మనిషి జీవితం ఒక యుద్ధం – Best Motivational Story in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Best Motivational Story in Telugu గురించి తెలుసుకుందాం.
జీవితం ఒక యుద్ధం
మీరు నమ్మినా నమ్మకపోయినా జీవితం అనేది ఒక యుద్ధం (Best Motivational Story in Telugu). కాకపోతే మనకు ఒక 20 సంవత్సరాలు వచ్చిందాక మన కోసం ఇంకొకళ్ళు యుద్ధం చేస్తారు అది కూడా కాకపోతే మనకి ఊహ తెలియక ముందు నుంచే మనం యుద్ధం చేయడం స్టార్ట్ చేస్తాము. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే యుద్ధం చేసే సత్తా ఉండి కూడా మన కోసం ఇంకొకళ్ళు యుద్ధం చేస్తే బాగుండు నాకు ఈ జీవితం నచ్చట్లేదు అని చెప్పేసి జీవితం మీద కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు. గట్టిగా మాట్లాడితే వాళ్లకు వచ్చే ప్రాబ్లమ్స్ కోసం ఇంకొకడు యుద్ధం చేయడం ఏంటి అది కాదు కదా లైఫ్ అంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ని మనమే ఎదుర్కోవాలి. మన జీవితంతో మనమే పోరాటం చేయాలి అంతకు మించి వేరే ఆప్షన్ లేదు ఇక్కడ ఎందుకంటే యుద్ధం చేస్తేనే మనకి విజయం దగ్గుతుంది లేకపోతే వీర మరణం దగ్గుతుంది. అందులో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలా కాకుండా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి నా కోసం ఎవరైనా యుద్ధం చేస్తే వాళ్ళ షాడో లో బ్రతికేస్తానంటే మాత్రం జీవితం అనేది అస్సలు వదిలిపెట్టదు. కాబట్టి మీకు మీరుగా పోరాడాలంటే ఫస్ట్ అఫ్ ఆల్ నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే యుద్ధం చేసే వాడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే ధైర్యం. ధైర్యం లేనప్పుడు యుద్ధం కాదు కదా ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టలేము. కాబట్టి యుద్ధం చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ధైర్యం. అంతే కాకుండా స్థిరత్వం యుద్ధం అంటే నాకు తెలిసినంత వరకు మనం ప్రతి రోజు ఫేస్ చేసే సమస్యలు అవ్వచ్చు లేకపోతే మన పక్కన వాళ్ళు క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అది కూడా కాకపోతే నేచర్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. మనకి పుట్టుకుతో వచ్చే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ప్రతిదీ ఒక యుద్ధం లాంటిదే దాన్ని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప దానికి మనం భయపడి అక్కడి నుంచి పారిపోకూడదు. ఎందుకంటే భగవంతుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చింది యుద్ధం చేసి హ్యాపీగా ఉండరా బాబు అని చెప్పి అంతేగాని యుద్ధాన్ని మధ్యలో ఆపేసో లేక లేకపోతే అసలు యుద్ధం మొదలు పెట్టకుండానే అక్కడి నుంచి వచ్చాయి అని చెప్పేసి కాదు. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. అంతే కాకుండా కష్టాలు వచ్చినప్పుడు ఎదుర్కొనేటప్పుడు ఇంకొక పాయింట్ గుర్తు చేసుకోండి ఇలాంటి కష్టాలు జీవితంలో మరిన్ని వస్తాయి వస్తూనే ఉంటాయి అలా వస్తేనే మనం యుద్ధంలో ఒక గొప్ప సైనికుడు అవుతాము లేదు నేను యుద్ధం చేసినా కూడా ఓడిపోతున్నాను అని కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారండి వాళ్ళకి నేను చెప్పొచ్చు పాయింట్ ఏంటంటే ఇక్కడ యుద్ధం చేసే ప్రతి ఒక్కడు గెలవాలని రూల్ లేదండి అలా అని చెప్పేసి చిన్న చిన్న సమస్యలను కూడా మీరు ఒక యుద్ధంలా భావిస్తే మాత్రం మిమ్మల్ని ఎవ్వడు మార్చలేడు. నేనేమంటానంటే ఒక మనిషి భూమి మీద పుట్టిన తర్వాత పడే కష్టాల కంటే అమ్మ కడుపులో నుంచి బయటికి రావడానికి వాడు పడే కష్టాలే చాలా ఎక్కువ. మనం ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ చిన్న చిన్న కష్టాలకి మనం భయపడిపోయి పనికిమాలిన ఆలోచనలన్నీ మన బుర్రలో పెట్టుకొని మనం ఈ ప్రపంచాన్ని వదిలేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటాం.
