డిప్రెషన్ పోవాలంటే ఏం చేయాలి – Ways to Overcome Depression in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Ways to Overcome Depression in Telugu గురించి తెలుసుకుందాం.
డిప్రెషన్ వదిలించే 5 మార్గాలు
మామూలుగా ప్రతి ఒక్క మనిషికి డిప్రెషన్ వస్తుంది నిరాశ వస్తుంది అలసట వస్తుంది అసలు ఏంట్రా బాబు ఈ జీవితం అని చెప్పేసి ఒక పెద్ద డౌట్ కూడా వస్తుంది. ఈ డౌట్లు ఈ నిరాశ ఇంకా డిప్రెషన్ ఇవన్నీ ఓవర్ గా పని చేసే వాళ్ళకి ఆ తర్వాత అసలు ఏ పని చేయకుండా ఉన్న వాళ్ళకి చాలా కామన్ గా వస్తూ ఉంటాయి. ఈ డిప్రెషన్ నుంచి బయట పడాలంటే మీకు నేను ఒక ఐదు పవర్ఫుల్ టిప్స్ చెప్తాను. ఈ ఐదు టిప్స్ మిమ్మల్ని ఖచ్చితంగా డిప్రెషన్ నుంచి దూరం చేయడమే కాకుండా మీ జీవితంలో మీకు ఒక కొత్త దానాన్ని క్రియేట్ చేసి పెడుతుంది ఇది మాత్రం గ్యారెంటీ.
Money Making
ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే ఫస్ట్ అఫ్ ఆల్ మీరు ఒత్తిడి నుంచి బయటికి రావాలి అంటే మనీ మేకింగ్ అనేది ప్రాపర్ గా ఉండాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఏ మనిషి అయినా సరే సర్వైవ్ అవ్వాలన్నా అంటే ప్రశాంతంగా బతకాలన్న డబ్బులు అవసరం ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఫేస్ చేయడానికి కూడా డబ్బులు అవసరం. కాబట్టి మనీ మేకింగ్ అనేది ప్రాపర్ గా ఉండాలి. ఇంకా ముఖ్యంగా డబ్బులు లేకపోవడం వల్ల కూడా నెక్స్ట్ నా జీవితం ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా మందికి డిప్రెషన్ వస్తుంది ఓవర్ థింకింగ్ వచ్చేస్తుంది అసలు ఏంట్రా బాబు అని చెప్పేసి జీవితం మీద నిరాశ వచ్చేస్తుంది. కాబట్టి మనీ మేకింగ్ అనేది ప్రాపర్ గా ఉండాలి అలా ఉండాలి అంటే మనం కచ్చితంగా ఉదయాన్నే నిద్ర లేచి మన పని మనం చేసుకుంటూ ఉండాలి. పనిలో మనం బిజీ అయిపోవడం వల్ల ఆల్మోస్ట్ మనం డిప్రెషన్ కి దూరం అయిపోతాము.
Hitting the Gym
ఇంకా మిమ్మల్ని డిప్రెషన్ నుంచి బయట పడేసే రెండో మార్గం ఏంటంటే హిట్టింగ్ ద జిమ్. బేసికల్ గా చాలా మంది జిమ్ కి వెళ్దాం అనుకుంటారు. కొంతమంది వెళ్ళిన తర్వాత కూడా కొన్ని రోజులకి మానేసి వెనక్కి వచ్చేస్తారు. మామూలుగా జిమ్ అనేది మనం కండలు పెంచుకోవడానికో కాదు మనం ఫిట్ గా ఉండటానికి అంతే కాకుండా ఆరోగ్యంగా ఉండటానికి అంతే అంతకు మించి ఏమీ లేదు. మామూలుగా జిమ్ కి వెళ్లి మనం ఆరోగ్యంగా ఉండొచ్చు లేదా ఉదయాన్నే లేచి ఒక గంట పరిగెత్తి ఆరోగ్యంగా ఉండొచ్చు లేదా పడుకునే ముందు సరదాగా వాకింగ్ కి వెళ్లి కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు ఏది ఏమైనా సరే మనిషి అనేవాడు 24 గంటల్లో ఒక గంట వ్యాయామం చేయడానికి గనక ఇంకా స్పెండ్ చేస్తే అసలు డిప్రెషన్ అనేది దరికే రాదు. కాబట్టి కొంచెం వ్యాయామం చేయండి అది జిమ్ కి వెళ్లి అయినా చేయండి మామూలుగా ఇంట్లో అయినా చేయండి.
