మీ లక్ష్యాలను సాధించడానికి సులభమైన మార్గం – lakshyalanu sadinchadaniki margalu
ఇవాళ్టి టాపిక్ లో lakshyalanu sadinchadaniki margalu గురించి తెలుసుకుందాం.
మీ లక్ష్యాలను వేగంగా చేరుకోవడానికి మార్గం ఇదే
ప్రతి ఒక్కరి జీవితంలో సాధించాలనుకున్న లక్ష్యాలు ఉంటాయి కానీ వాటిని వేగంగా సమర్ధవంతంగా ఎలా చేరుకోవాలో చాలా మందికి అర్థం కాదు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కూడా అదే మనకున్న జీవిత లక్ష్యాల్ని మనం చాలా వేగంగా ఎలా చేరుకోవాలి.
THE NECESSITY OF GOALS
ఇంక డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే మన ఉన్న జీవిత లక్ష్యాల్ని మనం వేగంగా చేరుకోవడానికి ఉపయోగపడే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ది నెసెసిటీ ఆఫ్ గోల్స్. జీవిత లక్ష్యాలు అనేవి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనవి గట్టిగా చెప్పాలంటే జీవిత లక్ష్యం లేని మనిషి జీవితం గమ్యం లేని ప్రయాణం లాంటిది ఎటు వెళ్తున్నాడో తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ ఒక జీవిత లక్ష్యం అనేది మనిషికి ఉంటే ఆ మనిషి జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అంతేకాకుండా మనిషి అనేవాడు ప్రతి ఒక్క పనికిమాలిన విషయానికి డైవర్ట్ అవ్వకుండా తన జీవిత లక్ష్యం కోసం పోరాడుతూ తన జీవిత లక్ష్యం కోసం పని చేసుకుంటూ నిజం చెప్పాలంటే తన కోసం తను బతుకుతూ ఉంటాడు. అలా కాకుండా ఉంటే ఏమవుతుందో మీ అందరికీ నేను సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు అనుకోండి. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి జీవిత లక్ష్యం అనేది చాలా అవసరం. కాబట్టి మీకు ఎటువంటి జీవిత లక్ష్యం లేకపోతే మాత్రం కచ్చితంగా ఒక జీవిత లక్ష్యాన్ని పెట్టుకోండి.
PLANNING BASED ON PRIORITY
ఇక రెండో పాయింట్ ఏంటంటే ప్లానింగ్ బేస్డ్ ఆన్ ప్రయారిటీ. సరే మాకు జీవిత లక్ష్యం ఉంది అని చాలా మంది అంటారు కొత్తగా జీవిత లక్ష్యం పెట్టుకున్నాం అని కొంతమంది అంటారు. వీళ్ళందరికీ నేను చెప్పవచ్చేది ఏంటంటే ఏ లక్ష్యానికైనా సరే మనం పని చేసుకుంటూ పోవాలి అది కూడా ప్రాపర్ గా ప్లానింగ్ తో చేసుకుంటూ పోవాలి. ఒకేసారి మన తలకు మించిన భారాన్ని గనక మనం నెత్తిన వేసుకుంటే దాన్ని మనం చేయలేక కింద మీద పడుతూ ఈ లక్ష్యం మనకు కరెక్ట్ కాదేమో నేను అసలు ఈ లక్ష్యాన్ని చేరుకోలేనేమో అని చెప్పేసి మీలో మీకు తెలియని ఒక నిస్సహాయత వచ్చేస్తుంది. కాబట్టి నేనేం చెప్పానంటే మీ జీవిత లక్ష్యాన్ని రీచ్ అయ్యే ప్లాన్ లో ప్రయారిటీ అనేది ఖచ్చితంగా అవసరం. ఏ పని ముందు చేసుకోవాలి ఏ పని తర్వాత అవార్డ్ చేసుకోవాలని చెప్పేసి మీరు ప్రాపర్ గా ఒక ప్లాన్ క్రియేట్ చేసుకుంటే. నిజం చెప్పాలంటే ఫస్ట్ చిన్న చిన్న పనులు చేసుకుంటూ లాస్ట్ లో ఒక పెద్ద పని చేసుకున్నారు అనుకోండి మీరు మీ గోల్ రీచ్ అవ్వడానికి 999% ఛాన్స్ ఉంది. కానీ ముందుగానే ఒక పెద్ద పని చేసుకున్నారు అనుకోండి దాన్ని చేయలేక మీరు మధ్యలోనే ఆపేశారు అనుకోండి మీరు చేయగలిగే చిన్న పనులు కూడా చేయకుండా అక్కడే వదిలేస్తారు. కాబట్టి ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకొని ప్రయారిటీ అనేది ముఖ్యం అన్నమాట ఎప్పుడు ఏ పని చేయాలనే ప్లానింగ్ ఖచ్చితంగా అవసరం అన్నమాట. కాబట్టి ఒక ప్రాపర్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. అలా ప్రిపేర్ చేసుకొని మీరు ఏదైతే పనిని ఫినిష్ చేస్తారో ఆ పనిని టిక్ చేసుకొని మీ ప్రయారిటీ లిస్ట్ లో నుంచి దాన్ని తీసేయండి.
