డబ్బు విషయం లో యువకులు చేస్తున్న తప్పులు – Money Mistakes in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Money Mistakes in Telugu గురించి తెలుసుకుందాం.
డబ్బు విషయం లో యువకులు చేస్తున్న తప్పులు
మామూలుగా ఏ మనిషి అయినా సరే తను యవ్వనంలో ఉన్నప్పుడు డబ్బుని గనుక ప్రాపర్ గా యూస్ చేయగలిగితే అతను ఉన్నంత ఆనందంగా ఈ జీవితంలో ఎవ్వరూ ఉండరు. కానీ ఏ మనిషి అయితే యవ్వనంలో ఉన్నప్పుడు డబ్బుని లెక్క చేయకుండా కనీసం దాన్ని హ్యాండిల్ కూడా చేయకుండా ఎలా పడితే అలా ఖర్చు పెడతాడో అతను వయసులోకి వచ్చిన తర్వాత ఇంకా ముఖ్యంగా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బు కోసం ఆ వయసులో కూడా పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దీని అంతటికి కారణం ఏంటంటే వయసులో ఉన్నప్పుడు అంటే మనం యుక్త వయసులో ఉన్నప్పుడు డబ్బుని ప్రాపర్ గా హ్యాండిల్ చేయడం రాక కొన్ని మిస్టేక్లు చేస్తాం అన్నమాట. ఆ మిస్టేక్ల వల్ల మన జీవితం తలకిందులు అయిపోతుంది. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ కూడా అదే మనం చేసే ఈ మూడు మిస్టేకుల వల్ల మన జీవితం తలకిందులు అయిపోతుంది అది కూడా వయసులో ఉన్నప్పుడు చేసే ఈ మూడు మిస్టేక్ ల వల్ల మన జీవితం ఎదగకుండా అక్కడే ఉండిపోతుంది.
ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే బేసికల్ గా ఎవరైనా సరే యుక్త వయసులో ఉన్నప్పుడు కామన్ గా చేసే మిస్టేక్లు మూడే ఉంటాయి అన్నమాట. ఆ మూడు చేయటం వల్లే వాళ్ళకి వృద్ధాప్యం వచ్చినా కూడా ఏదో ఒక పని చేసుకుంటూ కుటుంబ పోషణ కోసం కష్టపడుతూనే ఉంటారు. ఫస్ట్ అఫ్ ఆల్ మనం వయసులో ఉన్నప్పుడు చేసే అతి పెద్ద బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే మన స్థాయికి మించి మనం బతకాలి అనుకోవడం. మామూలుగా ఏ మనిషి అయినా సరే తన జీతాన్ని బట్టి తన లైఫ్ ని డిజైన్ చేసుకుంటాడు. కానీ చాలా మంది ఏంటంటే అప్పులు చేసి మరి వాళ్ళ వాళ్ళ లైఫ్ ని డిజైన్ చేసుకుంటారు మామూలుగా ప్రతి మనిషి అప్పులు చేస్తాడు చెయ్యాలి కూడా తప్పదు. కానీ నేనేమంటానంటే ఇల్లు కొనటానికి అప్పులు చేయాలి ఒక బిజినెస్ పెట్టడానికి అప్పు చేయాలి లేకపోతే పిల్లల్ని చదివించుకోవడానికి అప్పు చేయాలి. కానీ సెల్ ఫోన్ కొనటానికి అప్పు చేయడం కారు కొనటానికి అప్పు చేయడం ఇవన్నీ ఏంటంటే సెల్ ఫోన్ గాని కారు గాని మన జీవితంలో కొన్ని రోజులు పని చేసి ఆ తర్వాత పాడైపోయే వస్తువులు. కానీ వాటిని కూడా మనం అప్పు చేసి మరి కొనటం వల్ల మనకు తెలియకుండానే మనం పేదవాళ్ళు అయిపోతాం ఇది అక్షర సత్యం. కానీ మీ దగ్గర ఉన్న డబ్బుకి ఇంకొంత డబ్బు అప్పు చేసి మరి తీసుకొని ఒకచోట ఎక్కడైనా సరే ఒక ల్యాండ్ కొంటే కనుక మీరు గాని ఆ అప్పును మెల్లగా తీర్చుకుంటే కనుక ఆ అప్పుని మీరు ఎలా