చదివేటప్పుడు నిద్ర రాకుండా ఉండాలంటే – chadivetappudu nidra rakunda undalante em cheyali
ఇవాళ్టి టాపిక్ లో chadivetappudu nidra rakunda undalante em cheyali గురించి తెలుసుకుందాం రండి
చాలా మందికి సహజంగా పుస్తకాలు చదివేటప్పుడు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అది ఉదయం అవ్వచ్చు రాత్రులు అవ్వచ్చు నిద్ర అయితే కామన్ గా వస్తూ ఉంటుంది. కానీ రాత్రిపూట మాత్రం కొంచెం ఎక్కువగా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే అసలు నిద్ర రాకుండా మనం చక్కగా చదువుకోవడం ఎలాగా అనే డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈరోజు మన ఆర్టికల్ టాపిక్ కూడా అదే. ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్తే ఫస్ట్ అఫ్ ఆల్ చదువుకోవడం అనేది ప్రతి మనిషి యొక్క సహజ ధర్మం అన్నమాట. ఆ ధర్మాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ చదువుకోవడం అనేది తప్పనిసరి కాకపోతే కొంతమంది అత్యద్భుతంగా చదువుతూ ఉంటారు ఇంకొంతమంది పుస్తకం తీస్తేనే వాళ్ళకి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. నాలుగు అంటే నాలుగు అక్షరాలు చదవడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టిప్స్ ని ఫాలో అయ్యారు అనుకోండి మీరు రమ్మన్నా కూడా నిద్ర మీ దగ్గరికి రాదు ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్లో లాస్ట్ పాయింట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి అది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్.
ఇంకా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ పరిసరాలని ప్రాపర్ గా ఉంచుకోవాలి. మీరు గదిలో చదువుకున్న అవుట్ డోర్ లో చదువుకున్న డాబా మీద చదువుకున్న ఎక్కడైనా సరే మీ పరిసరాలని ప్రాపర్ గా ఉంచుకోవాలి. కొంచెం కంఫర్ట్ గా ఉంచుకోవాలి నీట్ గా ఉంచుకోవాలి కాకపోతే మీరు కూర్చునే కుర్చీ ఏదైతే ఉంటుందో కింద కూర్చున్న సరే మీరు మెత్తగా ఉండేలా చూసుకోకుండా కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి ఆనుకొని మాత్రం అస్సలు చదవాల్సిన అవసరం లేదు మీరు ఆనుకొని చదివితే ఆటోమేటిక్ గా నిద్ర వచ్చేస్తుంది. దానికన్నా పుస్తకం పక్కన పడేసి నిద్ర పోవడం చాలా మంచి పని. కాబట్టి నేను ఏమంటానంటే పరిసరాలని ప్రాపర్ గా ఉంచుకోండి. దాని వల్ల కూడా మనకి చిరాకు చిరాకుగా ఉంటుంది అంతే కాకుండా మెత్తటి కుర్చీల మీద కానీ సోఫా మీద కానీ డబల్ కట్ మంచం మీద మీద కానీ వీటిల మీద కూర్చొని చదువుకున్నారు అనుకోండి ఆటోమేటిక్ గా మీకు నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి మీరు స్టిఫ్ గా కూర్చొని కొంచెం స్ట్రాంగ్ గా ఉండే చెక్క మీద అంటే కుర్చీ మీద కూర్చొని చదవడం మొదలు పెడితే మీకు నిద్ర రాకుండా ఉండటానికి ఛాన్సులు ఉంటాయి. అంతే కాకుండా కంటిన్యూస్ గా మీరు చదువుతూనే ఉన్నారనుకోండి మీకు బోర్ కొట్టేస్తది కాబట్టి ఒక 40-45 మినిట్స్ తర్వాత కొంచెం చిన్న బ్రేక్ తీసుకోండి. సరదాగా అటు ఇటు తిరగండి చక్కగా టీ తాగండి మళ్ళీ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ చదవడం మొదలు పెట్టండి అలా చేయడం వల్ల కూడా మీకు నిద్ర రాదు. కాబట్టి ప్రాపర్ గా బ్రేక్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం రోబోట్లం కాదు అలా అని చెప్పేసి బ్యాటరీల మీద పని చేసే మిషన్ అయితే కాదు కంటిన్యూస్ గా పని చేసుకుంటూ పోవడానికి. మనం చేసే పని మీద మనకి శ్రద్ధ ఉంటే మనం ఒక 45 మినిట్స్ కష్టపడితే ఆ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మీరు కంటిన్యూస్ గా చదివినా కూడా మీరు చదివిన విషయాన్ని మర్చిపోతారు. ఆ తర్వాత బ్రెయిన్ కొంచెం అలసట తీసుకొని కొంచెం నిద్రపోదు అని చెప్పేసి మీ బ్రెయిన్ మీకు సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ 40 మినిట్స్ కి లేకపోతే వన్ అవర్ కి ప్రాపర్ గా కొంచెం చిన్న బ్రేక్ తీసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ప్రతి పని చేయటానికి ఒక సమయం అనేది ఉంటుంది. అందరూ ఏంటంటే నైట్ చదువుకునేటప్పుడు నిద్ర వస్తుంది అన్నప్పుడు నైట్ చదువుకోకుండా పడుకున్నారు అనుకోండి ఉదయాన్నే ప్రశాంతంగా చదువుకోవచ్చు కదా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ప్రాపర్ గా నిద్ర పోగలిగితేనే మరుసటి రోజు ఉదయం మీరు ప్రశాంతంగా చదువుకోవచ్చు. కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే నైట్ పూట చదివితే నిద్ర రావడానికి ఛాన్సులు ఉన్నాయి కాబట్టి నైట్ అంతా ప్రశాంతంగా పడుకొని టీవీ లకి మొబైల్స్ కి దూరంగా ఉండి మీకు మీరు అంటే మీ బాడీకి మీరు ప్రాపర్ గా రెస్ట్ ఇచ్చారనుకోండి ఉదయాన్నే రెట్టింపు ఉత్సాహంతో చదువుకోవచ్చు. అందులోని ఉదయం నాలుగు గంటలకి అంటే బ్రహ్మ ముహూర్తంలో గనక మీరు చదివితే మీకు నిద్ర రమ్మన్నా కూడా రాదండి. కాబట్టి ఏ టైం లో ఏ పని చేయాలో ప్రాపర్ గా తెలుసుకోండి అంటే ఉదయం పని చేయాలి సాయంత్రం పడుకోవాలి ఇది మనుషులు క్రియేట్ చేసుకున్న ఒక ఫార్ములా. కానీ నేను నైట్ కూడా చదువుతాను నా దగ్గర టైం లేదు అనుకుంటే నైట్ చదవచ్చు కాకపోతే నా దగ్గర టైం ఉంది నేను చదువుకుంటే నిద్ర వస్తుంది అన్నప్పుడు ప్రాపర్ గా నైట్ పడుకోండి. మొబైల్స్ కి టీవీ లకి దూరంగా ఉండండి ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నాలుగు గంటలకి నిద్ర లెగిసి చదవండి మీకు నిద్ర రమ్మన్నా కూడా రాదు.
