మిల్క్ మిస్ట్: Milk Mist Owner Success Story in Telugu
ఇవ్వాల్టి టాపిక్ లో Milk Mist Owner Success Story in Telugu గురించి తెలుసుకుందాం రండి.
మీరు కాంపిటీటివ్ మార్కెట్ లోకి ఒక పెద్ద బ్రాండ్ ని ఎలా పంపించాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ మీ కోసమే. ఎందుకంటే ఈరోజు మీకు చెప్పబోయే కథ డబ్బు లేని బ్రాండ్ వాల్యూ లేని పెట్టుబడిదారుల మద్దతు లేని ఒక 17 ఏళ్ల కుర్రోడి కథ అంతేకాదు అతను 2000 కోట్ల పాల వ్యాపారాన్ని చేస్తున్నాడు. అది కూడా చాలా కాంపిటీషన్ ఉన్న మార్కెట్లో ముఖ్యమైన పరిశ్రమలలో పాల పరిశ్రమ ఒకటి. ఈ పరిశ్రమలలో ప్రొడక్ట్ షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంటాయి అంటే పాలను త్వరగా అమ్మేయాలి. అంతేకాదు లాభ మార్జిన్స్ కూడా చాలా చాలా తక్కువ. కేవలం త్రీ టు 5% మాత్రమే ఉంటాది. పైగా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోకపోతే మీరు ఈ బిజినెస్ లో నుంచి త్వరగా బయటికి వచ్చేస్తారు.
1990 లో ఆపరేషన్ ఫ్లడ్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. ఇది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ప్రారంభించిన ప్రాజెక్ట్. ఇది భారతదేశాన్ని పాల కొరతతో బాధపడుతున్న స్థితి నుంచి ప్రపంచంలో కల్లా అతి పెద్ద పాల ఉత్పత్తిదారుగా మార్చింది. ఇది భారతదేశంపై శ్వేత విప్లవం ప్రభావం అయితే ఆ సమయంలో కొన్ని పాల బ్రాండ్ సంస్థలకి మనీ వాల్యూ బ్రాండ్ వాల్యూ మరియు టెక్నాలజీ వాల్యూ ఉన్నాయి. అయితే ఈ 17 ఏళ్ల కుర్రాడి వద్ద అవేమీ లేవు. ఈవెన్ అతని వ్యాపారాన్ని స్కేల్ చేయడానికి టెక్నాలజీ కూడా లేదు. అతను కాంపిటీషన్ లో ఉన్నాడని కూడా ఎవ్వరికీ తెలియదు. నేను మాట్లాడుతున్న ఈ అబ్బాయి భారతదేశంలోని తక్కువగా అంచనా వేయబడిన వ్యాపారవేత్తల్లో ఒకడు అతనే సతీష్ కుమార్ మరియు అతను నిర్మించిన బ్రాండ్ మిల్కీ మిస్ట్.
నేడు మిల్కీ మిస్ట్ ఎంత విజయవంతమైన బ్రాండ్ వారు దేశమంతటా 2000 కోట్ల విలువైన పాల ఉత్పత్తులను అమ్ముతున్నారు. కాబట్టి ఈరోజు మనం ఈ ఆర్టికల్ లో సతీష్ కుమార్ ఎలా ఈ కాంపిటీషన్ మార్కెట్ లో చోటు సంపాదించారు తెలుసుకుందాం.
సతీష్ కుమార్ తమిళనాడులో వ్యవసాయ కుటుంబానికి చెందిన వాడు. అతను హై స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అతను తన తండ్రి దగ్గర పాల వ్యాపారంలో హెల్ప్ చేసేవాడు, కానీ అప్పటికే వాళ్ళ బిజినెస్ నష్టాల్లో ఉండింది. అప్పుడు అతను వాళ్ళ పాల వ్యాపారంలో మూడు ప్రధాన సమస్యలను తెలుసుకున్నాడు. మొదటిది ఏంటంటే వాళ్ళు అమ్మే పాలకి సరైన విలువ జోడించి లేకపోవడం వలన ఎక్కువ మార్జిన్స్ ని తీసుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు లీటర్ కి 30 పైసల నుంచి ఒక్క రూపాయి మాత్రమే సంపాదించొచ్చు. అమ్మిన పాలల్లో ఇది కేవలం త్రీ టు 5% మార్జిన్ మాత్రమే అంతేకాకుండా కొన్నిసార్లు నష్టానికి కూడా అమ్మాల్సి ఉంటాది.
