మనస్సు కంట్రోల్ చేసుకోవడం ఎలా | How to Control Manasu in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

మనస్సు కంట్రోల్ చేసుకోవడం ఎలా | How to Control Manasu in Telugu

ఇవాళ్టి టాపిక్ లో How to Control Manasu in Telugu గురించి తెలుసుకుందాం. మనసుని కంట్రోల్ చేసుకోగలిగితే మనిషి అనుకున్నది సాధిస్తాడు కానీ ఆ మనసుని కంట్రోల్ చేసుకోవడం ఎలాగా ఈరోజు మన టాపిక్ అదే.

1.SELF-AWARENESS

ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్తే మనసుని కంట్రోల్ చేసుకోవడం అంత ఈజీ టాస్క్ కాదు కానీ. ఒక్కసారి గనక మనం ఆ టాస్క్ ని కంప్లీట్ చేయగలిగితే దానంత సులభమైన పని ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. మనం మనసును కంట్రోల్ చేసుకోవడానికి మొట్టమొదట తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్. ఈ సెల్ఫ్ అవేర్నెస్ వల్ల కలిగే ప్రయోగాలు ఏంటంటే మన గురించి మనం ఆలోచించడం మొదలు పెడతాము. అసలు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఏం చేస్తున్నాం ఏం చూస్తున్నాం ఏం వింటున్నాం అనేది ప్రాపర్ గా మనకి అర్థమైతే మన మనసుని ఏది ఇబ్బంది పెడుతుంది మన మనసుని ఏది ఆనంద పెడుతుంది. అంతేకాకుండా ఇబ్బంది పెట్టేది ప్రాక్టికల్ గా ఎంతవరకు కరెక్ట్ మనల్ని ఆనంద పరిచేది ఎంతవరకు ప్రాక్టికల్ గా కరెక్ట్ అని చెప్పేసి ప్రాపర్ అనాలసిస్ తీసుకోవడాన్నే సెల్ఫ్ అవేర్నెస్ అంటారు.

ఉదాహరణకి మనం ఒక మోటివేషనల్ వీడియో చూస్తున్నాం అనుకోండి దాని వల్ల మనకి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. అంతే కానీ మనకి ఎటువంటి సంబంధం లేని ఎటువంటి ఉపయోగం లేని వీడియోలు చూడటం వల్ల ఫస్ట్ అఫ్ ఆల్ మనకి టైం వేస్ట్ అవుతుంది. అంతేకాకుండా మనం మన జీవితంలో చేయాల్సిన చాలా పనులు డిలే అవుతూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఆ వీడియోల వల్ల ఆ పనుల వల్ల మీరు చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మిమ్మల్ని చెడగొట్టి అలవాట్లు మిమ్మల్ని బాగు చేసే అలవాట్లు మీలో ఏమున్నాయో కనుక్కొని చెడిపోయే అలవాట్లు తీసేసి బాగుపడే అలవాట్లు ఉంచుకొని మిమ్మల్ని మీరు ప్రాపర్ గా ఒకసారి చెక్ చేసుకోవడాన్నే సెల్ఫ్ అవేర్నెస్ అంటారు. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి సెల్ఫ్ అవేర్నెస్ అనేది తప్పకుండా అవసరం.

2. MINDFULNESS

అంతే కాకుండా మనసుని కంట్రోల్ చేసుకోవడానికి కావలసిన రెండో స్టెప్ ఏంటంటే మైండ్ ఫుల్నెస్. మామూలుగా మనం ఏంటి చక్కగా భోజనం చేసి మన పని మనం చేసుకుంటూ ఉంటాం. కాకపోతే ఫిజికల్ మూమెంట్ అనేది లేకుండా ఒకే చోట కూర్చొని ఒకే చోట పని చేసుకొని నిజం చెప్పాలంటే తిన్న తర్వాత గాని ఉదయాన్నే లేచిన తర్వాత గాని కొంచెం వ్యాయామం చేయడం వల్ల బాడీలో తెలియని ఒక శక్తి వస్తుందన్నమాట.

ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఉదయాన్నే నిద్ర లేచారు శుభ్రంగా స్నానం చేశారు భోజనం చేశారు ఆఫీస్ కి వెళ్ళిపోయారు మీరు ఆ రోజంతా ఎలా పని చేస్తారో అబ్సర్వ్ చేయండి. అంతేకాకుండా మీరు ఉదయాన్నే నిద్ర లేచి కాలకృత్యాలన్నీ తీర్చేసుకొని ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ వింటూ ఒక రెండు కిలోమీటర్లు నడిచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి స్నానం చేసి లైట్ గా టిఫిన్ చేసి చేసి ఆఫీస్ కి వెళ్ళండి ఆ రోజు మీరు ఎలా పని చేస్తారో ఒకసారి అబ్సర్వ్ చేసుకోండి రెండిట్లో మీకే తేడా తెలుస్తుంది. నేను చెప్పవచ్చేది ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ అనేది ప్రాపర్ గా అవసరం.

3. POSITIVE VISUALIZATION

అంతే కాకుండా మీ మనసుని మీరు కంట్రోల్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన మూడో స్టెప్ ఏంటంటే పాజిటివ్ విజువలైజేషన్. ఏ మనిషికైనా సరే విజువలైజేషన్ అనేది చాలా అవసరం మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి. ఈ పనిలో మనం తప్పక సక్సెస్ అవుతాం అని చెప్పి పాజిటివ్ గా మీరు ఆ పనిని స్టార్ట్ చేశారు అనుకోండి ఆ పని చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది అంతే కాకుండా ఆ పనిని ప్రాపర్ గా పూర్తి చేస్తారు. అలా కాకుండా భయం భయంగా బెరుగు బెరుగుగా మీరు ఆ పనిని స్టార్ట్ చేస్తే ఆ పని స్టార్ట్ అవ్వకముందే మీరు ఫెయిల్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మనం ఏ పని చేసినా పాజిటివ్ విజువలైజేషన్ అనేది చాలా అవసరం అలా ఉండటం వల్ల మనం ప్రతి ఒక్క పనిలో సక్సెస్ అయ్యే ఛాన్సులు చాలా ఉన్నాయి. అలా కాకుండా భయపడుతూ డౌట్ పడుతూ మన పనులు మనం మొదలు పెడితే మన విజయానికి మనమే అడ్డుకట్టేసుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి పాజిటివ్ గా విజువలైజ్ చేసుకోండి.

జీవితంలో సంతోషంగా ఉండడం ఎలా | Happy Life Tips in Telugu
జీవితంలో సంతోషంగా ఉండడం ఎలా | Happy Life Tips in Telugu

4. PHYSICAL ACTIVITY

అంతే కాకుండా మీరు తీసుకోవాల్సిన నాలుగో స్టెప్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. మనలో చాలా మందికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అలాగే తింటూ మన పని మనం చేసుకుంటూ ₹4 డబ్బులు సంపాదించుకుంటూ అలా జీవితాన్ని గడిపేస్తూ ఉంటాము. కానీ ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు మనం వ్యాయామం చేయటం లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం అలాగే స్టార్ట్ చేస్తూ ఉంటాము. కాకపోతే నేను చెప్పవచ్చేది ఏంటంటే ప్రతి ఒక్క మనిషి తనకంటూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫిజికల్ యాక్టివిటీని ఎంచుకోవాలి అది ఎక్సర్సైజ్ చేయడం అవ్వచ్చు, రన్నింగ్ చేయడం అవ్వచ్చు ఏదో ఒకటి మనం ఎంచుకోవడం వల్ల మనం రోజు ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఫస్ట్ అఫ్ ఆల్ మనకంటూ మన శరీరం మీద ఒక అవగాహన వస్తుంది శరీర శ్రమ ఏర్పడటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యంగా చాలా బాగుంటాము మన బ్రెయిన్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది మన బాడీ కూడా చాలా తేలిగ్గా ఉంటుంది ఏ పని మీద అయినా ప్రాపర్ కాన్సంట్రేట్ చేసి మనం పని చేయగలుగుతాం. అలా కాకుండా బాగా ఫుడ్ తిని బాగా కష్టపడి పని చేసినా సరే ఉపయోగం ఉండదు. కొంతమంది ఏమనుకుంటారంటే నేను ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు రోజంతా కష్టపడి పని చేస్తానని చెప్పేసి వాళ్లకు వాళ్ళు ఆ పనిని ఒక వ్యాయామంగా ఊహించుకుంటారు. వ్యాయామం చేయటం వేరు మనం మన పని చేసుకోవడం వేరు. కాబట్టి తప్పకుండా ఏ ఏజ్ వాళ్ళు అయినా సరే ఒక వ్యాయామాన్ని ఎంచుకోండి. ఉదయానం నిద్ర లేచినప్పుడు అవ్వచ్చు లేకపోతే సాయంత్రం పడుకోబోయే ముందు అవ్వచ్చు. ఆ వ్యాయామం చేయడం వల్ల మీ బాడీ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు.