ఉదాహరణకి సూసైడ్ అనుకోండి ఎందుకంటే చిన్న చిన్న కష్టాలకి చచ్చిపోతున్నారు. ఈ మధ్య జనం కాకపోతే నేను చెప్పొచ్చేది ఏంటంటే చచ్చిపోవటానికి కూడా చాలా ధైర్యం కావాలి. సచచ్చిపోవటానికి వచ్చే ధైర్యంలో 10% ధైర్యాన్ని తీసుకొని మీరు ఈ జీవితానికి అప్లై చేశారు అనుకోండి. మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క యుద్ధంలో మీరే గెలుస్తారు ప్రతి ఒక్క సమస్యని మీరే డీల్ చేసుకుంటారు. ఒకవేళ డీల్ చేసుకోవడం రాకపోతే నేర్చుకుంటారు. నేర్చుకొని మళ్ళీ మీ జీవితాన్ని స్టార్ట్ చేస్తారు అంతే అంతకు మించి ఏం జరగదు నాకు తెలిసి. కాబట్టి మీరు యుద్ధంలో ముందుగానే ఓటమిని అంగీకరించకండి. మీరు యుద్ధం చేయడం నేర్చుకోండి. అందులో గెలిచినా గెలవకపోయినా గెలిస్తే ఓకే ఒకవేళ ఓడిపోయారు అనుకోండి ఇంకోసారి గెలవడానికి ట్రై చేయండి ఎందుకంటే యుద్ధం చేయడం అనేది నిరంతరం ప్రక్రియ అయినప్పుడు గెలుపు ఏంటి ఓటం ఏంటి కాబట్టి యుద్ధాన్ని అంగీకరించండి. అలా అంటే జీవితం మొత్తం కష్టాలు ఉంటాయా మేము లైఫ్ లాంగ్ కష్టపడాలా అని చెప్పేసి చాలా మందికి డౌట్ రావచ్చు నేనేమంటానంటే సాగర మదనం చేస్తేనే కదా అమృతం బయటపడింది. యుద్ధం చేస్తేనే కదా నీలో ఉన్న వీరుడు బయటకు వచ్చేది అలా కాకుండా ఒకళ్ళు షాడో లో బతికేస్తూ నా కోసం ఇంకొకళ్ళు వచ్చి పని చేయాలని చెప్పేసి భ్రమలో బతుకుతూ ఉంటే మిమ్మల్ని ఎవరు మార్చలేరు. ప్రస్తుతం ఎవరైతే జీవితంలో సక్సెస్ ఫుల్ గా ఉన్నారో పెద్ద పెద్ద సెలబ్రిటీలు అవ్వచ్చు బాగా డబ్బు ఉన్నోళ్ళు అవ్వచ్చు. వాళ్ళు ఒక అప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళకి మాత్రమే తెలుసు కొంతమంది చెప్పుకుంటారు ఇంకొంతమంది చెప్పుకోరు ఆ విషయాలన్నీ మనకు తెలియవు కదా. అందుకని మనమందరం ఏమనుకుంటామంటే వాడు చూడరా బాబు అని చెప్పేసి ఏదేదో ఊహించుకుంటూ ఉంటాము కానీ నేను చెప్పవచ్చేది ఏంటంటే కరెక్ట్ గా కష్టపడితే మీరు కూడా ఆ స్థాయికి వెళ్తారు ఆ స్థానంలో ఉంటారు అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యని ఒక యుద్ధం లా ఫీల్ అవ్వండి అందులో మీరు పోరాడండి పోరాడి ఓడిపోయినా పర్లేదు పోరాటం మాత్రం చేయండి అంతేగాని చేయకుండా ఇంట్లో కూర్చుంటే మాత్రం కచ్చితంగా ఓడిపోతారు. కానీ పోరాటం చేశారు అనుకోండి మీకు పోరాటం చేయటంలోనే ఒక నైపుణ్యం వస్తుంది. ఇంకొకసారి ఓడిపోకుండా ఉండటానికి ఛాన్స్ ఉంటుంది.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
3 thoughts on “జీవితం ఒక యుద్ధం | Best Motivational Story in Telugu”