ధనవంతులు పాటించే నియమాలు – millionaire motivation in telugu
ఇవాళ్టి టాపిక్ లో millionaire motivation in telugu గురించి తెలుసుకుందాం.
ధనవంతులు పాటించే నియమాలు
ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి అయినా సరే ఏదో ఒక పని చేసుకోవాలి ఆ పని చేసుకొని కాస్తో కోస్తో డబ్బులు సంపాదించుకోవాలి అది ప్రతి ఒక్క మనిషికి ఉన్న ప్రప్రథమ బాధ్యత. కానీ అందరూ కష్టపడుతున్నప్పుడు అందరూ డబ్బులు సంపాదిస్తున్నప్పుడు కానీ కోటీశ్వరులుగా కొంతమంది మాత్రమే ఎన్నుకుంటున్నారో తెలుసా వాళ్ళకి ప్రాపర్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్‌లు ఉంటాయి. అంతేకాకుండా డబ్బుని ఎలా సంపాదించాలి ఆ డబ్బుతో మరికొంత డబ్బుని ఎలా సంపాదించాలి అని చెప్పి చెప్పేసి వాళ్ళ దగ్గర ప్రాపర్ ప్లాన్ ఉంటుంది. కానీ మిగతా వాళ్ళ దగ్గర అంటారా అలాంటిది ఏమి ఉండదు వాళ్ళు నెలంతా కష్టపడతారు ఒకటో తారీకున జీతం వస్తుంది, ఐదో తారీకున ఆ జీతాన్ని అవగొట్టుకుంటారు మిగతా 20 రోజులు మళ్ళీ యాస్ ఇట్ ఈజ్ గా బానిస బతుకుని బ్రతుకుతారు. కానీ వాళ్ళందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే డబ్బులు సంపాదించడం పెద్ద విషయం ఏం కాదు, మనం కష్టపడితే ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ డబ్బుని దాచిపెట్టడం అంతే కాకుండా ఆ డబ్బుని ప్రాపర్ గా యూస్ చేయడం మనం ఇంకోసారి కష్టాల్లోకి వెళ్లకుండా ఉండటం అనేది చాలా కష్టమైన పని. ఈరోజు మన టాపిక్ కూడా అదే అసలు మనం డబ్బుని ఎలా వాడాలి, ఎలా వాడుకుంటే మనం జీవితాంతం హ్యాపీగా ఉంటాము అనేది ఈ రోజు మన టాపిక్ millionaire motivation in telugu.
.
FINANCIAL AWARENESS
ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే ఫస్ట్ అఫ్ ఆల్ ఏ మనిషికైనా సరే ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది చాలా అవసరం. మీరు డబ్బు సంపాదిస్తారు బాగానే ఉంటుంది ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది అసలు మనకి రోజు ఎంత ఖర్చు అవుతుంది. మనం చివరికి ఎంత మిగులుస్తున్నామో అసలు ఏ డబ్బులు మిగలట్లేదు అనుకుంటే మనం ఏ ఖర్చులను తగ్గించుకోవాలి లేదు మనకి డబ్బులు మిగులుతుంది అంటే ఉన్న వాటిలో వేస్ట్ ఖర్చులు ఏమేమి పెడుతున్నావ్ ఇంకా కొంచెం క్లారిటీ తెచ్చుకొని ప్రాపర్ గా ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్క మనిషి తెచ్చుకోవాలి.
ఉదాహరణ చెప్పనా మామూలుగా చాలా మంది ఏం చేస్తారు ఒక 10 నెలలు ఈఎంఐ పెట్టుకొని ఒక పనికిమాలిన వస్తువును కొంటారు. ఉదాహరణకి అవసరం లేకపోయినా iphone కొంటాం నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు iphone కొనటం వేరు కానీ వేరే వాడి చేతిలో ఐఫోన్ చూసి నువ్వు దాన్ని 10 నెలలు 15 నెలలు ఈ పెట్టి కొనుక్కోవడం వల్ల అసలు నీకు ఏమైనా ఉపయోగం ఉందా. నిజం చెప్పాలంటే ఒక సంవత్సరం గడిచే లోపు ఇంకో కొత్త ఐఫోన్ మోడల్ వచ్చేస్తది నీ చేతిలో ఉన్న ఐఫోన్ పాతది అయిపోతుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే దాని బదులు మీకు ఉపయోగపడే ఒక వస్తువును కొనుక్కోవడమో లేకపోతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడమో అది కూడా కాకపోతే ఇంకొంచెం డబ్బులు జమ చేసుకొని ఒకచోట ల్యాండ్ కొనటమో ఇవి చేయడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. కానీ ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో పాడైపోయే వస్తువుల్ని మీరు ఎంత పెట్టి కొన్నా సరే మీరు నెలంతా పని చేసి ఆ జీతం కోసం వెయిట్ చేసే వాళ్ళ లిస్ట్ లో తప్పకుండా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది తప్పకుండా అవసరం. అది ఉండటం వల్ల మనం ఎటువంటి వస్తువులు కొనాలి ఎటువంటి వస్తువులు కొనకూడదు. ఏది కొంటే మనకి డబ్బులు బాగా కలిసి వస్తాయి ఏది కొనుక్కుంటే ఉన్న డబ్బులు మనం పోగొట్టుకుంటాం అని చెప్పేసి ప్రాపర్ ఐడియా వస్తుంది.
