మీ జీవితంలో విజయం సాధించాలంటే ఇలా చేయండి – Jevitham lo vijyam sadinchalante
ఇవాళ్టి టాపిక్ లో మీ జీవితంలో విజయం సాధించాలంటే ఇలా చేయండి – Jevitham lo vijyam sadinchalante in Telugu గురించి తెలుసుకుందాం రండి
ఈ టాపిక్ లో మీకు నేను చెప్పబోయే కొన్ని పాయింట్లు మిమ్మల్ని జీవితంలో సక్సెస్ అయ్యేలా చేస్తాయి ఇది మాత్రం గ్యారెంటీ. అసలు మామూలుగా ఏ మనిషికైనా సరే నేను జీవితంలో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే అసలు సక్సెస్ అంటే ఏంటి ఒక మనిషి నిజంగా సక్సెస్ అయితే అసలు తను జీవితంలో ఎలా ఉంటాడు అనేది మాత్రం చాలా మందికి తెలియదు. అంతేకాకుండా మనం నిజంగా జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే అసలు ఏం చేయాలో కూడా చాలా మందికి తెలియదు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనిషి జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది మన టాపిక్. ఇక డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే ఒక మనిషి నిజంగా జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే విజయం సాధించాలంటే ఫస్ట్ అఫ్ ఆల్ సెట్ క్లియర్ గోల్స్. మామూలుగా ప్రతి ఒక్క జీవితంలో విజయం సాధించాలంటే ముందు వాళ్ళు ఒక జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యమే మన జీవితాన్ని ఒక మార్గంలో ఉంచుతుంది. నిజం చెప్పాలంటే క్లారిటీగా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటేనే మనల్ని ఒక రూట్ లో నడిపిస్తుంది. అలా కాకుండా పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత ఒక లక్ష్యం సాయంత్రం పడుకునేటప్పుడు ఒక లక్ష్యం ఉంటే మాత్రం మీరు అలా లక్ష్యాల్ని మానుకుంటూనే ఉంటారు తప్ప మీ లక్ష్యం కోసం మీరు పోరాటం మానేస్తారు. కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే మీరు తీసుకునే ఆ లక్ష్యం ఏదో క్లియర్ కట్ గా సెట్ చేసుకొని నేను ఈ లక్ష్యం కోసమే పుట్టాను ఈ లక్ష్యం కోసమే బతుకుతాను అన్నట్టు ఉండాలి. అంతేకాకుండా ఆ లక్ష్యాన్ని మీరు ఒక కాగితం మీద రాసుకొని మీ ఇంట్లో అంటించుకోండి. ఎందుకంటే ప్రతి రోజు ఉదయం లేచిన వెంటనే మీకు ఆ కాగితం మీ లక్ష్యాన్ని గుర్తు చేస్తుంది. అంతేకాకుండా మీ లక్ష్యం కోసం మీరు పని చేయడం మీకు ఒక ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. కాబట్టి సెట్ చేసుకునే గోల్ ఏదో క్లియర్ గా సెట్ చేసుకోండి లేదు మాకు ఆల్రెడీ ఒక జీవిత లక్ష్యం ఉందనుకుంటే మాత్రం ఆ లక్ష్యం కోసం పోరాడండి.
