ఈ ప్రపంచంలో నిన్ను ఎవరు ప్రేమించడం లేదా – Prapancham lo avaru preminchadam leda in telugu
ఇవాళ్టి టాపిక్ లో Prapancham lo avaru preminchadam leda in telugu గురించి తెలుసుకుందాం.
ఈరోజు మన టాపిక్ ఏంటంటే మామూలుగా మనం చాలా మందిని ఇష్టపడతాం ఇంకొంత మందిని అయితే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేస్తాం కూడా. అది అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, లేకపోతే భార్య అవ్వచ్చు, పిల్లలు కూడా అవ్వచ్చు లేకపోతే ఒక అమ్మాయి కూడా అవ్వచ్చు. కానీ నా పాయింట్ ఏంటంటే మిమ్మల్ని మీరు ఎంత ఇష్టపడుతున్నారు అనేది కూడా పాయింటే. ఎందుకంటే వీళ్ళందరూ ఏదో ఒక దశలో ఒక పాయింట్ ఇంట్లో మిమ్మల్ని వదిలేస్తారు. ఒకవేళ వదిలేసిన వదిలేయకపోయినా మీ మీద వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది. కానీ మీ మీద మీకు ఎంత ప్రేమ ఉన్నది అనే పాయింట్ మీదే మీ జీవితం ఆధారపడి ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అనేది కూడా కొంచెం ఇంపార్టెంట్. లేదండి నన్ను నేను ఇష్టపడుతున్నాను అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే మనల్ని మనం ఇష్టపడటం అంటే మన కోసం మనం మంచి బట్టలు కొనుక్కోవడం లేకపోతే కాస్ట్లీ ఫోన్ కొనుక్కోవడం అది కూడా కాకపోతే రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక పెద్ద బైక్ కొనుక్కోవడం కాదు. అసలు నిజంగా మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా అని ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే మనల్ని మనం బాగా చూసుకోవడం. మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఎలా చూసుకుంటాం అలాగా మిమ్మల్ని మీరు చూసుకోవడం ఇది మెయిన్ పాయింట్. మీరు ఎవరిని ఇష్టపడిన లేకపోతే ఎవరి కోసం జీవితం సాక్రిఫైస్ చేసినా సరే ఒక పాయింట్ లో మీ శరీరం మీకు సహకరించదు. మీరు ముసలోళ్ళు అయిపోవచ్చు, లేకపోతే ఒక చిన్నపాటి యాక్సిడెంట్ అయ్యి మీరే మీ కుటుంబంలో ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు కాకపోతే ఆ క్షణంలో వాళ్ళందరూ మీకు దూరం అవుతారు. ఒకవేళ అవ్వలేకపోయినా సరే లోపల లోపల తిట్టుకుంటారు వీడేట్రా బాబు అని చెప్పేసి. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి. ఎలా చూసుకోవాలి అంటే మాత్రం నేను కొన్ని పాయింట్లు చెప్తాను వాటిని ఇష్టమైన వాళ్ళు ఫాలో అవ్వండి లేకపోతే ఈ టాపిక్ ఇంతటితో ఆపేసి వెళ్ళిపోండి.
