Oats Upma Recipe : ఆరోగ్యకరమైన రుచిగా ఉండే ఓట్స్ ఉప్మా
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Oats Upma Recipe : ఆరోగ్యకరమైన రుచిగా ఉండే ఓట్స్ ఉప్మా గురుంచి తెలుసుకుందాం రండి.
ఈ మధ్యకాలంలో బరువు తగ్గాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఎక్కువగా మిలేట్స్, ఓట్స్ తీసుకుంటుంన్నారు. బొంబాయి రవ్వ, సేమియా ఉప్మాల కన్నా ఓట్స్ ఉప్మా ఆరోగ్యానికి మంచిది, రుచిగా ఉంటుంది. అలాంటి ఉప్మాని టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం.
ఓట్స్ ఉప్మా తయారీకి కావలసిన పదార్థాలు
ఓట్స్ ఉప్మా తయారీ విధానం
- ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకుని అందులో ఓట్స్ వేసి దోరగా వేయించుకొని ప్రక్కన పెట్టుకోవాలి.
- తర్వాత పాత్రలో ఆవాలు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర మీగడ వేసి వేడి చెయ్యాలి.
- తర్వాత అల్లం తురుము, కరివేపాకు వేసి వేయించాలి.
- దీంట్లో పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి.
- దీనికి క్యారెట్ ముక్కలు, పచ్చిబఠాణీలు, పసుపు, క్యాప్సికం ముక్కలు వెయ్యాలి.
- వీటన్నిటినీ సిమ్ లో పెట్టి మగ్గనివ్వాలి.
- దీనిలో టమాటా జ్యూస్, నిమ్మరసం వెయ్యాలి.
- తరువాత ఓట్స్ వేసి బాగా కలపాలి.
- దీనిపై మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లో మగ్గనిస్తే సరిపోతుంది.
- పాత్రని దించే ముందు కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి కలుపుకోవాలి.