జీవితంలో చేయకూడని 4 పొరపాట్లు – jeevitham lo cheyakudani porapatlu
ఇవాళ్టి టాపిక్ లో jeevitham lo cheyakudani porapatlu గురించి తెలుసుకుందాం.
జీవితంలో చేయకూడని 4 పొరపాట్లు
ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుంటున్నాం అదేంటంటే జీవితంలో మనం చేయకూడని నాలుగు తప్పులు. ఈ నాలుగు తప్పుల మీద మనకి గనక ప్రాపర్ అవగాహన అనేది ఉంటే మన జీవితంలో మనం ఫేస్ చేస్తున్న చాలా సమస్యలు మనకి తెలియకుండానే మనకి దూరమైపోతాయి.
తొందరగా నిర్ణయాలు తీసుకోవడం
వీటిలో మనం చేస్తున్న మొదటి తప్పు ఏంటంటే తొందరగా నిర్ణయాలు తీసుకోవడం. కొన్నిసార్లు మనం ఆలోచించకుండా ఒకచోట నుంచొని తొందరపాటుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము. అలా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆ నిర్ణయం మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనకు ఉన్న ప్రతి ఒక్క పాయింట్ ని ప్రాపర్ గా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం మనకి ఎంతవరకు కరెక్ట్ ఒకవేళ తీసుకోకపోతే ఎంతవరకు రాంగ్ అని చెప్పేసి ప్రాపర్ గా డిసైడ్ చేసుకొని అది కూడా మనం ఆవేశంగా ఉన్నప్పుడు అస్సలు నిర్ణయాలు తీసుకోకూడదు. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. మనం చాలా సమస్యలకి దూరం అవుతాం లేదనుకోండి లేనిపోని సమస్యలనే కొని తెచ్చుకుంటాం.
డబ్బు మాత్రమే
ఇంకా రెండో తప్పు డబ్బు మాత్రమే ముఖ్యం అనుకోవటం డబ్బు అనేది ఏ మనిషికైనా చాలా అవసరం అది ముఖ్యమే. కానీ డబ్బుతోనే అన్ని పనులు అయిపోతాయి డబ్బే చాలా ముఖ్యం అనుకుంటే మాత్రం మీరు సాంబార్లో కాలేసినట్లే. డబ్బు కన్నా ముఖ్యమైనవి మన జీవితంలో కొన్ని ఉంటాయి అది ఆరోగ్యం, కుటుంబం, సంతోషం ఇవి డబ్బు కన్నా చాలా వాల్యూ అయినవి.
ఉదాహరణకి మీకో విషయం చెప్పనా బాగా డబ్బు ఉన్నవాళ్ళకి ఆరోగ్యం ఉంటుందా ఉండదు అంతే కాకుండా బాగా డబ్బు సంపాదించేవాడు కుటుంబంతో టైం స్పెండ్ చేయగలడా చేయలేడు ఎందుకంటే అతను లైఫ్ లో చాలా బిజీ గా ఉంటాడు. ఇంకా ముఖ్యంగా బాగా డబ్బు సంపాదించాడే అనుకుందాం తను సంతోషంగా ఉంటాడా ఉండడు తన లక్ష్యాన్ని తను చేరుకున్నప్పుడే సంతోషంగా ఉంటాడు. దీన్ని బట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే డబ్బు అనేది కొన్ని విషయాల్లో మాత్రమే ముఖ్యం కానీ అన్ని విషయాల్లో ముఖ్యం అంటే మాత్రం నేను ఒప్పుకోను. మన ఆరోగ్యం విషయంలో కుటుంబం విషయంలో మన జీవితంలో మనం సంతోషంగా ఉన్నామా లేదా అనే విషయంలో డబ్బు అనేది చాలా చిన్నది. కాబట్టి డబ్బు మాత్రమే ముఖ్యం అనుకోమాకండి. ఈ డబ్బుని మన మైండ్ లో నుంచి తీసేయడం వల్ల మనం చాలా కంఫర్ట్ గా ఉంటాం అండి.