తీరుస్తున్నారో ఆ ల్యాండ్ వాల్యూ కూడా మీరు తీర్చే అప్పుతో పాటు పెరిగి పెద్దది అయిపోతుంది ఆ ల్యాండ్ మీకు ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది. అది అమ్ముకోవడానికైనా ఆ ల్యాండ్ లో ఇంకొక ఇల్లు కట్టుకోవడానికైనా కానీ మనం ఏం చేస్తాం అంటే పోయి పోయి ఎలక్ట్రానిక్స్ మీద లక్షలు లక్షలు ఖర్చు పెట్టి వాటిని అప్పు తీసుకొచ్చి మరి వాటిని కొనుక్కొని అది ఉంటేనే మనం మనిషి లాగా ఫీల్ అవుతూ అది ఉంటేనే మనకు సమాజంలో గౌరవం వస్తుందని చెప్పి ఒక అపనమ్మకంతో మన జీవితాల్ని మనం నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి పెద్ద పెద్ద బైకులు అవసరం లేదు పెద్ద పెద్ద సెల్ ఫోన్లు అవసరం లేదు గట్టిగా చెప్పాలంటే వాడు ఎవడో బతికినట్టు జీవితం మనం కూడా బతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీకు ఎంత జీతం వస్తుంది నువ్వు అందులో ఎంత మిగుల్చుకుంటున్నావు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నావు ఈ క్లారిటీ చాలా మందికి ఉండట్లేదు. కాబట్టి దయచేసి ఈ ఒక్క విషయంలో క్లారిటీ ఉండండి.
ఇంకా ముఖ్యంగా యువకులు చేసే రెండో తప్పు ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ ని వాళ్ళ దగ్గర స్టాక్ ఉంచుకోవడం. మామూలుగా ఏ మనిషి అయినా సరే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేడు అలా అలాంటి సమయంలో మనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటూ కూర్చుంటే మనకి సడన్ గా ఏదైనా అయినప్పుడు సరే ఏదైనా అవ్వాల్సిన అవసరం లేదు సడన్ గా లాక్ డౌన్ పెట్టారనుకోండి. అలా లాక్ డౌన్ పెట్టినప్పుడు మన పరిస్థితి ఏంటి ఉద్యోగం ఉండదు ఇన్కమ్ సోర్స్ ఉండవు. ప్రపంచం మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది అలాంటప్పుడు మనం సర్వైవ్ అవ్వడానికి మనకు పనికొచ్చేదే ఈ ఎమర్జెన్సీ ఫండ్ అన్నమాట. బేసికల్ గా చాలా మంది ఉన్న డబ్బులన్నీ అవ్వగొట్టుకొని రావాల్సిన జీతం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ప్రతి నెల వాళ్ళు సంపాదించే దాంట్లో అట్లీస్ట్ 10% మనీని ఇది ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పేసి వాటిని దాచిపెట్టుకుంటూ ఉంటారు. అలా గనక మీరు పెట్టుకోలేదు అనుకోండి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనకి ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు మన కుటుంబంలో పెద్దవారికి అనారోగ్యం బాగోలేనప్పుడు మనం ఎవరిని అడుక్కుంటాం అడిగిన వెంటనే వాళ్ళు డబ్బులు ఇస్తారా. ఇవ్వరు కాబట్టి మనం ఎమర్జెన్సీ ఫండ్ ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎంతో కొంత కనీసం 5% మనీ అయినా సరే హెల్త్ కోసం అని చెప్పి తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇంకా వయసులో ఉన్నప్పుడు