జీవితం మారాలంటే ఆలోచన మారాలి – Oorike Manasu Padu Chesukoku
ఇవాళ్టి టాపిక్ లో జీవితం మారాలంటే ఆలోచన మారాలి – Oorike Manasu Padu Chesukoku గురించి తెలుసుకుందాం.
జీవితం మారాలంటే
ఈ కాంపిటీషన్ ప్రపంచంలో మనం ఇంకొకరితో కంపేర్ చేసుకోవడం అనేది సర్వసాధారణం. కాకపోతే మీరు ఎవరితో అయితే కంపేర్ చేసుకుంటున్నారో వాళ్ళు నిజంగా జీవితంలో సక్సెస్ అయ్యారా. లేకపోతే నిజంగా ఆనందంగా ఉన్నారా లేదా అని చెప్పేసి మీరు ప్రాపర్ గా చెక్ చేసుకొని అప్పుడు అవతల వాళ్ళతో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి. అలా కాకుండా సోషల్ మీడియాలో ఫోటోస్ చూసి వాళ్ళు లైఫ్ లో చాలా ఆనందంగా ఉన్నారని చెప్పేసి మీకు మీరు గా ఫిక్స్ అయిపోయి వాళ్ళతో మీరు రేస్ పెట్టుకోవడం వల్ల మీరు ఆచి తూచి మరి కంపారిజన్ అనే ఒక ట్రాప్ లో కాలేసినట్లే. కాబట్టి అలాంటి వాళ్ళ మీద ఎక్కువ మీరు ఫోకస్ చేసి నేను వాళ్ళలా ఉండాలి వీళ్ళలా ఉండాలి అని చెప్పేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకోమాకండి మీరు అసలు అవతల వాళ్ళ మీద ఫోకస్ చేయమాకండి. కేవలం మీ గురించి మీరు మాత్రమే ఆలోచించుకోండి ఎందుకంటే మీరు ఇతరుల జర్నీ మీద ఫోకస్ చేయడం వల్ల మీ పర్సనల్ జర్నీని మీరు మిస్ అవుతారు. మీరు చూసిన వ్యక్తి నిజంగా సక్సెస్ అయిన వాడై ఉండొచ్చు. అతను ఒక 10 సంవత్సరాలు కష్టపడి క్రియేట్ చేసుకున్న ఏదైతే సక్సెస్ ఉందో మీరు ఒక్క సంవత్సరంలో ఎలా క్రియేట్ చేస్తారు. కాబట్టి మీరు అతని జర్నీని పక్కన పెట్టేసి కేవలం మీ జర్నీ మీదే మీరు ఫోకస్ చేయండి. ఎందుకంటే అది మీ జీవితం కాబట్టి అవతల వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం వేరు అవతల వాళ్ళతో మనం కంపేర్ చేసుకొని కేవలం అవతల వాళ్ళ గురించి మాత్రమే మనం ఆలోచిస్తూ వాళ్ళలాగా మనం కూడా ఒకేసారి అయిపోవాలంటే కష్టం. కాబట్టి నేను ఏమంటానంటే అవతలి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి కానీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ మీరు వాళ్ళ గురించే ఆలోచిస్తూ మీ గురించి మీరు మర్చిపోతారు. అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే కేవలం మీ ఫోకస్ మీ మీదే పెట్టండి అలా మీ మీద మీరు ఫోకస్ పెట్టుకొని మీ గురించి మాత్రమే మీరు ఆలోచించుకోవడం వల్ల మీ బలం మీకు తెలుస్తుంది మీ బలహీనత కూడా మీకు తెలుస్తుంది. దానివల్ల మీ జీవితం మీద మీకు ప్రాపర్ ఐడియా వస్తుంది. అసలు మీకు ఏం వస్తుంది, ఏమి రావట్లేదు ఏది చేస్తే మీరు ఆనందంగా ఉంటున్నారు. ఏది చేయకపోతే మీరు ఇంకా బాధపడుతున్నారు అని చెప్పేసి ప్రాపర్ గా మీకు ఒక ఐడియా వస్తుంది. వస్తుంది పక్కింటోడు ఏదో అయ్యాడు అని చెప్పేసి మనం కూడా వాళ్లే అయిపోవాలంటే అది మనల్ని మనం మోసం చేసుకున్నట్లు అవుతుంది. కాబట్టి పక్కింటి వాడు వాడి జీవితాన్ని ఖచ్చితంగా ప్రాపర్ గా వాడుకొని వాడి సక్సెస్ అయితే మాత్రం అతన్ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని అతను ఎంత కష్టపడి పైకి వచ్చాడో తెలుసుకోవడంలో తప్పులేదు. కాకపోతే మనం కూడా అతన్ని కాపీ కొట్టి అతని లాగే మనం అవ్వాలనుకోవడం మాత్రం మూర్ఖత్వం. