28 రోజుల్లో జీవితాన్ని ఎలా మార్చుకోవాలి | 28 Days Challenge to Change Your life in Telugu
ఇవాళ్టి టాపిక్ లో 28 Days Challenge to Change Your life in Telugu గురించి తెలుసుకుందాం.
హాయ్ అందరికీ నమస్కారం మనిషి పుట్టిన దగ్గర నుంచి నడక నేర్చుకొని పెరిగి పెద్దవాడేంత వరకు జీవితంలో ఎన్నో ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ ఉంటాడు వాటిని విజయవంతంగా కంప్లీట్ కూడా చేస్తాడు. కాకపోతే మనం పెరిగి పెద్ద అయిన తర్వాత మనలో చిన్నప్పుడు ఛాలెంజెస్ ని ఫేస్ చేసే అంత ధైర్యము అంతే కాకుండా వాటిని చూసే విధానము. నిజం చెప్పాలంటే ఆ ఛాలెంజ్ ని చూస్తేనే సగం చచ్చిపోతాం అన్నమాట. ఎందుకంటే మన జీవితంలో మనకి కొన్ని రూల్స్ లేకపోవడం వల్ల వచ్చే ప్రతి ఒక్క ఛాలెంజ్ కి మనం భయపడుతూనే ఉంటాము. అయ్యో ఆ పని నేను చేయగలనా, వామ్మో ఈ పని నేను చేయలేనేమో అని చెప్పేసి మీలో మీకు తెలియని ఒక భయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. నేను మీకు ఈరోజు చెప్పొచ్చేది ఏంటంటే మీరు గనక ఈ ఐదు రూల్స్ ని ఫాలో అయితే 28 రోజుల్లో మీ జీవితం మారిపోతుంది. ఆ తర్వాత మీ జీవితంలో ఎదురయ్యే ఛాలెంజెస్ ని మీరు ట్రీట్ చేసే విధానం మారిపోతుంది. ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే 28 రోజుల్లో మనం మన జీవితాన్ని మార్చుకోవడానికి మన జీవితానికి మనం పెట్టుకోవాల్సిన ఐదు రూల్స్ లో.
1. Wake Up Before 6 AM
మొట్టమొదటి రూల్ ఏంటంటే వేకప్ బిఫోర్ 6:00 am. మామూలుగా ఎవరికైనా సరే ఉదయం 5:00 గంటలు లెగవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అందుకనే 6:00 గంటలకే ఉదయాన్నే నిద్ర లేచి మనం గనక మనసుని ప్రశాంతంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం డివోషనల్ గా గనక ఉండగలిగితే ఆ రోజంతా చాలా అద్భుతంగా ఉంటుంది. డివోషనల్ గా అంటే మీకు నచ్చిన దైవానికి కొంచెం దగ్గరగా ఉండటం. ఇంకా క్లిస్టర్ క్లియర్ గా చెప్పాలంటే ఒక హాఫ్ ఆన్ అవర్ మీకు నచ్చిన డివోషనల్ సాంగ్స్ వినటమో లేకపోతే ప్రవచనాలు వినటమో అలాగే మీరు చేయగలిగితే ఆ రూల్స్ అంతా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. అంతే కాకుండా మన డే స్టార్టింగ్ కూడా ప్రాపర్ గా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉదయం 6:00 గంటలకు నిద్ర లేగవాలి. ఒకవేళ ఈ రూల్స్ లో మీరు ఏ రూల్ అయినా సరే తప్పితే. మళ్ళీ డే వన్ నుంచి స్టార్ట్ చేయాలి అలాగ 28 డేస్ చేయాలన్నమాట. కాబట్టి ఎర్లీగా లెగవాలి ఇంకా ఎర్లీగా లెగవాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఎర్లీగా పడుకోవాలి ఎర్లీగా పడుకోవాలి అంటే ముందు మీరు పడుకోవడానికి రెండు గంటలకు ముందే మీ ఫోన్ ని మీరు పక్కన పడేయాలి లేదు బాసు ఫోన్ పక్కన పడేసిన కూడా నాకు నిద్ర రావట్లేదు అనుకుంటే మాత్రం మీకు నేను ఒక ఐడియా చెప్తాను. అదేంటంటే మీరు ఎన్ని గంటలకైతే పడుకోవాలి అనుకుంటున్నారో దానికి ఒక రెండు గంటల ముందు ఒక గంట సేపు నాన్ స్టాప్ గా వాకింగ్ చేస్తే కేవలం 60 నిమిషాలు మాత్రమే మీరు గనక వాకింగ్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ శుభ్రంగా స్నానం చేస్తే మీరు వద్దన్నా సరే మీకు నిద్ర వస్తుంది. మీరు గనక ప్రాపర్ గా నిద్ర పోగలిగితే ప్రాపర్ గా అంటే డీప్ స్లీప్ లోకి గనక వెళ్ళగలిగితే మీ ఆరోగ్యానికి ఎంత మంచు తెలుసా. అంత మంచి నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే 6:00 గంటలకు నిద్ర లేచి మన మనసుకి ఒక 30 నిమిషాలు డివోషనల్ ఫీలింగ్ గనక ఇవ్వగలిగితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతే కాకుండా జీవితం పట్ల కొంచెం కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది అది సంగతి.
