యువతను నాశనం చేసే సోషల్ మీడియా ( Social media is destroying our youth )
ఇప్పుడు చూస్తున్నారు కదా వీళ్ళంతా మన కళ్ళ ముందు ఎదిగే యువత అన్నమాట వీళ్ళకి చాలా టాలెంట్ ఉంది అంతే కాకుండా వీళ్ళకి వీళ్ళ జీవితం పట్ల చాలా కలలు ఉంటాయి జీవిత లక్ష్యాలు కూడా ఉంటాయి. కానీ వాళ్ళ దురదృష్టం ఏమిటంటే వాళ్ళు వాళ్ళ టైం ని ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తూనే ఉంటున్నారు. నిజం చెప్పాలంటే మన జీవిత లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే మన చేతిలో మనకున్న ఆయుధం ఏంటి టైం. ఆ టైం ని కరెక్ట్ గా యూస్ చేసుకొని మన లక్ష్యం కోసం మనం పని చేస్తే మన లక్ష్యాన్ని మనం చేరుకుంటాము. కానీ ఈ సోషల్ మీడియా అనేది ఎప్పుడైతే వచ్చిందో యూత్ మొత్తం దాంట్లోనే స్క్రోలింగ్ చేస్తూ వాళ్ళ టైం మొత్తాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. టైం అంటే ఇక్కడ జీవితం సో జీవితం అంటేనే టైము స జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సోషల్ మీడియా అనేది ఒక గొప్ప వరం మనకి ఎలాగంటే దాన్ని మనం కరెక్ట్ గా వాడుకుంటే ఈ ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగిన ఏ మనిషి ఏం సాధించినా సరే మనకి ఇట్టే తెలిసిపోతుంది. మనం ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి సోషల్ మీడియా అని అనేది ఈ జనరేషన్ కి ఒక గొప్ప వరం కానీ చాలా మంది తెలియక చేసే తప్పు ఏంటంటే వాళ్ళకి అవసరం లేని కంటెంట్ ని వాళ్ళు స్క్రోల్ చేస్తూనే ఉంటున్నారు. ఉన్న పని కూడా మానుకొని సోషల్ మీడియాలో లైకులు కొట్టడమే ఒక పనిగా పెట్టుకొని అలా ఫోన్లకి అతుక్కుపోయి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు, అంటే సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అలా వృధా చేసుకున్నప్పుడు మనకి భవిష్యత్తు ఎక్కడి నుంచి వస్తుందండి రాదు కదా. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పాపులారిటీ కోసం పాకులాడుతూ ఉంటారండి. చాలా మంది వాళ్ళ నిజమైన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారు ఎందుకంటే సోషల్ మీడియాలో మనం నవ్వుతూ ఫోటో పెడితే ఎక్కువ లైక్స్ వస్తాయి లేకపోతే అప్పు చేసి మనం షో చేస్తే ఇంకా కామెంట్స్ ఎక్కువ వస్తాయి. జనం అందరూ మనం సంతోషంగా ఉన్నాం అనుకుంటారు లేకపోతే ఫలానా చోటకి వెళ్ళాను నేను నేను ఒక్కడినే వెళ్ళాను అని చెప్పేసి మనం స్టేటస్ లో పెట్టుకుంటే దాన్ని చూసి జనం అందరూ ఆశ్చర్య పోతారు. వీడు భలే లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడురా అని చెప్పేసి ఇలాగ ఒక పాపులారిటీ అనే ఒక ట్రాప్ లో పడిపోయి అది ఎవరైనా అవ్వచ్చు. డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు అయినా అవ్వచ్చు లేకపోతే నన్ను చూసి జనం గొప్పగా అనుకోవాలని చెప్పేసి ఇప్పుడిప్పుడే మనసులో ఆలోచన పుడుతున్న వాళ్ళు కూడా అవ్వచ్చు. నేను ఏమంటానంటే ప్రతి ఒక్క మనిషికి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. దాన్ని మనం పబ్లిక్ ప్లాట్ఫార్మ్ లో పెట్టేసి మన జీవితాన్ని మనం వాళ్ళకి షో చేయలేము కదా. అందుకని నేను ఏమంటున్నానంటే మనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉండాలి. మనం ఈ పని ఎందుకు చేస్తున్నాం అనే క్లారిటీ ఉండాలి. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో కనిపించేది వినిపించేది 99% అది నిజమా అబద్ధమా తెలుసుకొని మీరు దాన్ని కి రియాక్ట్ అవ్వాలి. ఇంకా చెప్పాలంటే మీరు సోషల్ మీడియాలో ఉన్న ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోవాలి. ఆ గొప్ప విషయం ఏంటంటే మీరు youtube లో గాని instagram లో గాని facebook లో గాని మీరు ఏదైతే సెర్చ్ చేస్తారో అదే కంటెంట్ ని ఆ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ మీకు రికమెండ్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి మీకు పనికొచ్చే విషయాన్ని చూశారనుకోండి వాటినే మీకు పద్దాగులు చూపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్లకు వ్యూవర్షిప్ కావాలి యాప్ వాళ్ళకి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి. అలా కాకుండా మీకు సంబంధం లేని చూశారు అనుకోండి ప్రతిసారి మీకు సంబంధం అనేది చూపిస్తూనే ఉంటుంది సో దాని వల్ల మీ టైం అనేది మెజారిటీగా వేస్ట్ అవ్వడానికి ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి ఈ రియాలిటీని తెలుసుకోండి. మీరు ఏదైతే మీకు అవసరం ఉంటుంది అనుకుంటారో వాటినే సర్చ్ చేసి చూడండి ఓవరాల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే మీ జీవితం మీ చేతుల్లో ఉంది. మీ జీవితాన్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటే బాగుపడతారు. లేకపోతే దాన్ని కూడా షార్ట్ లాగో రీడ్ లాగో స్క్రోల్ చేస్తే ఇంకేమవుతారో నేను సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది చెప్పే ఇంకో పాయింట్ ఏంటంటే మేము బాగా కష్టపడి ఏదో కొంచెం రిలాక్స్ అవ్వదు అని చెప్పేసి మొబైల్ చూస్తాం తప్ప వేరే ఉద్దేశంతో మొబైల్ అసలు చూడమని చెప్పేసి అంటూ ఉంటారు. రిలాక్స్ అవ్వాలంటే చక్కగా నిద్రపోవాలి లేకపోతే youtube లో మనకి ఉపయోగపడే కంటెంట్ వెతికి మరి చూడాలి. అంతేగాని రికమెండెడ్ లో వచ్చిన కంటెంట్ ని గనక మీరు చూడటం అలవాటు చేసుకుంటే చివరికి అది ఒక వ్యసనం లా మారిపోతుంది. ఇప్పుడు మనకి ఒక విషయం గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే మనం ఏం చేస్తాం మొబైల్ తీస్తాం సెర్చ్ చేసి చూద్దాం అని చెప్పేసి కానీ మీరు youtube ఓపెన్ చేసినప్పుడు సెర్చ్ చేయడానికంటే ముందే మీకు కొన్ని వీడియోలను రికమెండ్ చేస్తున్నాను అన్నమాట. మీరు ఈ విషయాన్ని మర్చిపోయి ఆ వీడియో చూడటం మొదలు పెట్టారు అనుకోండి మీరు అసలు youtube ఎందుకు ఓపెన్ చేశారో మీరు మర్చిపోతారు. అసలు మీకు అవసరమైన విషయం ఏదో పక్కన పెట్టేసి అనవసరమైన విషయాన్ని మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం యూత్ చేస్తున్న బ్లెండర్ మిస్టేక్ ఇదే అన్నమాట. కాబట్టి ఇది రిపీట్ అవ్వకుండా చూసుకోండి సోషల్ మీడియాని మీరు ఎదగటానికి ఉపయోగించుకోండి ఓవరాల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే మీ సమయాన్ని మీ భవిష్యత్తు కోసం సద్వినియోగం చేసుకోండి. సోషల్ మీడియా ట్రాప్ లో మాత్రం అస్సలు పడకండి.
ఈ ప్రపంచంలో ఉన్న ఒక 100 రోగాలకి 90.999% రోగాలకి మందులు కనిపెట్టేసారు. కానీ కొన్ని రోగాలకు మాత్రం మందులు లేవు ఇంకా రావు కూడా అందులో మొట్టమొదటి రోగం సోషల్ మీడియా అడిక్షన్. కాబట్టి మందులు లేని ఆ రోగం బారిని మాత్రం మీరు అస్సలు పడకండి. ఎందుకంటే మీకైనా నాకైనా ఉన్నది ఒకే ఒక్క జీవితం చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకోండి అంతేనండి అంతకు మించి ఏం లేదు. సోషల్ మీడియా కి దూరంగా ఉండండి లేదండి. నేను సోషల్ మీడియాలో ఉంటా అనుకుంటే మాత్రం మీ జీవితాన్ని కాస్తో కూస్తో మార్చగలిగే కంటెంట్ ని ఫాలో అవ్వండి లేకపోతే బాగా పని చేసుకొని కొంచెం రిలాక్స్ అవుతారంటే మాత్రం రోజు మొత్తం మీద ఒక గంటో అరగంటో సెల్ ఫోన్ చూడండి తప్పే లేదు. అంతకు మించి చూస్తే మాత్రం మీ జీవిత లక్ష్యాన్ని మీరు చేరుకోలేరు.
2 thoughts on “మీ జీవితాన్ని నాశనం చేసే సోషల్ మీడియా | Social media is destroying our youth”