5. CONTINUOUS LEARNING

ఇంకా ఐదో స్టెప్ ఏంటంటే కంటిన్యూస్ లెర్నింగ్. మామూలుగా మనం ఏంటి మనకు తెలిసిందే ప్రపంచం అనుకుంటాము మనం పెద్దోళ్ళం అయిపోయాం మనకు అంతా తెలుసు అని చెప్పి అనుకుంటాం నిజం చెప్పాలంటే మనకు తెలిసింది గోరంతా మనకు తెలియాల్సింది కొండంతా. కాబట్టి ప్రతి రోజు మీరు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఎవరైనా మనకు తెలియని విషయం గురించి చెప్తే మాత్రం తప్పకుండా వినాలి అది చిన్న వాళ్ళు అయినా పెద్దవాళ్ళు అయినా అలా చేయటం వల్ల మనకి చాలా కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఎవరో మనకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు పుస్తకాలు చదవడం అవ్వచ్చు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన వీడియోలు చూడటం అవ్వచ్చు. మన జీవితానికి ఉపయోగపడే కొన్ని కొత్త కొత్త విషయాలు మనం ఎల్లప్పుడూ తెలుసుకోవడం వల్ల మనకి మన జీవితం మీద చాలా క్లారిటీ ఉంటుంది అంతేకాకుండా మనం అప్డేటెడ్ గా ఉంటాము. ఎందుకంటే ₹10000 పెట్టుకొని ఫోనే నెలకోసారి అప్డేట్ అవుతూ ఉంటుంది అలాంటిది మనం ఎందుకు అప్డేట్ అవ్వకూడదు ప్రతి ఒక్క విషయం మీద మనం నాలెడ్జ్ ఎందుకు గెయిన్ చేయకూడదు. కాబట్టి మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి.

6. GRATITUDE

ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఆరో స్టెప్ ఏంటంటే గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతా భావం. మామూలుగా మనం రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాము. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాము. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే నేను చెప్పొచ్చేది ఏంటంటే మొట్టమొదట మీ ఇంట్లో మీరు గ్రాటిట్యూడ్ గా ఉండండి మీ ఇంట్లో వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వండి కృతజ్ఞత భావంతో ఉండండి అలా ఉండటం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళకి రెస్పెక్ట్ పెరుగుతుంది. నిజం చెప్పాలంటే ఇంట్లో వాళ్లకైతే ప్రేమలు పెరిగిపోతూ ఉంటాయి కానీ అవి తగ్గటం వల్ల ఇంట్లో ఉన్న అన్నదమ్ములే విడిపోయి బతుకుతూ ఉన్నారు. కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే కృతజ్ఞత భావం అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉండాలి. అలా ఉండటం వల్ల ఒక మనిషి ఇంకొక మనిషికి కృతజ్ఞత చూపించడం వల్ల వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అనేది చాలా బాగుంటుంది.

ఉదాహరణకి మనం ఒక రెస్టారెంట్ కి వెళ్ళాము అనుకోండి మనం ఒక ఫుడ్ ఆర్డర్ చేస్తాము తింటాము దానికి డబ్బులు కూడా కడతాం. మనం ఎవరికీ థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం డబ్బులు కట్టాము వాళ్ళు మనకు ఫుడ్ ఇచ్చారు కానీ ఆ ఫుడ్ ఇచ్చిన వ్యక్తికి థాంక్యూ చెప్పి అంతే కాకుండా మీకు ఆ ఫుడ్ నచ్చింది అనుకోండి వండిన వ్యక్తికి థాంక్స్ చెప్పడం వల్ల ఆ వండిన వ్యక్తికి ఒక కాంప్లిమెంట్ ఇచ్చినట్టు ఉంటుంది అంతే కాకుండా ఒక ప్రశంస అనేది ఏ ఉద్యోగంలో అయినా సరే అది తీసుకోవడం వల్ల ఆమె మనిషి ఆ రోజు ఎంత ఉత్సాహంగా ఉంటాడో మీకు సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం మామూలుగా ఫుడ్ తినడానికి ఇలా రెస్టారెంట్ లోనే ఇలా ఉంటే ఇంట్లో అవ్వచ్చు మన చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు మనం పని చేసే ఆఫీస్ లో అవ్వచ్చు అలా ప్రతి ఒక్కరి దగ్గర మనం గ్రాటిట్యూడ్ గనక చూపించగలిగితే ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడటం మొదలు పెడతారు. ఇంకా ముఖ్యంగా మనం వాళ్ళని ఎంత గౌరవిస్తామో వాళ్ళు కూడా మనల్ని అంతే గౌరవిస్తారు. పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళా బిహేవ్ చేయాలి చిన్న పిల్లలతో చిన్న పిల్లలా బిహేవ్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి కృతజ్ఞతా అనేది చాలా అవసరం. ఇవన్నీ చేయటం వల్ల ఆటోమేటిక్ గా మీ మనసు మీ కంట్రోల్ లో ఉంటుంది.

