మైండ్ పాడు చేసే చెడు ఆలోచనలు – mind padu chese alochanalu
ఇవాళ్టి టాపిక్ లో mind padu chese alochanalu గురించి తెలుసుకుందాం.
మైండ్ పాడు చేసే మూడు చెడు అలవాట్లు
మామూలుగా ఏ మనిషికైనా ఎలాంటి మనిషికైనా ఏ పని చేసుకునే వాడికైనా సరే వాళ్ళ వాళ్ళ పెట్టుబడి ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ పెట్టుబడి కాకపోతే చాలా మందికి ఆ విషయం తెలియదు. ఇక్కడ నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే మనం ప్రత్యక్షంగా మన బుర్రను పాడు చేసుకునే అలవాట్లు కొన్ని ఉంటాయి. వాటిలో మందు తాగడం అవ్వచ్చు మామూలుగా మందు తాగితే మన బుర్ర అసలు పని చేయదు అందులోనూ ఆ బుర్ర మామూలు ప్రపంచం రావడానికి 24 గంటలు టైం పడుతుంది. అలాగే మనకి తెలియకుండా మన బుర్రని చాలా విధాలుగా మనం పాడు చేసుకుంటూ ఉంటాం ఇదంతా బానే ఉంటుంది. కానీ అసలు ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా చాలా పద్ధతిగా ఉండే వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బుర్రని పాడు చేసుకుంటారు, ఈరోజు నేను చెప్పబోయే పాయింట్ కూడా అదే. మీకు తెలియకుండా మీరు మీ బుర్రని పాడు చేసుకుంటున్నారు మీ బుర్రని పాడు చేసుకోవడం అంటే నెగిటివ్ థాట్స్ అన్నమాట అంటే అవి కూడా మనకి చాలా హాని చేస్తాయి నిజం చెప్పాలంటే మందు తాగడం కన్నా సిగరెట్ తాగడం కన్నా వాటన్నిటికన్నా భయంకరమైన మూడు నెగిటివ్ థాట్స్ ఉంటాయి. అవి గనుక మీ బుర్రలో ఇప్పుడు ఉంటే వాటిని తీసేయండి ఒకవేళ వస్తే మాత్రం వాటిని రానీయకుండా చూడండి. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ బుర్రని మీరు పాడు చేసుకుంటున్నారు.
THE TRAP OF I NOT GOOD (ద ట్రాప్ ఆఫ్ ఐ యామ్ నాట్ గుడ్)
ఫస్ట్ మీ బుర్రలో నుంచి మీరు తీసేయాల్సిన మొట్టమొదటి నెగిటివ్ థాట్ ఏంటంటే ద ట్రాప్ ఆఫ్ ఐ యామ్ నాట్ గుడ్. మామూలుగా మనం మనల్ని తక్కువ అంచనా వేసుకోవడంలో మనకు మించిపోతాం అన్నమాట. ఈ ప్రపంచంలో ఎవరు మనల్ని తక్కువ అంచనా వేయరు ఒకవేళ వేసినా కూడా అంత తక్కువ అంచన వేయరు కానీ మనల్ని మనం తక్కువ అంచన వేసుకోవడంలో మామూలుగా వేసుకోము మనకు అసలు ఏమి చేత కాదు మన వల్ల కాదు అని చెప్పేసి అవతలి వాళ్ళనే హీరోగా చూస్తాం తప్ప ఈ రోజు మనలో ఉన్న హీరోని మనం గుర్తించము. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే మనలో కూడా ఒక హీరో ఉంటాడు వాడికి కూడా స్పెషల్ టాలెంట్ ఏదో ఒకటి ఉంటుంది. కాకపోతే ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అది రికగ్నైజ్ చేయరు ఇక మన సంగతి అంటామా మనం అసలు రికగ్నైజ్ చేయం. ఎందుకంటే మనకి ఇష్టమైన పనిని మన జీవితంలో మనం కేవలం ఒక గంటో రెండు గంటలో చేస్తాం.
ఉదాహరణకి క్రికెట్ బాగా ఇష్టం అనుకోండి మహా అయితే రెండు గంటలు క్రికెట్ ఆడతాం సినిమా అంటే బాగా ఇష్టం అనుకోండి మహా అయితే ఒక మూడు గంటలు వదిలి పెడతాం. కానీ నేను సినిమా డైరెక్టర్ అవ్వగలను లేకపోతే నేను ఒక పెద్ద క్రికెటర్ అవ్వగలను అని చెప్పేసి మనలో ఉన్న టాలెంట్ ని మనం బయటికి తీసుకొచ్చి మనం ఖచ్చితంగా సాధిస్తాం అని చెప్పేసి మనతో మనం అసలు చెప్పుకోము. మనతో మనమే చెప్పుకున్నప్పుడు మిగతా వాళ్ళు ఎలా చెప్తారు. కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే మీరు ఐ యామ్ నాట్ గుడ్ అనే ట్రాప్ నుంచి దయచేసి బయటికి రండి మీ మనసులో ఉన్న ఆ నెగిటివ్ థాట్ ని తీసి పక్కన పెట్టేయండి.
