జీవితాన్ని మార్చే మోటివేషన్ ప్రతి రోజు ఉండాలంటే – Jeevitham Marche Motivation in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Jeevitham Marche Motivation in Telugu గురించి తెలుసుకుందాం.
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి పని వెనకాల ఒక మోటివ్ ఉంటుంది ఒక చిన్న పిల్లాడు బ్యాగ్ పట్టుకొని బుడిబుడి అడుగులు వేసుకుంటూ స్కూల్ కి వెళ్ళాడు అనుకోండి. వాడి మోటివ్ ఏంటి బాగా చదువుకొని పెద్దయిన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించడం. అంతేకాకుండా బాగా వయసైపోయిన ఒక పెద్దాయన ఉదయాన్నే లేచి చాలా సీరియస్ గా వాకింగ్ చేస్తున్నాడు అనుకోండి ఆయన మోటివ్ ఏంటి నేను ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్క పనికి ఒక మోటివ్ ఉంటుంది కాకపోతే ఈ మధ్యకాలంలో చాలా మంది ఆ మోటివ్ ని కోల్పోతున్నారు. ఈరోజు మన టాపిక్ అదే అసలు ఒక మనిషి ప్రతి రోజు మోటివ్ గా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఈరోజు మన టాపిక్.
ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే ఫస్ట్ అఫ్ ఆల్ మీ అందరికీ మోటివేషన్ గురించి చెప్పాలి. మోటివేషన్ అంటే ఏంటంటే మనం ఒక పని చేయడానికి మనల్ని పుష్ చేసే ఒక డ్రైవే ఈ మోటివేషన్. మోటివేషన్ మామూలుగా ఇది లేకపోతే ఇక్కడ ఎవ్వడు ఏ పని చేయడు. అంతేకాకుండా మోటివేషన్ లో కూడా రెండు రకాల మోటివేషన్లు ఉంటాయి.
1.ఇంట్రన్సిక్ మోటివేషన్
అందులో మొదటిది ఇంట్రన్సిక్ మోటివేషన్. ఈ మోటివేషన్ ఎలా ఉంటుందంటే మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడానికి అంతేకాకుండా మన ప్యాషన్ ని మనం ఫాలో అవ్వడానికి బేసికల్ గా దీనికి డబ్బుకి ఎటువంటి సంబంధం లేదు. ఉదాహరణకి చెప్పాలంటే మనం ఒక క్రికెట్ మ్యాచ్ చూడటం వల్ల మనకి అద్దు రూపాయి ఉపయోగం ఉండదు. కానీ ఆ మ్యాచ్ చూసినంత సేపు మనకి తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుంది అంతేకాకుండా మనం బాగా ఎంజాయ్ చేస్తాం కూడా. దీన్నే ఇన్స్టెన్సిక్ మోటివేషన్ అంటారు.
2. ఎక్స్ట్రాన్సిక్ మోటివేషన్
ఇక రెండోది వచ్చేసి ఎక్స్ట్రాన్సిక్ మోటివేషన్ ఈ రెండో రకమైన మోటివేషన్ అనేది ఈ ప్రపంచంతో లింక్ అయి ఉంటుంది. అంటే మనం ఎవ్వరితో సంబంధం లేకుండా మోటివేట్ అవ్వచ్చు ఈ ప్రపంచంతో లింక్ అయి మరి మోటివేట్ అవ్వచ్చు. మనం ప్రపంచంతో లింక్ అయినప్పుడు డబ్బుతో ముడిపడి ఉంటుంది. బేసికల్ గా మనం ఏ వర్క్ అయినా ఎందుకు చేస్తాం కొంత డబ్బు సంపాదించుకోవడానికి అది కూడా నీ చుట్టూ ఉన్న వాళ్ళ కన్నా నువ్వు ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఈ రెండో మోటివేషన్ మీకు ఉపయోగపడుతుంది. ఇంకా ముఖ్యంగా మీకు సమాన సమాజంలో గుర్తింపు ఒక మంచి పేరు మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ప్రశంసించడం ఇలాంటివన్నీ ఈ ఎక్స్టెన్సిక్ మోటివేషన్ లో ఒక భాగంగా ఉంటాయి. కాబట్టి మోటివేషన్ అనేది రెండు రకాలుగా ఉంటాయి. అంతేకాకుండా మనం ప్రతి రోజు మోటివ్ గా ఉండటానికి మనకి హెల్ప్ చేసేది మన జీవిత లక్ష్యం. అంటే మనం సెట్ చేసుకునే క్లియర్ గోల్స్. వాటి వల్లే మనం ఆల్మోస్ట్ ప్రతి రోజు మోటివ్ గా ఉంటాము. ఎందుకంటే వాటిని మనం నెరవేర్చుకోవాలి అవి మన జీవిత లక్ష్యాలు. మనకా ఉంది కొంచెం టైమే అని అంతేకాకుండా మనకి పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి తప్ప తరగవు. కాబట్టి మన లక్ష్యాన్ని మనం చేరుకుంటే మన నెత్తి మీద భారాలు తగ్గుతాయి. అంతే కాకుండా మన లక్ష్యం చేరుకున్న తర్వాత మనకు ఉండే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి అది ఎన్ని కోట్లు ఇచ్చినా సరే తిరిగి రాదు. ఎందుకంటే అది మన లక్ష్యం కాబట్టి.
