస్తే గెలుస్తామనే కదా. కాబట్టి మీకు చావు దగ్గర అయ్యేంత వరకు నాకు తెలిసినంత వరకు మీరు ఓడిపోలేదని. ఒకవేళ మీకు మీరు నేను ఓడిపోయాను ఇక నా వల్ల కాదని చెప్పేసి మీ ఓటమిని మీరే ఒప్పుకున్నారు అనుకోండి మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు. నాకు తెలిసినంత వరకు ఏ మనిషి అయినా సరే తాను అనుకున్నది సాధించాలి అనుకున్నది సాధించకపోతే ఆ మనిషి మరణానికి విలువ ఎందుకు ఉంటుంది. కాబట్టి మనం చచ్చిపోయే లోపు మనకి ఎన్ని సమస్యలు వచ్చినా సరే మనం ఎన్ని సార్లు ఓడిపోయినా సరే భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మూల కూర్చొని ఇక నా వల్ల కాదని చెప్పేసి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. జీవితం అంటే ఏంటి అని చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. నన్ను అడిగితే జీవితం అంటే తిండి తినటం పడుకోవడం సరదాగా టైం పాస్ చేయడం కాదు. నాకు తెలిసినంత వరకు జీవితం అంటే మీరు అనుకున్నది సాధించడం. అలా సాధించకుండా చనిపోతే అసలు మన పుట్టుకకే ఒక అర్థం ఉండదు.
కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే మన జీవితంలో మనం గెలిచిన తర్వాత మనం మన మరణాన్ని ఎదుర్కోవాలి. కాబట్టి ఒక్క క్షణం కూడా మనం వేస్ట్ చేయకూడదు. ఒక్క క్షణాన్ని మనం వృధా చేసినా సరే ఆ క్షణం మళ్ళీ మళ్ళీ మన కోసం తిరిగి రాదు. కాబట్టి కోపంతోనో ఆత్మవిశ్వాసంతోనో మన ఆశయాల మీద నమ్మకంతోనో మనం ముందుకు వెళ్లాలి తప్ప మనల్ని మనం నిందించుకుంటూ మనం అక్కడే ఆగిపోకూడదు. ఎందుకంటే మరణం తర్వాత కూడా మనం మనం సాధించిన వాటితో మిగిలిన వాళ్ళందరికీ గుర్తుండి పోవాలంటే మనం ఇంకా ఏ స్థాయిలో కష్టపడాలో అర్థం చేసుకోండి. మిగిలిన వాళ్ళని అంటే మీ ఇంటి ముందు మీ వెంట వెనక కాదు మీ కుటుంబ సభ్యులు. మీరు జీవితంలో ఏదైతే సాధించాలి అనుకుంటారో మీకు మరణం ఎదురయ్యేంత వరకు మీరు అనుకున్న ఆ లక్ష్యం కోసం పోరాడుతూనే ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని సార్లు ఓడిపోయినా సరే అనుకున్నది సాధించేంత వరకు చావును కూడా లెక్క చేయకండి. ఎందుకంటే ఇక్కడ మన కోసం కేవలం మనం మాత్రమే కష్టపడాలి. ఇంకొకళ్ళు మన కోసం కష్టపడరు అసలు కష్టపడటానికి పుట్టరు. ఎందుకంటే మీ జీవిత లక్ష్యం కోసం ఇంకొకడు ఎందుకు పని చేస్తాడు కాబట్టి మన లక్ష్యం కోసం మనమే పని చేయాలి అలాంటిది అసలు మన లక్ష్యం కోసం మనం పని చేయకుండా చక్కగా సెల్ ఫోన్ చూసుకుంటూ మన జీవితాన్ని వృధా చేసుకుంటూ ఏదో ఒక రోజు చనిపోయాం అనుకోండి అసలు మన పుట్టుకకి అర్థం ఉండదండి. కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే ప్రతి ఒక్క మనిషి పుట్టుకకి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఆ అర్ధానికి పరమార్థం వెతకాలే తప్ప అసలు ఏమి చేయటం రాదు ఏమి చేత కాదు ఏది చేసినా నేను ఓడిపోతున్నాను అని చెప్పేసి మీరు మధ్యలోనే మీరు అనుకున్న ఆ లక్ష్యాన్ని వదిలేస్తే మీ జీవితానికి అర్థం ఉండదు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను అనుకున్నది సాధించేంతవరకు చావును కూడా లెక్క చేయకండి.
1 thought on “అనుకున్నది సాధించేంతవరకు చావును కూడా లెక్క చేయకండి | Success Mindset in Telugu”