జిఎస్టి అంటే ఏమిటి – GST ante emiti telugu
ఇవాళ్టి టాపిక్ లో GST ante emiti telugu గురించి తెలుసుకుందాం. ఈ ఆర్టికల్లో మీకు చెప్పబోతున్నాను జిఎస్టి గురించి జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ( Good and Service Tax ). మనం కొనే వస్తువులకు మరియు మనం పొందే సేవలకు కట్టే టాక్స్ ని జిఎస్టి (GST) అంటారు. అసలు జిఎస్టి గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మన పాత టాక్స్ స్ట్రక్చర్ ని ఒకసారి చూద్దాం.
Types of Taxes (టాక్స్ రకాలు)
బేసికల్ గా మనకి టూ టైప్స్ ఆఫ్ టాక్స్ ఉన్నాయి.
1.డైరెక్ట్ టాక్స్
2.ఇండైరెక్ట్ టాక్స్
డైరెక్ట్ టాక్స్ లో ఇన్కమ్ టాక్స్ మరియు కార్పొరేట్ టాక్స్ వస్తాయి.
అదే ఇండైరెక్ట్ టాక్స్ లో సెంట్రల్ టాక్స్ మరియు స్టేట్ టాక్స్ ఉంటాయి.
జిఎస్టి స్ట్రక్చర్ ( GST నిర్మాణం )
ఇప్పుడు మనం జిఎస్టి స్ట్రక్చర్ ని చూద్దాం. ఓల్డ్ టాక్స్ సిస్టం విధంగానే డైరెక్ట్ టాక్స్ ఉంటుంది. కానీ ఇది జిఎస్టి కి సంబంధం లేదు. ఇంకా ఇండైరెక్ట్ టాక్స్ ని రీప్లేస్ చేస్తూ మనకి జిఎస్టి వస్తుంది. ఈ జిఎస్టి లో మళ్ళీ సెంట్రల్ జిఎస్టి మరియు స్టేట్ జిఎస్టి లేదా ఇంటిగ్రేటెడ్ జిఎస్టి ఉంటాయి. సెంట్రల్ జిఎస్టి అంటే మనం టాక్స్ ని డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి పే చేయడం. అదే స్టేట్ జిఎస్టి అంటే టాక్స్ ని డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ కి పే చేయడం. ఒకవేళ ఏదైనా గూడ్స్ లైక్ కార్ ఒక స్టేట్ లో మ్యానుఫ్యాక్చర్ అయ్యి అండ్ ఇంకో స్టేట్ కి మూవ్ అయితే దానికి ఇంటిగ్రేటెడ్ జిఎస్టి పే చేయాల్సి వస్తుంది. ఈ ఐ జిఎస్టి టు స్టేట్స్ కి ఈక్వల్ గా డివైడ్ అవుతుంది. ఐ జిఎస్టి పే చేసినప్పుడు మనం స్టేట్ జిఎస్టి ని పే చేయనవసరం లేదు. ఇప్పుడు పాత టాక్స్ సిస్టం కి ఈ జిఎస్టి కి ఉన్న డిఫరెన్స్ ని చూద్దాం. ఇక్కడ నేను మీకు అర్థం అవ్వడానికి ఫ్లాట్ టాక్స్ రేట్ 10% అనుకుంటున్నాను ముందుగా ఓల్డ్ టాక్స్ సిస్టం ని చూద్దాం. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ ఒక వస్తువు తయారు చేయడానికి అయ్యే ఖర్చు ₹100 అనుకుందాం. ఇందులోనే 10% టాక్స్ మ్యానుఫ్యాక్చరర్ గూడ్స్ కొనడానికి కట్టారు అంటే ఇప్పుడు ₹100 లో ఇంచుమించుగా ₹10 టాక్స్ అనుకుందాం. ఇంకా మ్యానుఫ్యాక్చరర్ ₹10 ప్రాఫిట్ కి తన వస్తువును డిస్ట్రిబ్యూటర్ కి అమ్మేశారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ₹110 కి కొన్న వస్తువుకి ఒక ₹20 ప్రాఫిట్ ని యాడ్ చేసుకున్నారు. ఇప్పుడు మొత్తం ₹130 అయ్యింది దీనికి 10% టాక్స్ అంటే ₹13 యాడ్ చేస్తే అయ్యే ప్రొడక్ట్ కాస్ట్ ₹143. ఇప్పుడు 143 కి డిస్ట్రిబ్యూటర్ హోల్సేలర్ కి అమ్మేశారు. ఇక్కడ కూడా హోల్సేలర్ తన ₹20 ప్రాఫిట్ ని యాడ్ చేసుకొని ప్రొడక్ట్ కాస్ట్ ని ₹163 చేశారు. హోల్సేలర్ కూడా టాక్స్ కట్టాలి కాబట్టి ఈ ₹163 కి 10% టాక్స్ అంటే ₹16.3 ని పే చేశారు. ఇప్పుడు ప్రొడక్ట్ కాస్ట్ కాస్త ₹1793 అయింది. ఫైనల్ గా రిటైలర్ తన కొంచెం ప్రాఫిట్ ₹20 ని యాడ్ చేసుకొని మొత్తం కాస్ట్ మీద 10% టాక్స్ ని పే చేసి ఫైనల్ ప్రైస్ ని ₹219 కి చేర్చారు.