2. Read 10 Pages A Day
ఇంకా రూల్ నెంబర్ టూ ఏంటంటే రీడ్ 10 పేజెస్ ఏ డే. మామూలుగా మనకి పుస్తకాలు చదవడం అంటే చాలా చిరాకు అందులోనూ కాలేజీ బుక్స్ చదవడం అంటే ఇంకా చిరాకు నేను చెప్పవచ్చేది ఏంటంటే. మీరు నాన్ ఫిక్షన్ బుక్స్ తీసుకొని అది బిజినెస్ అవ్వచ్చు మైండ్ ఫుల్నెస్ అవ్వచ్చు మెంటల్ హెల్త్ అవ్వచ్చు సైకలాజికల్ అవ్వచ్చు ఏదైనా సరే మీకు ఉపయోగపడే ఒక బుక్ తీసుకొని 10 అంటే పదే పేజీలు మీరు చదవగలిగితే కేవలం కొన్ని రోజుల్లోనే ఆ బుక్ ని ఫినిష్ చేస్తారు. ఇదే విషయాన్ని అమెరికన్ ఆర్థర్ డాక్టర్ షూస్ ఏమన్నారంటే ది మోస్ట్ దట్ యు రీడ్ ది మోర్ థింగ్స్ యు నో. కాబట్టి మనం ఎంత చదివితే మనకి అన్ని విషయాలు తెలుస్తాయి అలా తెలియటం వల్ల వాటిని మనం మన జీవితానికి ఉపయోగించుకుంటాము.
3. Exercise
ఇంకా మూడో రూల్ ఏంటంటే ఎక్సర్సైజ్ మామూలుగా మనందరి జీవితంలో మనకి చాలా తక్కువ టైం ఉంటుంది ఉద్యోగానికి వెళ్ళాలి వచ్చిన తర్వాత మళ్ళీ పడుకోవాలి మళ్ళీ పొద్దున్నే లేవాలి అని చెప్పేసి కొంతమంది జీవితం కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మీరు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఒక చిన్నపాటి వ్యాయామం గనుక మీరు చేయగలిగిన అయితే చిన్నపాట అంటే జస్ట్ వాకింగ్ అంతే అది కూడా కేవలం ఒక 60 నిమిషాలు మీరు గనక వాకింగ్ చేయగలిగితే మీ బాడీ ప్రాపర్ గా రీసెట్ అవుతుంది అంతే కాకుండా మానసిక స్థితి కూడా ప్రాపర్ గా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఆ రోజంతా చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు మీ బాడీ ఫిట్ గా ఉంటుంది. కాబట్టి దయచేసి అట్లీస్ట్ ఒక 60 నిమిషాలు మీరు వాకింగ్ చేయాలి లావుగా ఉన్నవాళ్ళు మాత్రమే కాదు సన్నగా ఉన్నవాళ్ళు కూడా ఒక 60 నిమిషాలు వాకింగ్ చేస్తే బాడీ అనేది కొంచెం ఫిట్ గా ఉంటుంది.
4. No Junk Food & No Alochol
ఇంకా మీరు తప్పనిసరిగా పాటించాల్సిన నాలుగో రూల్ ఏంటంటే నో జంక్ ఫుడ్ అండ్ నో ఆల్కహాల్. మానవ శరీరం అనేది ఒక దేవాలయం లాంటిది అందులో మీరు ఏం ఉంచుతారు అనేది ముఖ్యం అందులో ఆల్కహాల్ ఉంచుతారా, జంక్ ఫుడ్ ఉంచుతారా లేకపోతే వాటిని మానేసి మన శరీరానికి ఆరోగ్యాన్ని అంతేకాకుండా మానసిక సృష్టతను మరియు శక్తి స్థాయిలను పెంచుతారా అనేది కేవలం మీ చేతిలోనే ఉంటుంది. మీకు తెలుసు ఒక కూల్ డ్రింక్ తాగితే అందులో ఎంత షుగర్ ఉంటుందో, మీకు తెలుసు మీరు గనుక జంక్ ఫుడ్ తింటే అది మీ శరీరానికి ఎంత హాని చేస్తుందో కానీ కేవలం మీ నోట్లో ఉన్న నాలుకను సాటిస్ఫై చేయడానికి మీరు రకరకాల ఫుడ్ తింటూ ఉంటారు. నిజం చెప్పాలంటే మీ నాలుక కోసం మీ శరీరాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు. నేను చెప్పవచ్చేది ఏంటంటే మనకు తెలిసిన మంచి ఆహారాలు చాలా ఉన్నాయి వాటిని మనం పక్కన పెట్టి మరి వీటిని కొనుక్కొని తినటానికి ఒకే ఒక కారణం టేస్ట్. అలాగే మంచి ఆహారాలతో చాలా టేస్టీగా వండుకునే వంటలు కూడా చాలా ఉన్నాయి వాటిని మీరు ప్రాపర్ గా రీసెర్చ్ చేసి మీరు ప్రాపర్ గా వండుకొని మంచి ఆహారాన్ని మీ శరీరానికి గనక ఇవ్వగలిగితే మీ శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు మీరు అంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. నిజం చెప్పాలంటే చాలా హ్యాపీగా నిండు నూరేళ్ళు బ్రతికి ఉంటారు ఒకానొక సందర్భంలో మీ పిల్లల అవసరం లేకుండానే మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీ పిల్లలు మీకన్నా ముందే ముసలోళ్ళు అయిపోతారు. కాబట్టి ప్రాపర్ ఫుడ్ అలవాట్లు అనేది మెయింటైన్ చేయాలి జంక్ ఫుడ్స్ ని అలాగే ఆల్కహాల్ ని పక్కన పడి చేయాలి. వాటిని మనం తీసుకోవడం వల్ల అవి మనల్ని ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాయి. వాటికి ఆ ఛాన్స్ ఇవ్వడం ఎందుకు తెలిసి తెలిసి వాటికి మనం దగ్గర అవ్వడం ఎందుకు కాబట్టి వాటిని దూరంగా పెట్టండి.