DETERMINATION AND CONSISTENCY
ఇంకా మీ గమ్యాన్ని మీరు వేగంగా చేరుకోవడానికి మీకు ఉపయోగపడే మూడో పాయింట్ ఏంటంటే డిటర్మినేషన్ అండ్ కన్సిస్టెన్సీ. మామూలుగా ఏ మనిషి అయినా సరే తన జీవిత లక్ష్యాన్ని చేరుకోవడంలో సంకల్పం అనేది చాలా కీలకం మనం ఎన్నో సార్లు ఓడిపోతూ ఉంటాము. అలా ఓడిపోవడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం మరియు సంకల్పం అనేది మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి. కానీ వాటి మీద మన ఓటం అనేది ఎఫెక్ట్ చేయకుండా మనకి మనం సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. మన లక్ష్యాన్ని చేరుకునే ప్రాసెస్ లో ఎక్కడైనా తప్పు జరిగింది అనుకోండి మనం కొంచెం వెనక పడతాం. కానీ ఆ తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకుండా మన పని మనం చేసుకుంటూ మన సంకల్పాన్ని ఎప్పటికీ కోల్పోకూడదు. అంతే కాకుండా కన్సిస్టెన్సీ అనేది మనిషికి చాలా అవసరం ప్రతి రోజు నీ లక్ష్యం కోసం నువ్వు పోరాడాలి అంతే కానీ నీ లక్ష్యం కోసం ఇంకొకడు అయితే పని చేయడు. కాబట్టి మీ సంకల్పాన్ని మీరు కోల్పోకూడదు అంతేకాకుండా మీ లక్ష్యం మీద మీరు స్థిరంగా ఉండాలి. ఇదే నా జీవిత లక్ష్యం నేను పుట్టిందే దీని కోసం అన్నట్లు మీ పని మీరు చేసుకుంటూ పోతే మీరు చాలా వేగంగా మీ లక్ష్యానికి దగ్గర అవుతారు.
TIME AND DISCIPLINE
ఇంకా నాలుగో పాయింట్ ఏంటంటే టైం అండ్ డిసిప్లిన్. సమయం మరియు క్రమశిక్షణ అనేవి మన లక్ష్యం చేరుకోవడానికి అత్యంత ముఖ్యమైనవి. మనకున్న సమయాన్ని సరిగ్గా వినియోగించడం వల్ల మనం తక్కువ సమయంలోనే పెద్ద పెద్ద విజయాలను సాధిస్తూ ఉంటాము మన లక్ష్యాన్ని చాలా తొందరగా చేరుకుంటాము. ప్రతి చిన్న నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి రోజు డిసిప్లిన్ గా మన పని మనం చేసుకుంటూ మన లక్ష్యం కోసం పోరాడితే మీరు వద్దన్నా సరే మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు సెల్ ఫోన్ లో వీడియోలు చూసుకుంటూ రీల్స్ చూసుకుంటూ షాట్స్ చూసుకుంటూ మీకు అవసరమైతే చూడటం వేరు మీకు అవసరం లేని టాపిక్ మీద మీరు చూస్తూనే ఉండటం వేరు. కాబట్టి మీకున్న సమయాన్ని మీ లక్ష్యం కోసం ఖర్చు పెట్టండి. అలా చేయటం వల్ల మీరు చాలా వేగంగా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు.
POSITIVE MINDSET
ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ సెట్ అనేది అత్యంత శక్తివంతమైన ఒక సాధనం అన్నమాట. మనకి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే మనం పాజిటివ్ గా ఉంటూ మనకి మంచే జరగబోతుంది. ఒకవేళ జరగకపోయినా కూడా మనం ఏం చేసి మంచి జరిగేలా చూసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు పాజిటివ్ గా ఆలోచించడం అనేది ఒక శక్తివంతమైన సాధనం అన్నమాట. మనం గమ్యాలను చేరుకోవడంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి మనకి ఒక పాఠం నేర్పిస్తుంది. దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి మనం మనలో ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం ఉండాలి. ప్రతి రోజు పాజిటివ్ గా ఆలోచించడం వల్ల మన ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ఎందుకంటే మనం పాజిటివ్ గా ఆలోచిస్తాం కాబట్టి. ఒక సమస్య వచ్చినప్పుడు మనం టెన్షన్ పడిపోయి కాబడిపోతే మనకు ఆలోచనలు వస్తాయా రావు కానీ పాజిటివ్ గా ఉండి పాజిటివ్ గా ఆలోచిస్తే కచ్చితంగా మన సమస్యకి పరిష్కారం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఇంతకు ముందు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరో ఒకరికి వచ్చి ఉంటుంది. అది పెద్దవాళ్ళు కావచ్చు మీ చుట్టాలు కావచ్చు ఇంకెవరికి కావచ్చు వాళ్ళని ఒక్కసారి కన్సిడర్ చేసి వాళ్ళు ఆ సమయంలో ఏం చేశారో తెలుసుకొని మీరు ఏం చేయాలో తెలుసుకొని పాజిటివ్ గా ఆ పని చేశారు అనుకోండి ఆ సమస్య నుంచి బయట పడతారు.
కాబట్టి పాజిటివ్ గా ఉండండి పాజిటివ్ మైండ్ సెట్ ని అలవాటు చేసుకోండి. ఫైనల్ గా నేను చెప్పవచ్చేది ఏంటంటే లక్ష్యాలను చేరుకోవడం అనేది ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి ప్రయత్నంలో కృషి చేయాలి ప్రతి రోజు క్రమశిక్షణతో ముందుకు సాగటం వల్ల మన జీవిత లక్ష్యాల్ని మనం చాలా ఫాస్ట్ గా చేరుకుంటాము.
ఈ lakshyalanu sadinchadaniki margalu టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.