జీవితంలో గెలవాలంటే కష్టపడాలి – Motivational Story in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Motivational Story in Telugu గురించి తెలుసుకుందాం.
జీవితంలో గెలవాలంటే కష్టపడాలి
ఓ ఫంక్షన్ లో రాంచరణ్ గారు మాట్లాడుతూ డిసిప్లిన్ గురించి ఒక మాట అన్నారు. ఏ రంగంలోనైనా సరే అది సినిమా రంగం అవ్వచ్చు లేకపోతే క్రికెట్ అవ్వచ్చు లేకపోతే పాలిటిక్స్ అవ్వచ్చు దేంట్లోనైనా సరే డిసిప్లిన్ గా ఉన్నవాళ్ళు ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతారు. అంతేకాకుండా నీకు ఎంత టాలెంట్ ఉన్నా సరే నీలో డిసిప్లిన్ లేకపోతే వాళ్ళు ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వలేరు. ఒకవేళ మన దగ్గర టాలెంట్ లేకపోయినా సరే డిసిప్లిన్ ఉండటం వల్ల ఎంత పెద్ద విషయాన్నైనా సరే మనం మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉంటాము. ఆ రంగంలో ఎక్కువ రోజులు ఉంటాము అదండి సంగతి అంతకు మించి ఏం లేదు. కాకపోతే ఒక డిసిప్లిన్ ని మనం అన్బ్రేకబుల్ గా చేయాలంటే ఏం చేయాలి అనేదే ఈరోజు మన వీడియో టాపిక్.
ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే ఫస్ట్ అఫ్ ఆల్ డిసిప్లిన్ అనేది అసలు బ్రేక్ అవ్వకుండా ప్రాపర్ గా అన్బ్రేకబుల్ గా ఉండాలి అంటే మీలో ఆ డిసిప్లిన్ అనేది ఒక ఆశయంతో క్రియేట్ అవ్వాలి. మామూలుగా నేను నా ఫ్రెండ్ గాడు రోజు పొద్దున లేగుస్తున్నాడు నేను లెగుస్తాను లేకపోతే నా ఫ్రెండ్ గాడు ఎర్లీగా పడుకుంటున్నాడు నేను పడుకుంటా అంటే కుదరదు కానీ. నేనేమంటానంటే ఒక ఆశయంలో నుంచి మీలో డిసిప్లిన్ అనేది పుట్టుకొస్తే కచ్చితంగా అది మీతో జీవితాంతం ఉంటుంది.
ఉదాహరణకి మీరు జీవితంలో ఒక పెద్ద లక్ష్యాన్నే పెట్టుకున్నారు అనుకుందాం అలా పెట్టుకుంటే. మనం ఉదయం ఎన్ని గంటలకు నిద్ర లెగవాలి లెగిసిన తర్వాత సమయాన్ని ఎంత ప్రాపర్ గా వాడుకోవాలి అని చెప్పేసి మీరు ఒక రోజు మొత్తం మొత్తానికి ప్రాపర్ ప్లాన్ వేసుకుంటారు. అంతేకాకుండా ఆ ప్లాన్ నే ప్రతి రోజు మీరు కంటిన్యూగా వాడుతూ ఉంటారు. దీన్నే డిసిప్లిన్ అంటారు. కాకపోతే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనం డిసిప్లిన్ గా ఉండేటప్పుడు ఒకానొక సందర్భంలో సెల్ఫ్ కంట్రోల్ అనేది మిస్ అవుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఉదయాన్నే పొద్దున లేచి మన పనులు మనం చేసుకొని శుభ్రంగా చదువుకొని ఆ తర్వాత కెరీర్ ని బిల్డ్ చేసుకోవడానికి మనకంటూ కొన్ని ప్లాన్లు వేసుకొని అలాగే మన పని మనం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు సెల్ఫ్ కంట్రోల్ అనేది తప్పుతుంది ఎలాగంటే ఫ్రెండ్స్ అందరూ మంచి సినిమాకి వెళ్తారు మరి మనం కూడా వెళ్తే బాగుంటది కదా అనిపించిద్ది కాకపోతే అది నీ జీవితానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఐడియా ఉంటే కచ్చితంగా ఆ సినిమాకి వెళ్తే నీ జీవితానికి ఉపయోగపడుతుంది అనే ఆలోచన ఉంటే తప్పకుండా చూడొచ్చు. అలా కాకుండా ఎవడో సినిమాకి వెళ్ళాడని నువ్వు సినిమాకి వెళ్ళటం ఇంకెవడో ఏదో చేసాడని చెప్పేసి నువ్వు నీ పని మానుకొని ఆ పని చేయటం వల్ల నీ సెల్ఫ్ కంట్రోల్ డామేజ్ అవుతుంది అంతే కాకుండా నువ్వు ఎంతో కష్టపడి బిల్డ్ చేసుకున్న డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్ గా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి డిసిప్లిన్ గా ఉండే వాళ్ళకి ముఖ్యంగా ఉండవలసిన లక్షణం ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరం. అది తిండి విషయంలో అయినా సరే నిద్ర విషయంలోనైనా సరే. ఎందుకంటే ఎక్కువ తిండి తినటం వల్ల మనకి ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది. హెల్తీ ఫుడ్ తిని అది కూడా తక్కువ తక్కువ తిని మనం ఫుల్ బాడీకి ఏమి కావాలో తెలుసుకొని తిని ఆ తర్వాత ఎంత నిద్రపోతే మనకు ఆరోగ్యం వస్తుంది అని చెప్పేసి దాని మీద కూడా ప్రాపర్ ఒక అవగాహన ఏర్పరచుకొని అంత సమయం మాత్రం నిద్రపోయి మన పని మనం చేసుకుంటూ పోవడం వల్ల మనం క్రియేట్ చేసుకున్న డిసిప్లిన్ అనే ఒక సర్కిల్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ మనిషికి చాలా అవసరం.
