ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్రపోవాలంటే – How to Sleep Better in Telugu
ఇవాళ్టి టాపిక్ లో ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్రపోవాలంటే – How to Sleep Better in Telugu గురించి తెలుసుకుందాం.
ఒత్తిడి లేకుండా నిద్రపోవాలంటే
ఇవాళ మనిషి జీవితంలో నిద్రకు సంబంధించిన సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. మనిషికి ప్రతి రోజు రకరకాల విషయాల్లో మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ రాత్రిపూట మాత్రం నిద్ర అస్సలు పట్టట్లేదు. అసలు నిద్ర ఎందుకు పట్టదు అనే విషయం గనుక మాట్లాడుకుంటే ఒత్తిడి, ఆందోళన ఈ రెండు కామన్ గా మనిషికి నిద్ర లేకుండా చేస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనిషి మనిషికి ఎక్సైట్మెంట్ పెరిగినా కూడా నిద్ర పట్టదు. మామూలుగా ఏ మనిషి అయినా సరే తనకు నచ్చిన పని జరుగుతున్నప్పుడు బాగా ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు. ఇష్టమైన సినిమా చూసేటప్పుడు, క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు, లేకపోతే ఏదైనా పని చేసేటప్పుడు. కాకపోతే చాలా మంది నైట్ పడుకునే ముందు భయంకరంగా మొబైల్స్ చూస్తూ ఉంటారు. అందులో వచ్చే రీల్స్ అవ్వచ్చు షాట్స్ అవ్వచ్చు వీటి వల్ల మీలో ఎక్సైట్మెంట్ పెరిగిపోతూ ఉంటుంది. మీరు చాలా లేట్ గా నిద్ర పోవడానికి కారణం కూడా అవుతుంది. కాబట్టి ఎక్సైట్మెంట్ వల్ల కూడా మనిషికి నిద్ర పట్టదు.
ఈరోజు నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఏ ఒత్తిడి లేకుండా రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడానికి కొన్ని అద్భుతమైన పాయింట్లు చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నిద్రకి మన శరీరానికి సంబంధం ఏంటి మానవ శరీరం ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా మనకి శరీర నిద్ర రాకపోతే మన శరీరం ప్రతి పనిలోనూ వెనకబడుతుంది. ఒక మంచి నిద్ర మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. రాత్రిపూట సరైన సమయానికి నిద్ర పోకపోతే శరీరంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా శరీరంలో స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయి. అవి మన ఆరోగ్యానికి హానికరం. కాబట్టి నిద్రకి అత్యధిక ప్రాధాన్యత మనిషి అనేవాడు ఇవ్వాలి.
ఇక రెండో పాయింట్ ఏంటంటే ఒక మనిషి ప్రశాంతంగా నిద్రపోతే ఏం జరుగుతుంది. ఏ మనిషి అయినా సరే ప్రశాంతంగా పడుకుంటే మన శరీరం వేరే ఒక కొత్త శక్తిని పొందుతుంది. తెల్లవారు జామున లేవగానే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది అలా అనిపించడం కేవలం నిద్ర వల్లే. నిద్రలో మనం విశ్రాంతి పొందితే మనం రోజంతా ఎంతో ఆనందంగా ఉంటాం. కాబట్టి నిద్ర మనిషికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఒక విషయం మీద మనం ఆలోచించేటప్పుడు ఫస్ట్ అఫ్ ఆల్ మన బ్రెయిన్ సరిగ్గా పని చేయాలి కదా. మనం ప్రాపర్ గా నిద్ర పోవడం వల్ల మన బ్రెయిన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఇంకా మూడో పాయింట్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషి పని చేసుకోవాలి. కాకపోతే కొంతమంది ఏంటంటే ఇష్టం ఉన్న పని చేసుకుంటూ ఉంటారు ఇంకొంతమంది ఇష్టం లేకపోయినా కేవలం డబ్బు కోసం అక్కడ పని చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని కొంచెం మీరు మైండ్ లో పెట్టుకోవాలి. మనం ఒకచోట పని చేసేటప్పుడు కష్టపడి పని చేసే ప్రాసెస్ లో మనం కొంచెం ఒత్తిడికి గురవుతూ ఉంటాము ఇష్టం లేని పని చేసేటప్పుడు ఇంకా ఒత్తిడికి గురవుతాము. అంతేకాకుండా పని అంతా ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ బాధ్యతలు ఇంట్లో వాళ్ళ సమస్యలు వాటన్నిటి వల్ల మనకి ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోయి మనకి నిద్ర రాదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ ఎన్విరాన్మెంట్ ని మార్చుకోవాలి. సాయంత్రం ఎనిమిది తర్వాత టీవీ చూడటం ఆపేయాలి. చక్కగా అందరూ కలిసి భోం చేసుకొని ఇంట్లో చాలా ఎర్లీగా లైట్ లైట్ ని ఆఫ్ చేసి నిద్ర పోవడం వల్ల మొదటి, రెండు, మూడు రోజులు నిద్ర రాకపోయినా సరే ఆటోమేటిక్ గా కొన్ని రోజుల తర్వాత అందరికీ నిద్ర వచ్చేస్తుంది. ఇంకా ముఖ్యంగా కుటుంబం మొత్తానికి దైవ భక్తి అనేది చాలా అవసరం. అది ఏ దేవుడైనా అవ్వండి మనకి దైవ భక్తి ఉండటం వల్ల మనం వినే పాటలు అవ్వచ్చు, వినే మాటలు అవ్వచ్చు కొంచెం ఆధ్యాత్మికంగా ఉంటుంది. సో దాని వల్ల మనకి ఏంటంటే మన మైండ్ అనేది కొంచెం రిలాక్స్ అవుతుంది. మనం గుడికి వెళ్ళిన చర్చికి వెళ్ళిన మసీదుకి వెళ్ళిన బ్రెయిన్ స్ట్రెస్ కి గురవ్వదు కదా మనసు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. అలా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక ముద్ద అన్నం తిన్నాం అనుకోండి ఆటోమేటిక్ గా నిద్ర వచ్చేస్తుంది. అంతేనండి అంతకు మించి ఏం లేదు మీ ఇంట్లో ఎన్విరాన్మెంట్ ని మార్చేయండి తర్వాత టీవీ చూడటం ఆపేయండి. సెల్ ఫోన్లు చూడటం ఆపేయండి చక్కగా భోం చేసి ఇంట్లో అన్ని లైట్లు ఆఫ్ చేసి ప్రశాంతంగా పడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందండి. మీరు నిద్ర పోకపోతే మీకే కాదు మీ పక్కనున్న వాళ్ళ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. అది ఏ విధంగా అయినా అవ్వచ్చు ఇన్సోమినియా రోగం అవ్వచ్చు, లేకపోతే నిద్రకు సంబంధించిన రోగాలు కూడా మీకు వస్తాయి. కాబట్టి ఇంట్లో ఎన్విరాన్మెంట్ ని మార్చేయండి ఎర్లీగా పడుకోండి. ఆరోగ్యంగా ఉండండి అంతకు మించి ఏం లేదు మనం ఈ భూమి మీద సంపాదించుకునేది మనతో జీవితాంతం ఉండి ఏదైనా ఉంది అనుకుంటే అది ఖచ్చితంగా ఆరోగ్యం మాత్రమే. కాబట్టి ఆరోగ్యంగా ఉండండి.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
2 thoughts on “ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్రపోవాలంటే | How to Sleep Better in Telugu”