ధనవంతులకు ఉండే లక్షణాలు ఇవే – Habits of Rich People in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Habits of Rich People in Telugu గురించి తెలుసుకుందాం.
ధనవంతులకు ఉండే 4 అలవాట్లు
మామూలుగా ఏ మనిషి అయినా జీవిత లక్ష్యం యొక్క అంతిమ ఘట్టం అనేది డబ్బు సంపాదించడం మాత్రమే. అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక పెద్ద క్రికెటర్ ని అవుతాను అని ఎవరైనా అనుకుంటే నువ్వు ప్రతి మ్యాచ్ కి ₹1000 రూపాయలు ఇస్తారంటే ఇక్కడ ఎవరు ఆడరు మనం ఏ లక్ష్యం పెట్టుకున్నా సరే దాని యొక్క అంతిమ ఘట్టం అనేది కేవలం డబ్బు మాత్రమే ఉంటుంది డబ్బు ప్రతి ఒక్క మనిషికి అవసరం. జీవితంలో బాగా డబ్బులు సంపాదించే వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉంటాయి వాళ్ళు ఆ అలవాట్లు ఉండటం వల్లే జీవితంలో ఎంతో సక్సెస్ఫుల్ గాను అంతేకాకుండా ఎంతో ధనవంతులుగాను ఉంటారు. ఉదాహరణకు ఒక విషయం చెప్పనా భారతదేశంలో 140 కోట్ల మంది జనం ఉన్నారు అందులో 70 కోట్ల మంది ఇప్పటికీ రోజుకి కేవలం ₹300 మాత్రమే సంపాదిస్తున్నారు. అంతేకాకుండా ఇదే భారతదేశంలో గంటకి 10 కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు అసలు వీళ్ళు 10 కోట్లు సంపాదించడానికి కారణం ఏంటి అంటే. నాకు తెలిసినంత వరకు వాళ్లకు ఉండే అలవాట్లు ఆ అలవాట్లు అనేవి మనిషిని పర్ఫెక్ట్ గా తయారు చేస్తాయి. కాబట్టి ఈరోజు ఆ అలవాట్ల గురించి మాట్లాడుకుందాం.
SETTING GOALS
మొట్టమొదటిగా ఏ మనిషికైనా సరే గోల్ అనేది చాలా క్లియర్ కట్ గా ఉండాలన్నమాట మనం గోల్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతాం. చిన్నప్పుడు క్రికెట్ చూసినప్పుడు మనం క్రికెటర్ అవ్వాలనుకుంటాం లేకపోతే సినిమా చూసినప్పుడు సినిమా యాక్టర్ అవ్వాలనుకుంటాం లేకపోతే డైరెక్టర్ అవ్వాలనుకుంటాము లేకపోతే ఇంకేదో చూసినప్పుడు ఇంకేదో అనుకుంటూ ఉంటాము. కాకపోతే క్లియర్ కట్ గోల్ అనేది మనకు ఉండదు. నిజం చెప్పాలంటే మన జీవిత లక్ష్యం అనేది ఎప్పుడు నెరవేరుతుందో ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఎవరికీ తెలియదు. ఈ ప్రాసెస్ లో మన గోల్ మీద కూడా మనకు చిరాకు రావచ్చు మనం కరెక్ట్ కాదేమో అన్న డౌట్ కూడా మనకి రావచ్చు. కానీ నిజంగా ధనవంతులకు ఉండే లక్షణం ఏంటంటే వాళ్ళు ఒకసారి ఒక లక్ష్యాన్ని ఫిక్స్ అయితే అది 10 సంవత్సరాలు పడుతుందా 20 సంవత్సరాలు పడుతుందా అనవసరం వాళ్ళు ఆ లక్ష్యం కోసం పోరాడుతూనే ఉంటారు. కాబట్టి మీరు కూడా మీ లక్ష్యం కోసం పోరాడుతూ ఉండండి.
CONTINUOUS LEARNING
అంతే కాకుండా ధనవంతులకు ఉండే రెండో అలవాటు ఏంటంటే కంటిన్యూస్ లెర్నింగ్. మామూలుగా వీళ్ళు ఏ విషయాన్నైనా ప్రాపర్ గా నేర్చుకుంటారు. ఉదాహరణకి మనం ఎప్పుడైనా న్యూస్ చూస్తే అందులో ఒక మనిషి ఇంకో మనిషిని అత్యాచారం చేసి లేకపోతే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడు అని చెప్పేసి టీవీ లో చూపిస్తూ ఉంటారు. బట్ ఈ రెండు పదాలు వినటానికి ఒకేలాగా ఉంటే మనం కొంచెం కాన్సంట్రేట్ కూడా చేయం కాకపోతే అత్యాచారానికి అత్యాచారానికి చాలా తేడా ఉంది. హత్య అంటే ఒక మనిషిని చంపడం, హత్య అంటే ఒక మనిషి ఆచారాలని అతిక్రమించడం. అత్యాచారానికి అత్యాచారానికి ఉన్న తేడాను కూడా ప్రాపర్ గా తెలుసుకుంటారు. ఒక పదంలోనే మనం ఇంత డిఫరెన్స్ ని చూస్తే వాళ్ళు జీవితంలో చాలా డిఫరెన్స్ ని చూస్తారు. ప్రతి ఒక్క నిర్ణయం వెనకాల ఉన్న చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళు ఖాళీ సమయాల్లో బుక్ చదువుతూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా ఒక రంగంలో సక్సెస్ అయితే వాళ్ళు జీవితాంతం దానికే స్టిక్ అయి ఉండరు. వేరే వేరే జానర్ లో వాళ్లకున్న అభిరుచుల ప్రకారం వాటిల్లో కూడా వాళ్ళు విజయం సాధించాలని చెప్పేసి కొత్త కొత్త వృత్తుల్ని వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చూసినా సరే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు.
