మీ విలువను ఎలా పెంచుకోవాలి – How To Increase Your Value in Telugu
ఇవాళ్టి టాపిక్ లో How To Increase Your Value in Telugu గురించి తెలుసుకుందాం
మీ విలువను పెంచుకోవడానికి ఈ 3 చిట్కాలు పాటించండి
మామూలుగా ఏ మనిషి అయినా సరే ఈ సమాజంలో విలువగా బతకాలి 10 మందిలో కొంచెం గౌరవంగా ఉండాలని చెప్పేసి అందరూ అనుకుంటారు. కాకపోతే అసలు నిజంగా మనం విలువగా బతుకుతున్నామా లేకపోతే అందరూ మనకు విలువిస్తున్నారా అనేది ఒక పెద్ద ప్రశ్న అన్నమాట ఈరోజు మన టాపిక్ కూడా అదే.
మీ విలువని పెంచే పనులు మీరు చేస్తున్నారా
ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే ఫస్ట్ అఫ్ ఆల్ మీకు మీ చుట్టుపక్కల వాళ్ళు విలువిస్తున్నారా లేదా అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే మీ విలువను పెంచే పనులు మీరు చేస్తున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవతల వాడిని మనం మనం నిందించడం కన్నా మన తప్పులు మనం తెలుసుకొని మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు కూడా కరెక్ట్ అయిపోతారు. కాబట్టి నేనేమంటానంటే అవతలి వాళ్ళు మనకు విలువ ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని కొంచెం పక్కన పెట్టి మీ విలువ పెంచుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ విలువ పెంచుకోవడానికి నేను చెప్పే ఈ మూడు మార్గాలను గనక ఫాలో చేస్తే మీరు ఆటోమేటిక్ గా మీకు మీరు విలువ ఇచ్చుకున్నట్టే.
INVEST IN YOURSELF
ఫస్ట్ అఫ్ ఆల్ మీకు మీరు విలువ పెంచుకోవడానికి మీరు ఫాలో అవ్వాల్సిన మొట్టమొదటి మార్గం ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. మామూలుగా మనం ఏంటి ఏ బిజినెస్ లో అయినా సరే కొంచెం డబ్బుని ఇన్వెస్ట్ చేస్తాం లేకపోతే కొంత సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తాం అంతకు మించి ఏం చేయం. కానీ నేనేమంటానంటే మీకు విలువ పెరగాలంటే మిమ్మల్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా మీ ఊర్లో అందరూ చదువుకొని చక్కగా ఉద్యోగాలు చేస్తున్నారు అనుకోండి మీరు కూడా వాళ్ళతో పాటు వెళ్తే మిమ్మల్ని మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టు కాదు మీరు కూడా నలుగురిలో నారాయణ లాగా వెళ్తున్నట్టు. కానీ మీకంటూ కొన్ని అభిరుచులు ఉంటాయి మీకంటూ కొన్ని జీవిత లక్ష్యాలు ఉంటాయి. వాటి కోసం మిమ్మల్ని మీరు ఇన్వెస్ట్ చేయటం అంటే మిమ్మల్ని మీరు పెట్టుబడిగా పెట్టడం అనేది మీకు ఖచ్చితంగా విలువని పెంచుతుంది. ఎందుకంటే మనం ఒక స్కూల్లో చదువుకొని కాలేజీ కి వెళ్లి చదువుకొని ఆ తర్వాత ఒక చిన్నపాటి ఉద్యోగం తెచ్చుకుంటే విలువ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ మన జీవిత లక్ష్యం కోసం మనం పోరాడుతూ చివరగా దాంట్లో మనం సక్సెస్ అయితే మనకి ఈ సమాజం ఎలాంటి విలువ ఇస్తుందో నేను సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు అనుకోండి.
BUILD STRONG RELATIONSHIPS
ఇంకా మీ విలువను పెంచే రెండో మార్గం ఏంటంటే బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్. మామూలుగా మనం చాలా మందితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం చాలా మందితో పరిచయాలు పెంచుకుంటూ ఉంటాం అలా కాకుండా స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ అనేవి ఏర్పాటు చేసుకోవాలి. స్ట్రాంగ్ అంటే నీతో పని ఉండి నీ చుట్టూ తిరిగే వాళ్ళతో కాకుండా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాని కోసం పోరాడే వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. ఒకవేళ మీరు మీ జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నారు అనుకోండి మీతో రిలేషన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుగుతారు కదా. అప్పుడు మీకు మీ జీవిత లక్ష్యాన్ని వాళ్ళు గుర్తు చేస్తారు అరే మన పక్కన ఉన్నోడు బాగుపడిపోతున్నాడే మన పక్కన ఉన్నోడు వాడి జీవిత లక్ష్యాన్ని చేరుకున్నాడే మనం ఏంటి ఇలా మిగిలిపోయాం అని చెప్పేసి మనలో మనకు తెలియని ఒక గిల్టీ ఫీలింగ్ మొదలవుతుంది. అలా కాకుండా ఎప్పుడు మీతో కూర్చొని సిట్టింగ్ వేసేవాడితోనో లేకపోతే మీతో కలిసి బైక్ మీద ఊరంతా తిరిగే వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయడం వల్ల మీ లక్ష్యాన్ని మీరు మర్చిపోవడమే కాకుండా అసలు మీకు లక్ష్యమే లేకుండా వాళ్ళు చేస్తారు. నేను ఏమంటానంటే ప్రతి ఒక్క మనిషి మంచోడే కానీ అందరికీ జీవిత లక్ష్యాలు ఉండవు అందరూ వారి వారి లక్ష్యాల కోసం జీవితాన్ని త్యాగం చేయరు. కాబట్టి మీరు ఎవరితో అయితే రిలేషన్ మెయింటైన్ చేస్తారో వాళ్ళని ప్రాపర్ గా అబ్సర్వ్ చేయండి వాళ్ళ జీవిత లక్ష్యం కోసం వాళ్ళు పోరాడుతారు చూసారా వాళ్ళతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేయండి. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల వాళ్ళని చూసి మనం ఇంకా జీవితంలో కొన్ని నేర్చుకుంటూ ఉంటాము. ఒకవేళ మనం తప్పటడుగు లేసినా సరే వాళ్ళు వాటిని కరెక్ట్ చేసి మన జీవితంలో మనం ఎదగడానికి ఉపయోగపడతారు.
DELIVER EXCEPTIONAL VALUE
ఇంకా మీ విలువ పెరగడానికి మీకు నేను చెప్పే మూడో మార్గం ఏంటంటే డెలివర్ ఎక్సెప్షనల్ వాల్యూ. మామూలుగా మనం ఏ పని చేసినా సరే కొన్ని కొన్ని సార్లు చిరాకు పడుతూ ఉంటాం కొన్ని కొన్ని సార్లు మాత్రం చాలా ఉత్సాహంతో పని చేస్తూ ఉంటాము. నేను అబ్సర్వ్ చేసింది చాలా మందిలో ఏంటంటే మనం ఏదైనా ఉద్యోగానికి వెళ్ళాం అనుకోండి 9 to 6 ఉద్యోగమే అనుకుందాం కానీ ఎప్పుడు 6 అవుతుందా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాము మన మొహంలో ఆ ప్రేతకాల కనిపిస్తుంది. దాంతో మనకు పని ఇచ్చిన వాళ్ళు అంతేకాకుండా మన పై అధికారులు వీడేంట్రా బాబు ఎప్పుడు చూసినా ఉసురు మొహం వేసుకొని కూర్చుంటాడు అని చెప్పేసి మనల్ని వాళ్ళు చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. మనం కూడా మన ఉద్యోగం మీద కాన్సంట్రేట్ చేయలేకపోతాం అలా చేయనప్పుడు పై అధికారులు మనల్ని ఖచ్చితంగా తిడతారు. కానీ మనకు ఒక పని ఇష్టం ఉండి ఆ పనికి కొంచెం వాల్యూ ఎక్స్టెన్షన్ చేసి ఎంతో ఇష్టంగా నవ్వుతూ చాలా చక్కగా పని చేసినప్పుడు మన పై అధికారులు ఎలా ఫీల్ అవుతారు లేకపోతే మనకు పని సినిమాలు ఎలా ఫీల్ అవుతారు. దీన్ని బట్టి నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఏ పని చేసినా సరే ఎక్సెప్షనల్ వాల్యూ అనేది దానికి ఇవ్వాలి చాలా ఇష్టంగా పని చేయాలి. అలా చేయటం వల్ల మనం ఏ రంగంలో పని చేస్తున్నా సరే అక్కడ మనకంటూ ఒక విలువ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఆ పని ఇచ్చిన వాళ్ళు మనల్ని చాలా విలువగా చూస్తారు అలా ప్రతి పనిలో మనం ఇంట్రెస్ట్ గా పని చేయడం వల్ల మనకి ఆ పని ఇచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఫలానా వాడు ఆ పని చేస్తాడురా బాబు మామూలుగా చేయడు అని చెప్పేసి మనకి లేని విలువని యాడ్ చేస్తారు.
ఇంకొకసారి షార్ట్ గా చెప్తాను మీకు విలువని పెంచే మొదటి మార్గం. మిమ్మల్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలండి మీ జీవిత లక్ష్యం కోసం పోరాడాలి మీరు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి ఫైనల్ గా మీ జీవిత లక్ష్యాన్ని మీరు రీచ్ అవ్వాలి అలా అవ్వటం వల్ల ఈ సమాజం మీకు వద్దన్న విలువని ఇస్తుంది. ఇక మీకు విలువని పెంచే రెండో మార్గం ఏంటంటే స్ట్రాంగ్ రిలేషన్షిప్ ని బిల్ట్ చేసుకోవాలి. మనం దారి తప్పిన మనల్ని దారిలో పెట్టే వాళ్ళు మన చుట్టూ ఉండటం వల్ల మనం ఖచ్చితంగా దారిలో ఉంటాం. ఇక మూడో మార్గం ఏంటంటే మీరు ఏ పని చేసినా సరే మనస్ఫూర్తిగా పని చేయాలి చాలా ఇష్టంగా పని చేయాలి అలా చేయటం వల్ల ఆ పని మనకి ఇచ్చిన వల్ల అవ్వచ్చు లేకపోతే ఆ పని మనం చేయటం వల్ల అవ్వచ్చు ఆ పనికి ఒక అందం వస్తుంది అక్కడ మనదంటూ ఒక సిగ్నేచర్ ఉంటుంది. దాని వల్ల కూడా విలువ పెరుగుతుంది.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.