Paneer Samosa : టేస్టీ పీస్ పన్నీరు సమోసా ఇలా చేయండి
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Paneer Samosa : టేస్టీ పీస్ పన్నీరు సమోసా ఇలా చేయండి గురుంచి తెలుసుకుందాం రండి.
సమోసాలు తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే ఇవి నూనెలో దేవి తినడం వలన అనేక సమస్యలు వచ్చి ఇబ్బంది పడుతుంటారు. నూనె వాడకుండా పన్నీర్ సమోసాలు ఎలా హెల్తీగా ఎలా తయారు చేయాలో చూద్దాం.
తయారీకి కావలసిన పదార్థాలు
- మల్టీగ్రెయిన్ పిండి – 200గ్రా)
- ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలు – 1 కప్పు
- పచ్చిబఠాణీలు – 1 కప్పు
- తురిమిన పన్నీరు – 1కప్పు
- పెరుగు – 1 కప్పు
- కొత్తిమీర-1/2 కప్పు
- మామిడికాయ పొడి – 1 టేబుల్ స్పూన్
- వాము – 1 టేబుల్ స్పూన్
- ఎర్ర కారం – 1 టీ స్పూన్
- జీలకర్ర – 1 టీ స్పూన్
- పచ్చి మిర్చి ముక్కలు – 1 టేబుల్ స్పూన్
- పసుపు – కొద్దిగా
- మీగడ – కొద్దిగా
- కరివేపాకు – కొద్దిగా
- ఒక బౌల్లో పిండి తీసుకొని అందులో వాము, పసుపు, పెరుగు వేసి కలపాలి.
- సుమారు గంట సేపు ఈ పిండిని తడిపి పెట్టి ఉంచాలి.
- ఉడకపెట్టిన బంగాళదుంప ముక్కలు ముద్దగా చేసుకుని పెట్టుకోవాలి.
- దీనిలో జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, మామిడికాయ పొడి, సాంబార్ మసాలా పొడి కొద్దిగా వేయాలి.
- తర్వాత రోస్ట్ చేసిన పచ్చిబఠాణీలు, తురిమిన పన్నీరు, కొత్తిమీర కూడా వేసి బాగా కలపాలి.
- తాలింపు కోసం బాండిలో జీలకర్ర, కరివేపాకు, మీగడ వేసి సమోసా కర్రీని వేసి కలపాలి.
- పిండి ముద్దని చపాతీ లాగా చేసుకొని సగభాగం కట్ చేయాలి.
- కట్ చేసిన భాగానికి ఒక వైపు నీళ్లు రాయాలి.
- తర్వాత సమోసా లాగా ఫోల్డ్ చేసి కర్రీని లోపల పెట్టి తడిని పూస్తూ సమోసాని క్లోస్ చేయాలి.
- ఒక ట్రేలో బటర్ పేపర్ వేసి దానిపైన సమోసాలు పెట్టాలి.
- సుమారు 15 నిమిషాలు పాటు సమోసాలని కాల్చుకుంటే సమోసా రెడీ అయినట్టే.
నూనెతో చేసిన ఆహారాలు తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి చాలామంది దీనిని వాడటం తగ్గించారు. అలానే పూర్తిగా నూనె లేని ఆహారాలు తింటే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.