మనం ఇతరులతో పోల్చుకోవడం
ఇంకా మూడో తప్పు ఏంటంటే మనం ఇతరులతో పోల్చుకోవడం. ఈరోజు సోషల్ మీడియా ప్రభావం మనుషుల మీద ఎంత ఉందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడో అప్పులు చేసి ఏదో కొనుక్కొని సోషల్ మీడియాలో అందరి ముందు షో చేస్తున్నాడు అనుకోండి వాడిని చూసి పాపం చాలా మంది మోసపోతున్నారు అరే నిజంగా జీవితం అంటే ఇలా బతకాలి మనం బతుకుతుంది అసలు జీవితమే కాదని చెప్పేసి ఇతరులతో మనం పోల్చుకొని మనల్ని మనం తక్కువ అంచనా వేసుకొని మనకి నిరుత్సాహం వచ్చేసేలా చేసుకుంటాం మనం. కాబట్టి నేనేమంటానంటే ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం మనకు లేదు వాడికి డబ్బు ఎలాగ వచ్చిందో వాడు డబ్బు ఎలా సంపాదిస్తున్నాడో వాడు EMI పెట్టుకొనుకొని బయట షో చేస్తున్నాడో మనకు తెలియదు. కాబట్టి నేనేమంటానంటే మీరు సంపాదించే డబ్బుతో మీరు హ్యాపీగా ఉండండి. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కడి జర్నీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. అలా అని చెప్పేసి అందరి జర్నీలో ఒకేలా ఉండాలంటే కష్టం. కాబట్టి నేను ఏమంటానంటే నీ జర్నీని నువ్వు ఎంజాయ్ చెయ్ నీ ప్రయాణాన్ని నువ్వు ప్రేమించు అలా ప్రేమించడం వల్ల నీ లైఫ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నువ్వు కూడా పుట్టినందుకు కొంచెం సాటిస్ఫాక్షన్ గా ఉంటావు. అంతేగాని పక్కనోళ్ళతో పోల్చుకొని బతకడం వల్ల నువ్వు ఎందుకు పుట్టానురా బాబు అనే ఫీలింగ్ లో వస్తుందే తప్ప నీ జీవితానికి ఉన్న పరమార్థాన్ని నువ్వు తెలుసుకోకుండానే పోతావు. కాబట్టి ఉన్న దానితో హ్యాపీగా ఉండు మంచి లక్ష్యాన్ని పెట్టుకొని దాని కోసం పోరాడు. అంతే కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ అలా నేను ఎందుకు లేనని బాధపడితే నష్టపోయేది కేవలం నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ నష్టపోరు.
భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం
ఇంకా మనం చేస్తున్న నాలుగో తప్పు ఏంటంటే భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం. మనం భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూ ప్రస్తుతం ఉన్న జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం ఆ విషయం మీకు అర్థం కావట్లేదు. రేపు ఏం జరుగుతుందో రేపు ఏం జరిగితే నేను ఏం చేయాలో అని మీలో మీరు జరగని విషయానికి బాధపడి ప్రస్తుతం మన చేతిలో ఉన్న ఆ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు మీరు ఇప్పుడు కష్టపడి డబ్బులు సంపాదించుకుంటే రేపటి జీవితంలో బాగానే ఉంటారు. కాకపోతే రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజు పని మానుకొని కూర్చుంటే కచ్చితంగా రేపు బాధపడతారో లేదో తెలియదు కానీ ఈరోజు మాత్రం కచ్చితంగా బాధపడతారు. కాబట్టి మనం భవిష్యత్తు గురించి ఆలోచించి మన పురపాడు చేసుకోవడం కన్నా ప్రస్తుతం మన ముందున్న ఈ రోజుని మనం కంప్లీట్ చేయాలి. అది కూడా మనకు నచ్చినట్లు ప్రాపర్ గా మనకి ఇష్టం వచ్చిన పని చేసుకుంటూ ప్రశాంతంగా ఈ రోజు ఉన్నాం అనుకోండి రేపు కూడా ఇలాగే ఉంటుంది అంతకు మించి ఏమి ఉండదు. కాబట్టి భవిష్యత్తు గురించి మీరు బాధపడిపోవడాన్ని కొంచెం మానుకోవాలి. అలా చేయటం వల్ల మీరు హ్యాపీగా ఉంటారు లేదనుకోండి మీరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ప్రస్తుతం ఉన్న సంతోషాన్ని పోగొట్టుకుంటారు రేపు పొద్దున కూడా అదే బాధపడుతూ మీ జీవితంలో అసలు సంతోషం అనేది లేకుండా మీరే చేసుకుంటారు.
కాబట్టి భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేయండి ఈ నాలుగు తప్పులు చేయకుండా ఉంటే మనం జీవితంలో మరింత సక్సెస్ అవుతాం సంతోషంగా ఉంటాం. ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి ఒక మనిషి జీవితంలో కాబట్టి ఈ నాలుగు తప్పులు అసలు చేయకండి. అదండి సంగతి పనిలో పనిగా మీరు చేస్తున్న ఐదో తప్పు కూడా చెప్తాను. మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేయకుండా మన ఛానల్ లో వీడియోలు చూస్తున్నారు కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే మన బ్లాగ్ ని ఫాలో చేయడం వల్ల మన బ్లాగ్ లో వచ్చే అద్భుతమైన టాపిక్ లు మీకు కాస్తో కొస్తో ఉపయోగపడతాయి కాబట్టి మన బ్లాగ్ ని కూడా ఫాలో చేయండి.
1 thought on “జీవితంలో చేయకూడని 4 పొరపాట్లు | jeevitham lo cheyakudani porapatlu”