గౌరవం అడుక్కుంటే రాదు సంపాదించుకోవాలి – Earn Respect in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Earn Respect in Telugu గురించి తెలుసుకుందాం.
గౌరవం సంపాదించుకోండి
బేసికల్ గా ఈ భూమి మీద ఏదైనా ఫ్రీగా దొరకొచ్చు కానీ ఒక్కటి మాత్రం ఫ్రీగా అస్సలు దొరకదు అదే గౌరవం. మామూలుగా మనకి డబ్బు కావాలి అనుకోండి రోడ్డు మీదకి వెళ్లి అడుక్కుంటే ఆటోమేటిక్ గా ఎంతో అంత వస్తాయి. అంతే కాకుండా ఫుడ్ అవ్వని బెడ్ అవ్వని ఏదో ఒక చోట టెంట్ వేసుకొని పడుకోవచ్చు. ఈ భూమి మీద ప్రతిదీ మనకి ఫ్రీగా వస్తుంది. కానీ ఒక్కటి మాత్రం అది ఫ్రీగా రాదు కేవలం మనం సంపాదించుకుంటేనే వస్తుంది అది ఏదో కాదు గౌరవం. ఈ గౌరవాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి అనేదే ఈరోజు మన టాపిక్.
ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే గౌరవాన్ని సంపాదించుకోవడానికి నేను మీకు నాలుగు టిప్స్ చెప్తాను. నాలుగు అంటే నాలుగే చెప్తాను వీటిని శ్రద్ధగా వినండి.
ఆత్మవిశ్వాసం
మొట్టమొదటి టిప్ ఏంటంటే ఆత్మవిశ్వాసం అనేది ఏ మనిషికైనా చాలా అవసరం అది గనక లేదే అనుకోండి కచ్చితంగా మనం వేరే వాడి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అలా డిపెండ్ అవ్వడం వల్ల వాడు మనల్ని కొంచెం చిన్న చూపు చూస్తాడు. చూస్తే చూశాడులే కానీ మన గురించి కొంచెం తప్పు ఎక్కువగా బయట కూడా చెప్పొచ్చు. కాబట్టి నేనేమంటానంటే మీరు ఏ పని చేసినా సరే మీ మీద మీరు నమ్మకం ఉంచుకోవాలి ఆత్మవిశ్వాసాన్ని కొంచెం గట్టిగా మీ మీద మీరు పెట్టుకోవాలి అన్నమాట. అలా కాకుండా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే మాత్రం కచ్చితంగా మీ మీద మీకు నమ్మకం ఉండదు మీరు చేసే పని మీద అసలు నమ్మకం ఉండదు ప్రతి ఒక్క పనికి వేరే వాడి మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోండి
దయగా ఉండటం
ఇంకా రెండో చిట్కా వచ్చేసి ప్రతి ఒక్క మనిషి పట్ల మీరు కొంచెం దయగా ఉండండి. అలా ఉండటం వల్ల మీరు ఏదైతే మనుషులకి ఇస్తున్నారో అదే మీకు ఖచ్చితంగా తిరిగి వస్తుంది. అలా కాకుండా చిన్న చిన్న విషయాలకి బూతులు తిట్టుకుంటూ కొంచెం కోపం చూపిస్తూ మనుషుల మీద చిరాకు పడ్డారు అనుకోండి కచ్చితంగా వాళ్ళు కూడా మీ మీద ఏదో ఒక రోజు చిరాకు పడతారు. కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే ఈ సమాజం ఎలాంటిది అంటే మనం 100% మనుషులతో మంచిగా ఉన్నాం అనుకోండి వాళ్ళు ఓ 10% 15% మనతో మంచిగా ఉంటారు. అలాంటిది వాళ్ళు 100% మంచిగా ఉండాలంటే మనం ఇంకెంత మంచిగా ఉండాలి. కానీ ఒకవేళ మనం గనక వాళ్ళతో కొంచెం రాష్ గా ఉన్నాం అనుకోండి ఇంక వాళ్ళు ఇచ్చే అవుట్ పుట్ ఉంటే చూడండి అది మామూలుగా ఉండదు. వాళ్ళు ఇవ్వటం వల్ల ఏంటంటే మీ టైం వేస్ట్ వాళ్ళకి టైం వేస్ట్ వాళ్ళు ఎలాగో టైం గురించి ఆలోచించుకోరు మీ టైం వేస్ట్ అవుతుంది