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అలా అని చెప్పేసి అందరూ ఒక దాంట్లోనే సక్సెస్ అవ్వాలంటే ఈ ప్రపంచంలో జరగని పని. కాబట్టి మీ మీద మీరు ఫోకస్ పెడితే కచ్చితంగా మీ బలాలు మీ బలహీనతలు మీకు అభిరుచులు మీ అభిప్రాయాలు మొత్తం మీకు తెలుస్తాయి అన్నమాట. దానివల్ల మీకు ఏదైతే పని నచ్చుతుందో దాని కోసం మీరు పోరాడుతారు. అంతే కాకుండా ఆ పని చేసేటప్పుడు మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. ఎందుకంటే మనం పుట్టింది ఆనందంగా మనకు నచ్చిన పని చేసుకుంటూ ఉండటానికి తప్ప మెజారిటీ జనాలు దేన్నైతే ఇష్టపడుతున్నారో దాంట్లోకి మనం దూరిపోయి అందులో మనం సక్సెస్ అయిపోయి వాళ్ళందరిని సాటిస్ఫై చేసి మనం చేసే పని మనం ఇష్టం లేకుండా చేస్తూ జీవితాంతం ఏడవడానికి అయితే అస్సలు కాదు. కాబట్టి మీకు ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో ప్రాపర్ గా ఒక ఐడియా కి వచ్చేస్తారు మీ మీద మీరు ఫోకస్ పెట్టుకుంటే. అలా కాదు నేను ఇతరులతో కంపేర్ చేసుకొని నాలో ఉన్న టాలెంట్ ని నేను తొక్కేసుకుంటాను అసలు నాలో ఏ టాలెంట్ ఉందో నేను తెలుసుకోకుండానే చచ్చిపోతాను అంటే మాత్రం మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు.
ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనిషికి ప్రశాంతత అనేది చాలా అవసరం అంటే ఇన్నర్ పీస్ కూడా చాలా అవసరం. కాకపోతే నేనేమంటానంటే మనతో పరిగెత్తే వాళ్ళు మనకన్నా ముందు వెళ్ళినప్పుడు మనం కొంచెం ప్రశాంతంగా ఉండాలి. అయ్యో మనకన్నా ముందు వెళ్ళిపోయాడే వాడు జీవితంలో సక్సెస్ అయిపోయాడే అని చెప్పి అంటే మాత్రం అతని పరిస్థితులు అతనికి సహకరించాయి అంతే అతనికి మీకు తేడానే లేదు మీ పరిస్థితులు మీకు సహకరించట్లేదు అంతే మీరు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే అవతలి వాళ్ళతో ఏ విషయంలోనూ మనం కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళ జీవితం వేరు మన జీవితం వేరు వాళ్ళ కథ వేరు మన కథ వేరు వాళ్ళ పరిస్థితులు వేరు మన పరిస్థితులు వేరు. కాబట్టి అవతలి వాళ్ళతో మన జీవితాన్ని కంపేర్ చేసుకొని మీ గురించి మీరు ఆలోచించుకోవడం మర్చిపోతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను అవతల వాడు సక్సెస్ అయినా అవతల వాడు ఫెయిల్ అయినా సరే మనం అవతలి వాళ్ళతో అస్సలు కంపేర్ చేసుకోకూడదు. ఒక్కొక్కళ్ళకి ఏంటంటే సక్సెస్ అనేది 20 ఇయర్స్ కి వచ్చేస్తది, ఇంకొంత మందికి 40 కి వస్తది, ఇంకొంత మందికి 50 కి వస్తది, మరి కొందరి మందికి అయితే చనిపోయే గంట ముందు వస్తది. కానీ నేను చెప్పవచ్చేది ఏంటంటే మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల మిమ్మల్ని మీరు ఎక్కువగా పట్టించుకోవడం వల్ల మీకు సక్సెస్ అనేది చాలా ఎర్లీగా వస్తుంది. కాబట్టి పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మీ గురించి మీరు ఆలోచించడం మొదలు పెట్టండి.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
4 thoughts on “జీవితం మారాలంటే ఆలోచన మారాలి | Oorike Manasu Padu Chesukoku”