Chasing His Purpose
ఇంకా మిమ్మల్ని డిప్రెషన్ నుంచి బయట పడేసే మూడో మార్గం ఏంటంటే చేసింగ్ హిస్ పర్పస్. మామూలుగా ప్రతి మనిషి యొక్క జీవిత పర్పస్ అనేది తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి అది ఏదైనా సరే అలా లక్ష్యం ఉండటం వల్ల మీ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం మీకు తెలుస్తుంది. అలా తెలియడం వల్ల మీకు ఇష్టమైన పనిలో మీరు నిరంతరం పని చేస్తూనే ఉంటారు అలా చేయడం వల్ల మీకు ఆనందం వస్తుంది. అంతే కాకుండా అందులో మీరు సక్సెస్ అయితే మీ జీవితానికి ఒక సార్ధకత ఉంటుంది. ఈ భూమి మీద చాలా మంది పుడుతూ ఉంటారు చనిపోతూ ఉంటారు కానీ పర్పస్ లేకుండా ఏమి సాధించకుండా చనిపోయే వాళ్ళ లిస్ట్ లో చాలా మంది ఉంటారు. అలా కాకుండా మీ పర్పస్ ని మీరు తెలుసుకొని మీకంటూ ఒక లక్ష్యాన్ని సెట్ చేసుకొని దాని కోసం పోరాడే క్రమంలో అసలు మీకు డిప్రెషన్ ఎందుకు వస్తుంది చెప్పండి. కాబట్టి మీ లక్ష్యం కోసం మీ జీవితానికి ఉన్న పర్పస్ కోసం మీరు పోరాడండి.
Building a Lovely Family
ఇంకా మిమ్మల్ని డిప్రెషన్ నుంచి బయట పడేసే నాలుగో మార్గం ఏంటంటే బిల్డింగ్ ఏ లవ్లీ ఫ్యామిలీ ఫేసికల్ గా మనకి ఎన్ని బయట కష్టాలు ఉన్నా సరే మామూలుగా ఎంతమంది శత్రువులు ఉన్నా సరే మనకి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతత అనేది చాలా అవసరం. అలాంటి ప్రశాంతతకి ఒక అందమైన కుటుంబం అనేది చాలా చాలా అవసరం. మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడ లేని గోల అంతా మీకు చెప్పే వాళ్ళ కన్నా మీ బాధను అర్థం చేసుకొని పాపం బయటికి వెళ్ళాడు వీడు ఎంతో కష్టపడ్డాడు వీడిని కొంచెం ప్రశాంతంగా ఉంచనిద్దాం లేకపోతే వీడి బాధను తెలుసుకుందాం ఒకవేళ తెలుసుకుంటే వాడికి కొంచెం హెల్ప్ చేద్దాం అనే మైండ్ సెట్ తో కేవలం మన కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. కాబట్టి అలాంటి ఒక అందమైన ఫ్యామిలీని బిల్డ్ చేసుకోండి మీరే రోడ్లమ్మడి తిరుక్కుంటూ సాయంత్రం ఎప్పుడో ఇంటికి వస్తే వాళ్ళకి మీకు రిలేషన్ ఉంటుంది కేవలం ఉండటానికి తినటానికి తప్ప ఏం ఉండదు. కాబట్టి మాక్సిమం మీ కుటుంబ సభ్యులతో ఉండండి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళతో చెప్పుకోండి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఆ ఫ్యామిలీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ మధ్య బాండింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అలా కాకుండా నా ఫ్రెండ్స్ తో నేను తిరుగుతాను మీ ఫ్రెండ్స్ తో మీరు తిరగండి అంటే ఫ్యూచర్ లో అన్నదమ్ములు గాని అక్కచెల్లెలు గాని కలిసి ఉండటం చాలా కష్టమైపోతుంది అప్పుడప్పుడు పండగలకు కలుసుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ తో ఎక్కువ బాండింగ్ ఏర్పరచుకోండి ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళతో పంచుకోండి ఏదైనా ఆనందం వచ్చినా కూడా వాళ్ళతో పంచుకోండి అలాంటి ఫ్యామిలీ వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఫ్యామిలీ అండతో మనం వాటిని ఎదుర్కోవచ్చు.