బిజినెస్ మ్యాన్ సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది అదేంటంటే ఇప్పుడు దాకా ఇక్కడికి వచ్చి పీకిన వాళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చినోళ్లే అని చెప్పేసి. కాబట్టి మీరు దేన్నైతే ఇష్టపడతారో ఏ ఫీల్డ్ ని అయితే ఇష్టపడతారో ఆ ఫీల్డ్ లో ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళందరూ గారు ఎక్కడి నుంచో వచ్చి అక్కడ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్న వాళ్లే తప్ప అందులో నుండి పుట్టి అందులోనే పెరిగి అందులో ప్రూవ్ చేసుకున్న వాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి మిమ్మల్ని మీరు అసలు తక్కువ చేసుకోమాకండి అలా చేసుకుంటే మాత్రం మీకు తెలియకుండా మీ బ్రెయిన్ ని మీరే డామేజ్ చేస్తున్నట్టు. ఎందుకంటే జీవితంలో మనం సక్సెస్ అవ్వటం అనే విషయం కాస్త పక్కన పెడితే కనీసం కార్ డ్రైవింగ్ చేయడానికి కూడా మనకు ధైర్యం సరిపోదు. కాబట్టి మిమ్మల్ని మీరు అసలు తక్కువ అంచనా వేసుకోమాకండి.
THE FEAR OF FAILURE (ది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్)
ఇక రెండో నెగిటివ్ థాట్ ఏంటంటే ది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మామూలుగా అపజయం అంటే ప్రతి ఒక్కడికి భయం ఉంటుంది అలా భయం ఉండటం వల్లే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తాము. కాకపోతే ఒక పని మొదలు పెట్టక ముందు మనం సక్సెస్ అవుతామో లేదో అని డౌట్ పడటం వేరు మనం కచ్చితంగా ఫెయిల్ అవుతాం అని చెప్పేసి మీకు మీరు చెప్పుకొని మీలో ఉన్న ఎనర్జీ మొత్తం మీరు తీసేసుకోవడం వేరు. నేను ఏం చెప్తానంటే ప్రతి ఒక్కళ్ళు ఫెయిల్ అవుతారు అలా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఫెయిల్ అవుతూనే ఉంటారంటే నేను అసలు నమ్మను. కాబట్టి ఫెయిల్యూర్ అనే ఒక భయం మన మనసులో ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తాము కచ్చితంగా మనం చేసే పనిలో సక్సెస్ అవుతాము. కానీ మన వల్ల కాదేమో మనం తప్పకుండా ఫెయిల్ అవుతాము అని చెప్పేసి మనం అసలు ఆ పని చేయకుండానే మీ ఫెయిల్యూర్ ని మీరు అంగీకరించేసి అసలు ఆ పని చేయకపోతే ఎలా చెప్పండి. కాబట్టి నేను ఏమంటానంటే ప్రతి ఒక్క మనిషి ఎప్పుడూ సక్సెస్ లో ఉండడు ఒకవేళ సక్సెస్ లో ఉన్న వాళ్ళని చూపించి ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలన్నీ హిట్ అయిపోతున్నాయి కదా మరి ఆయన ఫుల్ సక్సెస్ లో ఉన్నాడు కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. కానీ వాళ్ళ నాన్నగారు ఒక సినిమా తీసిన తర్వాత అందులో వాళ్ళు చాలా డబ్బులు నష్టం పోయిన తర్వాత రాజమౌళి గారు ఒక నిర్ణయం తీసుకున్నారంట. అదేంటంటే మనం ఒక పని చేసేటప్పుడు అది సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో అనేది మన చేతుల్లో ఉండదు కేవలం పని చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఆ పనిని మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పర్ఫెక్ట్ గా చేస్తే మాత్రం అసలు ఫెయిల్ అవ్వడానికి ఆస్కారమే లేదని చెప్పేసి. మనం ఒక పనికి చేయాల్సిన పని కన్నా ఎక్కువ పని చేసి అంటే నా