How to Control Manasu in Telugu

ఈ టోటల్ టాపిక్ యొక్క ఉపోద్గాతాన్ని మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.

ధనవంతులయ్యే వాళ్ళకి ఉండే లక్షణాలు | Rich Habits in Telugu
ధనవంతులయ్యే వాళ్ళకి ఉండే లక్షణాలు | Rich Habits in Telugu

సెల్ఫ్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం మనం ఏం వింటున్నాం, ఏం చూస్తున్నాం, ఏవి చూడకూడదు, ఏవి వినకూడదు అని ప్రాపర్ నాలెడ్జ్ గనక మనకు ఉంటే మన ఆలోచన విధానాన్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం.

ఇంకా మైండ్ ఫుల్నెస్ ఉదయానం నిద్ర లేచిన తర్వాత చిన్నపాటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, లేకపోతే ఒక చిన్నపాటి వాకింగ్ కావచ్చు అలా చేసి మన డే ని స్టార్ట్ చేయడం వల్ల మీ మనసు లో ఉన్న నెగిటివ్ థాట్స్ అనేవి చాలా తగ్గుతూ ఉంటాయి మీ పట్ల మీకు నమ్మకం ఉంటుంది.

అంతేకాకుండా పాజిటివ్ విజువలైజేషన్ మనం ఏదైనా పని చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఈ పని అవుతుందా లేదా అని చెప్పేసి చిన్నపాటి డౌట్ ఉంటుంది. కానీ అలాంటి డౌట్లు ఏం లేకుండా కచ్చితంగా మనం ఈ పనిలో విజయం సాధించి తీరుతాం మనకు తిరిగే లేదని చెప్పేసి పాజిటివ్ గా ఆ పనిని స్టార్ట్ చేస్తే అంటే పాజిటివ్ గా విజువలైజ్ చేసుకొని మనం ఆ పని స్టార్ట్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవ్వడానికి 99% ఛాన్సులు ఉన్నాయి.

ఇంకా మరీ ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం. మనం ఏమనుకుంటాం మనం ముసలోళ్ళు అయిన తర్వాత చిన్నగా వాకింగ్ కి వెళ్ళాలి బాడీని ఫిట్ గా ఉంచుకోవాలి అనుకుంటాం కానీ మీరు 50 సంవత్సరాల తర్వాత ఎక్సర్సైజ్ చేసినా సరే మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ 16 ఏళ్లకే మీరు ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టండి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి అలా చేయడం వల్ల మీ బాడీ చాలా ఫిట్ గా ఉంటుంది. మీ మనసు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఏదైనా పని చేసినా లేకపోతే చేయవలసి వచ్చినా సరే మీ బ్రెయిన్ మీ మాట వింటుంది. ఎందుకంటే మనం బ్రెయిన్ లో ఒక పని అనుకుంటాం దానికి సహకరించాల్సింది బాడీనే కానీ బ్రెయిన్ షార్ప్ గా పని చేయాలి బాడీ ఇంకా షార్ప్ గా ఉండాలంటే మీరు తప్పకుండా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏదో ఒకటి ఎంచుకోవాలి అలా ఎంచుకుంటేనే మీరు చాలా ఫిట్ గా ఉంటారు.