ఇంకా రెండో పాయింట్ ఏంటంటే డెవలప్ డిసిప్లిన్. మామూలుగా ఏ మనిషికైనా సరే జీవిత లక్ష్యం ఉంటే సరిపోదు అతనికి క్రమశిక్షణ కూడా అవసరం. క్రమశిక్షణ లేకుండా ఎవరైనా సరే వాళ్ళ లక్ష్యాల్ని సాధించలేరు. కానీ క్రమశిక్షణ అనేది నిరంతరంగా మనల్ని మన లక్ష్యం కోసం పని చేసేలా చేస్తుంది మన విజయానికి మనల్ని దగ్గరగా చేస్తుంది. ప్రతి రోజు ఉదయాన్నే ఏ టైం కి లెగవాలి సాయంత్రం ఏ టైం కి పడుకోవాలి మనం ప్రాపర్ గా మన పనిని మనం ఎలా చేసుకోవాలి అసలు మన పని కాకుండా వేరే పనికి మనం డైవర్ట్ అయితే అసలు అలా డైవర్ట్ అవ్వకుండా ఉండటానికి మనం ఏం చేయాలి అని చెప్పేసి ప్రాపర్ గా మీరు డిసిప్లిన్ ని డెవలప్ చేసుకోవాలి ఇది ఒక్క రోజుతో అయ్యే పని కాదు అలా అని చెప్పేసి అసలు అవ్వకుండా ఉండే పని కూడా కాదు. కాబట్టి మీరు మీ డిసిప్లిన్ ని డెవలప్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ డిసిప్లిన్ గా ఉన్నా కూడా మరింత డిసిప్లిన్ గా ఉండటానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే అంటే మనల్ని డైవర్ట్ చేయడానికి ఈ భూమి మీద బొచ్చడని అవకాశాలు ఉన్నాయి బొచ్చడని మార్గాలు ఉన్నాయి. కానీ మనం డిసిప్లిన్ గా ఉండటానికి ఉన్న ఒకే ఒక్క మార్గం మనలో ఉన్న కాస్తో కోస్తో డిసిప్లిన్ ని మనం డెవలప్ చేసుకోవటం. అలా చేసుకుంటేనే మన లక్ష్యం కోసం మనం పని చేస్తూ ఉంటాము అలా పని చేస్తూ ఉండటం వల్ల ఏదో ఒక రోజు మన లక్ష్యాన్ని మనం చేరుకుంటాము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే సహనాన్ని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనకు లక్ష్యం ఉంది మనం డిసిప్లిన్ గా మన పని మనం చేసుకుంటున్నాం అన్నంత మాత్రాన మనం జీవితంలో సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. ఎందుకంటే విజయం అనేది ఎవ్వడికీ రాత్రికి రాత్రే వచ్చేదు. ఒకళ్ళకి 10 రోజులకు వస్తుంది ఇంకొకళ్ళకి 100 రోజులకు వస్తుంది మరి కొంతమందికి చాలా రోజుల టైం కూడా పట్టొచ్చు. కాబట్టి మీరు మీ జీవితంలో విజయం వచ్చేంతవరకు అలా సహనంతో డిసిప్లిన్ గా మీ లక్ష్యం కోసం మీరు పని చేసుకుంటే మాత్రమే మీరు జీవితంలో విజయవంతం అవుతారు తప్ప. మీరు మధ్యలోనే చిరాకు వచ్చేసి ఏంటి నేను ఇన్ని రోజులు కష్టపడుతున్నాను అసలు నేను సక్సెస్ అవ్వట్లేదు అని చెప్పేసి మీ లక్ష్యాన్ని మీరు మధ్యలో వదిలేస్తే మీరు ఎలా సక్సెస్ అవుతారు. కాబట్టి సహనాన్ని అలవాటు చేసుకోండి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఛాలెంజెస్ ని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ప్రతి రోజు మనకి అనుకూలంగా ఉండదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మనకి సవాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. వాటిని స్వీకరించి వాటిని మీరు ఎదుర్కొంటూ ఉన్నారు అనుకోండి మీ ఆలోచన విధానం మారిపోతుంది జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఖచ్చితంగా ఎదుర్కొంటారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ భూమి మీద మనం పుట్టి చచ్చిపోయేంత వరకు మనకి ప్రతి రోజు సవాలే కాకపోతే కొన్నిటిని మనం హ్యాండిల్ చేయగలం ఇంకొన్నిటిని మనం హ్యాండిల్ చేయలేము. మరికొన్ని వాటిని చూస్తేనే మనం సగం చచ్చిపోతాము. కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క కష్టాన్ని ప్రతి ఒక్క సవాలని మనం ఎదుర్కొని వాటిలో విజయం సాధించి తీరాల్సిందే. వాటికి భయపడిపోయి మనం ఆగితే మన జీవితం అక్కడే ఆగిపోతుంది. చావో రేవో అని చెప్పేసి ఒక అడుగు ముందుకు తీసుకొని వాటితో పోరాడితే భయం భయంకరమైన మార్పులు వచ్చేది మన జీవితంలోనే. కాబట్టి ఛాలెంజెస్ ని ఎప్పుడూ యాక్సెప్ట్ చేయాలి ఛాలెంజెస్ కి భయపడకూడదు. చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బు ఉన్నవాళ్లకి ఏంట్రా బాబు వాళ్ళు