జిఎస్టి సిస్టం ( GST System )
ఇప్పుడు మనం జిఎస్టి సిస్టం చూద్దాం. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ ఒక వస్తువు తయారు చేయడానికి అయ్యే ఖర్చు ₹100 అనుకుందాం. ఇందులోనే 10% టాక్స్ మ్యానుఫ్యాక్చరర్ గూడ్స్ కొనడానికి కట్టారు. అంటే ఇప్పుడు ₹100 లో ఇంచుమించుగా ₹10 టాక్స్ అనుకుందాం. ఇంకా మ్యానుఫ్యాక్చరర్ ₹10 ప్రాఫిట్ కి తన వస్తువును డిస్ట్రిబ్యూటర్ కి అమ్మేశారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ₹110 కి కొన్న వస్తువుకి ఒక ₹20 ప్రాఫిట్ ని యాడ్ చేసుకున్నారు. ఇప్పుడు మొత్తం ₹130 అయింది. దీనికి 10% టాక్స్ అంటే ₹13 డిస్ట్రిబ్యూటర్ పే చేయాల్సి ఉంటుంది. కానీ జిఎస్టి లో టాక్స్ కి టాక్స్ పే చేయం కాబట్టి ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరర్ పే చేసిన ₹10 ని డిస్ట్రిబ్యూటర్ పే చేసే టాక్స్ నుంచి తీసేయాలి. అంటే ఇప్పుడు జిఎస్టి కాస్త ₹3 అయింది కానీ ప్రొడక్ట్ కాస్ట్ మాత్రం ₹130. ఇక్కడ కూడా హోల్సేలర్ తన ₹20 ప్రాఫిట్ ని యాడ్ చేసుకొని ప్రొడక్ట్ కాస్ట్ ని ₹150 చేశారు. హోల్సేలర్ కూడా టాక్స్ కట్టాలి కాబట్టి ఈ ₹150 కి 10% టాక్స్ అంటే ₹15 ని పే చేయాలి. కానీ జిఎస్టి వలన డిస్ట్రిబ్యూటర్ పే చేసిన 10% టాక్స్ ని ఇక్కడ హోల్సేల్లర్ కట్టాల్సిన టాక్స్ నుంచి తీసేయాలి. అంటే ఇప్పుడు హోల్సేల్లర్ కట్టాల్సిన జిఎస్టి ₹2. ఈ విధంగా రిటైలర్ తన కొంచెం ప్రాఫిట్ ₹20 ని ఈ ₹150 కి యాడ్ చేసి ప్రొడక్ట్ కాస్ట్ ని ₹170 గా చేశారు. రిటైలర్ కూడా 10% టాక్స్ కట్టాలి కాబట్టి మరియు హోల్సేలర్ ₹15 టాక్స్ కట్టేసారు. కాబట్టి రిటైలర్ కి ₹2 జిఎస్టి పడుతుంది లాస్ట్ కి కస్టమర్ కి ₹170 కే ప్రొడక్ట్ వచ్చేస్తుంది.
జిఎస్టి స్లాబ్స్ ( GST Slabs )
ఇప్పుడు జిఎస్టి స్లాబ్స్ గురించి చూద్దాం. ఇన్కమ్ టాక్స్ లాగానే జిఎస్టి కి కూడా స్లాబ్స్ ఉన్నాయి. ఇవి టోటల్ గా ఫైవ్ కేటగిరీస్ లో సపరేట్ చేశారు.
0% లో అన్ ప్యాక్డ్ ఫుడ్ గ్రైన్స్
5% లో వైడ్లీ యూస్డ్ ఐటమ్స్ అంటే ఆయిల్స్ ప్యాక్డ్ గ్రైన్స్ etc
12% టు 18% లో నార్మల్ ఐటమ్స్ అంటే మెడిసిన్స్ కంప్యూటర్స్ ఫెర్టిలైజర్స్ సర్వీసెస్ etc
28% లగ్జరీ ఐటమ్స్ కి అంటే లో కాస్ట్ కార్స్, కాస్మోటిక్స్ etc. ఇదండీ జిఎస్టి అంటే..
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోండి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.