సెల్ ఫోన్ వల్ల నష్టాలు – Mobile Addiction in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Mobile Addiction in Telugu గురించి తెలుసుకుందాం.
మొబైల్ వలన అనుమానం మొదలవుతుంది
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మొబైల్ అడిక్షన్ వల్ల రిలేషన్షిప్స్ అనేవి డామేజ్ అవుతున్నాయి. కాకపోతే ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఆ రిలేషన్షిప్ అనేది డామేజ్ అవుతున్న సంగతి వాళ్ళకి కూడా తెలియదు. ఆ రేంజ్ లో వాళ్ళు మొబైల్ కి అడిక్ట్ అయిపోయారు. మీకు డౌట్ రావచ్చు మొబైల్ కి అడిక్ట్ అయితే మానవ సంబంధాలు ఎలా డామేజ్ అవుతాయి అదైనా పెద్ద తప్పా ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది కదా అందులో తప్పేముంది అనే డౌట్ మీకు రావచ్చు. ఈరోజు మన టాపిక్ కూడా అదే మామూలుగా మొబైల్ వల్ల మానవ సంబంధాలు ఎలా డామేజ్ అవుతుంది అనేదే ఈరోజు మన టాపిక్.
Communication
ఇంక డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే ఫస్ట్ అఫ్ ఆల్ మొబైల్ అడిక్షన్ వల్ల కమ్యూనికేషన్ కి చాలా ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. ఉదాహరణకి మామూలుగా మనం ఫోన్ తీసుకొని మనకి నచ్చిన వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాం అది పెద్ద తప్పు కూడా కాదు. కాకపోతే మనల్ని ఇష్టపడే వాళ్ళకి ఆ క్షణంలో మనం దూరం అవుతున్నాం కదా అది కూడా ఒక పాయింట్ ఉంది కదా. మనం ఎక్కువ వేరే వాళ్ళతో ఫోన్ లో మాట్లాడటం వల్ల ఇంట్లో వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వీడేంటి పక్కన మనుషులు పెట్టుకొని ఎప్పుడు చూసినా ఫోన్లు మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ కలగొచ్చు. లేకపోతే అసలు ఫోనే మాట్లాడకుండా 24 అవర్స్ మనం సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేయడం వల్ల కమ్యూనికేషన్ అనేది మామూలుగా డామేజ్ అవ్వదు ఒక రేంజ్ లో డామేజ్ అవుతుంది. ఇవాళ రేపు ఎవరికన్నా బాధ వచ్చినా ఆనందం వచ్చినా దాన్ని స్టేటస్ లో పెట్టుకొని సంతోష పడుతున్నారు తప్ప కుటుంబ సభ్యులతో చెప్పుకోను లేకపోతే మనం ఇష్టపడే వాళ్ళతో ఆ విషయాన్ని షేర్ చేసుకొని అది కూడా డైరెక్ట్ గా మొబైల్ లో కాదు వాళ్ళతో ఆనందంగా టైం స్పెండ్ చేయకుండా కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఎన్ని లైకులు వచ్చినాయి లేకపోతే, whatsapp స్టేటస్ లో ఎంతమంది దాన్ని చూశారు అని చెప్పేసి ఆ నెంబర్ కౌంట్ తో వాళ్ళు ఆనంద పడుతున్నారే తప్ప మనుషులకి కనెక్ట్ అవ్వడం మర్చిపోయారు కేవలం సెల్ ఫోన్ కి మాత్రమే కనెక్ట్ అయి ఉంటున్నారు.
Quality Time
ఇక్కడ ఇంకో హైలైట్ అయిన విషయం ఏంటంటే క్వాలిటీ టైం ని కేవలం మొబైల్ కే పరిమితం చేస్తున్నారు కుటుంబ సభ్యులతో కూర్చొని సరదాగా భోం చేయడం కానీ వాళ్ళతో మాట్లాడుకోవడం. అంతే కాకుండా జీవితంలో నేను ఏం చేస్తున్నాను నువ్వు ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి పెద్దవాళ్ళని అడిగి సలహా తీసుకోవడం మానేశారు కేవలం ఇన్ఫర్మేషన్ మొత్తం సెల్ ఫోన్ లోనే దొరుకుతుంది అన్నట్లు మొబైల్ మీద ఆధారపడి బతకడం స్టార్ట్ చేశారు.
Jealousy
అంతేకాకుండా సోషల్ మీడియాలో జెలస్ అనేది ఎక్కువగా రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. మామూలుగా అందరం ఏమనుకుంటాం మనం ఒక కొత్త ఐఫోన్ కొనుక్కొని సోషల్ మీడియాలో ఫోటో అప్లోడ్ చేస్తే అందరూ దానికి లైక్లు కొడతారు కామెంట్లు చేస్తారు అంతా బాగానే ఉంటుంది. కాకపోతే దీంట్లో ఇంకొక యాంగిల్ ఉంది వీడికే ఉందని బిల్డప్ అని చెప్పేసి ఇంకొంతమంది ఉంటారు అది బయటికి చూపించారు అనుకోండి మీ మీద చాలా మంది అసూయతో రగిలిపోతూ ఉంటారు దాన్ని బయట పెట్టరు. కానీ మీ ఎదుగుదలని ఎలాగైనా తొక్కాలని చెప్పేసి మీ చుట్టూ ఉండే వాళ్ళకి మీ మీద అసూయ మొదలైపోతుంది అది కూడా మానవ సంబంధాన్ని చాలా దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఫ్రెండ్షిప్ చేయటానికే సోషల్ మీడియా ఉండేది కానీ ఇప్పుడు షో చేయడానికి సోషల్ మీడియాని చాలా మంది బాగా యూస్ చేసుకుంటున్నారు అసలు సోషల్ మీడియాని ఎందుకు యూస్ చేయాలో తెలియక పాపం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ దగ్గర ఏదైనా ఉండొచ్చు దాన్ని సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా ముఖ్యంగా మనకంటూ పర్సనల్ లైఫ్ కొంత ఉండాలి అలా కాకుండా ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల మీకు తెలియకుండా మీరు శత్రువులని పోగేసుకున్నట్లే. ఎందుకంటే నేను అది కొన్నాను ఇది కొన్నాను అని చెప్పేసి మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల మిమ్మల్ని అభిమానించే వాళ్ళ ముసుగులో మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. నిజం చెప్పాలంటే మీ పతనాన్ని కోరుకునే వాళ్ళు మీ చుట్టూ నవ్వుతూ తిరుగుతూ ఉంటారు. అంతే కాకుండా మనం సెల్ ఫోన్ ఎక్కువ యూస్ చేస్తూ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ కుండా చుట్టాల మధ్య కూర్చున్న కూడా మాట్లాడకుండా ఉండటం వల్ల వాళ్ళకి కూడా డౌట్ వస్తుంది. టీనేజర్ అయితే ఎవరినైనా లవ్ చేస్తున్నాడేమో అనుకుంటారు, ఒకవేళ పెళ్లి అయిన వాడు అనుకో వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉన్నాడేమో అని డౌట్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే వాల్యూబుల్ టైం మొత్తం మన కుటుంబ సభ్యులకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నప్పుడు కచ్చితంగా ఇలాంటి డౌట్లే వస్తాయి ఇలా చాలా అనర్థాలు జరుగుతూ ఉంటాయి.
Health
ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మనకి మొబైల్ వల్ల జరిగే అతి భయంకరమైన డామేజ్ ఏంటంటే హెల్త్ అన్నమాట. చాలా మంది సోషల్ మీడియాని నైట్ టైం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు మనం ఒక ట్రాప్ లో పడిపోయి ఆ రీల్స్ కి షాట్స్ కి ఎడిక్ట్ అయిపోయి సాయంత్రం పూట కనక సెల్ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోతే చాలా లేట్ గా నిద్రపోతాము. కాకపోతే పొద్దున్నే పనికి వెళ్ళాలి లేకపోతే చదువుకోవాలి కాబట్టి ఎర్లీగా నిద్ర లేస్తాము అలాగా రోజుకి చాలా తక్కువ సమయం నిద్రపోవడం వల్ల మీకు తెలియకుండా మీ ఆరోగ్యాన్ని మీరు చాలా డామేజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అంతేకాకుండా చాలా ఎర్లీగా రోగాల బారిన పడతారు ఆ తర్వాత జీవితాంతం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండాలనుకోండి అది తర్వాత సంగతి. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోండి కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేయండి వాళ్ళతో ఎక్కువ సేపు మాట్లాడండి సోషల్ మీడియా చూడొచ్చు కాదనట్లేదు కాకపోతే దానికి ఎడిక్ట్ అవ్వకూడదు. ఎంత సమయం మనం సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తున్నాము, ఎంత సమయం కుటుంబ సభ్యులతో ఉంటున్నాము అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా అవసరము. ఎందుకంటే మందు సిగరెట్ అనేది బ్యాడ్ హ్యాబిట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మొబైల్ కి ఎడిక్ట్ అవ్వడం అనేది దానికి మించిన డేంజర్ అలవాటు అనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. కాబట్టి మొబైల్ ని ఎలా వాడాలో అలాగే వాడండి దానికి అస్సలు మీరు ఎడిక్ట్ అవ్వకండి. ఎందుకంటే జీవితాలే పోతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి మీ మొబైల్ తో అంతేనండి అంతకు మించి ఏం లేదు మొబైల్ ని మొబైల్ లో వాడండి.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.