అంతేకాకుండా కంటిన్యూస్ లెర్నింగ్ అనే ప్రాసెస్ మనిషికి చాలా అవసరం. మనకే అంతా తెలుసు కాకపోతే మనకేం తెలియదు అని రెండు ఫీలింగ్లు చాలా ప్రమాదకరం ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. ఖాళీ సమయంలో అయితే ఇంకా నేర్చుకుంటూ ఉండాలి అది పుస్తకాలు చదవడం అవ్వచ్చు పెద్దవాళ్ళు చెప్తే వినటం అవ్వచ్చు లేకపోతే youtube వీడియోలు చూడటం అవ్వచ్చు ఏదో ఒకటి మనం కంటిన్యూస్ గా నేర్చుకుంటూ ఉంటే తప్పకుండా మనం చాలా అప్డేటెడ్ గా ఉంటాం. అలా కాకుండా నాకు తెలిసిన ఫీలింగ్ లో గనక ఏమి నేర్చుకోకుండా ఉంటే రోజు రోజుకి ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది రోజు రోజుకి ఒక మనిషి ఎంత అభివృద్ధి చెందుతున్నాడో అవన్నీ మనం మిస్ అయిపోతాము మనం అన్ అప్డేటెడ్ ఫెలోస్ లా మిగిలిపోతాము. కాబట్టి మనం కంటిన్యూస్ గా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి.

ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా గ్రాటిట్యూడ్. ప్రతి ఒక్క మనిషికి కృతజ్ఞత భావం అనేది చాలా అవసరం. అది చిన్న వాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, మనకంటే డబ్బు ఎక్కువ ఉన్నవాళ్ళు అవ్వచ్చు, మనకంటే డబ్బు తక్కువ ఉన్న వాళ్ళు అవ్వచ్చు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే తినటానికి తిండి లేని వాళ్ళు అయినా సరే మనం వాళ్ళతో చాలా గ్రాటిట్యూడ్ గా బిహేవ్ చేస్తూ ఉండాలి. అలా చేయటం వల్ల ఒక మనిషికి ఇంకొక మనిషి పట్ల గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవడు ఏం సాధిస్తాడో తెలియదు అలాంటి మనుషులతో మనం ఈరోజు నువ్వు తక్కువ అని చెప్పేసి అతనితో కొంచెం మిస్ బిహేవ్ చేస్తే ఇంకొక 10 సంవత్సరాల తర్వాత వాడు మనకన్నా బెటర్ పొజిషన్ లో వచ్చి వాడు మళ్ళీ మనల్ని మీట్ అవ్వచ్చు. కాబట్టి నేను ఏమంటానంటే అసలు ఎవరిని తక్కువ అంచనా వేయకుండా ఎవరిని చిన్న చూపు చూడకుండా ప్రతి ఒక్కరితో మనం గ్రాటిట్యూడ్ గా ఉండటం వల్ల మనకు పోయేది ఏమని చెప్పండి.

కాబట్టి ఈ ఆరు పాయింట్లు మీరు ప్రాపర్ గా ఫాలో అయితే కచ్చితంగా మీ మనసును మీరు కంట్రోల్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అలా చేసుకోవడం వల్ల మీరు అనుకున్నది సాధిస్తారు. మీరు డైవర్ట్ అవ్వరు ఏ విషయంలోనూ మీ పని అవ్వచ్చు మీ అలవాట్లు అవ్వచ్చు ఎటువంటి వాటిల్లోనైనా సరే మనల్ని డైవర్ట్ చేయడానికి బయట చాలా మంది ఉంటారు. అయినా సరే మనం డైవర్ట్ చేయకుండా ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత చక్కగా మంచి మంచి పనులు పనులు చేసుకుంటూ అంటే వ్యాయామం చేసుకుంటూ చిన్నపాటి మెడిటేషన్ చేసుకుంటూ ఒక మంచి పుస్తకం తీసుకొని అందులో రెండు పేజీలు చదువుకొని చక్కగా మన పని మనం స్టార్ట్ చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చి ప్రశాంతంగా పడుకుంటే మన జీవితం ఎలా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆరు పాయింట్లు మీరు చక్కగా ఫాలో అవ్వండి మీ జీవితంలో భయంకరమైన మార్పులు వస్తాయి.

ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటే కచ్చితంగా షేర్ చేయండి కామెంట్ చేయండి నచ్చలేదు అనుకున్నా కూడా కామెంట్ చేయండి ఏం పర్లేదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment