Pelli Enduku Chesukovali – అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళికి ముందు దీని గురించి తప్పకుండ తెలుసుకోవాలి
ఇవాళ్టి టాపిక్ లో Pelli Enduku Chesukovali గురించి తెలుసుకుందాం.
ఒక మగాడికి ఒక ఆడది ఎంతవరకు అవసరం. ఉదాహరణకి పెళ్లి అనే సబ్జెక్టు తీసుకుంటే మామూలుగా పెళ్లి చేసుకోకుండా ఈ భూమి మీద చాలా మంది ఉందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోతున్నారు అలా ఫిక్స్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి వాటిల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం పెరిగింది. కాబట్టి ఎలా బతకగలవురా బాబు మనం కాకుండా అమ్మాయిని కూడా పోషించాలి అనే భయంతో కొంతమంది పెళ్లి చేసుకోవట్లేదు లేదు. ఇంకా ముఖ్యంగా ఆల్రెడీ పెళ్లి చేసుకొని విడిపోయిన వాళ్ళని చూసి ఒకవేళ మన పరిస్థితి కూడా ఇలా అవుతుందేమో ఈ మాత్రం టెన్షన్ మనకెందుకని చెప్పేసి కొంతమంది పెళ్లికి భయపడతారు. ఇంకొంతమంది అయితే మనం పెళ్లి చేసుకున్నంత వరకు బానే ఉంటుంది కానీ పిల్లల్ని కని పెంచి వాళ్ళ కోసం మన లక్ష్యాల్ని మన జీవితాన్ని త్యాగం చేయడం ఎందుకని చెప్పేసి పెళ్లి దాకా వెళ్తున్నారు కానీ పిల్లల దాకా అసలు వెళ్ళట్లేదు ఆ ఆలోచన కూడా రానివ్వట్లేదు. ఇంకొంతమంది అయితే పెళ్లి చేసుకుంటారు కానీ సెట్ అయ్యేంత వరకు పిల్లాన్ని కనకుండా ఉందాం అని చెప్పేసి వాళ్ళ ప్లానింగ్ లో వాళ్ళు ఉంటారు. వాస్తవానికి నిజంగా ఒక మగాడికి ఒక ఆడది అవసరమా లేకపోతే ఒక ఆడదానికి ఒక మగాడు అవసరమా అనే సబ్జెక్ట్ గనక మాట్లాడుకుంటే.
ఫస్ట్ అఫ్ ఆల్ అమ్మాయి అబ్బాయి కలిసేది పెళ్లి అనే ఒక కాన్సెప్ట్ మీద. వాళ్ళు కలవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు మన టాపిక్. ఫస్ట్ అఫ్ ఆల్ నేను చెప్పొచ్చేది ఏంటంటే మామూలుగా మనం అమ్మా నాన్నలకు పుడతాం. పుట్టిన తర్వాత మనం పెరిగే క్రమంలో వాళ్ళు మెల్లగా ముసలి వాళ్ళు అవుతూ ఉంటారు. అలా అయ్యే ప్రాసెస్ లో మనం కూడా మెల్లమెల్లగా వయసుకొస్తూ ఉంటాం వయసులో పెద్దవాళ్ళు అవుతూ ఉంటాం అన్నమాట అంటే పెద్దవాళ్ళు అంటే మరీ పెద్దవాళ్ళు కాదు కుర్రవాళ్ళు అవుతూ ఉంటాము అమ్మ నాన్న మెల్లగా ముసలి వాళ్ళు అయిపోతూ ఉంటారు. అలాంటి మనకి ఒక తోడు కావాలి తోడు అంటే రోడ్డు మీద తిరగడానికో లేకపోతే సినిమాలకు వెళ్ళడానికో సరదాగా క్రికెట్ ఆడుకోవడానికో కాదు మనం పడుకుంటే మన పక్కలో కూడా మనతో పాటు పడుకునే ఒక తోడు కావాలి. టు బి ఫ్రాంక్ మనం ఓపెన్ గా ఒక మనిషితో ఏవైనా చెప్పుకునే తోడు ఆ తోడునే ఆడ తోడు అంటారు చాలా మంది. ఇంకా కొంచెం డీప్ గా చెప్పాలంటే తల్లిదండ్రులు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అసలు పెళ్లి ఎందుకు చేస్తారు. అసలు పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ మైండ్ లో ఏం రన్ అవుతుంది అంటే.
