మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు త్యాగం చేయవలసిన విషయాలు – Telugu Inspirational Story
ఇవాళ్టి టాపిక్ లో Telugu Inspirational Story గురించి తెలుసుకుందాం
త్యాగం చేస్తేనే విజయం వస్తుంది
సక్సెస్ గురించి చాలా మందికి చాలా ఉద్దేశాలు ఉన్నాయి ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే జీవితం పట్ల మంచి ప్లానింగ్ ఉండాలి. అంతే కాకుండా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉండాలి. వాతావరణం అనుకూలించాలి ఆ రోజు వర్షం పడకూడదు లేకపోతే ఇంకేదో జరగాలి అని చెప్పేసి చాలా మందికి చాలా ఉద్దేశాలు ఉంటాయి. కానీ నన్ను అడిగితే ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే తను ఖచ్చితంగా చేయాల్సిన పని ఒకటి ఉంది అదే త్యాగం. త్యాగం చేయడం వల్ల సక్సెస్ ఎలా వస్తుంది అనే డౌట్ మీకు రావచ్చు. ఏ విషయంలో త్యాగం చేస్తే ఏ విషయంలో మనం విజయం అవుతాం అంటే సక్సెస్ అవుతాం అనే పాయింట్ నేను మీకు రోజు చెప్తాను.
ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి యొక్క అంతిమ లక్ష్యం విజయం సాధించడం అది ఏ వృత్తిలో అయినా సరే ఏ రంగంలోనైనా సరే. కాకపోతే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మనం సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి ఎలా పని మొదలు పెట్టాలి అని చెప్పి అనుకుంటారు. కాకపోతే వాటి వెనకాల లెక్క లేనన్ని త్యాగాలు ఉంటాయి అంటే ఒక మనిషి విజయం సాధించడం వెనకాల లెక్క లేనని త్యాగాలు ఉంటాయి అవన్నీ మనకు కనిపిస్తే కనిపించవు.
ACADEMIC SACRIFICES
ఉదాహరణకి అకాడమిక్ సాక్రిఫైసెస్ బేసికల్ గా చదువుకునే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి ప్రతి నెలకి ఎగ్జామ్స్ ఉంటూ ఉంటాయి. వాటికి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు అలా ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ లో కుటుంబ సభ్యులకి దూరంగా ఉంటారు రిలేటివ్స్ లో ఫంక్షన్స్ వస్తాయి కదా ఆ ఫంక్షన్స్ కి వాళ్ళు అటెండ్ అవ్వలేరు. అంతేకాకుండా సరదాగా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్లి క్రికెట్ ఆడటమో లేకపోతే వాళ్ళతో సరదాగా అటు ఇటు తిరిగి రావటమో ఇలాంటి వాటన్నిటికి దూరమైపోయి బాహ్య ప్రపంచాన్ని షట్ డౌన్ చేసేసి పుస్తక ప్రపంచానికి చాలా దగ్గర అవుతారు. అలా వాళ్ళు సాక్రిఫైస్ చేస్తేనే వాళ్ళు ఉన్న ఆ విద్యారంగంలో వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారు.
ATHLETIC SACRIFICES
అత్లెంటిక్ సాక్రిఫైసెస్ మామూలుగా వీళ్ళ గురించి చెప్పాలంటే ప్రతి రోజు ఉదయం పరుగులు తీస్తూ బాడీని చాలా హిట్ గా ఉంచుకుంటూ నిజం చెప్పాలంటే ప్రతి చెమట చుక్క ప్రతి క్షణం ఎన్నో సందేహాలను ఎదుర్కొని వాటిని అతిగమించి ఎన్నో త్యాగాలు చేసి గొప్ప గొప్ప విజయాలకి వాళ్ళు దగ్గరగా ఉండాలనుకుంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళు తినాలి అంటే కడుపు నిండా భోజనం చేయగలరు కానీ తినలేరు కొంత ఫుడ్ మాత్రమే తిని బాడీని చాలా ఫిట్ గా ఉంచుకొని అప్పటికే వాళ్ళ మైండ్ లో ఎన్నో డౌట్లు ఉంటాయి వాటన్నిటిని క్లియర్ చేసుకొని వాళ్ళు అనుకున్న రంగంలో వాళ్ళు విజయం సాధిస్తారు. అంతెందుకండి ఒక వ్యక్తి పెళ్లి చేసుకొని తన కుటుంబం కోసం తను చేసే త్యాగాల గురించి మనం సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భార్యకి పిల్లలకి కష్టాలు చెప్పుకుంటే వాళ్ళు ఎక్కడ బాధపడతారు అని చెప్పేసి వాళ్ళు పడే బాధను కూడా తనే పడుతూ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ వాటిని కూడా బయటికి చెప్పు ఒప్పుకోకుండా కేవలం కుటుంబ సభ్యుల సంతోషం కోసం వాళ్ళ జీవితాన్ని వాళ్ళు త్యాగం చేసుకున్న వాళ్ళు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. వాళ్ళు మనతో తిరుగుతూ ఉంటారు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే త్యాగం అలాగే విజయం రెండు ఒకే నాణానికి అటువైపు ఇటువైపు ఉంటాయి అన్నమాట. వాటిని ప్రాపర్ గా మనం హ్యాండిల్ చేయగలిగితే మీరు వద్దన్నా సరే విజయం మీ వెనకాల వస్తుంది. ప్రతి త్యాగం నిన్ను నీ కలలకి ఒక అడుగు దగ్గరకు తీసుకువస్తాయి ఎందుకంటే నువ్వు చేసే త్యాగమే నీ సక్సెస్ ని డిఫైన్ చేస్తాయి. కాబట్టి జీవితం లో ఏం సాధించాలన్న తప్పకుండా త్యాగం చేయాలి.
లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీ జీవితంలో మీ కోసం త్యాగం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాళ్ళు మీకు ఏమవుతారో కూడా కామెంట్ చేయండి.ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.