మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే – Manasu Prashantanga Undalante in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Manasu Prashantanga Undalante in Telugu గురించి తెలుసుకుందాం రండి.
ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషి ప్రథమ లక్ష్యం డబ్బు సంపాదించడం అయితే అంతిమ లక్ష్యం మాత్రం ప్రశాంతంగా ఉండటం. కాకపోతే చాలా మందికి ఆ ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయం మాత్రం అస్సలు తెలియదు. కొంతమంది ఏమనుకుంటారంటే బాగా డబ్బులు సంపాదిస్తే వస్తుంది అనుకుంటారు ఇంకొంతమంది ఏమనుకుంటారంటే ఆ డబ్బులు జేబులో పెట్టుకొని ఊరంతా తిరగటం వల్ల వస్తుంది అనుకుంటారు మరి కొంతమంది అయితే కేవలం డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రశాంతత ఉంటుంది మిగతా వాళ్ళకి అసలు ఉండదు అని చెప్పి అనుకుంటారు అలాగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అనుకుంటారు. నా విషయానికి వస్తే మనిషి జీవితంలో ప్రశాంతంగా ఉండడానికి డబ్బుకి అసలు సంబంధమే లేదు. కాబట్టి మనం ప్రశాంతవంతమైన జీవితం ఎలా గడపాలో అసలు ప్రశాంత జీవితాన్ని ఎలా పొందాలో ఈరోజు నేను మీకు చెప్తాను ఫస్ట్ అఫ్ ఆల్ మీరు ప్రశాంతంగా ఉండాలంటే మీ ఆలోచనలని నియంత్రించాలి. మన జీవితంలో నిజంగా ప్రశాంతత వచ్చేది మన ఆలోచనల్ని మనం కంట్రోల్ చేసుకున్నప్పుడు. అసలు ఇటువంటి విషయాల గురించి మనం ఆలోచించాలి మనకి సంబంధం లేని విషయాల గురించి మనం ఆలోచన ఆలోచించి మన బుర్రపాటు చేసుకోవడం వల్ల మనకి ఫస్ట్ అఫ్ ఆల్ మనశ్శాంతి అనేది ఉండదు.
ఉదాహరణకి ఒక విషయం చెప్పనా ప్రతి ఒక్క మనిషి అయితే ఫ్యూచర్ లో ఉంటాడు లేకపోతే పాస్ట్ లో ఉంటాడు అంటే జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ ఉంటాడు లేకపోతే జరగాల్సిన దాని గురించి భయపడుతూ ఉంటాడు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే జరిగిన దాన్ని మనం ఎలాగో మార్చలేము అలా అని నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం ముందుగానే గేస్ కొట్టలేము. కాబట్టి ఈ జరిగిన దాని గురించి బాధపడకండి జరగబోయే దాని గురించి భయపడకండి ప్రస్తుతం ఉన్న జీవితాన్ని అనుభవించండి. అంతేగాని అతిగా ఆలోచించి జరిగిన దాని గురించి జరగబోయే దాని గురించి భయపడుతూ జరుగుతున్న జీవితాన్ని మాత్రం వదిలేసుకోమాకండి. కాబట్టి మీ ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోండి కంట్రోల్ కూడా కాదు అసలు ఆలోచనలు రాకుండా నియంత్రించండి.
ఇక రెండో పాయింట్ ఏంటంటే సంతృప్తి పొందటం. ఏ మనిషి అయినా సరే ఉన్న దానితో సంతృప్తి పొందేవాడు ఉన్నంత ప్రశాంతంగా ఎవడు ఉండడు. చాలా మంది ఏమనుకుంటారు అందరికీ అన్ని ఉన్నాయి నాకేం లేవు అనుకుంటాడు. అసలు నిజం చెప్పాలంటే కాళ్ళు చేతులు బాగుంటే చాలు ఏ మనిషికైనా ఎందుకంటే అవి లేని వాళ్ళు ఈ భూమి మీద ఎన్ని ఇబ్బందులు పడతారు మనకి ప్రత్యక్షంగా ఎవరు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రస్తుతం మీరు ఏ పొజిషన్ లో ఉన్నారో దాంతో సంతృప్తి చెందండి. ఒకవేళ తృప్తి లేకపోతే ఒక లక్ష్యం పెట్టుకొని దాని కోసం ఫైట్ చేయండి. అలా చేయడం వల్ల కూడా మనిషి చాలా సంతోషంగా ఉంటాడు ఎందుకంటే తన లక్ష్యం కోసం తను పోరాడుతున్నాడు కదా అందుకని చాలా సంతోషంగా ఉంటాడు. కాబట్టి ఉన్న దానితో సంతృప్తిగా ఉండండి లేని దాని గురించి ఆలోచించండి. నా విషయానికి వస్తే లేనిది అంటే మాత్రం మనం సంపాదించుకోలేనిదే తప్ప మన దగ్గర లేనిది కాదు. ఎందుకంటే అవతలోడి దగ్గర ఉంది మన దగ్గర లేదంటే దాన్ని మనం సంపాదించుకోలేదు అని. కాబట్టి మీరు సంపాదించుకోలేని దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించమాకండి ఉన్న దానితో సంతోషపడండి ఒకవేళ లేదు అని బాధపడే వాళ్ళకి మాత్రం నేను చెప్పవచ్చేది ఏంటంటే అది మీరు సంపాదించుకోలేదు అంతే లేకపోతే మీ కుటుంబ సభ్యులు మీకు సంపాదించి ఇవ్వలేదు. అంతే అంతకు మించి ఏం లేదు కాబట్టి లేని దాని గురించి బాధపడమాకండి ఉన్న దానితో సంతోషంగా ఉండండి.
2 thoughts on “మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే | Manasu Prashantanga Undalante in Telugu”