తెలివిగా మాట్లాడటం నేర్చుకోండి – Communication Skills Tips in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Communication Skills Tips in Telugu గురించి తెలుసుకుందాం.
తెలివిగా మాట్లాడటం నేర్చుకోండి
తెలివిగా మాట్లాడాలి అని ప్రతి ఒక్క మనిషికి తన మనసులో ఒక చిన్న కోరిక ఉంటుంది. కాకపోతే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు మీరు ఎందుకు తెలివిగా మాట్లాడాలి. మీ సమస్య మీద మీరు తెలివిగా మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికా లేకపోతే ఒక 10 మంది ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక విషయం గురించి తెలివిగా మాట్లాడి వీడు తెలివి కల్లోడురా అని అనిపించుకోవడానికా అనేది చాలా ఇంపార్టెంట్. నేనేమంటానంటే మీరు మీ కోసం తెలివిగా మాట్లాడాలన్నా లేకపోతే ఒక విషయం మీద తెలివిగా మాట్లాడి 10 మంది ముందు తెలివి కల్లోడిలా కనిపించాలన్న నేను చెప్పే కొన్ని విషయాలు గనక మీరు పాటిస్తే తప్పకుండా తెలివిగా మాట్లాడతారు.
ఫస్ట్ అఫ్ ఆల్ తెలివిగా మాట్లాడటం అనేది చాలా ముఖ్యమైన పని. అసలు ఎందుకు ముఖ్యమైనది అనే పాయింట్ గనక నన్ను అడిగితే ఫస్ట్ మనం పని చేసే చోట అవ్వచ్చు లేకపోతే ఒక 10 మంది మధ్యలో అవ్వచ్చు అది కూడా కాకపోతే మన ఫ్రెండ్స్ తో అవ్వచ్చు మనం మాట్లాడే మాటల వల్ల వీళ్ళందరితో ఉండే మన రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అంతే కాకుండా వాళ్ళందరూ మనకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు దాంతో మనకంటూ ఒక బెస్ట్ సర్కిల్ ఏర్పడుతుంది.
ఫస్ట్ అఫ్ ఆల్ తెలివిగా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పనే ఆక్టివ్ లిసనింగ్. బేసికల్ గా ఒక విషయం మీద 10 మంది కలిసి మాట్లాడుతున్నారు అనుకోండి అసలు ఆ విషయాన్ని మనం ప్రాపర్ గా వినాలి. అలా కాకుండా ముందు ముందుకు వెళ్ళిపోయి ఆ విషయం గురించి మాట్లాడటం వల్ల మీకు ఉన్న విలువ పోతుంది. అంతే కాకుండా అసలు ఆ విషయం ఏంటో కూడా మీకు సరిగ్గా అర్థం కాదు. దాని వల్ల 10 మందిలో మీ మాటకి అస్సలు విలువ ఉండదు. కానీ నేనేమంటానంటే ఒక విషయాన్ని పూర్తిగా వినటం అంతేకాకుండా అందులో లో ఉన్న తప్పు ఒప్పుల్ని అనాలసిస్ చేసుకొని మనం మాట్లాడే సమయం వచ్చినప్పుడు కూడా మనం చాలా తక్కువగా మాట్లాడాం అనుకోండి అసలు అక్కడ సిచుయేషన్ అనేది మనకి ప్రాపర్ గా అర్థమవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరు తెలివిగా మాట్లాడుతున్నారు ఎవరు తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది.
అంతేకాకుండా తెలివిగా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన ఇంకో జాగ్రత్త ఏంటంటే ఆస్క్ థాట్ ఫుల్ క్వశ్చన్స్. బేసికల్ గా బురద తక్కువ క్వశ్చన్లు అడిగి అసలు అర్థం పరద లేని క్వశ్చన్లు అడిగి అక్కడ మీ విలువ మీరు చేసేసుకోవడం కన్నా ఆలోచనాత్మకమైన ప్రశ్నలను అడిగి అక్కడున్న వాళ్ళని కూడా మీరు ఆలోచింప చేసేలా చేయాలి. అలా చేయటం వల్ల మీ విలువ మరింత రెట్టింపు అవుతుంది.
ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మీరు ఆలోచనాత్మకమైన ప్రశ్నలు అడగాలి అనుకుంటే ఫస్ట్ అఫ్ ఆల్ మీరు సమాచారంతో ఉండాలి అంటే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఉండాలి అదేమి లేకుండా ఉందనుకోండి మీ మైండ్ లోకి అసలు ప్రశ్నలే రావు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని ప్రాపర్ గా తెలుసుకుంటూ ఉండాలి. అది మనం పుస్తకాలు చదవడం వల్ల లేకపోతే టీవీ లో చూసే అవ్వచ్చు, లేకపోతే youtube వీడియోలు కూడా చూసేవచ్చు అలా కాకుండా రీల్స్ చూసుకుంటూ షాట్స్ చూసుకుంటూ మనకి సంబంధం లేని విషయాలు చూస్తూ మనం టైం వేస్ట్ చేసుకున్నాం అనుకోండి. మనకు అసలు నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది సో నాలెడ్జ్ లేనప్పుడు మనకి ఏ విషయం అర్థం కాదు అసలు ఆ విషయం అర్థం కానప్పుడు మనం క్వశ్చన్ ఎలా వేస్తాము మనం క్వశ్చన్ వేయకుండా సైలెంట్ గా కూర్చుంటే మనం అసలు తెలివిగా మాట్లాడే వాళ్ళం ఎలా అవుతామో. కాబట్టి ఏదైనా సరే ఒక విషయాన్ని పూర్తిగా వినండి అంతేకాకుండా ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి అనుకుంటే ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకోండి. ఇంతకుముందు మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే మనం దానికంటూ కొంత ఖర్చు చేయాలి పుస్తకాల రూపంలో కానీ లేకపోతే బయటికి వెళ్లి ఇంటర్నెట్ సెంటర్ లో కంప్యూటర్ ని ఒక వన్ అవర్ రెంట్ తీసుకొని తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు అలా ఉందా మన దగ్గరికే కంప్యూటర్ వచ్చేసింది. కాబట్టి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని ప్రాపర్ గా తెలుసుకోండి. ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు ప్రాపర్ గా వినండి ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్ గా ఏ విషయం గురించి అయినా సరే తెలివిగా మాట్లాడుతారు తెలివిగా ప్రశ్నలు వేస్తారు లేకపోతే ఎవరన్నా ప్రశ్నలు వేస్తే వాటికి తెలివిగా సమాధానం చెప్తారు. ఇది ఒక రోజుతో రెండు రోజులతో సాధ్యమయ్యే పని కాదు గాని మీరు గనక మనసు పెడితే కచ్చితంగా అయ్యే పని.
1 thought on “తెలివిగా మాట్లాడటం నేర్చుకోండి | Communication Skills Tips in Telugu”