5. Best Morning Routine
ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రూల్ ఏంటంటే బెస్ట్ మార్నింగ్ రొటీన్. మామూలుగా మన జీవితంలో మనకేంటంటే నైట్ ఎప్పుడు పడుకుంటే ఉదయం ఎప్పుడు లెగవాలి అనేది డిసైడ్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఒక మంచి రొటీన్ లేక నిజం చెప్పాలంటే ఒక ప్లానింగ్ లేక. మనం సాయంత్రం ఎన్నింటికి పడుకుంటే దానికి ఒక ఏడు గంటలు ఎనిమిది గంటలు కౌంట్ చేసుకుంటే ఉదయం అన్ని గంటలు లెగుస్తాము. మనం లేట్ గా లెగిస్తే ఉదయం లేచిన వాళ్ళందరికన్నా వెనకబడతాము కానీ ఎర్లీగా లెగిస్తే లెగవల్సిన వాళ్ళ కన్నా ముందు ఉంటాము. కాబట్టి ఒక మంచి మార్నింగ్ రొటీన్ ని ప్లాన్ చేసుకొని శుభ్రంగా లేచిన వెంట ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న పాయింట్లు అన్నిటిని ప్రాపర్ గా ప్లాన్ చేసి మీరు గనక ప్రతి రోజు ఈ రూల్స్ ని పాటించగలిగితే 28 రోజుల్లో మీ జీవితం మారిపోతుంది. మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా మీరు ట్రీట్ చేసే విధానం మారిపోతుంది. ఎందుకంటే రోజుకి 10 పేజీలు బుక్ చదివినప్పుడు అందులో ఉండే ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్ కి ఇచ్చే సపోర్ట్ అంతా ఇంత కాదు మామూలుగా ఒక కొటేషన్ చదివితేనే ఆ రోజు మొత్తం కొంచెం హై లో ఉంటాము అలాంటిది గొప్ప గొప్ప వాళ్ళు రాసిన పుస్తకాలను తీసుకొని రోజుకి 10 పేజీలు చదివిన తర్వాత కూడా మన బ్రెయిన్ డల్ గా ఎందుకు ఉంటుంది చెప్పండి. కాబట్టి నేను చెప్పిన ఈ ఐదు రూల్స్ ని మీరు ప్రాపర్ గా పాటిస్తే మీ జీవితం ఖచ్చితంగా 28 రోజుల్లో మారిపోతుంది. కాకపోతే వీటిని మీరు మధ్యలో గనక బ్రేక్ చేస్తే మళ్ళీ ఒకటో తారీకు నుంచి మొదలు పెట్టండి. ఎందుకంటే ఆల్రెడీ 10 రోజులు అయిపోయినాయి కదా కాకపోతే 11వ రోజు నేను బ్రేక్ చేశాను అని చెప్పేసి మీరు కౌంట్ చేసుకోవద్దు మళ్ళీ ఒకటో తారీకు నుంచి మొదలు పెడితే ఈ ప్రపంచంలో లాభపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మీరే. కాబట్టి మీ కోసం మీరు ఈ రూల్స్ ని ఖచ్చితంగా పాటించండి అలా పాటించడం వల్ల క్వాలిటీ లైఫ్ ని గెయిన్ చేస్తారు క్వాలిటీ జీవితాన్ని అనుభవిస్తారు.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోండి ఫస్ట్ లైక్ చేయండి, మీరు ఎవరి జీవితంలో అయితే మార్పులు చూడాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
1 thought on “28 రోజుల్లో జీవితాన్ని ఎలా మార్చుకోవాలి | 28 Days Challenge to Change Your life in Telugu”