మనం చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే బేసికల్ గా పెట్టుబడులని మనం పెట్టకపోవడం. మామూలుగా పెట్టుబడి అంటే ఎవరేమైనా ఏమనుకుంటారంటే ఇది బాగా డబ్బు ఉన్నోళ్ళు చేసే పని బిజినెస్ మ్యాన్లు చేసే పని అని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ పెట్టుబడి అనేది ప్రతి ఒక్క మనిషి పెట్టుకోవచ్చు నిజం చెప్పాలంటే ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళు బాగా డబ్బులు పోగేసుకొని బంగారం కొంటారు ఒక విధంగా చెప్పాలంటే అది కూడా పెట్టుబడే. ఎందుకంటే మనం ఎంతో కొంత మన దగ్గర ఉన్న డబ్బులతో బంగారం కొంటాం కొన్ని రోజులకి ఆ బంగారం రేటు పెరిగి మీరు పెట్టిన దానికన్నా ఎంతో కొంత ఎక్కువ వస్తుంది కదా అది కూడా పెట్టుబడి లాంటిదే. మరి ముఖ్యంగా మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ బంగారాన్ని అమ్ముకొని ఆ ఆపద నుంచి మనం బయట పడొచ్చు. చాలా మంది చాలా విషయాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. కానీ అదే చాలా మంది సంపాదించిన డబ్బుని ఒకచోట పెట్టుకొని చూస్తూ మురిసిపోతూ ఉంటారు. ఎందుకంటే డబ్బు మన ఇంట్లో డబ్బు డబ్బుని సంపాదించి పెట్టదు. కానీ అదే డబ్బుని ఇన్వెస్ట్ చేసి ప్రాపర్ ప్లానింగ్ తో ఇన్వెస్ట్ చేయగలిగితే అది ఖచ్చితంగా ఆ డబ్బే ఇంకొంత డబ్బుని సంపాదించి పెడుతుంది. కాబట్టి మీ దగ్గర ఎంతుంటే అంతని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఒక బిజినెస్ లోనో లేకపోతే మీకు ఇష్టమైన పనిలోనో పెట్టుబడి పెట్టగలిగితే కచ్చితంగా మీకు ఎంతో కొంత రిటర్న్స్ వస్తాయి. దాని వల్ల మీరు ఇంకా లాభం పొందుతారు. ఓవరాల్ గా అదండి.
మామూలుగా మనకున్న దానికి మించి మనం అసలు బతకకూడదు 10000 సంపాదిస్తే 10000 లో బ్రతికేయాలి లక్ష రూపాయలు సంపాదిస్తే లక్ష రూపాయల్లో బ్రతికేయాలి. ఓవరాల్ గా ఫస్ట్ పాయింట్ అది. ఇంకా రెండో పాయింట్ విషయానికి వస్తే ఎమర్జెన్సీ ఫండ్ ని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎంతో కొంత మనం నెల సంపాదించే దాంట్లో కనీసం 5% అయినా మనం దాచిపెట్టుకుంటూ ఉండాలి. ఇంకా ముఖ్యంగా లాస్ట్ అండ్ ఫైనల్ మన దగ్గర ఉన్న డబ్బుని అస్సలు మనం ఇన్వెస్ట్ చేయకుండా అలా ఖాళీగా పెట్టకూడదు. ఇన్వెస్ట్మెంట్ కి కూడా కొంత డబ్బులు తీయాలి ఆ ఇన్వెస్ట్ చేసిన మనీ ఇంకొంత మనీని జనరేట్ చేస్తూ ఉంటాయి. ఓవరాల్ గా జరిగేది. కాబట్టి వీటిని అసలు యువకులు నెగ్లెక్ట్ చేయకూడదు ఒకవేళ చేశారే అనుకోండి మీరు బతికున్నంత కాలం పని చేస్తూనే ఉండాలి. అలా కాకుండా ప్రశాంతంగా బతకాలనుకుంటే కచ్చితంగా ఈ మూడు పాయింట్లు మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు జీవితంలో హ్యాపీగా ఉంటారు.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.