భయపడుతూ ఎన్నాళ్లు బ్రతుకుతావు – How to Stop Worrying in Telugu
ఇవాళ్టి టాపిక్ లో How to Stop Worrying in Telugu గురించి తెలుసుకుందాం.
భయపడుతూ కూర్చుంటే బ్రతకలేము
ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిలో ఉండే కామన్ ఎమోషన్ భయం. కాకపోతే ఆ భయాన్ని అడ్డుపెట్టుకొని చాలా మంది జీవితంలో డెవలప్ అవుతూ ఉంటారు అదే భయం వల్ల ఎంత టాలెంట్ ఉన్నా సరే చాలా మంది జీవితంలో ముందడుగులేకపోతూ ఉంటారు. ఈరోజు మన టాపిక్ అదే భయంలో ఉండే ఒక ఫిలాసఫీని మీకు నేను పరిచయం చేస్తాను
ఇంక డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ ఫస్ట్ అఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఆ భయాన్ని సరిగ్గా అర్థం చేసుకోరు. మామూలుగా భయం అంటే ఏంటి మన జీవితంలో ఖచ్చితంగా జరగాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. కాకపోతే అది అవుతుందా లేదా అని చెప్పేసి మనలో మనకు తెలియని కొన్ని భయాలు ఉంటాయి వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లాజిక్ లేని భయాలు మనలో చాలా ఉంటాయి లాజికల్ గా ఉండే భయాలు మనలో కొన్ని ఉంటాయి. కాసేపు లాజిక్ లేని భయాల గురించి మాట్లాడుకుంటే మనం ఏంటి అసలు జరగని దాని గురించి ఆలోచించుకొని భయపడిపోతూ ఉంటాం అన్నమాట. ఉదాహరణ మనకి మరుసరి రోజు ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఉందనుకుందాం. ఆ ఫుట్బాల్ మ్యాచ్ లో అపోజిట్ టీం వాళ్ళు మనకన్నా స్ట్రాంగ్ మనకన్నా బాగా ఎక్కువ మ్యాచ్లు గెలిచారు అని చెప్పేసి మనం వాళ్ళ మీద ఓడిపోతాం అని చెప్పేసి మనలో మనకి తెలియని ఒక భయాన్ని క్రియేట్ చేసుకొని అసలు మ్యాచ్ ఆడక ముందే మనం ఓడిపోయాం అని చెప్పేసి మనకు తెలియకుండా మనకి చెప్పుకుంటూ ఉంటాము. అసలు నిజం చెప్పాలంటే మీరు వాళ్ళతో ఆడితేనే కదా మీరు గెలుస్తారో ఓడిపోతారో తెలిసేది అలా కాకుండా ముందుగానే ఓడిపోయినట్టు మీకు మీరు ఊహించుకొని మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడాన్నే అర్థం పర్థం లేని భయానికి లోనవ్వడం అంటారు. కాకపోతే ప్రతి మనిషిలో కొన్ని లాజికల్ భయాలు ఉంటాయి అన్నమాట వాటి వల్ల మనకి ఉపయోగం తప్ప నిరుపయోగం అయితే లేదు.
దీనికి ఇంకో ఉదాహరణ చెప్తాను మామూలుగా మనకి ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం బాగా వచ్చు అయినా సరే ఆపోజిట్ టీమ్ ఇంకా స్ట్రాంగ్ గా ఉందనుకోండి మనకి ఇంకో 30 రోజులు టైం ఉందనుకోండి. వాళ్ళు ఎలా ఆడతారు వాళ్ళని మనం ఓడించాలంటే ఏం చేయాలి అని చెప్పేసి ప్రాపర్ ప్లాన్ వేసుకొని ఈ 30 రోజులు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళని ఓడించడం పెద్ద విషయం కాదని చెప్పేసి మీకే అర్థమవుతుంది. అంతేకాకుండా విపరీతంగా ప్రాక్టీస్ చేసేలా చేస్తుంది ఆ భయం అనేది ఎందుకంటే మీరు ఓడిపోకూడదు అంటే కచ్చితంగా విపరీతమైన ప్రాక్టీస్ చేయాలి ఆ టీం ని మీరు ఓడించాలి. అంతే ఇలా భయాలు ఉండటం వల్ల కొన్ని ప్లస్ లు ఉన్నాయి కొన్ని మైనస్ లు ఉన్నాయి. కాబట్టి మీనింగ్ లెస్ భయాలతో మీరు వణికి పోవాల్సిన అవసరం లేదు ఇంకా ముఖ్యంగా మీ వ్యక్తిగత ఎదుగుదలకి మీకు ఉపయోగపడేదే భయం. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క విషయంలో భయపడుతూనే ఉంటాము. ఉదాహరణకి సైకిల్ తొక్కడం అవ్వచ్చు, అయ్యో కింద పడిపోతాను అని చెప్పేసి భయపడతాను. ఆ తర్వాత బైక్ నడవడం అవ్వచ్చు లేకపోతే మనం కొంచెం పెద్దయిన తర్వాత ఒంటరిగా ప్రయాణం చేయడం అవ్వచ్చు. ఎందుకంటే అప్పటివరకు అమ్మా నాన్నలతో ప్రయాణం చేసిన మనం సడన్ గా ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు కొంచెం మనకి భయంగా ఉంటుంది. కాకపోతే మనం ఆ భయాన్ని మనకు మనంగా పోగొట్టుకోవాలి తప్ప మనం భయపడుతూ కూర్చుంటే జీవితంలో అస్సలు ముందుకు వెళ్లలేము అలా చెప్పుకుంటూ పోతే మనం భయపడకుండా చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. కాకపోతే అందరినీ చూసి ఎవరెవరు ఏ టైం లో ఏం చేస్తున్నారు వాళ్ళ జీవితం జీవితంలో గొప్ప గొప్ప వాళ్ళు ఎలా అయ్యారు అని చెప్పేసి వాళ్ళ గురించి మనం తెలుసుకున్నప్పుడు మన జీవితంలో మనకు కొంచెం భయం అనిపించినప్పుడు ఆ విషయాల్ని కాస్త నెమరవేసుకుంటే మనకి ఆ భయం పోయి మనలో మనకి తెలియని ఒక ఎనర్జీ వచ్చేసి మనం కూడా ఆ భయాన్ని దాటుకొని ముందుకు వచ్చేస్తాము ఇది పెద్ద విషయం ఏం కాదు. అలాగే ప్రతి ఒక్క విషయానికి అంతే తప్ప మనం భయపడిపోయి అక్కడే ఆగిపోతే మాత్రం కచ్చితంగా మనమే వెనుకుంటాము.
నేను ఓవరాల్ గా చెప్పవచ్చేది ఏంటంటే ఈ భూమి మీద మనం ఏది కొత్తగా చేయట్లేదు ఆల్రెడీ మన పూర్వీ మన పెద్దవాళ్ళు చేసుకుంటూ వచ్చిన పనులే మనం చేస్తున్నాము. ఉదాహరణకి చదువుకోవడం అనుకోండి చదువుకోవడంలో కూడా చాలా భయాలు ఉంటాయి. అంతేకాకుండా ఉద్యోగం తెచ్చుకోవడం అనుకోండి ఉద్యోగం తెచ్చుకోవడంలో కూడా చాలా భయాలు ఉంటాయి మనకన్నా ముందు జనరేషన్ ఏం చేశారు. జీవితంలో గొప్ప గొప్ప వాళ్ళు ఇంతకు ముందు ఎలా చదివారు వాళ్ళు ఎలా ఉద్యోగం తెచ్చుకున్నారు ఒకవేళ ఉద్యోగం రాకపోతే వాళ్ళు జీవితంలో ఏం చేసి సక్సెస్ అయ్యారు అని చెప్పేసి మనకి చాలా రిఫరెన్స్ లు ఉంటాయి మనం ఆ మాత్రం దానికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి భయం అనేది మనం సక్సెస్ అవ్వడానికి ఒక టూల్ ఉపయోగించుకోలే తప్ప భయపడుతూ కూర్చుంటే మాత్రం అస్సలు పనులు అవ్వవు. అంతేకాకుండా అర్థం పర్థం లేని భయాలతో ఉక్కిరి బిక్కిరి అయితే మాత్రం మిమ్మల్ని ఎవ్వడు ఏం చేయలేడు. కాబట్టి భయాన్ని ఒక టూల్ గా వాడుకోండి మీ జీవితంలో మీరు సక్సెస్ అవ్వండి. మీనింగ్ లెస్ భయాలతో మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకోమాకండి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రశ్నకి ఒక సమాధానం ఉంటుంది ఆ సమాధానం మీ అంతట మీరే వెతుక్కోవాలి మీ కోసం ఇంకొకళ్ళు ఎవరు వచ్చి వెతికి పెట్టరు. కాబట్టి భయాన్ని ఒక టూల్ గా వాడుకొని మీరు మీ జీవితంలో సక్సెస్ అవ్వాలి.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.