కాబట్టి ఒక మనిషికి ప్రాపర్ లక్ష్యం అనేది ఉంటే ఆ మనిషి ప్రతి రోజు మోటివ్ గానే ఉంటాడు. తన లక్ష్యాన్ని చేరుకునే ప్రాసెస్ లో తను ప్రతి రోజు ప్రాపర్ గా డిజైన్ చేసుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి రోజు ప్రయత్నిస్తూనే ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మన లక్ష్యం కోసం మనం పోరాడే ప్రాసెస్ లో మనం కొంచెం డిమోటివేట్ అయిపోతూ ఉంటాం అన్నమాట. మనల్ని కొంచెం డిమోటివేట్ చేస్తూ ఉంటారు కానీ మన లక్ష్యం యొక్క గొప్పతనం మన లక్ష్యాన్ని మనం చేరుకునే విధానం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకు అసలు స్టామినా ఉందా లేదా అని కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేసి మీ లక్ష్యానికి కొంచెం లేట్ గా వెళ్తున్నారు అనుకోండి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు మీరు కొంచెం పాజిటివ్ గా ఉండి. మంచి రూట్ మ్యాప్ ని ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మనం పుట్టిందే పోరాడటానికి అంతేగాని ఇక్కడ కూర్చొని ఏడవడానికి అయితే నాకు తెలిసినంత వరకు అస్సలు కాదు చచ్చిపోయేంత వరకు పోరాడటం తప్పేం లేదు. కానీ ఖాళీగా కూర్చున్నా కూడా చచ్చిపోతాం ఆ విషయం తెలుసు కదా మనకి కాబట్టి మీరు పాజిటివ్ గా మంచి రూట్ మ్యాప్ ని వేసుకొని ప్రాపర్ గా పోరాడండి మీ లక్ష్యానికి మీరు అనుకున్నంత టైం కన్నా కొంచెం ముందుగానే చేరుకుంటారు. అలా కాకుండా ఎవడిని పడితే వాడిని సలహాలు అడిగితే వాళ్ళు ఇచ్చే రివ్యూలకి మీ లక్ష్యాన్ని చేరుకోవడం కాదు కదా కనీసం మీ ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా భయపడతారు. మీరు అలా భయపడకుండా ఉండాలి అంటే ఫస్ట్ అఫ్ ఆల్ మీరు పాజిటివ్ గా ఉండాలి పాజిటివ్ గా ఆలోచించాలి. నేను ఏం చేసినా మంచే జరుగుతుంది ఇక మంచే జరగబోతుంది అనే రేంజ్ లో మీరు ఉండాలి. కానీ ప్రతి పనికిమాలిన విషయానికి మీరు భయపడుతూ ఉంటే మాత్రం ఇదంతా సాధ్యం కాదు. మీరు ఎప్పుడూ పాజిటివ్ గా ఉండాలి అంటే నాకు తెలిసినంత వరకు మంచిగా మాట్లాడాలి, మంచి మాటలే వినాలి అంతే కాకుండా అకౌంటబిలిటీ అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉండాలండి. మనం పెద్దవాళ్ళకి భయపడాలి వాళ్ళు మనల్ని ఏదైనా అడిగినా సరే సమాధానం చెప్పేలా ఉండాలి వాళ్ళ ముందు తలదించుకునేలా అసలు ఉండకూడదు. దీనివల్ల ఏంటంటే మనం వద్దన్నా సరే జీవితంలో సక్సెస్ అవుతాం తల్లిదండ్రులకి భయపడాలి గురువులకి భయపడాలి స్నేహితులకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఇవన్నీ చేసే ప్రాసెస్ లో మీరు ఏ తప్పు చేయకుండా మీ గురువులు చూసుకుంటారు తల్లిదండ్రులు చూసుకుంటారు ఒకవేళ మీరు జీవితంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కచ్చితంగా ఫ్రెండ్స్ చూసుకుంటారు. ఇంకా చెప్పండి ప్రతి రోజు మోటివ్ గా ఎందుకు ఉండరు మీరు.
కాబట్టి ప్రతి రోజు మోటివ్ గా ఉండాలంటే రెండే రెండు పాయింట్లు అండి ఫస్ట్ మీకంటూ క్లియర్ కట్ గోల్ ఉండాలి. దానికి కోసం మీరు పోరాడుతూ ఉండాలి అలా పోరాడే క్రమంలో మీకు ఫెయిల్యూర్స్ రావచ్చు కానీ మీరు మీ గురువుల దగ్గర తల్లిదండ్రుల దగ్గర స్నేహితుల దగ్గర చాలా జెన్యూన్ గాను వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా వినేటట్టుగానో అంతే కాకుండా మీ లక్ష్యాన్ని వాళ్ళకి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే బయట మిమ్మల్ని డిమోటివేట్ చేసే మనుషుల కన్నా వీళ్ళు వేరే ఎట్టు బెటర్ అండి బాబు. ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడం వల్ల వాళ్ళు మొదట మిమ్మల్ని కాదన్నా సరే అటు తిరిగి ఇటు తిరిగి సర్లే ఈ పిచ్చోడు ఏదో చేస్తా అంటున్నాడు కదా అని చెప్పేసి మీకు సపోర్ట్ ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోయినా సరే మిమ్మల్ని కిందకి లాగాలి అని మాత్రం వాళ్ళు అస్సలు ప్రయత్నించరు.
కాబట్టి ప్రతి రోజు మోటివ్ గా ఉండాలంటే ఏం చేయాలి అనే పాయింట్ కి మీకు సమాధానం దొరికింది అనుకుంటున్నాను. దొరికింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టాపిక్ మీకు కావాలనుకుంటే తప్పకుండా మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.