అంతేకాకుండా కన్సిస్టెన్సీ కూడా చాలా అవసరం ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్ రీచ్ అవ్వడానికి సమయం పడుతుంది. దానికి మీరు డిసప్పాయింట్ అయిపోయి మిమ్మల్ని మీరు నిందించుకొని మనం ఏది చేసినా సరే మనం సక్సెస్ అవ్వమని చెప్పేసి మీకు మీరు నిర్ణయం తీసుకొని మిమ్మల్ని మీరు డిమోటివేట్ చేసుకోవడం వల్ల మీకే నష్టం. కాబట్టి మనం చేసే పనిలో కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం కంటిన్యూగా మన పని మనం చేసుకుంటూ పోవాలి.
ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మన పని మనం చేసుకుంటూ వెళ్లే క్రమంలో అన్ని సక్సెస్ అవ్వం కదా. మనం కొన్ని వాటిల్లో ఫెయిల్ అవుతూ ఉంటాము వాటిని కూడా ప్రాపర్ గా అనాలసిస్ చేసుకొని ఇంకొకసారి ఆ తప్పు జరగకుండా మనం ఇప్పుడు ఏదైతే తప్పు చేసి ఓడిపోయామో ఆ తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఇంకొకసారి మనం ఓడిపోకుండా మనల్ని మనం ప్రాపర్ గా అనాలసిస్ చేసుకొని ఒక ముక్కలో చెప్పాలంటే ఫెయిల్యూర్స్ ని ఓవర్ కం చేసుకొని మళ్ళీ మన ట్రాక్ లోకి వెళ్ళిపోవాలి. ఉదాహరణకి డిసిప్లిన్ గా ఉండి జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు అంటే నాకు గుర్తొచ్చే కొంతమంది పేర్లు చెప్తారు. నాకు ఫస్ట్ ఫస్ట్ గుర్తొచ్చేది ఎం ఎస్ ధోని మామూలుగా ఆయన గ్రౌండ్ లోకి వచ్చినప్పుడు ఎంత కోల్ గా ఉంటాడు. అంతేకాకుండా ఒక గేమ్ జరిగినప్పుడు ఎంత కాన్షియస్ గా ఉంటాడు. ఇంకా ముఖ్యంగా ఎంతమంది స్లెడ్జింగ్ చేసినా సరే తాను మాత్రం అస్సలు కంట్రోల్ తప్పకుండా తను ఏ పని మీద వచ్చాడో ఆ పని చేసుకుంటూ అలా వెళ్ళిపోతూనే ఉంటాడు. ఎంఎస్ ధోనిని చూస్తే నాకైతే గుర్తొచ్చేది అది ఎందుకంటే ఒక మనిషికి డిసిప్లిన్ ఉండాల్సింది. కేవలం ఒక్క విషయంలోనే కాదు ప్రతి ఒక్క విషయంలో డిసిప్లిన్ ఉండాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక అతను నెలకి రెండు లక్షల లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుందాం తనకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే ఆ రెండు లక్షలు కూడా సరిపోవు. అంతేకాకుండా నెలకి కేవలం ₹20000 సంపాదించే వ్యక్తిని తీసుకోండి తాను గనక ప్రాపర్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే తనకు వచ్చే ₹20000 తో చాలా అద్భుతంగా బతుకుతాడు. అంతే ఇది ఏ విషయంలో అయినా సరే మనిషికి డిసిప్లిన్ అవసరం, అది ఫైనాన్షియల్ విషయం అవ్వచ్చు లేకపోతే మనం మాట్లాడే మాటల్లో కూడా క్రమశిక్షణ లేకపోతే ఏదో ఒక పనికిమాలిన డైలాగ్ మన నోట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. దాని వల్ల మనం అందరికీ చులకనైపోతాం. అసలు నిజం చెప్పాలంటే మీరు అవసలోడి దగ్గర చులకన అవ్వాల్సిన అవసరం మీకు ఉందా అంత అవసరం లేదు. కాబట్టి ఒక మనిషికి ప్రతి విషయంలో డిసిప్లిన్ ఉండాలి తినే తిండి అవ్వచ్చు మాట్లాడే మాట అవ్వచ్చు సంపాదించే డబ్బు అవ్వచ్చు. దేంట్లోనైనా మనిషికి డిసిప్లిన్ ఉంటే అతనంత సక్సెస్ఫుల్ పర్సన్ ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఒకవేళ సక్సెస్ కాకపోయినా సరే రాబోయే రోజుల్లో తాను ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.