మీ జీవితాన్ని ఎలా రీసెట్ చేయాలి – Restart Your Life in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Restart Your Life in Telugu గురించి తెలుసుకుందాం.
జీవితాన్ని రీస్టార్ట్ చేయండి
ఇక డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోదాం మామూలుగా ఏ మనిషి అయినా సరే తన జీవితంలో కచ్చితంగా ఒక చోట స్ట్రక్ అయిపోతాడు అంటే జీవితం అక్కడ ఆగిపోతుంది అన్నమాట. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే కచ్చితంగా జీవితాన్ని రీస్టార్ట్ చేయాలి అలా ఎలా చేస్తాం అనేది ఈ రోజు మన టాపిక్.
ఇంకా డైరెక్ట్ గా వీడియో లోకి వెళ్ళే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే మన ఛానల్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి
ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక చోట తను అనుకున్నట్లు జరగక అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటాడు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక బిజినెస్ పెట్టాం అనుకోండి ఆ బిజినెస్ లో లాస్ రావటం. ఉదాహరణకి మనం ఒక పెద్ద చదువు చదివాం అనుకోండి ఆ చదువుకి ఉద్యోగం రాకపోవడం. ఇంకా ముఖ్యంగా మనం ఒక జీవిత లక్ష్యాన్ని పెట్టుకొని పరిగెడుతూ ప్రాసెస్ లో మన లక్ష్యాన్ని మనం చేరుకోలేక అక్కడే నుంచుని ఆలోచించడం. అలాంటి సమయంలో ఏ మైండ్ అయినా ఏం చేయాలంటే, ఫస్ట్ అఫ్ ఆల్ లైఫ్ ని రీస్టార్ట్ చేయాలి అంటే ఒక్కసారి మీ జీవితాన్ని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సరే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అది ఎలాగంటే ఫస్ట్ అఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ జీవితాన్ని ప్రాపర్ గా అనాలసిస్ చేసుకోవడం. అంటే ఇప్పుడు మీరు ఒక జర్నీ స్టార్ట్ చేశారు కదా నేను జీవితంలో ఇది సాధించాలి అని చెప్పేసి అలా అప్పటి నుంచి ఇప్పుడు మీరు ఓడిపోయి రోడ్డు మీద నుంచుకున్నంత వరకు మీరు ప్రాపర్ గా ఏం చేశారు ఏ తప్పులు చేశారు ఏం ఒప్పులు చేశారు ఎందుకు నేను జీవితంలో ఓడిపోయాను అని చెప్పేసి ప్రాపర్ గా మీ జర్నీని మీరు అనాలసిస్ చేసుకోవాలి. అలా అనాలసిస్ చేసుకున్న తర్వాత అందులో మీకు కొన్ని తప్పులు తెలుస్తాయి ఆ తప్పులు మీరు జీవితంలో మళ్ళీ చేయకూడదు కదా అందుకని మీరు మీ జీవితాన్ని ప్రాపర్ గా అనాలసిస్ చేసుకోవాలి. మన జీవితంలో మనం ఓడిపోవడానికి 100 కారణాలు ఉంటాయి అందులో మన ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకపోతే మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు. నిజం చెప్పాలంటే మన జీవితంలో మనం ఓడిపోవడానికి మనం కూడా కారణం కావచ్చు. కాబట్టి మనం తప్పు చేస్తే మనల్ని మనం మార్చుకుందాం మన ఫ్రెండ్స్ తప్పు చేస్తే వాళ్ళని కొంచెం మార్చడానికి ట్రై చేస్తాం వాళ్ళు మారకపోతే వాళ్ళని అక్కడే వదిలేద్దాం. కుటుంబ సభ్యులు ఏదైనా మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారా సరే వీళ్ళ మాటలు పట్టించుకోకూడదు అని చెప్పేసి మన పని మనం చేసుకుంటూ పోతాం. ఇలాగ మీ జర్నీని మీరు ప్రాపర్ గా అనాలసిస్ చేసుకోగలిగితే ఆల్మోస్ట్ మీరు 50% మీరు అనుకున్న పనిలో మీరు సక్సెస్ అయినట్టే.
ఇంకా రెండో పాయింట్ ఏంటంటే మీరు మీ జీవితాన్ని రీస్టార్ట్ చేసిన తర్వాత, నెక్స్ట్ మీ జీవిత లక్ష్యం అవ్వచ్చు మీ ఎడ్యుకేషన్ కెరియర్ అవ్వచ్చు దాన్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి మనం ఈ పని చేసిన తర్వాత నెక్స్ట్ మన జీవితం ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్రాపర్ గా మీ లక్ష్యాన్ని మీరు సెట్ చేసుకొని ఆ లక్ష్యం కంప్లీట్ అయిన తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్రాపర్ గా విజువలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఏ పని చేసినా ఒక ఉపయోగం ఉంటేనే కదా మనం చేసేది ఆ ఉపయోగాన్ని మనం ముందుగానే ఊహించుకోవడం వల్ల పని చేయటం మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఉదాహరణకి రోజంతా కష్టపడితే మనకు ₹2000 డబ్బులు వస్తున్నాయి అనుకోండి ఆ ₹2000 మన జీవితానికి ఎంత ఉపయోగపడతాయి అనే పాయింట్ ని మీరు ఉదయాన్నే ఊహించుకోగలిగితే ఆ రోజంతా పని పర్ఫెక్ట్ గా చేస్తారు. అలాగే మనం చదువుకున్న తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది, మనం బిజినెస్ చేసిన తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్రాపర్ గా విజువలైజ్ చేసుకోగలిగితే మనం ఆ పనిని పర్ఫెక్ట్ గా చేస్తాము ఇంట్రెస్ట్ గా చేస్తాము నిజం చెప్పాలంటే ఇరగదీసి అవతలు పడేస్తాం.