నేను ఇంతకు ముందు చెప్పాను కదా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే ఆ పాయింటే బేసికల్ గా మనం ఏ పని చేసినా సరే దానికి ఒక పరమార్థం ఉంటుంది మనం మీనింగ్ లెస్ గా అయితే ఏ పని చేయం కదా మనం ఒక పని మన కోసం మాత్రమే చేస్తాము మనకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని చేస్తాము మీరు ఏ లక్ష్యం లేకుండా చదివేటట్లయితే మీకు కంటిన్యూస్ గా నిద్ర వస్తూనే ఉంటుంది. మిమ్మల్ని ఎవడు మార్చలేడు కానీ మీరు ఎందుకు చదువుతున్నారు మిమ్మల్ని చదివించడానికి మీ అమ్మా నాన్న ఎంత కష్టపడుతున్నారు. మీ జీవిత లక్ష్యం ఏంటి అసలు మీరు ఏమనుకుంటున్నారు అవన్నీ మీ మనసులో పెట్టుకొని మీకు కొంచెం సమయం ఆ కొంచెం సమయంలో కూడా మీరు చదవకపోతే చివరికి ఏమైపోతారు. అనే ప్రాక్టికల్ నాలెడ్జ్ గనక మీకు ఉండి మీకు ప్రాపర్ జీవిత లక్ష్యం ఒకటి ఉంటే మాత్రం మీకు రమ్మన్నా నిద్ర రాదు. ఎందుకంటే మనల్ని చదివించడానికి మన అమ్మ నాన్న ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కష్టాన్ని గుర్తుపెట్టుకున్న లేకపోతే రోజు వాళ్ళని చూస్తున్న సరే మనం ఎందుకు చదవాలో మనకి అర్థమైపోతుంది. అంతే అంతకు మించి ఏం లేదు మనం ఎందుకు చదువుతున్నాం. మన లక్ష్యం ఏంటి మనం ఏం చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాం అనే ప్రాక్టికల్ నాలెడ్జ్ గనుక మీకు ఉంటే మీరు ఖచ్చితంగా నిద్రపోకుండా చదువుతారు నన్ను అడిగితే రాత్రి ఏంటి పగలేంటి మీకున్న లక్ష్యం కోసం మీరు పోరాడటానికి కేవలం కొంత అంటే కొంత సమయం మాత్రమే ఉంది. కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు మీ లక్ష్యానికి దగ్గర అవుతారు లేకపోతే ఏదో ఒక కంపెనీలో చిన్నపాటి ఉద్యోగస్తులు అవుతారు. అది కూడా లేకపోతే ఎక్కడో ఒకచోట రోజువారి కూలి అవుతారు అంతకు మించి ఏమీ జరగదు.
కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ గా సింపుల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు ఒక లక్ష్యం ఉండి ఆ లక్ష్యం వెనకాల ఒక బలమైన కారణం ఉండి మీ మీద ఎంతమంది ఆధారపడుతున్నారు అమ్మ అవ్వచ్చు నాన్న అవ్వచ్చు మీకన్నా వయసులో చిన్న వాళ్ళు అయినా మీ తోడ పుట్టిన వాళ్ళు అవ్వచ్చు వాళ్ళందరి బాధ్యత మీ మీద ఉంది అంతేకాకుండా మీ బాధ్యత కూడా మీ మీద ఉంది. కాబట్టి వీటన్నిటిని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ గా మీకు నిద్ర రాదండి. ఎందుకంటే ఇన్ని బాధ్యతలు తీసుకున్న వాడికి అసలు నిద్రే రాదు అంతేకాకుండా నేను చదవాల్సిన అవసరం లేదు నాకు అసలు నిద్రపోతే చాలు ప్రశాంతంగా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. ఈరోజు అంటే చిన్న చిన్న పనులకు కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చాలా అవసరం అయిపోయింది. మీరు నిద్రపోయి మీ చదువుని అశ్రద్ధ చేశారు అనుకోండి మీరు జీవితంలో దిద్దుకోలేని తప్పు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ లక్ష్యాన్ని మీరు ముందుగా గుర్తు చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీకు నిద్ర అనేది రాదు. మీకు వీలున్నంత సేపు రోజు మొత్తం చదువుతారు.