ప్రశాంతంగా బతుకుతారు అని అనుకుంటారు కానీ డబ్బు ఉన్నవాడికి ఉన్న సమస్యలు లేని వాడికి లేని సమస్యలు. అల్టిమేట్ గా ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషికి సమస్యలు వస్తూనే ఉంటాయి. అవతల వాడు సుఖంగా ఉంటున్నాడు నేనేంట్రా బాబు కష్టపడుతున్నాను అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవతల వాడికి ఎన్ని కష్టాలు ఉన్నాయో వాడికి కే తెలుసు వాడు కూడా నీ దగ్గరికి వచ్చి చెప్పుకోడు కదా నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి అని చెప్పేసి అలాగా మీరు కూడా వేరే వాళ్ళ దగ్గర మీ కష్టాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడం నేర్చుకోండి. ఒకవేళ ఎదుర్కొనే శక్తి లేనప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా చూసే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్లి మీ సమస్యలు చెప్పుకోండి వాళ్ళు కొన్ని సలహాలు ఇస్తారు వాళ్ళ సహాయంతో వాళ్ళ సపోర్ట్ తో మీరు మీ సమస్యలు ఎదుర్కోండి. అలా ఎదుర్కోవడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యని మీరే డీల్ చేసుకుంటారు. కాబట్టి వీటన్నిటిని మీరు ప్రాపర్ గా పాటించారు అనుకోండి మీ జీవితంలో మీరు వద్దన్నా సక్సెస్ అవుతారు. మళ్ళీ ఒక్కసారి ప్రాపర్ గా మొత్తాన్ని సమ్మరైజ్ చేస్తాను వినండి మీరు ఫస్ట్ క్లియర్ కట్ గా ఒక జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అలా కనక మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మీ లక్ష్యాన్ని ఒక బోర్డు గా చేపించి మీ ఇంట్లో తగిలించుకున్న కూడా తప్పులేదు. ఎందుకంటే మీకు మీ లక్ష్యాన్ని గుర్తు చేస్తుంది బోర్డు. ఆ లక్ష్యం కోసం మిమ్మల్ని పరిగెత్తేలా చేస్తుంది. అంతేకాకుండా మీరు లక్ష్యం కోసం పరిగెత్తేటప్పుడు ఫస్ట్ అఫ్ ఆల్ క్రమశిక్షణ అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. మనకు ఉన్నది 24 గంటలు అందులో తోచా తప్పకుండా ఎనిమిది గంటలు నిద్రపోవాలి అలా పోకపోతే మనకి అనారోగ్యం వస్తుంది. అలా అనారోగ్యం పాలైనప్పుడు మనం సక్సెస్ అయితే ఏంటి అవ్వకపోతే ఏంటి. కాబట్టి క్రమశిక్షణగా మనం ఎన్ని గంటలు నిద్రపోవాలి ఎన్ని గంటలు పని చేసుకోవాలి ఎన్ని గంటలు కుటుంబంతో స్పెండ్ చేయాలి అని చెప్పేసి ప్రాపర్ గా మీరు డిసిప్లిన్ ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా సహనం అనేది మనకి ఈ జర్నీలో చాలా అవసరం ఉంటుంది. మనకి సక్సెస్ వచ్చేంత వరకు మనం చాలా ఓపికతో ఉండాలి సహనంగా ఉండాలి ఆ సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అలా కాకుండా మనం కొంచెం అటు ఇటు అయినా కూడా మన లక్ష్యం పట్ల మనం కొంచెం అటు ఇటుగా ప్రవర్తిస్తూ ఉంటాము. దీని మూలంగా మనం మాత్రమే నష్టపోతాము కాబట్టి సహనంగా ఉండాలి. ఈ జర్నీలో ఇంకొక ముఖ్యమైన విషయం ఛాలెంజెస్ ని యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ఛాలెంజెస్ అనేవి ప్రతి రోజు వస్తూ ఉంటాయి ప్రతి గంట అనుకుంటూనే ఉంటాయి. కాబట్టి మనం చచ్చేంత వరకు ఉండే ఈ ఛాలెంజెస్ కి మనం ఎందుకు భయపడాలి చెప్పండి. వాటిని ఎదుర్కోవాలి అది మనం సింగిల్ గా అయినా అవ్వచ్చు కుటుంబ సభ్యుల సలహాలతో అవ్వచ్చు ఎలాగైనా సరే మనకున్న సమస్యల్ని మనం ఎదుర్కొనే తీరాలి. ఇవన్నీ చేయడం వల్ల మీరు అవునన్నా కాదన్న సరే జీవితంలో మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇదంతా సాధించిన తర్వాత ఈ జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుందండి. అలా కాకుండా మీనింగ్ లెస్ గా బతుకుతాను అంటే మాత్రం ఎవరు మాత్రం ఏం చేస్తారు. కాబట్టి మన జీవితానికి ఒక అర్థం ఉండాలి కాబట్టి ఉండాలంటే మన జీవితంలో మనం సక్సెస్ అవ్వాలి.
1 thought on “మీ జీవితంలో విజయం సాధించాలంటే ఇలా చేయండి | Jevitham lo vijyam sadinchalante in Telugu”