రెండోది పాలకి కేవలం మూడు నుంచి నాలుగు రోజులు మాత్రమే షెల్ఫ్ లైఫ్ ఉంటది. కాబట్టి వాళ్ళు పాలు పితికిన 10 గంటల లోపే అమ్మేయాల్సి ఉంటాది.
మూడోది ఏంటంటే ఈ కారణంగా వాళ్ళకి లాజిస్టిక్స్ చాలా కష్టంగా ఉంది. కాబట్టి వాళ్ళు తమ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయలేకపోయారు. కాబట్టి సతీష్ కుమార్ ఇవి గుర్తించి తన పాల వ్యాపారాన్ని ఎలా 2000 కోట్ల మిల్క్ మిస్ట్ కంపెనీగా ఎదిగాడో చూడండి. పాలు అందరూ అమ్మే ప్రొడక్ట్ కావడంతో కేవలం త్రీ టు 5% లాభాల మార్చంతో ఉత్పత్తి అవుతుంది. అయితే మిల్కెమిస్ట్ వాళ్ళు పాలను సేకరించి దాని నుంచి పన్నీర్, పెరుగు మరియు నెయ్యిగా మార్చారు. కాబట్టి ఇలా పాలకి విలువ జోడించడం వలన వాటి మార్జిన్ పెరిగాయి. కాబట్టి ఇది మన బిజినెస్ ని లాభదాయకం చేయడంలో సహాయపడింది ఎలా అంటే పాల నుంచి పన్నీర్ చేసినప్పుడు వాటికి మార్జిన్స్ పెరుగుతాయి. అలాగే పన్నీర్ షెల్ఫ్ లైఫ్ కూడా పెరుగుతాది కాబట్టి మీరు ఈ చార్ట్ లో పాల నుంచి ఐస్ క్రీమ్ వరకు షెల్ఫ్ లైఫ్ ని చూడొచ్చు. ఏడు రోజుల నుంచి 30 రోజులు నెల రోజులు, మూడు నెలలు, ఒక సంవత్సరం వరకు పెరుగుతుంది. కాబట్టి అందుకే మిల్కీ మిస్ మార్కెట్ లో పెరుగు మరియు పన్నీర్ ని అమ్మడం మొదలు పెట్టింది మీరు ఒకే రకమైన వస్తువులు అమ్మే మార్కెట్ లో ఉంటే ధరలు తగ్గించడం ద్వారా మీ లాభాలు తగ్గిపోతాయి. కానీ మీరు విలువ పెంచే విధానాలను ఉపయోగిస్తే ధరల పోటీ నుండి బయటపడి నిజానికి ఎక్కువ లాభాలు పొందొచ్చు. కాబట్టి మిల్కీ మిస్ట్ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ కి జోడిని పన్నీర్ ని యూస్ చేసి లాభాల్ని పొందారు. కానీ పన్నీర్ ని ఎక్కువగా హై క్లాస్ పీపుల్ తింటారు కానీ 1991 లో గవర్నమెంట్ పెట్టిన బడ్జెట్ కారణంగా చాలా మంది జనాలకి ఉద్యోగాలు వచ్చాయి అప్పుడు ఇండియాలోని మధ్య తరగతి ప్రజలకి ఉద్యోగాలు రావడంతో వాళ్ళకి పౌష్టిక ఆహారం మరియు ఆరోగ్యం మీద కూడా అవగాహన పెరిగింది. కాబట్టి జనాలు పన్నీర్ ఒక మంచి ప్రోటీన్ పోషక ఆహారం అని తెలుసుకున్నారు. అందుకే పన్నీర్ కొన్ని రోజుల్లోనే చాలా అమ్ముడైంది. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే సతీష్ కుమార్ గారు గ్రేట్ మార్కెటింగ్ చేస్తున్నారు ఎలా అంటే ఎక్కువ మార్జిన్ ఉన్న తక్కువ పోటీదారులు ఉన్న ప్రొడక్ట్ తో మార్కెట్ చేయడం అలాగే మీరు అనుకోవచ్చు తన బిజినెస్ బాగానే జరుగుతుందని కానీ కాదు పన్నీర్ మరియు పెరుగు ఉత్పత్తి చేయడం మరియు అమ్మడం కంటే తనకి వేరే సమస్యలు ఉండేవి.
అవేంటంటే రైతులను పాలు అమ్మే ఒప్పందానికి కట్టుబడేలా ఉంచడం మరియు పాలు నాణ్యత చూసుకోవడం. ఈ సమస్యలను అతను ఎలా పరిష్కరించారో చూడండి. రైతులకి జీవితంలో కావలసిన ముఖ్యమైనవి అందించడంలో కృషి చేశారు. సతీష్ కుమార్ గారు ఎలా అంటే బ్యాంకు వాళ్ళతో కలిసి రైతులకి లోన్స్ ఇప్పించడం 24/7 జంతు సంరక్షణ హెల్ప్ లైన్ ని అందించడం పశువుల దానను జీరో ప్రాఫిట్ కి అందించడం అలాగే రైతులకి టెక్నాలజీ మరియు ఫైనాన్సింగ్ గురించి తెలియజేయడం. అంతేకాకుండా రైతులకి వారానికి ఒకసారి చెల్లింపులు చేసేవారు అందువలన రైతులకి తగినంత డబ్బు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లో ఉండడం వలన బ్యాంకు వాళ్ళు రైతులకి లోన్స్ ఇచ్చే ఛాన్సెస్ పెరుగుతాయని మిల్కీ మిస్ట్ వాళ్ళు ఇలా చేశారు. కాబట్టి ఇప్పుడు ఒక రైతుగా మీరు నాకు చెప్పండి ఒక కంపెనీ మీకు పొందడంలో సహాయం చేయడానికి పశువులని జాగ్రత్తగా చూసుకోవడానికి మీకు టెక్నాలజీ నేర్పి మీ బిజినెస్ ని చూసుకోవడానికి హెల్ప్ చేస్తే మీరు ఆ కంపెనీకి విధేయతగా ఉంటారా లేరా? ఒకవేళ మీ ఆన్సర్ ని మాకు చెప్పాలనుకుంటే కామెంట్ లో చెప్పండి.
ఇప్పుడు మనం మళ్ళీ మిల్కీ మిస్ గురించి మాట్లాడుకుందాం. ఈ విధంగా మిల్కీ మిస్ ఏ ఒప్పందం లేకుండా ట్రస్ట్ అండ్ లాయల్టీని రైతుల నుంచి సంపాదించుకుంది మరియు ప్రతిఫలంగా వాళ్ళు త్రీ మేజర్ బెనిఫిట్స్ ని పొందారు. అవేంటంటే నాణ్యతమైన పాలని పొందగలిగారు ఎలా అంటే 24/7 డాక్టర్స్ ని అందించడం వలన రైతులకి ఆ డాక్టర్స్ ఎలాంటి ఫుడ్ పెట్టాలో చెప్పేవారు. కాబట్టి అప్పుడు మనకి నాణ్యమైన పాలు రావడం జరిగింది. డైలీ పాలు లభించేవి ఎలాగే అలాగే ముఖ్యంగా పోటీదారుల గురించి బెంగ లేదు ఎందుకంటే మిల్కీ మిస్ట్ వాళ్ళు ట్రస్ట్ అండ్ లాయల్టీ తో రైతుల్ని సంపాదించారు. కాబట్టి ఇలా మిల్కీ మిస్ట్ సప్లై ప్రాబ్లం ని సాల్వ్ చేసుకుంది.
