ఈ 5 సందర్భాల్లో మౌనంగా ఉండిపో – Always be silent in Five Situations in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Always be silent in Five Situations in Telugu గురించి తెలుసుకుందాం.
చాలా మంది ఏమనుకుంటారంటే ఎప్పుడు మాట్లాడుతూ ఉండటం అంతే కాకుండా ఒక విషయం మీద వాళ్ళ ఆలోచన విధానాన్ని వ్యక్తపరచడం అంటే వాళ్ళ భావాన్ని వ్యక్తపరచడం. చాలా అవసరం అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు కాకపోతే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనిషి అనేవాడు కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం వల్ల కూడా అతని జీవితంలో అతను అనుకున్న విజయాన్ని సాధించొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం మౌనంగా ఉండటం వల్ల మన జీవితంలో మనకి చాలా మంచి జరుగుతుంది. కాకపోతే చాలా మందికి ఎటువంటి సందర్భాల్లో మౌనంగా ఉండాలి అనే విషయం మాత్రం తెలియదు. ఈరోజు మన టాపిక్ లో నేను చెప్పవచ్చే పాయింట్ ఏంటంటే ఈ ఐదు సందర్భాల్లో మీరు గనక సైలెంట్ గా ఉంటే మీ జీవితంలో మీరు ఆనందంగా ఉంటారు సక్సెస్ ఫుల్ గా ఉంటారు ఇంకా ముఖ్యంగా ప్రశాంతవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు.
కాబట్టి ఇంకా డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్తే ఏ మనిషి అయినా సరే మౌనంగా ఉండవలసిన మొట్టమొదటి సందర్భం ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు. మామూలుగా మనం కష్టాలు ఎదురైతే పానిక్ అయిపోతూ ఉంటాము ఏం చేయాలో తెలియక పిచ్చెక్కి పోతూ ఉంటుంది అంతే కాకుండా ఎవరు కనిపిస్తే వాళ్ళకి మన కష్టాలు చెప్పుకుంటూ ఉంటాము. నన్ను అడిగితే ఎవరికి పడితే వాళ్ళకి మీ కష్టాలు చెప్పుకోవడం వల్ల వాళ్ళకి మీ మీద సింపతీ కలుగుతుంది కానీ మీకున్న కష్టం పోదుగా. కాకపోతే ప్రతి ఒక్క మనిషి జీవితంలో కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు. అమ్మా, నాన్న, లేకపోతే భార్య పిల్లలు ఇలాగ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళకి చెప్తే చెప్పొచ్చు లేకపోతే చెప్పకపోయినా నష్టం లేదు. నేను ఏమంటానంటే ఏ మనిషికైనా సరే సరే కష్టాలు వచ్చినప్పుడు మొదట పానిక్ కాకుండా ఆ తర్వాత మనం వెళ్లి ఇంకొకళ్ళతో కష్టాలు చెప్పుకోకుండా ఫస్ట్ అఫ్ ఆల్ ప్రశాంతంగా మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఈ కష్టం ఎందుకు వచ్చింది ఈ కష్టానికి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి మీరు ఆలోచించుకుంటే బహుశా మీకు ఐడియా రాకపోవచ్చు ఎందుకంటే ఆ టైం లో రాదు. కానీ మీరు ప్రశాంతంగా ఉండి ఆ కష్టం గురించి ఆలోచించకుండా ఆ తర్వాత కొంత సమయం తీసుకొని అసలు ఈ కష్టాన్ని కొంచెం అనాలసిస్ చేసుకుంటే ఫస్ట్ మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఎందుకంటే మీ మనసు ప్రశాంతంగా ఉంది కాబట్టి. అలా కాకుండా మనం గాబరా గాబరాగా ఉన్నప్పుడు మన సమస్యలకి సంబంధించిన సొల్యూషన్స్ ని వెతికితే ఆ సొల్యూషన్స్ కూడా గాబరాగానే వస్తాయి. కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే మీరు మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు కొంచెం మౌనంగా ఉండండి మీ గురించి మీరు ఆలోచించుకోండి. అంతేకాకుండా మీ కష్టాలను వేరే వాళ్ళకి చెప్పుకొని వాళ్ళకి చులకన అవ్వద్దు లేకపోతే వాళ్ళు మీ కష్టాలను వేరే వాళ్ళకి చెప్పి నవ్వుకునేలా అవ్వద్దు. అంతేకాకుండా మీరు మీ కష్టాలను వాళ్ళకి చెప్పటం వల్ల మీ కష్టాలు వాళ్ళు తీర్చకపోగా వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీరు ప్రాబ్లమ్స్ లో ఉన్నారు కదా అందుకని నవ్వుకుంటారు ఇది మనిషి యొక్క నిజమైన స్వరూపం. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి మీ కష్టాలు చెప్పుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోమాకండి. ఆ తర్వాత చెప్పుకొని అనవసరంగా వీడికి నా ప్రాబ్లమ్స్ అని చెప్పుకున్నాను వీడికి మన ప్రాబ్లమ్స్ చెప్పడం వల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సమాజంలో మన పరువు పోయింది నేను చెప్పింది ఒకటైతే వీడు జనాలకు చెప్పింది ఇంకోటి అని చెప్పేసి మీరు మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తారు. అందుకనే మీకు కష్టాలు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రశాంతంగా ఉండండి అంతేకాకుండా మౌనంగా ఉండండి. మీరు మౌనంగా ఉండటం వల్ల మీ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండవు ఆ తర్వాత మీ సమస్యకు సొల్యూషన్ పరిగెత్తుకుంటూ వస్తుంది అంతే అంతకు మించి ఏమీ లేదు.
ఇంకా మౌనంగా ఉండవలసిన రెండో సందర్భం ఏంటంటే మన మీద అవతలి వాళ్ళు గాసిప్స్ క్రియేట్ చేసినప్పుడు. మనం ఒక పని చేయకపోయినా సరే వాడు ఆ పని చేశాడు వాడు అలాంటి వాడు అని చెప్పేసి మన గురించి ఎవరైనా క్రియేట్ చేసి మన గురించి తప్పుగా మాట్లాడినా మనల్ని తక్కువ చేసినా సరే మనకి రియాక్ట్ అవ్వాలి మనం ఏదో ఒకటి మాట్లాడాలి అనిపిస్తుంది. కానీ నన్ను అడిగితే మీరు అలాంటి సందర్భంలో సైలెంట్ గా అంటే మౌనంగా ఉండటం వల్ల అసలు మీరు వాడి మాటలకి విలువ ఇచ్చిన వాళ్ళు అవ్వరు. అలా కాకుండా మీరు మాట్లాడారు అనుకోండి వాడి మాటకు విలువ ఇచ్చి మీరు రిప్లై ఇచ్చినట్టు అవుతుంది. ఆల్మోస్ట్ వాడు గెలిచినట్టు అవుతుంది కాబట్టి నేను ఏమంటానంటే ఎవడైనా మిమ్మల్ని తక్కువ చేసినా లేకపోతే మీ మీద ఏదైనా రూమర్ క్రియేట్ చేసి మిమ్మల్ని తప్పు దారి పట్టించాలని ప్రయత్నించినా కూడా మీరు మౌనంగా ఉండండి. అలా ఉండటం వల్ల మీ మీద రూమర్లు క్రియేట్ చేసే వాళ్ళు మీ గురించి సాకులు చెప్పేవాళ్ళు తక్కువ అవుతూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైతే రియాక్ట్ అయ్యి వాళ్ళ మాటలకి మీ మాటలు అడ్డు వేస్తారో అలా మీ గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోతారు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి దాన్ని ఎలాగో ఆపలేరు కాబట్టి మీరు మీ ఆలోచనలని కంట్రోల్ లో పెట్టుకొని ముందు మీ మాటలని మీరే ఆపేసుకోండి. దానివల్ల అవతలి వాడు వాగి వాగి వాగేసి వాడు ఇంకా మనకి రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇక మీ గురించి మాట్లాడటమే ఆపేస్తాడు. అలా ఆపేసిన తర్వాత ఏమవుతుంది ఎవడి పని అటు చేసుకుంటారు. కాబట్టి మనం అవతలి వాడి మాటలకి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు అంతేకాకుండా మిమ్మల్ని ఎంత తక్కువ చేసినా ఎంత నీచంగా మాట్లాడినా మీరేంటో మీకు తెలిసినప్పుడు మీరు అవతల వాడికి ఎందుకు రెస్పాండ్ అవ్వాలి. కాబట్టి ఇలాంటి చిల్లర విషయాలకి మీరు రెస్పాండ్ అయ్యి మీ మనశ్శాంతిని ఎవడు పాడు చేసుకోమన్నాడు. కాబట్టి మీరు మౌనంగా ఉండండి అలా ఉండటం వల్ల ప్రశాంతంగా ఉండేది మీరే. కాబట్టి మీ ప్రశాంతతని మీ మాటల ద్వారా చెడగొట్టుకుంటారా మీ మాటలు కట్టిపడేసి మీ ప్రశాంతతను మీరు పెంచుకుంటారా అనేది మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ముఖ్యంగా మీరు గాసిప్స్ క్రియేట్ అయినప్పుడు మౌనంగా ఉండండి.
