కొత్తగా పెళ్లైన వాళ్ళు చేసే పొరపాట్లు ఇవే – Avoid These Mistakes After Marriage in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Avoid These Mistakes After Marriage in Telugu గురించి తెలుసుకుందాం.
రిలేషన్స్ అనేవి మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా కొత్తగా పెళ్లి చేసుకుంటారు కదా వాళ్ళకి పెళ్లి అయిన తర్వాత వాళ్ళ మధ్య క్రియేట్ అయ్యే స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది వాళ్ళు జీవితాంతం కలిసి ఉండటానికి ఒక బలమైన పునాది అవుతుంది. అయితే ఆ వయసులో అనుభవం లేకపోవడం వల్లో లేకపోతే ఎక్కువ ఎమోషనల్ అయిపోవడం వల్లో వాళ్ళు పూర్తిగా ఆ బంధాన్ని బిల్డ్ చేసుకోలేకపోతున్నారు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్ల వల్ల వాళ్ళ రిలేషన్షిప్ లో తగా రావచ్చు లేకపోతే కొన్ని సందర్భాల్లో విడాకుల వరకు వెళ్లొచ్చు. నేను ఈ టాపిక్ లో చెప్పొచ్చేది ఏంటంటే ఒక రిలేషన్షిప్ లో ఉన్న జంటలు ఎక్కువగా చేస్తున్న పొరపాట్లు ఆ పొరపాట్లు మన జీవితంలో రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే పాయింట్ మీద మాట్లాడబోతున్నాను.
ఫస్ట్ అఫ్ ఆల్ పెళ్లి అనేది ఒక వ్యక్తిగత ప్రయాణం మాత్రమే కాదు ఇద్దరు మనుషుల జీవితాన్ని ఒకటిగా మలిచే ఒక అద్భుతమైన బంధం. అయితే కొంతమంది మాత్రం పెళ్లి అయిన తర్వాత కేవలం వాళ్లకు మాత్రం మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ పార్ట్నర్ యొక్క ప్రాధాన్యతను మర్చిపోతూ ఒక ముక్కలో చెప్పాలంటే వాళ్ళ మనోభావాలను అసలు పట్టించుకోకుండా వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తూ ఉంటారన్నమాట. ఇలా చేయటం వల్ల కూడా భార్యా భర్తల మధ్య రిలేషన్ అనేది డామేజ్ అవుతూ ఉంటుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే బంధం అంటే ఒకరికొకరు గౌరవించుకోవడం ఒకరికొకరు సమయాన్ని కేటాయించుకోవడం ఒకరి అభిప్రాయాల్ని మరొకరు గౌరవించుకోవడం వల్ల రిలేషన్ అనేది బిల్డ్ అవుతుంది. కానీ అలా ఏకపక్షంగా ఉండటం వల్ల ఆ రిలేషన్ అనేది డామేజ్ అవ్వబోతుంది. ఎందుకంటే మనందరం మనుషులం మనందరికీ కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. అవి డామేజ్ అయినప్పుడు ఆ బంధంలో ఖచ్చితంగా కలహాలు అనేవి స్టార్ట్ అవుతాయి.
అంతే కాకుండా కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన రెండో పాయింట్ ఏంటంటే. చిన్న చిన్న విషయాలకే గొడవ పడటం ఒకరిపై ఒకరు శాశ్వతంగా నెగిటివ్ గా ఆలోచించడం ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో నెగిటివ్ ఎంత ఉంటుందో పాజిటివ్ కూడా అంతే ఉంటుంది. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే వీడు పర్మనెంట్ నెగిటివ్ గాడు అని చెప్పేసి వాడిని కంటిన్యూస్ గా నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తారే తప్ప కనీసం ఒక్క పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అసలు చూడరు. అలా చూడటం అనేది కేవలం అవగాహన లేకపోవటం వల్లే జరుగుతుంది. కానీ ఒక మనిషికి పూర్తిగా అవగాహన ఉంటే మాత్రం అస్సలు అలాగా జరగదు. కానీ వీటికి పరిష్కారం ఏంటంటే గొడవలు జరగటం అనేది సాధారణమే. కానీ వాటిని పరిష్కరించే విధానం అనేది చాలా ముఖ్యం. ఏదైనా చిన్న గొడవ జరిగినప్పుడు ఆ గొడవ చిన్నగా ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించుకుంటే మాత్రం అది అంతటితోనే ఆగిపోయి పోతుంది. అలా కాకుండా మీ వాళ్ళు మా వాళ్ళు అని చెప్పేసి ఆ గొడవని రెండు కుటుంబాలకి లింక్ పెట్టడం వల్లో లేకపోతే ఇద్దరి మనుషుల మధ్య సమస్యని రెండు కుటుంబ సమస్యలుగా మార్చేస్తే మాత్రం అది ఎప్పటికీ తెగదు. కాబట్టి ఒక సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాన్ని ఎలా డీల్ చేయాలో కొంచెం నేర్చుకుంటే నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి కొంచెం తగ్గితే చాలు నేను ఎందుకు తగ్గాను అనే విషయం కూడా చెప్తే చాలు. ఎందుకంటే ఏ మనిషి అయినా తగ్గాల్సింది ఎందుకు బంధం బలపడటానికి అంతే కానీ బంధాన్ని చెడగొట్టుకోవడానికి అయితే కాదు. ఎందుకు తగ్గారో ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ పార్ట్నర్ కి నేను మన ఇద్దరం కలిసి ఉన్నాం అని చెప్పేసి తగ్గుతున్నాను. అలా అని చెప్పేసి నన్ను ప్రతిసారి తగ్గమంటే కుదరదు అని చెప్పేసి నీట్ గా మీ భర్త కోసమో మీ భార్య కోసమో మీరు తగ్గటంలో తప్పే లేదు. అలా డీల్ చేసుకుంటూ పోతే చిన్న చిన్న విషయాలకి గొడవ పడాల్సిన అవసరం అనేది రాదు. అంతేకాకుండా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల కూడా చిన్న చిన్న గొడవలు కాస్త పెద్ద పెద్ద గొడవలుగా మారుతూ ఉంటాయి. వయసురి లేకపోతే అనుభవం లేకపోవడం వల్ల కూడా చాలా మంది వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతారు. చిన్న చిన్న విషయాలకి ఫోన్లు సీస్ కొట్టేయటాలు లేకపోతే పక్కన ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద అరిచేయటాలు ఇలా చేస్తూ ఉండటం వల్ల కూడా గొడవలు అనేవి తరచుగా జరుగుతూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా మాట్లాడి మన తత్వాన్ని నియంత్రించుకోవాలి. మనకు కోపం వచ్చేసింది ఆ విషయం అసలు మన కంట్రోల్ లో లేదు అనుకున్నప్పుడు మాత్రం మాక్సిమం మన బ్రెయిన్ మన కంట్రోల్ లో ఉండదు. కాకపోతే కంట్రోల్ చేసుకోవాలి కోవటం అనే అనుభవాన్ని గనక మనం సాధించగలిగితే అసలు గొడవలు అనేవి జరగవు అది ఇంట్లో అవ్వచ్చు బయట అవ్వచ్చు. ఆ అనుభవాన్ని గెయిన్ చేయాలి అలా గెయిన్ చేయాలి అంటే పెద్దల సలహాల్ని పాటించాలి అంతే అంతకు మించి ఏం లేదు. అంతే కాకుండా కొత్తగా పెళ్లైన వాళ్ళ రిలేషన్ అనేది కామన్ గా పాడైపోవడానికి ఇంకొక కారణం ఆర్థిక వ్యవహారాలు అవగాహన లేకపోవడం అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది లేకపోవడం ఆర్థిక సమస్యలు అనేవి చాలా సందర్భాల్లో రిలేషన్స్ ని దెబ్బతీస్తూ ఉంటాయి. మన మన డైలీ ఎక్స్పెన్సివ్స్ ని తగ్గించుకోకుండా అసలు వాటికి ప్రాధాన్యత లేకుండా ఖర్చులు చేయటం అవగాహన లేక అప్పులు చేయటం వల్ల కూడా తగాదాలు వస్తాయి. తగాదాలు వస్తే ఆటోమేటిక్ గా రిలేషన్స్ అనేవి దెబ్బ తింటా ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే ఫస్ట్ భార్య భర్తలు కూర్చొని వాళ్ళ సంపాదన ఎంత వాళ్ళ ఖర్చులు ఎంత ఒకళ్ళు సంపాదిస్తున్నారా ఇద్దరు సంపాదిస్తున్నారా ఒకవేళ సంపాదిస్తే ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఏ ఖర్చులు మనం అరికట్టాలి ఎటువంటి ఖర్చులు మనం పెట్టాలి అని చెప్పేసి ప్రాపర్ గా ప్లాన్ అని వేసుకుంటే అసలు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవు. అలా కాకుండా ఒకడు సంపాదించడం ఇంకొకళ్ళు ఖర్చు పెట్టడం అయితే మాత్రం ఆ కొంపలో ఖచ్చితంగా గొడవలు అవుతూ ఉంటాయి. అది కూడా నేను సంపాదిస్తే నువ్వు ఖర్చు పెట్టడం ఏంటి అని చెప్పేసి కొన్ని పనికిమాలిన ఆలోచనలు కూడా మన మనసులోకి వస్తాయి. ఎందుకంటే మనం అనే పదాన్ని ఉపయోగించడం వేరు నేను అనే పదాన్ని ఉపయోగించడం వేరు. ఎప్పుడైతే మనం అనే పదాన్ని ఉపయోగిస్తామో ఆ రిలేషన్ ఎలా ఉంటుందో మీకు సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. నేను అనే పదాన్ని ఉపయోగించి మీరు పెళ్లి చేసుకున్నా కూడా మిమ్మల్ని మీరు విడగొట్టుకొని మాట్లాడుకుంటే మాత్రం మీ రిలేషన్ అంత స్ట్రాంగ్ గా అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు. కాబట్టి భార్యా భర్తలు ఇద్దరు కూర్చొని ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే మాత్రం వాళ్ళకి ఆర్థిక వ్యవహారాల్లో గొడవలు అయితే రావు అది మాత్రం కన్ఫర్మ్.