ఇప్పుడు మీరు అనుకోవచ్చు మిల్కీ మిస్ట్ వాళ్ళు బాగానే పాలను కొన్నారు. బట్ ఎలా వాళ్ళ ప్రొడక్ట్ ని అమ్మారని మొదట వాళ్ళు బెంగళూరులో ఫైవ్ స్టార్ హోటల్స్ తో స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఫైవ్ స్టార్ హోటల్స్ కి పన్నీర్ ఎక్కువగా వాడతారు. వాళ్ళు వాడే పన్నీర్ ఖచ్చితంగా జీరో టు ఫోర్ డిగ్రీస్ మధ్యలో నిల్వ చేయాలి మరియు మంచి నాణ్యత కలిగి ఉండాలి. కాబట్టి మిల్కీ మిస్ట్ వాళ్ళు ఆ హోటల్స్ కి కావలసిన విధంగా పన్నీర్ ని తయారు చేశారు. నెక్స్ట్ వాళ్ళు కిరాణ షాప్స్ తో స్టార్ట్ చేశారు కానీ అక్కడ వాళ్ళు మళ్ళీ సమస్యను ఎదుర్కొన్నారు. పన్నీర్ కి షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఒకవేళ రీఫ్రిజిరేషన్ లో పెట్టకపోతే ఒక రోజులోనే పాడైపోతది. కాబట్టి మిల్క్ కెమిస్ట్ వాళ్ళకి ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయింది. దీన్ని మిల్కీ మిస్ట్ వాళ్ళు ఎలా సాల్వ్ చేశారంటే తమ పన్నీర్ ని అమ్మే రీటైలర్స్ కి 20000 చిల్లర్స్ ని ఇవ్వాలని అనుకున్నారు. అలాగే వాళ్ళ పన్నీరు ఫ్యాక్టరీలో చేయబడుతుంది. అది దక్షిణాదిలో వివిధ నగరాలకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు చిల్లింగ్ టెక్నాలజీని ట్రక్స్ లోకి కూడా ఇన్స్టాల్ చేశారు. ట్రక్స్ రిటైలర్స్ కి చేరే వరకు చిల్లర్స్ లో ఉంటాయి. కానీ ఈ ట్రక్ డ్రైవర్స్ ట్రిప్ మధ్యలో బ్రేక్ తీసుకున్నప్పుడు రిఫ్రిజిరేషన్ ఆపేయడం వలన పన్నీర్ ని పాడైపోయే ఛాన్స్ ఉంది. అలాగే ఆ ట్రక్స్ కూడా థర్డ్ పార్టీ అవ్వడంతో వీళ్ళు ఏం చేయలేకపోయారు. మిల్కీ మిస్ట్ వాళ్ళు ట్రక్స్ కొనాలని అనుకున్నారు. అప్పుడు వాళ్ళు జర్నీ టైం ని మరియు పన్నీర్ షెల్ఫ్ లైఫ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అనుకున్నారు. ఇప్పుడు మిల్కీ మిస్ట్ వాళ్ళకి 250 కంటే ట్రక్స్ అండ్ ట్యాంకర్స్ ఉన్నాయి వాటి డేటా మరియు లొకేషన్ ని తెలుసుకోవడానికి జిపిఎస్ మెకానిజం కూడా వాడారు. ఇలా సతీష్ కుమార్ గారు ప్రొడక్ట్ మార్జిన్స్ ని పెంచుకుంటూ లాజిస్టిక్స్ ని కూడా ఏర్పరచుకుంటూ తన బిజినెస్ ని 2000 కోట్ల రెవెన్యూ కంపెనీగా మార్చారు. అది కూడా పాలు మరియు పాల ప్రొడక్ట్స్ ని అమ్ముతూ ఈ విజయాన్ని సాధించింది. ఈ టాపిక్ గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి. అలాగే కామెంట్ లో మీకు ఎలాంటి టాపిక్స్ కావాలో మాకు చెప్పండి. తిరిగి మళ్ళీ నెక్స్ట్ టాపిక్ లో కలుద్దాం..
I could not resist commenting. Perfectly written!
Visit my blog post :: https://carinsuranceagents1.z20.web.core.windows.net/how-to-find-best-car-insurance-agent-index-86.html