1. మీ విలువ మీరు తెలుసుకోవాలి
ఫస్ట్ అఫ్ ఆల్ మీ విలువ మీరు తెలుసుకోవాలి ఎందుకంటే చాలా మంది వాళ్లకు వాళ్ళు విలువ తక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు మనకన్నా వాళ్ళు గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు. అంతే కాకుండా ఏముందిలే మనది అని చెప్పేసి వాళ్ళని వాళ్లే డిమోటివేట్ చేసుకుంటూ ఉంటారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫస్ట్ అఫ్ ఆల్ మీ విలువ మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎవడు ఏ పని చేసినా డబ్బు కోసమే అంతే కాకుండా డబ్బు సంపాదించినోడు ఆనందంగా ఉంటాడా అంటే అది రాంగ్, అలా అని చెప్పేసి డబ్బు లేనోడు ఇంకా ఆనందంగా ఉంటున్నాడు అంటే అది డబల్ రాంగ్. నేనేమంటానంటే నీ విలువ నువ్వు తెలుసుకొని నీకు నచ్చిన పని నువ్వు చేసావు అనుకో నీ అంత ఆనందంగా ఈ ప్రపంచంలో ఎవ్వడు ఉండడు అది పాయింట్. కాబట్టి నీ విలువ నువ్వు తెలుసుకొని ఎవడో ఏదో అన్నాడనో లేకపోతే ఇంకెవడో ఏదో చెప్పాడనో కాకుండా ప్రాపర్ గా నిన్ను నువ్వు అద్దంలో చూసుకొని నీ విలువ నువ్వు తెలుసుకో అంతే ఇంకా అంతకు మించింది ఏం లేదు.
2. మిమ్మల్ని మీరు కాపాడుకోండి
ఇక రెండో పాయింట్ ఏంటంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలండి మీరు రోజంతా పని చేసినా తొందర చచ్చిపోతారు అలా అని చెప్పేసి ఏ పని ఇంట్లో కూర్చున్నా సరే తొందరగా చచ్చిపోతారు. కాబట్టి చక్కగా పని చేసుకొని బ్యాలెన్సింగ్ గా మంచి డైట్ ఫాలో చేస్తూ డైట్ అంటే అన్నం తినకుండా సన్న పడటం కాదు. చక్కగా మన శరీరానికి ఏ ఫుడ్ ఇవ్వాలి ఏ ఫుడ్ ఇవ్వకూడదు ఏ ఫుడ్ ఇస్తే మన శరీరం బాగా రియాక్ట్ అవుతుంది ఏ ఫుడ్ ఇవ్వడం వల్ల మన శరీరం మనకు సహకరించకుండా అడ్డుగిస్తుంది అనే ప్రాపర్ డైట్ ని మీరు గనక నోట్ చేసుకొని చక్కగా పని చేసుకొని ఇంకా చక్కగా నిద్రపోయారు అనుకోండి మిమ్మల్ని మించిన కోటీశ్వరుడు ఈ భూమి మీద ఎవడున్నాడు చెప్పండి. కాబట్టి సెల్ఫ్ కేర్ అనేది ప్రాక్టీస్ చేయాలి అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు అంతే కాకుండా ఇంకొకళ్ళకి మీరు భారం కాకుండా ఉంటారు. ఆ భారం అనే పదం నేను ఎందుకు చెప్తున్నాను అంటే నాకు తెలిసిన ఒకాయన ఉన్నాడు ఆయన రోజు ప్రశాంతంగా పని చేసుకుంటాడు రోజుకో 1500 సంపాదించుకుంటాడు సాయంత్రం పూట చక్కగా మందు కొడతాడు ఇంటికి వచ్చి పడుకుంటాడు ఇది కూడా సెల్ఫ్ కేరే కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. దీనంత బుర తక్కువ పని ప్రపంచంలో ఇంకోటి లేదండి ఎందుకంటే మనం 1500 కోసం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గొడ్డు చాకిరి చేసి మళ్ళీ సాయంత్రం పోయి ఆ మందు తాగి ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని వచ్చి ప్రశాంతంగా పడుకోవడం బాగానే ఉంటుంది. నువ్వు సంపాదించిన డబ్బుల్లో మిగులుస్తావ్ ఇంకా బాగుంటుంది ఆస్తులు పాస్తులన్నీ కూడబెడతావ్ ఇంకా అద్దిరిపోయింది. కాకపోతే నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే నీ ఆరోగ్యం పాడైపోయినప్పుడు నువ్వు మంచం మీద పడుకొని ఉన్నప్పుడు నీ శరీరం