ఉద్దేశం కష్టపడి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిజం చెప్పాలంటే మనం ఒక రన్నింగ్ రేస్ కాంపిటీషన్ లో పాల్గొంటున్నాం అనుకోండి అది కూడా 5 kg కిలోమీటర్ల రన్నింగ్ రేస్ అనుకోండి మనం 5 km పరుగు పంద్యానికి మాత్రమే ప్రిపేర్ అయ్యాము అనుకోండి ఫెయిల్ అవ్వచ్చు సక్సెస్ అవ్వచ్చు కానీ 7 km పరుగు పంద్యానికి ప్రిపేర్ అయిపోయాం అనుకోండి అందులో మనకి గెలిచే ఛాన్సులు ఎలా ఉంటాయి కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే మీ టార్గెట్ 10 మైల్స్ అయితే హేమ్ టు ద 11th మైల్ అంతేనండి అంతకు మించి ఏం లేదు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకొని నేను గెలుస్తానో లేదో అని చెప్పి భయపడిపోయి అసలు పోటీకే మీరు రాకపోతే నిజంగా ఓడిపోతారండి మీరు ఓడిపోవడానికి కారణం మీరే. కానీ మీరు దేన్నైతే ఈ టార్గెట్ అనుకుంటున్నారో దానికి డబల్ ప్రాక్టీస్ చేశారు అనుకోండి ఒకటి ఎక్స్పీరియన్స్ వస్తది రెండు గెలుపన్న వస్తది. అంతే అంతకు మించి ఏం లేదు
I DO IT LATER (ఐ డూ ఇట్ లేటర్)
ఇంకా మూడో నెగిటివ్ థాట్ ఏంటంటే మనం ఏ పని మొదలు పెట్టిన ఐ డూ ఇట్ లేటర్ అని మనకి మనం చెప్పుకోవడం అన్నమాట నేను తర్వాత చేస్తాను అని చెప్పేసి మనకి మనం సర్ది చెప్పుకోవడం వల్ల సంకనాగిపోయేది మనమే. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు రేపు చేయాల్సిన పనిని కుదిరితే ఈరోజు చేసుకోండి అమ్మ ఎందుకంటే ఈ ప్రపంచం ఎలా పరిగెడుతుందో మీ అందరికీ నేను సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ 2024 లో మనుషులు ఎలా ఆలోచిస్తున్నారు ఎలా కష్టపడుతున్నారు అని చెప్పేసి మీరు బయటకు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే 24 గంటల్లో ప్రతి గంట ప్రతి నిమిషం మనకి చాలా ఇంపార్టెంట్ వచ్చే నిమిషం చూసుకుందాం అని చెప్పేసి ఈ నిమిషాన్ని మీరు వృధా చేస్తే నష్టపోయేది మీరే. కాబట్టి నేను తర్వాత చేస్తాను ఆ తర్వాత చేస్తానని చెప్పేసి మీకు మీరు సద్ది చెప్పుకొని మీరు సమయాన్ని వృధా చేస్తే మాత్రం నాకు తెలిసినంత వరకు మీరు జీవిత లక్ష్యాలు లేకుండా అన్నిటిని పక్కన పెట్టేసి ప్రశాంతంగా కూర్చోవడం బెటర్. ఎందుకంటే అంత ప్రశాంతత కావాలన్నా కూడా మనం చాలా కష్టపడాలి పాపం అందుకనే యోగాలు ధ్యానాలు మెడిటేషన్లు అని చెప్పేసి రకరకాలు చేస్తూ ఉంటారు. నీకు ప్రశాంతత కావాలన్నా కూడా నువ్వు ఒకచోట కూర్చొని కూడా కష్టపడాలి అది కూడా కష్టమే. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు ఏదైనా పని ఉంటే మీకు ఏదైనా టార్గెట్ ఉంటే మీకు ఏదైనా లక్ష్యం ఉంటే దాని కోసం ఈ క్షణం నుంచే పరిగెత్తడం మొదలు పెట్టండి పని చేయడం మొదలు పెట్టండి అలా చేయటం వల్ల ఈ ప్రపంచంలో బాగుపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం అది ఖచ్చితంగా మీరే.
కాబట్టి మీ బ్రెయిన్ లో ఉన్న ఈ మూడు నెగిటివ్ థాట్స్ ని గనక తీసి పక్కన పడేస్తే మీ జీవితంలోకి ప్రశాంతత ఆ తర్వాత సక్సెస్ ఇంకా ముఖ్యంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
1 thought on “మైండ్ పాడు చేసే చెడు ఆలోచనలు | mind padu chese alochanalu”