Relationship with God
ఇంకా మిమ్మల్ని డిప్రెషన్ నుంచి బయట పడేసే ఐదవ పాయింట్ ఏంటంటే రిలేషన్షిప్ విత్ గాడ్. మామూలుగా చాలా మందికి ఆధ్యాత్మికత అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఒకవేళ ఎక్కువగా ఉంటే వాడిని పిచ్చలో లో చూస్తూ ఉంటాము. నిజంగా చెప్పాలంటే ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము డబ్బులు సంపాదించడానికా లేకపోతే సంపాదించిన డబ్బులు ఎంజాయ్ చేయడానికా లేకపోతే మనం సంపాదించిందంతా మనం చచ్చిపోయిన తర్వాత తర్వాత మన కుటుంబ సభ్యులు దాని కోసం కొట్టుకోవడానికా. నేను చెప్పొచ్చేది ఏంటంటే మన కుటుంబంలో ఆధ్యాత్మికత అనేది ఎక్కువగా ఉండటం వల్ల డబ్బు అనేది నథింగ్ మనిషికి టాలెంట్ ఉంటే డబ్బులు ఎలాగైనా సంపాదిస్తాడు. ఇంకా ముఖ్యంగా మంచి పేరు సమాజంలో గౌరవం ఇవి డబ్బుల వల్ల రావు అది కేవలం మన ప్రవర్తన వల్ల మన ప్రవర్తన మంచిగా ఉండాలంటే కచ్చితంగా మనం ఆధ్యాత్మికంగా ఉండాలి. అలా ఆధ్యాత్మికంగా ఉండగలిగితే అసలు డిప్రెషన్ అనేది మన దరికే రాదు నన్ను అడిగితే ఆధ్యాత్మికంగా మనిషి అనేవాడు ఉండాలి. దైవ చింతన ఉండాలి సరదాగా ఒక వారానికి ఒకసారి చర్చి కన్నా వెళ్ళాలి టెంపుల్ కి వెళ్ళాలి మసీదు కి వెళ్ళాలి ఇలా ఏదో ఒక మార్గాన్ని మనం ఎంచుకోగలిగితే మన బ్రెయిన్ కొంచెం ఆధ్యాత్మికంగా ఉంటుంది. అలా కాకుండా మా దేవుడు గొప్ప మీ దేవుడు గొప్ప కాదు అని చెప్పేసి కొట్టుకుస్తానంటే మిమ్మల్ని ఎవరు మార్చలేరు. ఎందుకంటే మనం దేవుడి కోసం గొడవ పడటానికి అయితే ఈ భూమి మీదకి రాలేదు కానీ దేవుడి మార్గంలో నడవడానికి అయితే వచ్చాము అది ఏ దేవుడైనా సరే. కాబట్టి మెజారిటీగా ఆధ్యాత్మికంగా ఉండండి దేవుని చింతనలో ఉండండి కుటుంబంతో హ్యాపీగా ఉండండి మీకంటూ ఒక లక్ష్యాన్ని సెట్ చేసుకోండి దాని కోసం పని చేయండి ఇవన్నీ చేసిన తర్వాత డిప్రెషన్ ఎందుకు వస్తుంది కేవలం డబ్బులు మాత్రమే దగ్గరికి వస్తాయి.
ఒక ముక్కలో చెప్పాలంటే ఖాళీగా కూర్చుంటే కచ్చితంగా డిప్రెషన్ వస్తుంది అంతే కాకుండా పనికిమాలిన వాళ్ళతో తిరిగితే ఇంకా డిప్రెషన్ వస్తుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే కుటుంబ సభ్యులతో ఉండండి చక్కగా మీ జీవిత లక్ష్యం కోసం మీకు నచ్చిన పని చేసుకోండి జీవితంలో హ్యాపీగా ఉండండి. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.