నీకు సహకరించినప్పుడు నీతో పాటు ఇక్కడికి ఎవ్వడు రాడు. అంతే కాకుండా నువ్వు సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి కోసం కొట్టుకున్న కొట్టుకుంటారు నీ పిల్లలు లేకపోతే ఇద్దరు కలిసి నిన్ను చంపేస్తారు. ఈ రెండు జరుగుతాయి ఎందుకంటే 2024 వ సంవత్సరం ఇది మనం ఇంకా ఫార్వర్డ్ గా ఆలోచించాలి కదా ఎందుకంటే మనం ఇంకొక 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత 40 ఏళ్ల తర్వాతో ముసలి వాళ్ళం అయిన తర్వాత మన పిల్లల మైండ్ సెట్ ఇలా ఉంటుంది అది మనం ముందుగానే పసిగట్టాలి కదా. ఎందుకంటే ప్రశాంతంగా తాగి వచ్చి పడుకుంటే పిల్లల బాగోగులు ఎవడు చూస్తాడు పిల్లల బాగోగులు మనం వదిలేసినప్పుడు పిల్లలు మనకన్నా వరస్ట్ గా తయారవుతారు కదా. అలా తయారైనప్పుడు మనం సంపాదించి ఆ రూపాయి అది రూపాయి కోసం బయట కొట్టుకొని చస్తారు. కాబట్టి మీరు ప్రాపర్ గా మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీరు కొంచెం క్లారిటీగా ఉన్నారు అనుకోండి మీ పిల్లలు కూడా కాస్తో కాస్త మిమ్మల్ని ఫాలో అయిపోయి వాళ్ళు కూడా అంతే క్లారిటీగా ఉంటారు. టోటల్ గా ఒక ముక్కలో నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ఎంత సంపాదించాము అనేది పాయింటే.
3. ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి
దానికన్నా ముఖ్యమైన పాయింట్ ఇంకోటి ఉంది అదేంటంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే అనారోగ్యం పాలవుతాము ఏం చేస్తే ఆరోగ్యంగా ఉంటాము అనే ఒక చిన్న నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్క మనిషికి ఉండాలండి. మనం అవతల వాళ్ళ కోసం కష్టపడటం అవతల వాళ్ళ కోసం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేయడం వీటన్నిటి వల్ల మనిషికి ఉపయోగం లేదండి. నేను ఏమంటున్నానంటే అసలు పని మానేసి ఇంట్లో కూర్చోమని చెప్పి అనట్లేదు కానీ మీరు ఎంత పని చేసినా సరే మిమ్మల్ని కూడా మీరు పట్టించుకోండి. చక్కగా మీ గురించి మీరు ఆలోచించుకోండి అలా గనక మీరు ఆలోచించుకోకపోతే మీ జీవితానికి అసలు అర్థమే ఉండదు. ఎందుకంటే మీరు కేవలం పని చేసి డబ్బులు సంపాదించి పిల్లలకి ఇచ్చి చచ్చిపోవడానికే పుట్టినట్టు ఉంటది. కాబట్టి మీ గురించి మీరు ప్రాపర్ గా ఆలోచించుకోండి అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకుందాం చక్కగా పని చేసుకుందాం మన శరీరానికి చక్కటి ఆహారాన్ని ఇద్దాం. మన బుర్రకి అద్దిరిపోయిన నిద్ర ఇద్దాము మళ్ళీ ఉదయాన్నే లేచి మన పని మనం చేసుకుందాం. పిల్లలు చెడిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి ఇంట్లో వాళ్ళు సహకరించకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి ఈ సమాజం సహకరించిన సహకరించకపోయినా పిల్లలు మనతో ఉన్నా లేకపోయినా అమ్మా నాన్న మనకి సపోర్ట్ చేసి చేయకపోయినా మనకి మనం సపోర్ట్ ఇచ్చుకోవాలి మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. సెల్ఫ్ లవ్ అనేది చాలా అవసరం.
ఈ టాపిక్ మీకు నచ్చితేనే షేర్ చేయండి కామెంట్ చేయండి, అంతే కాకుండా ఇప్పటికి మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.