కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి – kastalu vachinappudu em cheyali
ఇవాళ్టి టాపిక్ లో kastalu vachinappudu em cheyali గురించి తెలుసుకుందాం.
కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎలా ఉండాలి
ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రోజు కష్టాలు వస్తాయి అలా వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని ఎలా నిలబడతాం అన్నది చాలా ముఖ్యం. ఈరోజు మనం ఈ టాపిక్ లో అదే విషయం గురించి మాట్లాడుకుందాం. ఎంత కష్టమైనా మనం ధైర్యంగా ఉండాలంటే మన లక్ష్యం మీద పట్టుదలతో ఉండాలి. ధైర్యం లేకపోతే మనం సులభంగా ఓడిపోతాం భయపడతాం మనోధైర్యాన్ని కోల్పోతాం.
అసలు ధైర్యం అంటే ఏంటి
ధైర్యం అంటే మనలోని భయాన్ని అధిగమించడం ఇది మన మనసులో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని బయటకు తీసుకురావడం. ధైర్యం అంటే కేవలం భయం లేకపోవడం కాదు భయం ఉన్నప్పటికీ దాన్ని ఎదుర్కోవడం సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాంటి గొప్ప వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ధైర్యంగా నిలబడ్డారు వాళ్ళకి భయాలు ఉన్నప్పటికీ ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్లారు.
అసలు కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడటం ఎలాగా
ముందుగా కష్టాలకి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి ఆ కష్టాలను ఎప్పుడూ పక్కన పెట్టకుండా వాటిని ఎదిరించి ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే మనసులో ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండాలి. ఏదైనా సమస్య ఎదురైతే దాన్ని పరిష్కారం కోసం ధైర్యంగా ఆలోచించాలి. అలా ఎదిరించాలంటే చిన్న చిన్న స్టెప్స్ ద్వారాగా వాటిని మనం ఎదిరించగలం ఎంత పెద్దటి కష్టమైనా సరే చిన్న చిన్న అడుగుల ద్వారాగా అధిగమించొచ్చు. ఒక్కొక్క అడ్డంకి ఒక్కొక్క అడుగు తీసుకుంటూ దాటడం వల్ల మన ధైర్యం అనేది ఒక్కొక్క స్టెప్ పెరుగుతుంది.
కష్టాలు వచ్చినప్పుడు ధైర్యాన్ని ఎలా పెంపొందించాలి
మనలో ఉన్న ఆత్మవిశ్వాసం మన ధైర్యానికి పునాది మనకు మన మీద నమ్మకం ఉంటే ఎలాంటి కష్టాన్ని అయినా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. పాజిటివ్ మనస్తత్వం ఉన్నవారితో ఉండటం వల్ల మన ధైర్యం పెరుగుతుంది. మంచి స్నేహితులు కుటుంబ సభ్యులు మనకి భరోసాను కల్పిస్తారు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మనం చేసే తప్పులు కూడా మనకి ధైర్యాన్ని నేర్పుతాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకొని మనం ముందున్న ఆపదలను ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం.
ఉదాహరణకి మన చుట్టూ ఉండే చాలా కుటుంబాల్లో ఆ కుటుంబాన్ని ధైర్యంగా లాక్కొచ్చే ఒక మనిషి ఉంటాడు ఆ కుటుంబం కోసం పోరాడే ఒక మనిషి ఉంటాడు ఆ మనిషి ఆ కుటుంబం కోసం ఎన్నో చేస్తూ ఉంటాడు ఆ కుటుంబం కోసం పోరాడే ఆ మనిషి కూడా కొన్నిసార్లు భయమేస్తుంది బాధేస్తుంది అసలు నేను ఈ కుటుంబాన్ని ఎలా మెయింటైన్ చేయగలను అనే ఆలోచన కూడా వస్తుంది. కానీ ఆ భయాలను అధిగమించి ధైర్యంతో ముందడిగేసి తన కుటుంబ సభ్యుల సలహాలు తీసుకొని తన స్నేహితుల సలహాలు తీసుకొని వాళ్ళ అండదండలతో ఎటువంటి ఆపదనైనా సరే ఎటువంటి భయం భయాన్ని అయినా సరే ధైర్యంతో ఎదుర్కొని జీవితంలో ఎన్నో సమస్యల్ని దాటుకొని వస్తారు.
కాబట్టి మనకి ఎప్పుడైనా భయమేస్తే మనం దిక్కులు చూడాల్సిన అవసరం లేదు. మన చుట్టూనే చాలా మంది హీరోలు ఉంటారు ప్రతి ఒక్క కుటుంబంలో ఒక హీరో ఉంటాడు. ఆ హీరో కష్టపడబట్టే ఆ కుటుంబం అలా ఉంటుంది ఆ హీరో ధైర్యంగా ఉండబట్టే ఆ కుటుంబం అంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి మీకు కష్టాలు వచ్చినప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళని కొంచెం దగ్గరగా చూస్తే చాలు ఆటోమేటిక్ గా మీకు కూడా ధైర్యం వచ్చేస్తుంది.
కాబట్టి ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోండి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటికి మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి..
3 thoughts on “కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి | kastalu vachinappudu em cheyali”