జీవితంలో విజయం సాధించడం ఏలా – How To Be Successful In Life in Telugu
ఇవాళ్టి టాపిక్ లో How To Be Successful In Life in Telugu గురించి తెలుసుకుందాం.
ఎన్ని కష్టాలు వచ్చినా జీవితంలో విజయం సాధించడం ఎలా
మామూలుగా మనం చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయ్యేంత వరకు కంటిన్యూస్ గా మన కుటుంబ సభ్యుల నుంచి వినే మాట ఏంటంటే నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ జీవితంలో మాత్రం సక్సెస్ అవ్వాలి. ఒకవేళ నువ్వు అవ్వకపోతే ఈ సమాజం నీకు రెస్పెక్ట్ ఇవ్వదు ఈ సమాజం నిన్ను అసలు మనిషిలా చూడదు. నిజం చెప్పాలంటే ఈ సమాజం అసలు నిన్ను లెక్క కూడా చేయదు అంటే నిన్ను ఒక మనిషిగా కూడా కన్సిడర్ చేయదు ఎందుకు నువ్వు సక్సెస్ అవ్వకపోతే. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఏ మనిషి అయినా ఎందుకు సక్సెస్ అవ్వడు, ఎందుకు సక్సెస్ అవ్వడు అంటే అతనికి చాలా కష్టాలు వస్తాయి. అలా వచ్చినప్పుడు వాటిని ఫేస్ చేయలేక కొంతమంది ఓటమిని అంగీకరిస్తారు ఇంకొంతమంది అంగీకరించకుండా అలాగ పోరాడుతూనే ఉంటారు. కాకపోతే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే అక్కడ ఓటమిని అంగీకరించింది వాళ్లే ఇక్కడ ఓటమిని అంగీకరించకుండా పోరాడుతుంది కూడా వాళ్లే. కాబట్టి ఏదైనా మనలోనే ఉంటుంది నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొని జీవితంలో విజయం సాధించడం ఎలా అనే టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. మూడు అంటే మూడే మూడు పాయింట్లు చెప్తాను ఈ మూడింటిని గనక మీరు సరిచేసుకొని చక్కగా ఉదయాన్నే నిద్ర లేచి శుభ్రంగా స్నానం చేసి తల దువ్వుకొని మొహానికి వాటర్ కొట్టుకొని ప్రతి రోజు రెడీ అయిపోయారు అనుకోండి మిమ్మల్ని ఈ జీవితంలో ఎవరు లెక్క చేయాల్సిన అవసరం లేదు ఎవరు గౌరవించాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఎవరు కౌంట్ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే మీ పనిలో మీరు బిజీ గా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళతో మీకేంటి సంబంధం. కాబట్టి నేను చెప్పొచ్చు ఏంటి ఏంటంటే ఈ మూడు పాయింట్లు గనుక ప్రాపర్ గా పాటిస్తే మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొని మీరు మీ జీవితంలో సక్సెస్ అవుతారు ఇది నా మాట కాదు ప్రపంచంలో చాలా మంది గొప్ప వాళ్ళు చెప్పిన మాట.
THE POWER OF MINDSET (ది పవర్ ఆఫ్ మైండ్ సెట్)
ఇక మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ది పవర్ ఆఫ్ మైండ్ సెట్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు మనకి ఎదురయ్యే కష్టాల వల్ల మనం ఏంటంటే ఓడిపోయాం అని చెప్పేసి మనకి మనం అంగీకరించేసుకొని మనం కాంపిటీషన్ లో నుంచి పక్కకు వచ్చేసి పనికిమాలిన వాళ్ళలాగా దిక్కులు చూస్తూ ఉంటాం అది కరెక్ట్ కాదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ మైండ్ సెట్ ని ప్రాపర్ గా మీరు డిజైన్ చేసుకోవాలి మీరు అవునన్నా కాదన్నా సరే ప్రతి రోజు మన జీవితంలో మనకి కష్టాలు వస్తూనే ఉంటాయి. కొంతమంది ఏమో వాటిని అలవాటు చేసుకుని సింపుల్ గా వాటితో ఫుట్బాల్ ఆడుకొని పక్కకి వెళ్ళిపోయి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం వాటిని చూసి భయపడిపోతూ ఉంటారు మనం ఎలా బతకాలిరా బాబు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు నిజం చెప్పాలంటే వాళ్ళ ఊరు దాటి బయటకు వచ్చి బతకడానికి కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారు. అంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఉంటారు మనకు అసలు ఏమి చేయాలి కదా అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు ఫిక్స్ అయిపోతూ ఉంటారు అసలు వాళ్ళ మైండ్ సెట్ ఏ కరెక్ట్ గా ఉండదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు మొట్టమొదట మనసుని జయించండి అది కూడా మీ మనసును మీరు జయించండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పానిక్ అవ్వకుండా లాజికల్ గా మీ మనసును మీరు డిజైన్ చేసుకోండి. ఎందుకంటే ఈ సమస్య నీ ఒక్కడికే వస్తే నువ్వు బాధపడుతున్నావ్ తప్పులేదు ప్రపంచంలో ప్రతి ఒక్కడికి సమస్యలు వస్తున్నప్పుడు నువ్వు ఎందుకు బాధపడాలి. కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే ఈ సమస్య ఇంతకు ముందు వేరే వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు అని తెలుసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ మీ సమస్యకి 50% సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కానీ అలా కాకుండా మీరు మీ మనసుని జయించకుండా వేరే వాటిల గురించి ఎక్కువ ఆలోచించుకుంటూ వామ్మో నా వల్ల కాదు అనుకుంటే మాత్రం మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు. కాబట్టి మీరు మీ మనసుని జయించండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రాక్టికల్ గా ఉండండి. మొదట భయపడకుండా ఉండండి ఎందుకంటే భయం అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది వాళ్ళు ఉన్న భయాన్ని పక్కకు నెట్టేసి ప్రశాంతంగా ఉంటారు మరి కొంతమంది లేని సిట్యువేషన్ లో కూడా భయాన్ని క్రియేట్ చేసుకొని భయపడుతూనే ఉంటారు. కాబట్టి మొట్టమొదట మీరు మీ మనసుని జయించండి.
STARGEY FOR OVER COMING OBSTICLES (స్ట్రాటజీస్ ఫర్ ఓవర్ కమింగ్ అబ్స్టాకిల్స్)
ఇంకా రెండో పాయింట్ ఏంటంటే స్ట్రాటజీస్ ఫర్ ఓవర్ కమింగ్ అబ్స్టాకిల్స్ బేసికల్ గా అడ్డంకుల్ని అధిగమించడానికి ప్రతి ఒక్క మనిషి దగ్గర వ్యూహాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ లేని వాళ్ళు మాత్రం వాళ్ళ వ్యూహాలని ప్రాపర్ గా రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి రోజు మనకి కష్టాలు వస్తాయండి ఇది మాత్రం కామన్ గా ఉండే ప్రక్రియ. కాబట్టి ఎదురు దెబ్బల నుండి తిరిగి పుంచుకోవడానికి మన దగ్గర ప్రాపర్ గా వ్యూహాలు అనేవి ఉండాలి అవి లేకపోతే మాత్రం కష్టం. ఎందుకంటే అయ్యో ఈ నెల మనకు ఉద్యోగం లేకపోతే మన పరిస్థితి ఏంటి అని చెప్పి భయపడిన వాళ్ళు చాలా మంది కరోనాలో ఖాళీగా ఉన్నా సరే మనం బతికి బయట పడితే చాలు ఏదో ఒకటి పని చేసుకొని బతకొచ్చు అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే ఈ భూమి మీద మన ప్రాణం కన్నా విలువైంది ఏదీ లేదు. అలా ఫిక్స్ అయితే మాత్రం మీరు ఎటువంటి పనైనా చేయగలుగుతారు ఏ సిచుయేషన్ లో అయినా సరే మీరు వ్యూహాలను రచించగలుగుతారు. అలా గనక మీరు చేస్తే మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యకి మీ దగ్గర సొల్యూషన్ ఉంటుంది. అంతేగాని మీరే పానిక్ అయిపోయి మీ సమస్యలను చూసి మీరే భయపడిపోతే మిమ్మల్ని ఈ జీవితంలో ఎవ్వరూ మార్చలేరు.
REAL LIFE SUCCESS STORIES (రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీస్)
ఇంకా మూడో పాయింట్ ఏంటంటే రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీస్ ని ఎక్కువగా వింటూ ఉండండి అలా వింటూ ఉండటం వల్ల వాళ్ళు అసలు సక్సెస్ ఫుల్ గా ఉండటానికి కారణం ఏంటి అన్ సక్సెస్ ఫుల్ గా అవ్వకపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి మీకు ప్రాపర్ గా ఐడియా వస్తుంది. అలాగ మీరు కథలు తెలుసుకోవాలంటే ఫస్ట్ అఫ్ ఆల్ బుక్స్ అండ్ చదవాలి లేకపోతే అద్భుతమైన కొన్ని youtube ఛానల్స్ ని ఫాలో అవ్వాలి. కుదిరితే మనల్ని కూడా ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. అలాగా మీరు ఫాలో అయ్యే ప్రతి ఒక్క సోషల్ మీడియా అకౌంట్ మీకు కొన్ని గొప్ప కథలు చెప్పేవై ఉండాలి. అవి చదవటం వల్ల అవ్వచ్చు చూడటం వల్ల అవ్వచ్చు మీకు తెలియకుండానే మీకు చాలా బలం వస్తుంది బలం అంటే మెంటల్ స్ట్రెంత్ వస్తుంది. మీలో మీకు తెలియని ఒక స్పార్క్ వస్తుంది ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఎక్కడో జరిగిన ఒక కథ మీ సమస్యకి ఒక సొల్యూషన్ కూడా వెతికి పెడుతుంది. కాబట్టి కంటిన్యూస్ గా బుక్స్ చదువుతూ ఉండండి లేకపోతే చదివి ఓపిక లేదు అన్నప్పుడు youtube లో వీడియోస్ చూడండి అది కూడా కాకపోతే ఆడియో బుక్స్ ని వినండి. అలా కంటిన్యూస్ గా మీరు వినటం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని మీరు ఎదిరించి జీవితంలో సక్సెస్ అవ్వడానికి 99% ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ అఫ్ ఆల్ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ మైండ్ సెట్ ని మార్చుకోండి. ఆ తర్వాత మీకు ఎదురయ్యే సమస్యలకు వ్యూహాలు రచించండి. ఇంకా ముఖ్యంగా చరిత్రలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తుల కథలు చదవండి అలా చదివిన తర్వాత మీ సమస్యలకి ఆటోమేటిక్ గా పరిష్కారాలు దొరుకుతాయండి.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
2 thoughts on “జీవితంలో విజయం సాధించడం ఏలా | How To Be Successful In Life in Telugu”