అనుకున్న లక్ష్యాన్ని సాధించడం ఎలా – Anukunadi Edina Sadinchadam Ela
ఇవాళ్టి టాపిక్ లో anukunadi edina sadinchadam ela గురించి తెలుసుకుందాం.
అనుకున్నది సాధించడం ఎలా
మామూలుగా మనం ఎవరో తెలిసిన వాళ్ళు కామన్ గా మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే నీ జీవితంలో నువ్వు ఏం సాధించాలి అనుకుంటున్నావ్ అని చెప్పేసి అడుగుతారు. దానికి మనం ఇచ్చే సమాధానం ఏంటంటే మనం ఏదైతే జీవిత లక్ష్యంగా పెట్టుకుంటామో దాని గురించి వాళ్ళకి చెప్తాము లేకపోతే కొంచెం భయం వేస్తే మాత్రం ఒక చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి తప్పించుకొని తిరుగుతాము. నిజం చెప్పాలంటే ఈ రెండిటికి గల కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉంటుంది ఒకడేమో చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు ఇంకొకడు చెప్పుకోవడానికి బాధపడతాడు ఈ రెండిటికి ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే వాటిని ఎలా సాధించి కూడా తెలియక కొంతమంది చెప్పుకొని సంతోష పడతారు ఇంకొంతమంది చెప్పడానికే భయపడతారు కానీ. ఈ టాపిక్ లో నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే మనం ఏదనుకున్నా అంటే మన లక్ష్యాలు అవ్వచ్చు లేకపోతే ఒక పని అవ్వచ్చు ఏదైతే మన మనసులో అనుకుంటామో దాన్ని సాధించడం ఎలా అనేదే ఈరోజు మన టాపిక్.
అనుకున్న పనిని అతి తొందరగా సాధించాలంటే
ఇక డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే ఫస్ట్ అఫ్ ఆల్ మీరు అనుకున్న పనిని మీరు అతి తొందరగా సాధించాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే. మీ లక్ష్యం పట్ల మీరు క్లిస్టర్ క్లియర్ గా ఉండటం మీ లక్ష్యాన్ని మీరు ప్రాపర్ గా నిర్ణయించుకోవడం చాలా మంది కి వాళ్ళ లక్ష్యం పట్లే చాలా కన్ఫ్యూషన్లు ఉంటాయి. మనం అసలు ఈ ఫీల్డ్ కి పనికిరామేమో ఒకవేళ ఈ ఫీల్డ్ లో ఉంటే మనం అనుకున్నంత సక్సెస్ అవ్వలేమేమో అని చెప్పేసి వాళ్ళకి చాలా డౌట్లు ఉంటాయి వాళ్ళ మీద వాళ్లే డౌట్ పడుతూ ఉంటారు. నేను చెప్పవచ్చేది ఏంటంటే మీ లక్ష్యం దగ్గరే మీరు అంత డౌట్ గా ఉన్నప్పుడు మీ లక్ష్యాన్ని మీరు సాధించే క్రమంలో మీకు చాలా డౌట్లు వస్తాయి. కాబట్టి వాటికి మీ దగ్గర సమాధానం లేనప్పుడు మీరు ఏదైతే లక్ష్యం అనుకుంటారో దాన్ని మీరు అచీవ్ చేయలేరు. కాబట్టి మీ లక్ష్యం ఏదైతే ఉంటుందో దాన్ని క్లిస్టర్ క్లియర్ గా ఫిక్స్ అయిపోండి. ఇదే నా జీవిత లక్ష్యం నేను దీని కోసమే పుట్టాను అనే రేంజ్ లో ఉండండి అలా ఉన్నప్పుడే మీరు మీ జీవితంలో అనుకున్నది సాధిస్తారు.