ఇంకా మీరు మౌనంగా ఉండాల్సిన మూడో సందర్భం ఏంటంటే అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు మీరు సైలెంట్ గా ఉండండి. వాదనల్లో కోపాలు వస్తూ ఉంటాయి ఒకళ్ళు రెచ్చిపోతూ ఉంటారు ఇంకొకళ్ళు కావాలని చెప్పి గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఆ వాదనల వల్ల మీకు ఉపయోగం ఉండదు వాళ్ళకి ఉపయోగం ఉండదు వాళ్ళు వాంటెడ్ గా ఏదో చేయాలనుకుంటారు ఆ ట్రాప్ లో మీకు తెలియకుండా మీరు పడిపోతారు. కాబట్టి మీ జీవితంలో జరిగే అన్నసరి ఆర్గ్యుమెంట్స్ లోకి మీరు తలదూర్చి మరి అక్కడ వాగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఉపయోగం ఉన్నచోటే చాలా తక్కువ మాట్లాడమని చెప్తున్నాను. అలాంటిది మీ జీవితంలో మీకు అవసరం లేని పనుల దగ్గరికి వెళ్లి మీరు ఏదో ఒకటి మాట్లాడి ఆ ట్రాప్ లో మీరు చిక్కుకొని మీరు ఇబ్బంది పడటం అనేది అసలు దానికి మించిన మూర్ఖత్వం ఏమి ఉండదు. కాబట్టి అనవసరమైన ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు మీరు మౌనంగా ఉండండి. అలా ఉండటం వల్ల మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది అంతేకాకుండా మీ జీవితంలో ప్రశాంతత అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే అసలు మీరు ఉన్నప్పుడు ఆర్గ్యూ చేయడానికే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిరు ఎందుకంటే ఎవడైనా ఆర్గ్యుమెంట్ ఎప్పుడు చేస్తాడు. అవతల వాడు రెచ్చిపోయి మరి వాగుతున్నప్పుడు కానీ మీరు అసలు నోట్లో నుంచి మాట్లారా అన్నప్పుడు మీతో ఇంకొకడు ఆర్గ్యూ ఎందుకు చేస్తాడు. ఒకవేళ మీకే ఆర్గ్యుమెంట్ సిట్యువేషన్ వచ్చిందనుకోండి మీకు మీరు సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోండి ఆ సిచుయేషన్ నుంచి తప్పించుకొని పారిపోండి ఆర్గ్యుమెంట్ అనేది అనుబాంబు తో సమానం అది పేలటం వల్ల ఎంతమంది జీవితాలు ఎలా డిస్టర్బ్ అవుతాయో ఎంతమంది మనుషులు మాట్లాడుకోకుండా పోయారో ఎన్ని కుటుంబాలు విడిపోయాయో మీకు సపరేట్ గా నేను చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. కాబట్టి నేను ఏమంటానంటే ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు మీరు మౌనంగా ఉండటం అనేది చాలా ఉత్తమమైన పని. కొంతమంది అంటారు వాళ్ళకి సంబంధం లేని విషయాల గురించి ఆర్గ్యూ చేసి గొడవ పెట్టేసుకొని వాళ్ళతో అయిపోయి ఏదో సాధించేసామని ఫీల్ అవుతూ ఉంటారు. అసలు మీకు సంబంధం లేని విషయాల గురించి మీరు గొడవ పెట్టుకొని విడిపోవడం అనేది ఎంత కామెడీగా ఉంటుంది. కాబట్టి నేను ఏమంటానంటే మీకు సంబంధించిన విషయాల్లోనే మీరు కొంచెం తక్కువగా రియాక్ట్ అవ్వండి. నన్ను అడిగితే అసలు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మౌనంగా