మీరు మీ జీవితం పట్ల అసంతృప్తిగా ఉండడానికి గల కారణాలు – Jevitham lo asamthrupthi nundi bayataku ravadam ela
ఇవాళ్టి టాపిక్ లో Jevitham lo asamthrupthi nundi bayataku ravadam ela గురించి తెలుసుకుందాం.
మనుషులు జీవితంలో అసంతృప్తిగా ఎందుకు ఉంటున్నారు
మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా మనం ఎంత కష్టపడిన సరే ఎంత డబ్బులు సంపాదించినా సరే మనం మన జీవితంలో అసంతృప్తిగా ఎందుకు ఉంటున్నాము. అసలు మన జీవితంలో మన సంతోషాన్ని మనం ఎందుకు కోల్పోతున్నాము, అసలు సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నాము, ఇలాగ మీకు ఏదో ఒక రోజు అనిపించే ఉంటుంది. కాకపోతే ఈరోజు వాటికి కారణాలు మనం తెలుసుకుందాము ఈరోజు మన టాపిక్ కూడా అదే మనం జీవితంలో అసంతృప్తిగా ఎందుకు ఉంటాము.
గతాన్ని వదిలిపెట్టకపోవడం
ఫస్ట్ పాయింట్ ఏంటంటే గతాన్ని వదిలిపెట్టకపోవడం మనం చేసిన తప్పులు మనకు జరిగిన అన్యాయాలు మనం మోసపోవడం అవ్వచ్చు, అనేక రకాల ఆలోచనలు మన మనసులో ఎప్పుడూ ఉండిపోతూనే ఉంటాయి. అలా ఉంటాయి అంటే గతానికి సంబంధించిన వాటన్నిటిని మన జీవితాంతం మోస్తాం అని దాని అర్థం. గతం అనేది మనకి ఎప్పుడైనా సరే ఆనందాన్ని కలిగించాలి కానీ మన సంతోషాన్ని మనకి దూరం చేయకూడదు. నేను చెప్పవచ్చేది ఏంటంటే మనం చేసిన తప్పుల్ని మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం వల్ల అవి ఉప్పులైపోతాయా అవ్వవు. అంతేకాకుండా మనం ఎవరి దగ్గర మోసపోయిన తర్వాత వాడు నన్ను అలా మోసం చేశాడు నేను లవ్ ఉండాల్సింది అని చెప్పేసి మీలో మీరు బాధపడుకుంటూ కూర్చుంటే మీరు మోసపోయిందే కాక మీ సంతోషాన్ని కూడా మీకు మీరు దూరం చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే జరిగింది ఏదో జరిగిపోయింది కానీ జరిగిన వాటి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకొని మనం మన జీవితంలో ఆనందంగా ఉండాలి మనం సంతృప్తిగా ఉండాలి తప్ప మన జీవితం పట్ల మనం అసంతృప్తిగా ఉండకూడదు. మేజర్ గా చాలా మంది వాళ్ళ వాళ్ళ జీవితాల పట్ల అసంతృప్తిగా ఉండటానికి మెయిన్ రీసన్ వాళ్ళు తెలిసి చేసిన తప్పులు అవ్వచ్చు తెలియక చేసిన తప్పులు అవ్వచ్చు వాటి వల్ల గిల్టీ ఫీలింగ్ తో కూడా అసంతృప్తిగా ఉంటారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు తెలిసి తప్పు చేసిన తెలియక తప్పు చేసిన తప్పు అయితే చేశారు కానీ నేనేమంటానంటే ఇంకొకసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకోండి మరొకసారి మీరు వాంటెడ్ గా తప్పు చేయకుండా ఉండటానికి మాక్సిమం ట్రై చేయండి. ఇలా ఉండటం వల్ల మీ జీవితంలో మీరు అసంతృప్తిగా ఉండకుండా ఉండటానికి మాక్సిమం ఛాన్సులు ఉంటాయి.
ఇతరులతో పోల్చుకోవటం
ఇంకా రెండో పాయింట్ ఏంటంటే ఇతరులతో పోల్చుకోవటం మన జీవితాలను ఇతరులతో పోల్చుకోవడం వల్ల కూడా మన జీవితంలో మనం అసంతృప్తిగా ఉంటాము. సోషల్ మీడియా అవ్వచ్చు సినిమాలు అవ్వచ్చు లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సక్సెస్ అవ్వటం చూసి మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాము. ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్ళు సంతోషంగా ఉండటం చూసి మన సంతోషాన్ని మనం కోల్పోతాము. నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు ప్రతి ఒక్కరి విజయం వేరు మనం మన సంతోషాన్ని ఇతరులతో పోల్చుకుంటే అది ఎప్పుడూ మనకి సంతోషాన్ని ఇవ్వదు మన సంతోషాలు మనవే అవతలి వాళ్ళ సంతోషాలు అవతలి వాళ్ళవే మన విజయాలు మనవే అవతలి వాళ్ళ విజయాలు అవతలి వాళ్ళవే. ఇక్కడ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన జర్నీ ఉన్నప్పుడు ఒకడు ముందుగా రీచ్ అవుతాడు ఇంకొకడు కొంచెం లేట్ గా రీచ్ అవుతాడు కానీ ముందుగా రీచ్ అయిన వాడిని చూసి లేట్ గా రీచ్ అయిన వాడు బాధపడితే ఎవడికి నష్టం చెప్పండి. కాబట్టి మీ చుట్టూ ఉన్నవాడు వాళ్ళని చూసి అయ్యో నేను కూడా వాళ్ళలాగా సక్సెస్ అవ్వలేకపోతున్నానే నేను కూడా వాళ్ళలాగా డబ్బులు సంపాదించలేకపోతున్నానే నేను కూడా వాళ్ళలాగా లగ్జరీగా బతకలేకపోతున్నాను అని చెప్పేసి మీ ఆనందాన్ని మీరు దూరం చేసుకుంటే ఎవరికి నష్టం చెప్పండి. కాబట్టి మీరు అవతల వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల అవతలి వాళ్ళతో పోల్చుకోవడం వల్ల మీ జీవితం పట్ల మీకు అసంతృప్తి అనేది మొదలవుతుంది. కాబట్టి ఇతరులతో ఎప్పటికీ అస్సలు పోల్చుకోమాకండి అలా పోల్చుకోవడం వల్ల మన సంతోషం మనమే కోల్పోయిన వాళ్ళం అవుతాం.