మీ జీవితాన్ని మీరు రీస్టార్ట్ చేసిన తర్వాత మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మార్పులను స్వీకరించడం అంటే జీవితంలో వచ్చే మార్పుల్ని ఖచ్చితంగా స్వీకరించి తీరాలి. ఎందుకంటే అప్పటివరకు మనం చూసిన జీవితం లాగా మన జీవితం ఉండదు. మనం కష్టపడేటప్పుడు మనం ఒక పని చేసేటప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం చదువుకునేటప్పుడు లేదా ఒక కొత్త రకం ఉద్యోగాన్ని మనం చేయాలని చెప్పి మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనకి ఇంతకు ముందున్న జీవితానికి ఇప్పుడు జరగబోయే జీవితానికి చాలా చేంజెలు వస్తాయి. వాటన్నిటిని స్వీకరించి వాటిని ఎదుర్కొని వాటిని మనం మనకు అలవాటు అయ్యేలా చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఆల్మోస్ట్ మనం 99% సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఏ మనిషి అయినా సరే తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కష్టపడటం మొదలు పెడితే కచ్చితంగా సక్సెస్ అవుతారు. నిజం చెప్పాలంటే ఒక మనిషికి డబ్బులు కావాలి ఒక మనిషికి 100 కోట్లు ఉన్నప్పుడు తను కష్టపడటం ఎందుకు కానీ ఆ 100 కోట్లను కూడా పనంగా పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తే అది కచ్చితంగా 1000 కోట్లు అవుతుంది కదా. తన కంఫర్ట్స్ అన్ని వదిలేసుకొని తన దగ్గర ఉన్న 100 కోట్లతో బిజినెస్ చేయబట్టే కదా 1000 కోట్లు సంపాదించింది. అలాగే మన దగ్గర ఉన్న శక్తిని కూడా మంచం మీద పడుకొని రీల్స్ చూడటం కాకుండా ఆ ఎనర్జీని కాస్త యూస్ చేసుకొని దాన్ని మనీగా కన్వర్ట్ చేస్తే మన జీవితం బాగుంటుంది ఇంకా చెప్పాలంటే మనం ఫిజికల్ గా కూడా చాలా బాగుంటాం. కాబట్టి జీవితంలో వచ్చే మార్పుల్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరాలి యాక్సెప్ట్ చేస్తేనే మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది. లేదు కంఫర్ట్ జోన్ లో ఉంటానంటే మీకు వచ్చే శాలరీ తో మీకున్న ఉద్యోగంతో మీరు హ్యాపీగానే ఉంటారు. కానీ మీ జీవితంలో ఎదుగుదల మాత్రం అస్సలు ఉండదు.
ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే మీరు జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్న లేకపోతే నేను పని చేయాలి ఈ స్థాయిలో నేను ఉండాలి అని అనుకుంటే మాత్రం కచ్చితంగా ఆ పనిని ఈ క్షణం నుంచే స్టార్ట్ చేయండి లేట్ చేయమాకండి. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి ఈ క్షణం నుంచే కష్టపడండి కచ్చితంగా మీరు జీవితంలో అనుకున్న సాధిస్తారు లేదు నేను టైం వేస్ట్ చేస్తా అనుకుంటే మిమ్మల్ని ఈ జీవితంలో ఎవ్వరూ మార్చలేరు మిమ్మల్ని మీరు కూడా మార్చుకోలేరు. కాబట్టి లైఫ్ ని ఎప్పుడైనా సరే ఒకచోట ఆగిపోయినప్పుడు మనం ఓడిపోయినప్పుడు మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదు జీవితాన్ని అక్కడి నుంచే రీస్టార్ట్ చేస్తే కచ్చితంగా మనం అనుకున్నది సాధిస్తాం. ఎందుకంటే ఉన్నదే ఒక జీవితం కదా మనం అనుకున్నవన్నీ జరిగితే ఆ జీవితానికి అర్థమేమి ఉండదు కానీ మన చేతుల్లో ఉన్నది కేవలం కష్టపడటం మాత్రమే. కాబట్టి ఓడిపోయిన ప్రతిసారి జీవితాన్ని రీస్టార్ట్ చేయండి కచ్చితంగా సక్సెస్ అవుతారు.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.