ఉదాహరణకి ఒక అబ్బాయికి పెళ్లి పెళ్లి చేస్తున్నాం అనుకోండి వాళ్ళ అమ్మ ఏమనుకుంటుందంటే మా అబ్బాయిని అచ్చు నాలాగే చూసుకున్న ఒక అమ్మాయి రావాలి. వాడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాడిని బ్రహ్మాండంగా చూసుకుని ఒక అమ్మాయి ఇస్తే చాలు నా పిల్లాడు హ్యాపీగా ఉంటాడు అంతకు మించి నాకేం కావాలని చెప్పేసి ఆ అబ్బాయి వల్ల అమ్మ అనుకుంటుంది. ఇక అమ్మాయి విషయానికి వస్తే అమ్మాయి వాళ్ళ నాన్న కూడా ఇలాగే అనుకుంటాడు నేను పుట్టిన దగ్గర నుంచి పెద్ద దాకా అంటే పెళ్లి అయిన దాకా నా కూతురుని నేను ఎలా చూసుకున్నానో అలాంటి వాడు నా కూతురు జీవితంలోకి వస్తే చాలా బాగుంటుంది వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు నా కూతుర్ని అర్థం చేసుకుంటే చాలు అని చెప్పి చెప్పేసి అమ్మాయి వాళ్ళని నాన్న అనుకుంటాడు. అలా అనుకోవాలి అనుకోవడంలో తప్పు కూడా లేదు కాకపోతే చాలా మంది తల్లిదండ్రులకి తెలియని విషయం ఏంటంటే అసలు పెళ్లి చేసుకునేటప్పుడు పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంది వాళ్ళు అసలు పెళ్లి గురించి ఏమనుకుంటున్నారు అబ్బాయి అయితే అమ్మాయి గురించి ఏమనుకుంటున్నాడు అమ్మాయి అయితే అబ్బాయి గురించి ఏమనుకుంటుంది అనే ఒక్క పాయింట్ ని గనక తల్లిదండ్రులు తెలుసుకోగలిగితే నాకు తెలిసి చాలా మంది విడాకులు ఆపొచ్చు నాకు తెలిసి చాలా మందికి పెళ్లిళ్లు చేయొచ్చు. బేసికల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే పెళ్లి అంటే చాలా మంది కొన్ని కొన్ని విషయాలకే అనుకుంటున్నారు కాక లేకపోతే వాళ్ళు అనుకున్నట్లు ఆ కొన్ని విషయాల కోసమే కాదు పెళ్లి అనేది చాలా విషయాలతో కూడుకున్న ఒక గొప్ప కార్యం అంతేకాకుండా పెళ్లి చేసే తల్లిదండ్రులకే క్లారిటీ లేనప్పుడు పాపం పెళ్లి చేసుకునే అబ్బాయికి అమ్మాయికి ఏం క్లారిటీ ఉంటుంది చెప్పండి. మామూలుగా ఇవాళ రేపు పెళ్లి అనేది ఒక బిజినెస్ అయిపోయింది అమ్మాయి ఎంత సంపాదిస్తుంది, అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు ఆ అమ్మాయికి ఎంత ఆస్తి ఉంది, ఈ అబ్బాయికి ఎంత ఆస్తి ఉంది ఇలా ఆస్తులు ఉంటే కాపురాలు చేసేస్తారా లేకపోతే ఉద్యోగాలు ఉంటే వీళ్ళద్దరు సెట్ అయిపోతారా నాకు తెలిసినంత వరకు పెళ్లి మీద ప్రాపర్ అవగాహన ఉండాలి. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఎందుకు తోడుగా ఉండాలి ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఎందుకు తోడుగా ఉండాలి. రోజు గడిచే కొద్దీ తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోతూ ఉంటారు ఇది కామన్. కానీ నిజం చెప్పాలంటే మన తల్లిదండ్రులు మనకంటే ముందుగానే చనిపోతారు. అలా చనిపోయిన తర్వాత మనకు తోడు ఎవరు ఉంటారు అందుకనే తల్లిదండ్రులు మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు అనాధులు కాకూడదు అంతేకాకుండా మన అబ్బాయిని మనలాగా చూసుకుని ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఇంకా ముఖ్యంగా అమ్మాయి తాలూకా అయితే మన అమ్మాయికి మనం మన అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటామో అలాగే చూసి చూసుకొని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తో పెళ్లి చేస్తారు. అంతే కాకుండా కట్నాలు ఎక్కువ చేయాలి లేకపోతే డబ్బులు ఎక్కువ ఉండాలి వాళ్ళిద్దరూ కలిసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేస్తే డబ్బులు బాగా వస్తాయి అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ తో ఈ మధ్య చాలా మంది పెళ్లి చేస్తున్నారు అది రాంగ్. మామూలుగా పెళ్లి చేసుకునేటప్పుడు అబ్బాయి అమ్మాయితో జీవితాంతం ఉంటాడా లేకపోతే అమ్మాయి అబ్బాయితో జీవితాంతం ఉంటాడా లేదు ఇద్దరు పనికిమాలినోళ్ళు మధ్యలో విడిపోతారా అనేది ప్రాపర్ గా తల్లిదండ్రులు ప్లాన్ చేసుకుంటే నాకు తెలిసినంత వరకు మీరు చనిపోయిన తర్వాత కూడా అంటే వయసు పెరిగిన తర్వాత ఎవరైనా కచ్చితంగా చనిపోతారు. అలా మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు ప్రశాంతంగా ఉండాలంటే మనం కొంచెం ప్లానింగ్ ప్రకారం పెళ్లి చేయాలి లేకపోతే వాడిని పద్ధతిగా పెంచాలి. అలా గనక పెంచకపోతే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే జీవితానికి అర్థం తెలియకుండా ఉన్న ఆ తెల్ల కాగితం లాంటి జీవితాన్ని పిచ్చి పిచ్చి గీతలు గీసుకొని చెడదుకుంటారు ఆ తర్వాత వాళ్ళ జీవితం చిత్తు కాగితంలా అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఏ తల్లిదండ్రులైనా సరే వాళ్ళ పిల్లల జీవితాన్ని కొంచెం అందంగా డిజైన్ చేయండి వాళ్ళ జీవితం మీరు చనిపోయిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. మీ పేరుని మీ పరువుని అలా పెట్టి వాళ్ళు కూడా ప్రశాంతంగా చనిపోతారు. ఎందుకంటే ఈ భూమి మీద ఎవ్వడు ఉండడు ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. కానీ ఉన్న కొన్ని రోజులు కూడా పెండ పెంట చేసి చనిపోవడం కరెక్ట్ కాదు కదా.