కదా. కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే నూటికి నూరుతం మీరు అవతల వాళ్ళ పట్ల కొంచెం జాలి దయ చూపిస్తూ ఉండండి. ఒకడు ఏమన్నా నోరు జారి మాట్లాడినా సరే వాడిని వాళ్ళ అమ్మ నాన్న సరిగ్గా పెంచలేదని చెప్పేసి వదిలేయండి. అంతే కానీ వాడిని పట్టుకొని వాడితో ట్రావెల్ అవుతూ వాడంటే బురద తక్కువోడు కాబట్టి మిమ్మల్ని తిడుతున్నాడు. కానీ మీరు కూడా మీ బుర్ర తక్కువతనం చేసుకొని వాళ్ళని తిట్టేసి వాళ్ళతో ట్రావెల్ చేయమాకండి మీ సమయాన్ని వేస్ట్ చేసుకోమాకండి. కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే అవతల వాళ్ళ పట్ల జాలి దయతో ఉండండి ఒకవేళ అవతల వాళ్ళదే తప్పు అనుకోండి పాపం వాళ్ళ మానసిక స్థితి సరిగా లేదని చెప్పేసి మీలో మీరు నవ్వుకొని ఆ విషయాన్ని అక్కడే వదిలేసి ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి. అలాగే మీ పని మీరు చేసుకోవడం వల్ల ఆటోమేటిక్ గా వద్దన్నా సరే అవతల వాళ్ళు మీకు గౌరవిస్తారు. ఎందుకంటే వాళ్ళతో మీరు అనవసరంగా మాట్లాడరు. అంతే కాకుండా మీరు మాట్లాడే విషయం కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. వాళ్ళతో పిచ్చాపాటి మీటింగ్ వేరు కదా అలా ఉండటం వల్ల అవతల వాడు మన టైం వేస్ట్ చేయడానికి ఆల్మోస్ట్ ఆలోచిస్తూ ఉంటాడు. మనతో కేవలం పని ఉన్నప్పుడు మాత్రమే వచ్చి మాట్లాడతాడు. దాని వల్ల మనకి ఆటోమేటిక్ గా గౌరవం అనేది వస్తుంది కాబట్టి మీరు అవతల వాళ్ళ పట్ల జాలి దయతో ఉండండి ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు కూడా మాక్సిమం ఉండటానికి ట్రై చేస్తారు.
నిజాయితీగా ఉండటం
ఇంకా టిప్ నెంబర్ త్రీ ఇది కొంచెం కష్టమైనా సరే మీరు తప్పకుండా దీన్ని గనక పాటిస్తే ఇక మిమ్మల్ని ఎవరు ఆపలేరు. అదేంటంటే మీరు ఎప్పుడూ నిజాయితీగా ఉండటం నిజాయితీగా ఉండటం కొంచెం కష్టమే కానీ ట్రై చేయండి. ఎందుకంటే మన పని అవ్వగొట్టుకోవాలని చెప్పేసి మీ విలువలను కూడా మీరు మర్చిపోయి మీ అవసరం కోసం మీరు అబద్ధాలాడి. నిజం చెప్పాలంటే అవతల వాళ్ళ ముందు బ్లేమ్ అయి కూడా కూడా కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటారు. నేనేమంటున్నానంటే వాటనన్నిటిని పక్కన పెట్టండి మీరు 100 కి 100% నిజాయితీగా ఉండడం అనేది జరగదు కానీ. నేనేమంటానంటే మీ వరకు అంటే మీ దగ్గరికి ఎవరైనా వచ్చినా ఏదైనా హెల్ప్ అడిగినా మీ వంతు ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు ప్రాపర్ గా మీరు నిజాయితీగా ఉండండి. అలా ఉండటం వల్ల జీవితాంతం మీరు నిజాయితీగా ఉండటం అలవాటు చేసుకుంటారు అలా అలవాటు చేసుకోవడం వల్ల మీకు ఆటోమేటిక్ గా గౌరవం అనేది తన్నుకుంటూ వస్తది. ఎందుకంటున్నానంటే జనాలు మిమ్మల్ని చూసే పర్స్పెక్టివ్ మారిపోతుంది అలా మారటం వల్ల ఆటోమేటిక్ గా మీకు గౌరవం వస్తుంది. కాబట్టి కొంచెం కష్టమైనా సరే నిజాయితీగా ఉండండి.