అంతే కాకుండా కొత్తగా పెళ్లైన జంటల్లో కామన్ గా కనిపించే ఒక బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు మితిమీరిన అంచనాలు పెట్టుకోవడం. అలా అంచనాలు పెట్టుకున్న తర్వాత అవి నెరవేరకపోవడం వల్ల కూడా వాళ్ళు అసంతృప్తికి గురవుతారు. అలా గురైన తర్వాత ఏం జరుగుతుందో మీకు నేను సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే నిజ జీవితానికి తగినట్టుగా మీ అంచనాలు పెట్టుకోండి. మనందరం మనుషులం తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పులను అర్థం చేసుకుంటే ఆ బంధం అనేది బలపడుతుంది. అలా కాదు మనం మనుషులం కాదు దేవుళ్ళం అసలు జీవితంలో తప్పే చేయకూడదు తప్పు చేస్తే ఎలా అని చెప్పేసి మిమ్మల్ని మీరు దేవుడిగా ఊహించేసుకొని లేకపోతే దేవతగా ఊహించేసుకొని మీ పార్ట్నర్ ని ఒక మనిషిలా ట్రీట్ చేశారు అనుకోండి. కచ్చితంగా వాళ్ళు మీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వరు మిమ్మల్ని మీరు అద్దంలో ఎలా చూసుకుంటారో మీ పార్ట్నర్స్ ని కూడా అలా చూసుకుంటే మాత్రం కచ్చితంగా వాళ్ళు చేసే తప్పులు చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా మీలాగే మనిషి అని చెప్పేసి మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అంతే అంతకు మించి ఏం లేదు. కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమాకండి అంతే కాకుండా కొత్తగా పెళ్లైన వాళ్ళ జీవితంలో మూడో వ్యక్తుల ప్రభావం కూడా చాలా ఉంటుంది. అంటే అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాకుండా ఇంకొక మనిషి ప్రభావం అనేది వీళ్ళ జీవితంలో చాలా ఉంటుంది మన జీవితంలో కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ వీళ్ళందరూ మనకు అవసరం అయినప్పటికీ వాళ్ళ మాటల ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల కూడా సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మూడో వ్యక్తి మాటలు పట్టించుకోకుండా ఇద్దరు కలిసి తమ నిర్ణయాలు తీసుకోవాలి అవగాహనతో తీసుకునే నిర్ణయాలు కూడా ఆ సంబంధానికి బలాన్ని కలిగిస్తాయి. కానీ ఎప్పుడైతే మీ జీవితంలోకి మూడో వ్యక్తి ఎంటర్ అవుతారో వాడు అనేవాడు మీ జీవితంలో కీ రోల్ ప్లే చేస్తాడో అప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం కూడా బలహీన పడుతూ ఉంటుంది. కాబట్టి ఇద్దరు కూర్చొని చక్కగా మాట్లాడుకొని ఒక డిసిషన్ తీసుకోండి. మీ జీవితంలోకి మరొకరిని ఎంటర్ అవ్వనియమాకండి.
