నీ లైఫ్ పర్పస్ ఏమిటి – What is the Purpose Of Life in Telugu
ఇవాళ్టి టాపిక్ లో What is the Purpose Of Life in Telugu గురించి తెలుసుకుందాం
ఈరోజు ఈ టాపిక్ లో నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫైండింగ్ యువర్ పర్పస్ (What is the Purpose Of Life in Telugu). ప్రతి ఒక్క మనిషి పుట్టుక వెనుక ఖచ్చితంగా ఒక పర్పస్ ఉంటుంది. కానీ చాలా మందికి ఆ విషయం తెలియదు అనుకోండి కొంతమందికి తెలుసు. కాకపోతే అసలు తెలియని ఆ పర్పస్ ని మనం తెలుసుకోవడం ఎలా అనేది ఈ రోజు మన టాపిక్.
ఇక డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే మామూలుగా ఏ మనిషి అయినా సరే ఈ భూమి మీద పుట్టడానికి ఒక పర్పస్ ఉంటుంది కచ్చితంగా ఉండి తీరుతుంది. కానీ చాలా మంది ఆ విషయం తెలుసుకోరు కొంతమంది అయితే జీవితాంతం ఒక పార్టీ జెండా మోయడానికో లేకపోతే ఒక సినిమా హీరోకి అభిమానిగా ఉండిపోవడానికో ఇంకా ముఖ్యంగా ఒక క్రికెటర్ కి అభిమానిగా ఉండిపోవడానికో వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తారు. ఇక్కడ నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే మనం ఒకళ్ళని అభిమానించడంలో తప్పే లేదు వాళ్ళని చూసి ఇన్స్పైర్ (inspire)అవ్వడం అస్సలు తప్పే లేదు. కానీ వాళ్ళ తరపున జీవితాన్ని పోరాటం చేస్తాం కదా అది చాలా తప్పు. ఒక రాజకీయ నాయకుడిని ఏమన్నా లేకపోతే, ఒక సినిమా హీరోని ఎవరన్నా ఏమన్నా లేకపోతే, ఒక క్రికెటర్ ని ఎవరన్నా తిట్టినా సరే దానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో తిట్టిన వాళ్ళతో ఫైట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే ఇక్కడ మన జీవితం గురించి మనకి సరిగ్గా తెలియదు ఇంకొకళ్ళని ఎవరో తిట్టారని చెప్పేసి మీరు వాళ్ళ కోసం పోరాడటం కొంచెం కామెడీగా ఉంది కదా. నేను చెప్పొచ్చేది అదే నేను ఏమంటున్నాను అంటే మనం ఎవరినైనా సరే అభిమానించొచ్చు వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా జీవితంలో పైకి రావచ్చు. కానీ వాళ్ళ వల్ల మన జీవితంలో కిందకి వెళ్ళిపోవడం అనేది అది ఒక పెద్ద నాన్సెన్స్ అన్నమాట.
ఫస్ట్ అఫ్ ఆల్ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఈ భూమి మీద పుడటానికి కచ్చితంగా ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ని మీరు తెలుసుకోవాలంటే ముందు మీ గురించి మీరు ఆలోచించుకోవాలి అంటే. ఉదయాన్నే నిద్ర లేగటం ఏదో ఒక పని చేసుకోవడం సాయంత్రం నిద్రపోవడం కాకుండా అసలు మనకి ఏ పని అంటే ఇష్టం మనం అసలు ఎందుకు ఆ పని చేస్తున్నామో ఆ పని చేయడం వల్ల మనకు ఉపయోగం ఉందా లేదా అని చెప్పేసి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. అలా క్వశ్చన్ చేసుకోవడం వల్ల ముందు అవతల వాళ్ళ కోసం మనం జీవించడం మానేసి మన కోసం మనం జీవించడం మొదలు పెడతాం. అలా జీవించడం వల్ల మీ ఇన్నర్ ప్యాషన్ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇన్నర్ ప్యాషన్ అంటే ఏంటి మీ అభిరుచులు ఏంటి మీకు ఏ వృత్తి అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది మీకు తెలియకుండా మీలో ఉన్న టాలెంట్ ఏంటి అని చెప్పేసి రకరకాలుగా మీ గురించి మీకు తెలుస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే అసలు మీకంటూ ఉన్న ఒక లక్ష్యం అనేది మీకు ఆ రోజే ఖచ్చితంగా తెలుస్తుంది. అలా తెలిసిన తర్వాత ఏముంది తప్పకుండా మీరు మీ లక్ష్యం కోసం పోరాడుతూ ఉంటారు.