ఉండండి. ఎవరైనా సరే ఆర్గ్యుమెంట్ అనేది ఎందుకు పెట్టుకుంటారు అంటే అవతల వాడితో వాదించి గెలవాలి అనే కాన్సెప్ట్ తోనే వాదన పెట్టుకుంటారు. కాబట్టి వాదించి గెలవటం కన్నా మాట్లాడి తేల్కోవడం అనేది చాలా ఉత్తమమైనది. కాబట్టి మీరు ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు దయచేసి మీ నోరు ఎత్తమాకండి అప్పుడు మీరు సైలెంట్ గా ఉంటే మీ జీవితంలో మీరు రాబోయే చాలా సమస్యల్ని మీకు తెలియకుండా అడ్డుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు మాత్రం సైలెంట్ గా ఉండండి.
ఇంకా మౌనంగా ఉండాల్సిన నాలుగో సందర్భం ఏంటంటే మన మనసు సరిగా లేనప్పుడు అంటే మనం రైట్ ఫార్మ్ ఆఫ్ మైండ్ లో లేనప్పుడు మనం కోపం వచ్చినప్పుడు లేదా మనం బాగా చిరాగ్గా ఉన్నప్పుడు అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే అలా మాట్లాడటం వల్ల కూడా మనకి చిరాకు పుట్టించిన సందర్భం యొక్క ఆ ఇరిటేషన్ అనేది అవతల వ్యక్తుల మీద చూపించొచ్చు లేకపోతే ఆ మాటల్లో వ్యక్తపరచొచ్చు. కాబట్టి అలా మాట్లాడటం వల్ల కూడా మనకి మనం హాని చేసుకున్న వాళ్ళు అవుతాం అంటే మన పరువు మనం తీసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మన ఆలోచన విధానం మనం రైట్ ట్రాక్ లో లేనప్పుడు మనం సైలెంట్ గా ఉండటమే బెటరు. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు మనం అన్ని సందర్భాల్లో ఒకేలాగా అస్సలు ఉండము కొంచెం సేపు ఏమో చిరాగ్గా ఉంటాం ఇంకొంచెం సేపు ఏమో నవ్వుతూ ఉంటాం ఇంకొంచెం సేపు బాధపడుతూ ఉంటాము. అలాగా మన మైండ్ లో రాంగ్ ఎమోషన్ అనేది రన్ అవుతున్నప్పుడు మనం మాట్లాడటం వల్ల కూడా మన మీద అది ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఆ ఎఫెక్ట్ కాస్త వీడు ఇలాంటోడు అని చెప్పేసి సమాజంలో అందరూ మన మీద ముద్ర వేసేస్తారు. కాబట్టి ఇలాంటి సమయంలో కూడా మనం సైలెంట్ గా ఉండటం వల్ల మనకి చేసుకునే అంత మంచి పని మామూలు పని కాదు. కాబట్టి సైలెంట్ గా ఉండాలి ఎందుకంటే మనం ఎక్కడో కోపాన్ని ఇంకెక్కడో చూపిస్తూ ఉంటాము ఏదో కోపంలో అన్న మాటలు మనకి ఏదో కోపంలో అనేసాం అని అనిపించొచ్చు కానీ ఆ మాటలు ఎవరి మీద అయితే అంటాము వాళ్ళు దాన్ని అలా అర్థం చేసుకోరు వీడికి ఎంత బలిస్తే అన్నాడూరా అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయిపోతారు మనకు దూరం అవ్వచ్చు లేకపోతే ఏదైనా జరగొచ్చు. కాబట్టి మీ మనసు సరిగ్గా లేనప్పుడు మీ ఆలోచన విధానం మీ కంట్రోల్ లో లేనప్పుడు మీరు అస్సలు మాట్లాడకండి. ఆలోచనలే కంట్రోల్ లో లేవు ఇంకా మాటలు ఏముంటాయి అంటారా ఇక మిమ్మల్ని ఎవడు మార్చలేడు. కాబట్టి మీరు కంట్రోల్ లో ఉండండి మౌనంగా ఉండండి.
ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే సందర్భం అయితే కాదు కానీ మనం మాట్లాడే మాటలు అనేవి చాలా మందికి నచ్చొచ్చు నచ్చక పోవచ్చు కొంతమంది వీడు ఓవర్ రైటింగ్ ఏంటిరా బాబు అని చెప్పి అనుకోవచ్చు ఇంకొంతమంది ఏంటంటే ఓకే వీడు బానే మాట్లాడుతాడు అని చెప్పి అనుకోవచ్చు. నేను వాళ్ళందరికీ చెప్పవచ్చేది ఏంటంటే మీరు మీ మాటలతో మనుషులకి దగ్గర అవ్వటం అనే విషయం కన్నా మీ చేతలతో మనుషులకు దగ్గర అవ్వడం అనేది చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఎమోషనల్ బాండింగ్ అనేది బిల్డ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ మాటలకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే మీరు మీ చేతలతో ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలి అలా ప్రూవ్ చేసుకున్నప్పుడు మనం ఒక 10 మందిలో ఉండి మాట్లాడినా సరే మన మాటకు విలువ ఉంటుంది ఆ విలువ అనేది చిరస్థాయిగా మిగిలిపోతుంది. అలా కాకుండా కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నాం అనుకోండి వాళ్ళు మనకు పెట్టే పేరు ఏంటో తెలుసా వీడు ఒక వాగుడుకాయ అని చెప్పి అంటాడు లేకపోతే వీడో పెద్ద నాసా గాడు అని చెప్పేసి మన మీద ముద్ర వేసి మనల్ని రకరకాలుగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి మన పనులతో మనం అవతల వాళ్ళని ఆకట్టుకుంటే లేకపోతే ఒక్క ముక్కలో చెప్పాలంటే మన పనులే మాట్లాడాలి మన టాలెంటే మాట్లాడాలి అవతల వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇచ్చేలా చేయాలి అంతే అంతకు మించి ఏం లేదు. కాబట్టి ప్రతి సందర్భంలో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు సైలెంట్ గా ఉండటం వల్ల కూడా అవతలి వాడు మనల్ని ప్రిడిక్ట్ చేయలేకపోతాడు. వీడు ఏంటి అసలు ఏం మాట్లాడట్లేదు వీడు ఆనందంగా ఉన్నాడా లేకపోతే సాడ్ గా ఉన్నాడా లేకపోతే ఏదైనా యాక్షన్ చూసుకోవడానికి రెడీగా ఉన్నాడా అని చెప్పేసి అవతలి వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. మనల్ని ప్రెడిక్ట్ చేయలేకపోతాడు మనల్ని ప్రెడిక్ట్ చేయలేనప్పుడే కదా మనం సక్సెస్ అయ్యేది మన లైఫ్ లో అవతలి వాడు మనల్ని ప్రిడిక్ట్ చేశాడు అనుకోండి అవతలి వాడు మనల్ని ఒక అంచనా వేసేసాడు అనుకోండి వాడు మనల్ని దాటేసుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి మీరు మౌనంగా ఉండండి మీ పని మీరు చేసుకోండి జీవితంలో ప్రశాంతంగా ఉండండి. అవతల వాళ్ళని సాటిస్ఫై చేయడానికి అయితే మనం పుట్టలేదు మన కోసం మనం పుట్టాము మన సంతోషమే మనకి ముఖ్యము. కాబట్టి సైలెంట్ గా ఉండండి.
1 thought on “ఈ 5 సందర్భాల్లో మౌనంగా ఉండిపో | Always be silent in Five Situations in Telugu”