అంతేకాకుండా భార్యా భర్తల మధ్య సంబంధం వీక్ అవ్వడానికి ఇంకో కారణం కూడా ఉంది. అదేంటంటే ఇద్దరు ఒకరికి ఒకరు సరైన సమయాన్ని కేటాయించుకోకపోవడం వల్ల కూడా వాళ్ళ రిలేషన్ అనేది కొంచెం బలహీన పడే అవకాశం ఉంది. ఈ ఉరుకుల పరుకుల జీవితం జీవితంలో కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు ఒకరికి ఒకరు సమయాన్ని కేటాయించుకోవాలి. అలా కేటాయించుకోకుండా ఎవరి జీవితంలో వాళ్ళు బిజీ ఉంటే మాత్రం ఆ రిలేషన్ అనేది వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి పరిష్కారం ఏంటంటే బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ కూడా రోజుకి కనీసం కొంత సమయాన్ని అయినా సరే మీరు ఒకరితో ఒకళ్ళు కేటాయించుకోవాలి. క్వాలిటీ టైం ని స్పెండ్ చేయాలి ఎందుకంటే మనకి డబ్బు ఎంత ముఖ్యమో రిలేషన్ అనేది దానికన్నా ఎక్కువ ముఖ్యం. కాబట్టి మీరు పని సమయానికి ఎంత విలువ ఇస్తారు మీ భాగస్వామికి కూడా అంతే విలువిస్తూ వాళ్ళతో ఒక క్వాలిటీ టైం ని స్పెండ్ చేయాలి. అలా చేయనప్పుడు కూడా భార్యా భర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి క్వాలిటీ టైం ని స్పెండ్ చేయండి.
ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విపరీతమైన అనుమానం కూడా సంబంధాలను కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి అనుమానం అనే విషయాన్ని కొంచెం పక్కన పెట్టి నమ్మకం అనేది సంబంధానికి ప్రాణం లాంటిది ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉండండి. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ రిలేషన్స్ ని బాధ్యతగా పొరపాట్లు జరగకుండా. ఒకవేళ జీవితంలో పొరపాట్లు జరిగినా సరే వాటిని సరిదిద్దుకోవడం ద్వారాగా బంధాలు మరింత బలపడతాయి. అలా కాకుండా చిన్న చిన్న విషయాలకి అనుమానాలు అని చెప్పేసి ఆర్థికంగా ఇబ్బందులు అని చెప్పేసి ఏదో పని చేద్దాం అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి టైం కూడా కేటాయించకుండా ఒకవేళ పని చేసి ఇంటికి వచ్చిన వ్యక్తితో అసలు టైం స్పెండ్ చేయకుండా మీ జీవితం మీరని చెప్పేసి ఏదో బతికేస్తే మాత్రం ఆ పెళ్లికి అసలు అర్థం లేకుండా పోతుంది. కాబట్టి ఏ మనిషి అయినా సరే అతను మనిషి లాగే ఉండాలి తప్ప దేవుడి లాగా బిహేవ్ చేయకూడదు. ఒక తప్పు జరగొచ్చు జరిగితే దాన్ని మనం మనిషి లాగా ట్రీట్ చేయాలి అంతేగాని నేను అసలు జీవితంలో తప్పు చేయను అన్నట్లు బిహేవ్ చేసినా సరే బంధాలు స్ట్రాంగ్ గా ఉండవు.
కాబట్టి ఈ టాపిక్ లో చెప్పిన తప్పులు జరుగుతుంటే మాత్రం వాటిని సరిదిద్దుకోండి జరగట్లేదు అనుకుంటే మాత్రం కచ్చితంగా మీరు ఆనందంగా ఉంటారు అసలు మీకు ఈ టాపిక్ నే అవసరం లేదు. కాబట్టి ఈ తప్పులు జరగకుండా చూడండి కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు దయచేసి ఈ తప్పులకు కొంచెం దూరంగా ఉండండి. ముఖ్యంగా మూడో వ్యక్తిని మీ డిస్కషన్ లోకి రానివ్వమాకండి. డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో కొంచెం తెలుసుకోండి. ఆ రెండు సమస్యలను మీరు కొంచెం ఓవర్ కమ్ చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళని నమ్మకంతో ఉన్నారనుకోండి. ఈ జీవితం అనేది చాలా అందంగా కనిపిస్తుంది. మీకు అంత అందంగా ఉంటుంది కూడా అంతే అంతకు మించి ఏం లేదు. కాబట్టి ప్రశాంతంగా ఈ జీవితాన్ని గడిపేయండి మనం జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికే భూమి మీద పుట్టాము
1 thought on “కొత్తగా పెళ్లైన వాళ్ళు చేసే పొరపాట్లు ఇవే | Avoid These Mistakes After Marriage in Telugu”