తప్పు చేస్తే ఒప్పుకోండి
ఇంకా నాలుగో టిప్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే తప్పు చేస్తే ఆ తప్పుని అందరి ముందు ఒప్పుకోండి. మీరు గనక ఒప్పు చేస్తే మాత్రం ఎంతమంది వచ్చేది తప్పు అన్నా సరే కచ్చితంగా నేను కరెక్టే చేశాను అని చెప్పేసి అందరికీ మొహమాటం లేకుండా చెప్పండి. మీ పట్ల మీరు జాలి దయ అస్సలు చూపించుకోకండి. ఎందుకంటే మనల్ని మనం ఎలా ట్రీట్ చేసుకుంటాం అలాగే అవతల వాళ్ళని కూడా ట్రీట్ చేయాలి కానీ అవతల వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తే మనల్ని మనం అలా ట్రీట్ చేసుకోవాలి. ఈ విషయం మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మీరు తప్పు చేస్తే ఫస్ట్ అఫ్ ఆల్ ఎవడో ఒకడు వచ్చేసి మిమ్మల్ని విమర్శించేదాకా అక్కండి మిమ్మల్ని మీరు విమర్శించుకోండి ఆ తర్వాత మీ తప్పును ఒప్పుకోండి అలా తప్పు ఒప్పుకోవడం వల్ల కూడా ఈ సమాజంలో మనకి ఆటోమేటిక్ గా గౌరవం వస్తుంది. ఇందాక నుంచి వస్తున్నాను గౌరవం వస్తుంది గౌరవం వస్తుంది అంటున్నారు దాని వల్ల మనకు ఉపయోగం ఏంటి అని అడిగితే మాత్రం దాని వల్ల చాలా ఉపయోగం ఉంది. నిజం చెప్పాలంటే ఒక పెళ్లి చేయాలంటే అటు ఇటు తరాలు ఇటు ఇటు తరాలు చూసి పెళ్లి చేయాలి అని అంటారు కదా ఎందుకు చెప్పనా ఇందుకని. ఆ కుటుంబం గౌరవం గల కుటుంబమా ఆ కుటుంబం కష్టాలు వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది ఆ కుటుంబంలో ఉన్న మనుషులు ఎలా ఉంటారు అని చెప్పేసి ప్రాపర్ గా గౌరవ మర్యాదలన్నీ తెలుసుకొని ఆ కుటుంబంలోకి అబ్బాయినో ఆ అమ్మాయినో పంపిస్తారు. ఇలాగ పెళ్లి విషయంలోనే కాదు ప్రతి ఒక్క విషయంలో ఉదాహరణకి మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఎవరి ఇంటికైనా వెళ్లి నాకు కొంచెం సమస్యగా ఉంచి కొంచెం సహాయం చేస్తారని చెప్పి అడిగినా కూడా అవతల వాడికి మీ మీద ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా. అది గౌరవం అవ్వచ్చు అగౌరవం అవ్వచ్చు అగౌరవంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాడి దగ్గర డబ్బులు ఉన్నా కూడా మిమ్మల్ని పక్కకు పంపించేస్తాడు. కానీ నిజంగా మీరు అతని దగ్గర గౌరవం సంపాదించుకుంటే అతను మీకు ఇచ్చే విలువ అంతేకాకుండా మీరు ఆపదలో ఉంటే అతను విధానం చాలా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం సమాజంలో గౌరవం సంపాదించుకోవడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి.
కాబట్టి ఈ నాలుగు పాయింట్లు మీరు తూచా తప్పకుండా పాటిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఆటోమేటిక్ గా గౌరవం వస్తుంది. అలా గౌరవం వస్తే ఏమవుతుంది ఈ సమాజంలో మీకంటూ ఒక విలువ ఉంటుంది. మీకు ఉంటే ఆటోమేటిక్ గా మీ కుటుంబ సభ్యులకు ఉంటుంది ఇంకా ముఖ్యంగా మీ కుటుంబానికి ప్రాపర్ గా ఒక రెస్పెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఏదేమైనా సరే ప్రతిదీ మనకి అడుక్కుంటూ వచ్చేసిద్ది కానీ ఈ రెస్పెక్ట్ అనేది మాత్రం మనం ఖచ్చితంగా సంపాదించి మాత్రం వస్తుంది సంపాదించుకోవడం అంత ఈజీ కాదు అలా అని చెప్పేసి అంత కష్టం కూడా కాదు. కాబట్టి ప్రాపర్ గా మన అలవాట్లు చేంజ్ చేసుకొని మన లైఫ్ స్టైల్ ని మార్చుకొని ప్రాపర్ గా మనం ఈ సమాజానికి టచ్ లో ఉంటూ వాళ్ళని అబ్సర్వ్ చేస్తూ మనల్ని మనం అర్థం చేసుకుంటూ మనల్ని మనం తగ్గించుకుంటూ మన జీవితంలో ముందడిగేస్తే కచ్చితంగా మనకి గౌరవం అనేది తన్నుకుంటూ వస్తుంది.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.