నిజం చెప్పాలంటే అసలు వాళ్ళ జీవిత లక్ష్యం ఏంటో వాళ్ళకే తెలియకుండా చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పొచ్చేది ఏంటంటే మీ లక్ష్యం ఏంటో మీరు తెలుసుకోండి. అలా తెలుసుకున్నాక కూడా నేను రాజకీయ నాయకుడిని అవ్వాలనుకుంటే కచ్చితంగా రాజకీయాల్లో ఉండండి నేను నటుడు అవ్వాలనుకుంటే సినిమా రంగంలో ట్రై చేయండి నేను మంచి క్రికెటర్ అవ్వాలనుకుంటే క్రికెట్ రోజు ఆడుతూ మీ టాలెంట్ ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. అది కూడా 30 సంవత్సరాలు గడిచిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అయ్యో నా లక్ష్యం ఇది కాదే అని మళ్ళీ మీరు రీస్టార్ట్ చేస్తా అన్నా కూడా మీ జీవితం మళ్ళీ రీస్టార్ట్ అవ్వదు. ఎందుకంటే ఏ మనిషికైనా కేవలం ఈ భూమి మీద కొన్ని సంవత్సరాలు మాత్రమే టైం ఉంది. కాబట్టి ప్రాపర్ గా మీ జీవిత లక్ష్యాన్ని మీరే ఫైండ్ అవుట్ చేసుకోండి. సరే నాకంటూ ఒక లక్ష్యం ఉంది నేను నా లక్ష్యాన్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఏంటి అంటే కచ్చితంగా మనకంటూ ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఆ లక్ష్యం కోసం మనం పని చేస్తున్నప్పుడు ఫస్ట్ మనకి డౌట్స్ అనేవి వస్తాయి. ఆ తర్వాత భయాలు కూడా ఉంటాయి అంటే డౌట్స్ అలాగే ఫియర్ ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే మనకి ఒక పని జరగక ముందే దాని గురించి ఇది జరగకపోతే అనే భయం ఉంటుంది. అంతే కాకుండా ఈ రంగంలో మనం అసలు రాణించగలమా లేదా అని చెప్పేసి ఒక డౌట్ కూడా ఉంటుంది. వాటికి నేను చెప్పొచ్చే సమాధానం ఏంటంటే మనం ఒక విషయాన్ని ముందుగానే మన మైండ్ లో విజువలైజ్ చేసుకుంటే అదే మనకు కనిపిస్తుంది. నేను ఆ వృత్తిలో గెలుస్తాను నాకు నమ్మకం ఉందనుకుంటే అలాగే ఉంటుంది లేదు నా మీద నాకు కొంచెం డౌట్ గా ఉందని చెప్పేసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని మాట్లాడటం వల్ల లేకపోతే మీ గురించి మీరు తక్కువగా ఊహించుకోవడం వల్ల మీలో భయాలు మొదలైపోతాయి డౌట్లు మొదలైపోతాయి మీరు విజయం సాధించడానికి చాలా అవకాశాలు తగ్గిపోతాయి. నేను చెప్పొచ్చేది ఏంటంటే కచ్చితంగా డౌట్లు ఉంటాయి భయాలు ఉంటాయి వాటిని కూడా ఎదుర్కొని మీ మీద మీరు నమ్మకం ఎక్కువ పెట్టుకొని మీ జీవితంలో మీరు అనుకునే లక్ష్యం కోసం మీరు పోరాడండి తప్పకుండా ఆ లక్ష్యాన్ని చేతిస్తారు.
అదండి సంగతి నేను చెప్పవచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఒక అభిమానించే రాజకీయ నాయకుడు ఉంటాడు ఆయనకు ఓటు వేయడం వల్ల కచ్చితంగా మన జీవితంలో మార్పులు వస్తాయి. అంతే కాకుండా అప్పుడప్పుడు ఫ్యామిలీ తో కలిసి చక్కగా ఒక సినిమా చూడొచ్చు ఆ సినిమా హీరో అంటే మీకు ఇష్టం ఉండొచ్చు ఇంకా ముఖ్యంగా ఫ్రెండ్స్ అందరితో కలిసి సరదాగా క్రికెట్ ఆడుకోవచ్చు. కానీ వాటి వల్ల మన జీవితాలు మారిపోయి వాటి కోసమే మన జీవితం అన్నట్లు మనం జీవించడం మాత్రం నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే మన జీవితం కోసం ఇంకొకడు జీవితం అయితే త్యాగం చేయరు. ఎందుకంటే మన మన కోసం మన జీవితం మాత్రమే త్యాగం చేయాలి. నేను చెప్పవచ్చేది ఏంటంటే మీ జీవితం యొక్క పర్పస్ ని మీరు తెలుసుకోండి. అలా తెలుసుకోవడం వల్ల మీలో ఉన్న ఆ టాలెంట్ అనేది బయట పడుతుంది. అది బయట పడటం వల్ల కచ్చితంగా మీకంటూ ఒక లక్ష్యం ఏర్పడుతుంది ఆ లక్ష్యాన్ని సేవిధించే క్రమంలో మీకు చాలా ఒడిదుడుకులు ఎదురవుతాయి. అంతేకాకుండా మీరు వాటిని గనక తట్టుకోగలిగితే కచ్చితంగా మీ జీవిత లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు. అలా చేరుకున్న తర్వాత ఇంకేముంది ఈ జీవితానికి ఒక సార్ధకత అనేది ఉంటుంది. కాబట్టి మీ జీవితాన్ని అస్సలు వృధా చేసుకోకండి అది కూడా మీకు ఉపయోగం లేని వాళ్ళ గురించి మీ జీవితాన్ని ఇన్ఫ్లూయన్స్ (influence)చేయని వాళ్ళ గురించి అసలు మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. దయచేసి మీ జీవితం యొక్క పర్పస్ ని మీరు వెతుక్కోండి. బాయ్ ఈ టాపిక్ గనుక మీకు నచ్చితే నచ్చితేనే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికి మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.