అందుకని ఒక మగాడికి ఒక ఆడది ఎందుకు అవసరం ఒక ఆడది ఒక మగాడికి ఎందుకు అవసరం అనే ప్రాపర్ క్లారిటీ గనుక ఇవాళ రేపు తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వకపోతే వాళ్ళు దాన్ని వేరేలా అర్థం చేసుకొని ఇంకొకలా ఊహించుకొని ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని చివరికి పెళ్లి అయిన తర్వాత వాస్ ఇంతేనా అని చెప్పేసి వాళ్లకు వాళ్లే ఒక నిర్ణయాలు తీసేసుకొని బ్రేకప్ లు చెప్పేసుకొని విడాకులు తీసేసుకొని విడిపోతున్నారన్నమాట. ఎందుకంటే పెళ్లి అనేది అత్యుత్సాహంతో స్టార్ట్ అవ్వకూడదు ఒక ఆలోచనతో స్టార్ట్ అవ్వాలన్నమాట మనకి పెళ్లి ఎందుకు మనకి ఈ అమ్మాయి కరెక్టా కాదా అలాగే అమ్మాయిలు కూడా మనకి ఈ అబ్బాయి కరెక్టా కాదా అని చెప్పేసి ఒక ప్రాపర్ క్లారిటీ తో నిజం చెప్పాలంటే రెండు కుటుంబాలు కలుస్తున్నాయి. ఒక అబ్బాయి అమ్మాయి కలవడం వల్ల ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది అని చెప్పేసి క్లియర్ కట్ ఒక విజన్ తో ముందుకు వెళ్లాలి తప్ప పిచ్చి పిచ్చి ఆలోచనలు మైండ్ లో పెట్టుకొని అమ్మాయి చూడటానికి బాగుంది లేకపోతే అబ్బాయి చూడటానికి బాగున్నాడు అని చెప్పేసి అలాగే అవసరం లేని వాటిని మైండ్ లో పెట్టుకొని పెళ్లి గనుక చేసుకుంటే మీరు ఏదైతే ఊహించుకొని పెళ్లి చేసుకుంటారో అది కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అది అందం అవ్వచ్చు లేకపోతే ఐశ్వర్యం అవ్వచ్చు ఎందుకంటే కూర్చొని తింటే డబ్బులు కూడా అయిపోతాయి రోజు గడిచే కొద్దీ మనం కూడా ముసలి వాళ్ళు అయిపోతాం. కాబట్టి అబ్బాయికి అమ్మాయి ఖచ్చితంగా అవసరం అమ్మాయికి అబ్బాయి ఖచ్చితంగా అవసరం. కానీ ఎందుకు అవసరం ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో అవసరం అనే ప్రాపర్ క్లారిటీ గనుక ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ ఉంటే మాత్రం వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలా ఏమీ లేకుండా పుట్టిన దగ్గర నుంచి పెళ్లి అయ్యేంత వరకు పిచ్చి పిచ్చి తప్పులన్నీ చేసుకుంటూ చివరికి మళ్ళీ పెళ్లి చేసుకొని నువ్వు ఆ తప్పు చేసావ్ నేను ఈ తప్పు చేసావు అని చెప్పేసి ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు దూషించుకుంటూ ఉంటే దీనికి మించిన నరకం నాకు తెలిసి నరకంలో కూడా ఉండదు అన్నమాట ఎందుకంటే అంత నరకంగా ఉంటుంది. కాబట్టి అబ్బాయికి అమ్మాయి ఖచ్చితంగా అవసరం అమ్మాయికి అబ్బాయి ఖచ్చితంగా అవసరం వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉంటే అబ్బాయి అమ్మ నాన్నకి కానీ అమ్మాయి అమ్మ నాన్నకి కానీ వాళ్ళకి ఇంతకు మించిన ఆనందం ఏం కావాలో చెప్పండి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని క్లారిటీగా పెంచండి పిల్లలు మీరు కూడా తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయేటప్పుడు కొంచెం క్లారిటీగా వాళ్ళని చూసుకుంటూ ఉండండి. నన్ను పెళ్లి చేసుకున్నాను నేను డబ్బులు సంపాదించాలి పిల్లల్ని పెద్దోళ్ళు చేయాలి అని చెప్పేసి ఈ ప్రాసెస్ లో పడిపోయి మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన వాళ్ళని మర్చిపోతే ఎలాగా. కాబట్టి జీవితం పట్ల కొంచెం అవగాహనగా ఉండండి అలా ఉండటం వల్ల మీ ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ అమ్మా నాన్నలకి ఏదైతే ఇస్తారో రేపు పొద్దున మీరు ముసలోళ్ళు అయిన తర్వాత మీ పిల్లలు మీకు అదే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చూసి పెరుగుతారు కాబట్టి ఒక అబ్బాయికి అమ్మాయి అవసరం ఒక అమ్మాయికి అబ్బాయి అవసరం.
ఇలాంటి మరిన్ని టాపిక్ మీకు కావాలనుకుంటే తప్పకుండా మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.