SAVINGS
ఇంకా రెండో పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి సేవింగ్స్ అనేవి ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. వచ్చిన జీతాన్ని వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ అంతేకాకుండా రాబోయే జీతాన్ని కూడా ఇప్పుడే అప్పులు చేసుకుంటూ గనుక కూర్చుంటే మీ జీవితం మీకు నరకంలా అనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే జీతానికి నువ్వు ఇప్పుడే అప్పులు చేసినప్పుడు ఆ రోజు నీకు జీతం వచ్చినప్పుడు కూడా మనశాంతి ఉండదు. కాబట్టి నేను ఏమంటానంటే ఇప్పటి నుంచే మనం డబ్బుని అతిగా ఖర్చు పెట్టకుండా అలా అని చెప్పేసి అసలు ఖర్చు పెట్టకుండా దాచిపెట్టుకోమని నేనైతే చెప్పట్లేదు. మనం ఈ భూమి మీద పుట్టడానికి మనం ఒక పని చేయటానికి మెయిన్ రీసన్ ఏంటంటే మనం ఆనందంగా ఉండటం. ఆ ఆనందం అనేది సరైన పద్ధతిలో పొందుతున్నామా లేకపోతే పనికిమాలిన విషయాలకు ఎక్కువ దగ్గర అవుతున్నామా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఉంటుంది. కాబట్టి డబ్బు సంపాదించేది ఆ తర్వాత పని చేసుకునేది మనసు సుఖంగా ఉండటానికి అంతేగాని మన ఆరోగ్యం చెడగొట్టుకోవడానికో లేకపోతే మన పరువును రోడ్డు మీద పడవేయడానికో కాదు. కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే ప్రతి ఒక్క మనిషి తాను సంపాదించే జీతంలో కొంత సేవింగ్ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల అనుకోకుండా వచ్చే ఆపదల నుంచి మనం మనల్ని కాపాడుకోవచ్చు.
ఉదాహరణకి కోవిడ్ అవ్వచ్చు, లేకపోతే అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, ఇంకా ముఖ్యంగా సడన్ గా మన ఉద్యోగం ఊడిపోయింది అనుకోండి మనకి ఇంకొక ఉద్యోగం వచ్చేంత వరకు మనం సర్వే అవ్వాలి కదా. అందుకని ప్రతి ఒక్క మనిషికి సేవింగ్స్ అనేవి చాలా అవసరము. అంతేకాకుండా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అనేది మనిషికి ఉండాలన్నమాట మనం లాంగ్ టర్మ్ లో మన జీవితం ఎలా ఉండాలని చెప్పేసి ఇప్పుడే డిజైన్ చేసుకోవాలి. అంతేగాని ఏదో జరుగుతుందిలే ఏముందిలే అని చెప్పేసి మీరు మీ లైఫ్ ని గనక జోక్ గా తీసుకుంటే చివరికి ఇబ్బంది పడేది మీరే. ఎందుకంటే ఏ మనిషి అయినా సరే ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళని వాళ్ళ పిల్లలు చూస్తే అదృష్టవంతులు ఇంకా వాళ్ళు అంత అదృష్టవంతులు ఈ భూమి మీద ఎవరు ఉండరు. కానీ పిల్లలే అప్పులు పాలు అయిపోయి వాళ్ళ జీవితంలో వాళ్ళు పోరాడుతూ ఉన్నారు అనుకోండి ఇంక మనల్ని ఏం చూస్తారు. కాబట్టి మనకంటూ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అనేది ఆ పాయింట్ గనక మనకు తట్టకపోతే మనం చివరి దశలో నరకాన్ని చూస్తాం. కాబట్టి ఇప్పటి నుంచే మనం డబ్బుని అతిగా ఖర్చు పెట్టకుండా తగ్గించుకొని ఉంటాం మన అవసరాలకు తగ్గట్టుగా మనం ఫైనాన్షియల్ ప్లాన్ వేసుకోవాలి. ఎవరో ఏదో చేశారు అని చెప్పేసి ఇంకెవరో ఏదో కొన్నారు అని చెప్పేసి వాళ్ళని చూసి మనం కూడా అదే దోలా వెళ్ళాం అనుకోండి చివరికి నష్టపోయేది మనమే. చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం డబ్బుని గౌరవిస్తే చివరి దశలో ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాము.
ఈ టాపిక్ millionaire motivation in telugu మీకు నచ్చింది అనుకోండి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
1 thought on “ధనవంతులు పాటించే నియమాలు | millionaire motivation in telugu”