ప్రాపర్ ప్లానింగ్ అనేది మీ లక్ష్యానికి చాలా అవసరం
ఇంకా రెండో పాయింట్ ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ అనేది మీ లక్ష్యానికి చాలా అవసరం. సరే నాకు లక్ష్యం ఉందని చెప్పేసి మీరు పని చేసుకుంటూ పోతే మీరు అనుకున్నది సాధిస్తారో లేదో కొంచెం డౌటే. నేనేమంటానంటే ప్రాపర్ గా ప్లానింగ్ ఉండాలి. ఉదాహరణకి మీరు ఒక పెద్ద వీడియో ఎడిటర్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి. ఫస్ట్ అఫ్ ఆల్ మీరు చిన్న చిన్న వీడియోలను ఎడిటింగ్ చేస్తూ అవి ఎలా ఉన్నాయో లేదో అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ కు చూపించుకుంటూ దాంట్లో మీరు మెల్లమెల్లగా ఆ ఉత్తీర్ణత పొందాలి తప్ప. ఒకేసారి మీరు సినిమాలు ఎడిటింగ్ చేసే స్థాయికి వెళ్లాలంటే కష్టం. కాబట్టి మీరు ఎడిటింగ్ ని ఫ్యూచర్ గా ఎంచుకున్నప్పుడు మెల్లమెల్లగా చిన్న చిన్న వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ మీరు జీవితంలో ఎదగాలే తప్ప ఒకేసారి మీరైతే జీవితంలో ఎదగరు కాబట్టి ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఫస్ట్ ఒక చిన్న వీడియోని తీసుకొని దాన్ని ఎడిటింగ్ చేయాలి. ఆ తర్వాత ఒక చిన్నపాటి షార్ట్ ఫిలిం ని ఎడిటింగ్ చేయాలి. ఆ తర్వాత ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ ఉన్న షార్ట్ ఫిలిం ని ఎడిటింగ్ చేసి ఆ తర్వాత మీరు ముందు ముందు మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే స్టెప్స్ చేయాలి. వీటన్నిటికీ ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక జీవిత లక్ష్యానికి ఖచ్చితమైన ప్లానింగ్ అనేది ఉండాలి.
కష్టాలన్నీ అదగమించడం ఎలా
ఇక నేను చెప్పొచ్చే మూడో పాయింట్ ఏంటంటే మీరు మీ లక్ష్యాన్ని చేరుకునే ప్రాసెస్ లో చాలా కష్టాలు వస్తాయి. వాటికి మీరు భయపడి మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో మీకు మళ్ళీ కన్ఫ్యూషన్ వచ్చిందనుకోండి మిమ్మల్ని ఎవరూ మార్చలేరు.
ధైర్యంగా మీరు ముందడుగేయాలి
ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ధైర్యంగా మీరు ముందడుగేయాలి. మీరు కష్టపడుతూ ప్రతిదీ ప్రయత్నిస్తూ ఉంటే ఒక రోజు మీరు కోరుకున్నది మీ దగ్గరికి వస్తుంది అది ఆత్మవిశ్వాసంతో మరియు మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క కష్టాన్ని చాలా ఈజీగా డీల్ చేయగలుగుతాం. అలా కాకుండా అధైర్యంగా ఉంటే మాత్రం మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు ఎందుకంటే మనం ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఆ పని మనం చేయగలం అనే నమ్మకం ఎంత ఇంపార్టెంట్ మనం ఖచ్చితంగా చేసి తీరుతాం. ఎటువంటి కష్టాలు ఎదురొచ్చినా సరే వాటిని కూడా మనం డీల్ చేస్తాం అని అనే ధైర్యం మాత్రం మనిషికి చాలా అవసరం. అలా ధైర్యంగా ఉంటే మాత్రం మీరు ఏదైతే జీవితంలో సాధించాలనుకుంటారో దాన్ని ఖచ్చితంగా అచీవ్ చేసి తీరుతారు. అంతేనండి అంతకు మించి ఏం లేదు కాబట్టి మీరు ఏమైతే కావాలనుకుంటున్నారో దాన్ని మనసులో ఉంచుకోండి. లక్ష్యాన్ని క్లియర్ కట్ గా పెట్టుకోండి మంచి ప్లాన్ రెడీ చేసుకోండి మీరు మీ లక్ష్యాన్ని చేరుకునే ప్రాసెస్ లో కొన్ని కష్టాలు వస్తాయి. వాటిని మీరు ధైర్యంగా ఎదుర్కోండి ఇలా చేయటం వల్ల మీరు ఏదైతే చేయాలనుకుంటారో అది జీవిత లక్ష్యం అవ్వచ్చు రేపు పొద్దున పని కూడా అవ్వచ్చు. ఆ పనిని మీరు ఖచ్చితంగా చేసి తీరుతారు జీవితంలో సక్సెస్ ఫుల్ గా ఉంటారు.
ఈ టాపిక్ మీకు నచ్చితే కచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికి మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి..