జీవితంలో గొప్పగా ఎదగాలి అంటే – Jeevitham lo adagali ante
ఇవాళ్టి టాపిక్ లో Jeevitham lo adagali ante గురించి తెలుసుకుందాం.
గొప్పగా ఎదగాలి అంటే కొన్ని త్యాగాలు చేయాలి
ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషికైనా తనకంటూ జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది. కొంతమంది పెద్ద లక్ష్యాలు ఉంటాయి, కొంతమంది చిన్న లక్ష్యాలు ఉంటాయి చిన్న చిన్న లక్ష్యాలు అనుకోండి కొన్ని రోజుల్లో తీరిపోతాయి. కానీ పెద్ద పెద్ద లక్ష్యాలు ఎప్పటికి తీరుతాయో ఎప్పుడు తీరుతాయో ఎవరికీ తెలియదు అలాంటి పెద్ద పెద్ద లక్ష్యాల్ని మన జీవితంలో మనం అచీవ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ఆ విషయం చాలా మందికి తెలియదు. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ కూడా అదే బేసికల్ గా మన జీవితంలో పెట్టుకున్న పెద్ద పెద్ద లక్ష్యాల్ని మనం ఎలా అచీవ్ చేయాలి. అచీవ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అనే టాపిక్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం.
ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే మన జీవితంలో మనకున్న పెద్ద పెద్ద లక్ష్యాలని మనం అచీవ్ చేయడానికి ఫస్ట్ అఫ్ ఆల్ మనకంటూ ఒక క్లియర్ గోల్ ఉండాలి. బేసికల్ గా చాలా మందికి చాలా లక్ష్యాలు ఉంటాయి కాకపోతే అందులో మనం క్లియర్ కట్ గా దేని మీద ఫోకస్ చేయాలో మనకు తెలియదు అన్నమాట. అందుకే నేను చెప్పవచ్చేది ఏంటంటే క్లియర్ గా గోల్ ఉండాలి. ఉదాహరణకి ఫస్ట్ అఫ్ ఆల్ మనం ఈ భూమి మీద సర్వే అవ్వడానికి కొంత డబ్బులు సంపాదించుకోవాలి అంటే వేరే ఏదో ఒక చోట ఒక పని చేసుకుంటూ ఉంటాం. కానీ అలా కష్టపడి పని చేసే ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక జీవిత లక్ష్యం ఉంటుంది. ఒక పక్క డబ్బులు సంపాదించుకోవడానికి ఒక పని ఉంటుంది ఇంకా ముఖ్యంగా మనకంటూ ఒక జీవిత లక్ష్యం ఉంటుంది. ఈ రెండిటిని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి డబ్బులు సంపాదించే పనికి ఎంత టైం ఇవ్వాలి. మన జీవిత లక్ష్యం కోసం అది కూడా పెద్ద లక్ష్యం కోసం మనం ఎంత సమయాన్ని కేటాయించుకోవాలి మనం ఎంత సమయం కేటాయిస్తే మనకున్న ఆ పెద్ద లక్ష్యం ఎప్పటికీ నెరవేరుతుంది అని చెప్పేసి ప్రాపర్ గా ఒక అవగాహన ఉండాలి క్లియర్ కట్ గా ఒక గోల్ ఉండాలి. సరే నాకంటూ జీవితంలో ఒక పెద్ద గోల్ ఉంది నేను వేరే చోట పని చేసుకుంటున్నాను ఆ పని చేసుకుంటూ నా జీవిత లక్ష్యం కోసం నేను పోరాడుతున్నాను. కానీ నెక్స్ట్ నేను ఏం చేయాలి అనే డౌట్ గనుక మీకు ఉంటే ఫస్ట్ మీరు చేయాల్సింది క్రియేట్ ఏ స్ట్రాటజిక్ ప్లాన్. మనిషికి ప్రాపర్ గా ప్లాన్ ఉండాలి ఎందుకంటే ఎవరికైనా సరే రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటాయి ఆ 24 గంటల్లో మనం ఎంతసేపు నిద్రపోవాలి ఎంతసేపు మనకు డబ్బులు సంపాదించే పని చేయాలి ఎంతసేపు మన జీవిత లక్ష్యానికి ప్రాపర్ గా పని చేయాలి అలా ఎన్ని రోజులు పని చేస్తే మన జీవిత లక్ష్యాన్ని మనం చేరుకుంటాం అనే ఒక ప్రాపర్ ప్లాన్ ఉండాలి.
ఇంకా ముఖ్యంగా జీవితంలో అన్ సక్సెస్ఫుల్ గా మిగిలిపోయిన చాలా మంది వాళ్లకున్న ఆ 24 గంటలు వాళ్ళ కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం ఖర్చు చేయటం వల్ల వాళ్ళు అన్ సక్సెస్ ఫుల్ గా మిగిలిపోతారు. కానీ నిజం చెప్పాలంటే మన కోసం మన రోజుని గనక మనం ప్రాపర్ గా యూస్ చేసుకోగలిగితే మన జీవిత లక్ష్యం కోసం వాడగలిగితే మన లక్ష్యాన్ని చాలా తొందరగా మనం రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సరే నాకంటూ ఒక జీవిత లక్ష్యం ఉంది దాని కోసం నేను రేత్రం పగలు కష్టపడి పడుతున్నాను ఆ తర్వాత ఏం చేయాలి ఇప్పటికి నేను రీచ్ అవ్వలేకపోతాను నా గోల్ అంటే. మీరు ఫస్ట్ అఫ్ ఆల్ ఛాలెంజెస్ ని ఓవర్ కమ్ చేయాలి బేసికల్ గా మనం ఒక పని చేసేటప్పుడు సవ లక్ష ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సవ లక్ష సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని ప్రాపర్ గా మనం అనాలసిస్ చేసుకొని వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళగలిగితేనే కచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. అలా కాకుండా మన కంఫర్ట్ జోన్ లో మనం ఉండి మనం ఇంట్లోనే మనం ఉండి చరిత్ర సృష్టించాలంటే అసలు కుదరని పని. కచ్చితంగా గడప బయటికి రావాలి కష్టపడాలి ప్లాన్లు వేసుకోవాలి. ఇంకా ముఖ్యంగా మనకి ఎదురయ్యే అడ్డంకుల్ని ప్రాపర్ గా దాటుకొని ముందుకు వెళ్ళాలి అలా వెళ్లకుండా జీవిత లక్ష్యాన్ని సాధించిన వాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రాపర్ గా ప్లాన్ ఉంది కష్టపడుతున్నాను అంటే కుదరదు మీకు వచ్చే సమస్యల్ని మీరు స్ట్రాటజీ తో వాటిని ఎదుర్కొని వాటిని అధిగమించి మీరు ముందుకు వెళ్లగలిగితేనే మీ జీవిత లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు. సరే నాకంటూ క్లియర్ కట్ గా ఒక గోల్ ఉంది ఒక మంచి ప్లాన్ ఉంది ఇంకా ముఖ్యంగా నాకు ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొంటున్నాను అయినా సరే నాకు సక్సెస్ రావట్లేదు గురు అంటే మాత్రం.
నేను చెప్పొచ్చేది ఒకటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కన్సిస్టెంట్ గా యాక్షన్ అనేది మనిషిలో ఉండాలి. బేసికల్ గా మనం ఏం చేస్తాం ఒక పని మీద ఇంట్రెస్ట్ తో ఒక పని మీద కసితో మనం కొంతకాలం మాత్రమే ప్రయత్నించి ఆపేస్తాం. కానీ నీ జీవిత లక్ష్యాన్ని నువ్వు చేరుకునేంత వరకు నిరంతరం దాని కోసం అంటే కన్సిస్టెంట్ గా దాని కోసం కష్టపడే తత్వం నీలో ఉంటే కచ్చితంగా ఏదో ఒక రోజు నీ జీవిత లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు.
మరి ఇంకొక్కసారి రివైండ్ చేసుకుందాం. మన జీవితంలో మనకున్న పెద్ద లక్ష్యాల్ని మనం చేరుకోవడం ఎలాగంటే ఫస్ట్ క్లియర్ కట్ గా గోల్స్ ఉండాలి. ఆ తర్వాత ప్రాపర్ గా ప్లాన్ ఉండాలి అంటే మనకున్న 24 గంటల్లో మన జీవిత లక్ష్యానికి ఎంత కేటాయిస్తున్నాం, మనం డబ్బులు సంపాదించుకోవడానికి ఎంత కేటాయిస్తున్నాం, మన శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికి ఎంత కేటాయిస్తున్నాం అనే ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఆ తర్వాత ఛాలెంజెస్ ని ఓవర్ కమ్ చేయాలి ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి వస్తాయి కూడా వాటిని మనం ఓవర్ కమ్ చేసి ముందడిగేస్తూ వెళ్ళాలి. ఇంకా ముఖ్యంగా దాన్ని కన్సిస్టెంట్ గా చేస్తూనే ఉండాలి అంటే నీ లక్ష్యం కోసం నువ్వు కన్సిస్టెంట్ గా కష్టపడుతూనే ఉండాలి ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు. అంతే అంతకు మించి ఏమీ లేదు కచ్చితంగా కష్టపడండి మీ చుట్టూ ఉన్న ఒక 10 మందికి ఆదర్శంగా నిలవండి.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
3 thoughts on “జీవితంలో గొప్పగా ఎదగాలి అంటే | Jeevitham lo adagali ante”