కృతజ్ఞత లేకపోవటం
ఇంకా మూడో పాయింట్ ఏంటంటే కృతజ్ఞత లేకపోవటం అంటే మన పట్ల మనకి కృతజ్ఞత అనేది అస్సలు లేకపోవటం మనకు ఉన్నది ఏమిటో మనం ఏమి సాధించామో చూసుకోకుండా మనకు ఏమీ లేదో మాత్రమే చూస్తూ ఉంటాము. ఈ భావన వల్ల మనం ఎప్పుడూ తృప్తిగా అస్సలు ఉండలేము. కాబట్టి ఉన్న దానితో తృప్తి పడండి లేని దాని కోసం పోరాడండి తప్పులేదు కానీ నాకు ఎందుకు లేదు అని చెప్పేసి ఏ పని చేయకుండా ఆలోచిస్తే బాధపడేది ఎవరు మీరే కదా తృప్తి లేకుండా జీవించేది ఎవరు మీరే కదా. కాబట్టి ఉన్న దానితో సంతోషపడండి భగవంతుడు మనకి ఇంత ఇచ్చాడు అని చెప్పేసి కృతజ్ఞతగా ఉండండి లేని దాని కోసం మీకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని దాని కోసం పోరాడండి దాని కోసం పని చేయండి కష్టపడండి తప్పులేదు. కానీ నాకెందుకు లేదని చెప్పి కూర్చొని బాధపడటం వల్ల కూడా మీరు జీవితాంతం అసంతృప్తిగా ఉంటారు. కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే ఈ మూడు పాయింట్లు గనక ప్రాపర్ గా మీరు ఒకసారి అనాలసిస్ చేసుకుంటే మీరు మీ జీవితం లో అస్సలు అసంతృప్తిగా ఉండరు ఇది 100% నిజం.
కాబట్టి మళ్ళీ ఒక్కసారి ప్రాపర్ గా ఈ మూడు పాయింట్లను నేను మీకు చెప్తాను.
ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే గతాన్ని వదిలిపెట్టేయాలి. గతంలో మీరు తప్పులు చేసి ఉండొచ్చు ఒప్పులు చేసి ఉండొచ్చు మంచి చేసి ఉండొచ్చు చెడు కూడా చేసి ఉండొచ్చు కానీ నేనేమంటానంటే గతాన్ని అస్సలు మీ మనసులో మోయమాకండి. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే ఇతరులతో పోల్చుకోవద్దు దీనంత దరిద్రమైన అలవాటు ఇంకెక్కడ ఉండదు అన్నమాట. అవతల వాళ్ళతో కంపేర్ చేసుకోవడం ఏంటి ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి యూనిక్ లైఫ్ ఉంటుంది యూనిక్ లైఫ్ స్టైల్ ఉంటుంది ఒక సపరేట్ జర్నీ ఉంటుంది. దాన్ని ఎంజాయ్ చేయలే కానీ అవతల వాడిలాగా నా జీవితం కూడా ఉండాలనుకోవడం మాత్రం దీనికి మించిన దరిద్రం ఇంకోటి ఉండదు. ఎందుకంటే వాడికి పర్సనల్ గా ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ ఇండైరెక్ట్ గా మనకు కూడా రావాలని కోరుకున్నట్టే కదా. కాబట్టి ఇతరులతో పోల్చుకోమాకండి వాళ్ళలాగా లేవని చెప్పేసి బాధపడమాకండి. ఇంకో మూడో పాయింట్ ఏంటంటే మీ పట్ల మీరు కృతజ్ఞతగా లేకపోవటం ఉన్నదానితో సంతోషపడండి లేని దాని కోసం కష్టం కష్టపడి పని చేయండి. ఈ మూడు చేయడం వల్ల మీ జీవితం పట్ల మీరు చాలా సంతృప్తిగా ఉంటారు.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
1 thought on “మీరు మీ జీవితం పట్ల అసంతృప్తిగా ఉండడానికి గల కారణాలు | Jevitham lo asamthrupthi nundi bayataku ravadam ela”