NETWORKING
ఇంకా ధనవంతులకు ఉండే మూడో అలవాటు ఏంటంటే నెట్వర్కింగ్. మామూలుగా మనకు ఉండే ఫ్రెండ్స్ ఎలా ఉంటారు మనలాగే ఆలోచించే వాళ్ళు ఉంటారు లేకపోతే మన వయసు వాళ్లే ఉంటారు. కానీ ఈ ధనవంతులకు ఉండే ఒక గొప్ప లక్షణం ఏంటంటే తెలివి కలవాడు చిన్నవాడైనా, పెద్దవాడైనా సరే వాడితో ట్రావెల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు వాడి ఐడియాలని తీసుకుంటూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే వాడి సజెషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. కేవలం వీడు బ్రిలియంట్ వీడికి మంచి ఫ్యూచర్ ఉంది వీడి వల్ల మనకు ఉపయోగం ఉంది మన వల్ల వాడికి ఉపయోగం ఉంది అన్న ఇలాంటి వాళ్ళతోనే వీళ్ళు ట్రావెల్ అవుతారు తప్ప టైం వేస్ట్ చేసుకుంటూ వాళ్ళకి సంబంధం లేని పనులు చేసుకుంటూ ఉండే వాళ్ళతో మాత్రం వీళ్ళు అస్సలు ట్రావెల్ అవ్వరు.
DISCIPLINED FINANCIAL HABITS
ఇక ధనవంతులకు ఉండే లాస్ట్ అండ్ ఫైనల్ హ్యాబిట్ ఏంటంటే డిసిప్లిన్డ్ ఫైనాన్షియల్ హ్యాబిట్స్. మామూలుగా ధనవంతులు అవ్వాలి అంటే డబ్బుని ఎక్కువ సంపాదిస్తే సరిపోదు ఆ సంపాదించిన డబ్బుని ఎలా యూస్ చేయాలి ఎలా పెట్టుబడి పెట్టాలి పెట్టిన పెట్టుబడిలో నుంచి మళ్ళీ లాభాలు మనం ఎలా సంపాదించాలి అని చెప్పేసి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనే మనిషికి లేకపోతే అసలు ఎంత సంపాదిస్తున్నావ్ ఎంత ఖర్చు పెడుతున్నావ్ అని చెప్పేసి వచ్చిన డబ్బు మాత్రం ఖర్చు పెడుతూ కూర్చుంటాం. కాబట్టి ధనవంతులకు ఉండే ఒక గొప్ప లక్షణం ఇది సంపాదించిన ధనాన్ని వాళ్ళు ఊరకనే ఖర్చు పెట్టరు. ఒకవేళ ఖర్చు పెడితే మాత్రం దానికి రెండింతలు డబ్బులు రిటర్న్ వాళ్ళు ఆ డబ్బులు ఖర్చు పెట్టరు. అలా అని చెప్పేసి అన్న తినకుండా ఉంటారో లేకపోతే ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటారు అని నేను అనను గాని వాళ్ళు ఒక లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అంటే దాని వెనకాల వాళ్ళు పడిన కష్టం ఉంటది వాళ్ళు ఎంతో కష్టపడి క్రియేట్ చేసుకున్న ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. అంతే కాకుండా వాళ్ళు కంటిన్యూస్ గా నేర్చుకునే నేర్పరతనం ఉంటుంది. అది పుస్తకాల్లో అవ్వచ్చు లేదా కొంతమంది వ్యక్తుల నుంచి అవ్వచ్చు ఇంకా ముఖ్యంగా వాళ్ళ జీవిత లక్ష్యాన్ని ప్రాపర్ గా సెట్ చేసుకునే విధానం అవ్వచ్చు. వీటన్నిటి వల్ల ఒక మనిషి డబ్బు ఉన్నోడు అవుతాడు సక్సెస్ ఉన్నోడు అవుతాడు తప్ప ఇవి ఏమీ లేకుండా ఏదో లక్కులు అయ్యేవాళ్ళు లక్కులు అయిపోయి ఆ తర్వాత కూడా మళ్ళీ డౌన్ అయిపోతారు.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
1 thought on “ధనవంతులకు ఉండే లక్షణాలు ఇవే | Habits of Rich People in Telugu”