Haldirams Success Story in Telugu – హల్దిరామ్స్ 25 వేల కోట్లు బూజియ తో ఎలా సంపాదించారు
ఇవాళ్టి టాపిక్ లో Haldirams Success Story in Telugu – బూజియా అమ్ముతూ వేల కోట్ల బిజినెస్ గురించి తెలుసుకుందాం రండి.
బయట ఫుడ్ కి ఉండే డిమాండే వేరు అందులో స్నాక్స్ అంటే నచ్చిన వాళ్ళు ఉండరు. ఆ స్నాక్స్ బిజినెస్ చేస్తూ బిలియనియర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో హల్దీ రామ్స్ ఒకటి. ఈ కంపెనీ గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఒక చిన్న మిఠాయి షాప్ గా మొదలైన ఈ హల్దీ రామ్స్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 80 కంటే ఎక్కువ దేశాల్లో వ్యాపించింది. ఈ Haldirams ఏదో నిన్న మొన్న పుట్టింది కాదండి స్వతంత్రం రాకముందే ఈ బ్రాండ్ స్టార్ట్ అయ్యింది. ఈ హల్దీ రామ్ బ్రాండ్ ఎక్కడ ఎలా మొదలైంది ఎలాంటి బిజినెస్ స్ట్రాటజీని ఫాలో అయ్యింది వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటో ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
ఈ హల్దీ రామ్స్ ను రాజస్థాన్ కి చెందిన గంగాభిషణ్ అగర్వాల్ అనే వ్యక్తి 1941 లో స్థాపించాడు. ఈయన ఒక మార్వాడి ఫ్యామిలీకి చెందిన వాడు. గంగాభిషణ్ అగర్వాల్ ని చిన్నప్పుడు అందరూ హల్దీ రామ్ అని పిలిచేవారు. ఎందుకంటే ఆయన పసుపు పచ్చ రంగులో ఉంటాడు అని అందరూ అక్కడ అతన్ని అలా పిలిచేవారు. రాజస్థాన్ లో బికనీర్ లో వీళ్ళ నాన్నగారు కారపూస అమ్మేవారు. ఈ గంగాభిషణ్ అగర్వాల్ 11వ వయసులోనే వాళ్ళ నాన్నగారితో కారపూస కొట్టులో పని చేసేవాడు. ఈ ప్రయాణంలోనే ఆయనకి కారపూస చేయడం మీద ఇంట్రెస్ట్ వచ్చింది కానీ ఆ బికనీర్ లో అందరూ కారపూసే అమ్ముతారు. అలానే అన్ని షాప్స్ లో టేస్ట్ కూడా ఒకేలా ఉండేది కాబట్టి అక్కడ క్వాలిటీ అండ్ క్వాంటిటీలో కాంపిటీషన్ లేదు కారపూస టేస్ట్ అండ్ ప్రైస్ లో ఉంది అని అనుకున్నాడు. అందుకే ఆయన తను చేసే కారపూసలో టేస్ట్ అండ్ ప్రైస్ మారిస్తే బిజినెస్ సక్సెస్ అవుతాది అని అనుకున్నాడు. అలా ఆలోచన రాగానే అతను వాళ్ళ కారపూస టేస్ట్ మార్చాడు ఎలా అంటే యాక్చువల్ గా కారపూసని శనగపిండితో చేస్తారు కదండీ కానీ ఆయన వెరైటీగా మోత్ బీన్ అనే పదార్థంతో చేశారు. అది ఆ బికానీర్ లో ఉన్న కస్టమర్స్ కి నచ్చడంతో అతనికి సేల్స్ పెరిగాయి. ఆ టైం లో అందరూ కిలో రెండు పైసలకు అమ్మితే ఈయన కిలో ఐదు పైసలకి అమ్మేవారు. దీనివల్ల హల్దీరామ్ గారి కారం పూస్ అంటే కస్టమర్స్ లో ఒక మంచి క్వాలిటీ ప్రొడక్ట్ అనే ఫీలింగ్ వచ్చింది. అలానే అతని ప్రొడక్ట్ కి మంచి పేరు ఉండాలి అని ఆ బికనేర్ కి రాజు అయిన దొంగదేవ్ పేరుని దొంగ సేవ్ గా పెట్టుకున్నారు. ఈ పేరుకి ఈ ప్రొడక్ట్ కి ఏ సంబంధం లేదండి కానీ ఆ పేరు వాడడం వలన తన బిజినెస్ కి ఆ కింగ్ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉపయోగపడ్డాడు. దాంతో కస్టమర్స్ అందరూ ఈ ప్రొడక్ట్ మంచి క్వాలిటీ అందుకే ఇతనికి ఆ దొంగ దేవ్ గారు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు అని అనుకునేవారు. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూస్ చేయడం వలన హల్దీరామ్ భుజియా చాలా ఫేమస్ అయిపోయిందండి. ఈ హల్దీరామ్ భుజియా అందరికీ కాంపిటీషన్ ఇస్తూ మార్కెట్ లో లీడర్ గా మారింది ఆ తర్వాత హల్దీరామ్ గారు తన బిజినెస్ ని బికనేర్ తో పాటు మరికొన్ని సిటీస్ లో కూడా పెట్టారు. హల్దీరామ్ గారికి ముగ్గురు కొడుకులు ఆయన పెద్ద కొడుక్కి నలుగురు పిల్లలు ఆ పిల్లల్లో ఇద్దరే ఈ హల్దీరామ్స్ ని ఒక స్టేజ్ కి తీసుకెళ్లారు. వాళ్లే శివకిషన్ అగర్వాల్ అండ్ మనోహర్ లాల్ అగర్వాల్. హల్దీరామ్ తర్వాత ఈ బుజియా బిజినెస్ ని వాళ్ళ కొడుకులు పెద్దగా ఎక్స్పాండ్ చేయలేకపోయారు కానీ అతని మనవడైన శివకిషన్ అగర్వాల్ అండ్ మనోహర్ లాల్ అగర్వాల్ ఈ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు.
ఇప్పుడు ఈ శివకిషన్ అగర్వాల్ ఎలా తన ఫ్యామిలీ బిజినెస్ ని సక్సెస్ చేశారో చూడండి. ఈయన 1960 లో ఫ్యామిలీ బిజినెస్ లో జాయిన్ అయ్యాడు. ఆ టైం లో ఈ హల్దీరం బిజినెస్ బికానీర్ కోల్కత్తా అండ్ నాగ్పూర్ లో ఉండేది. ఈ శివకిషన్ అగర్వాల్ నాగపూర్ బిజినెస్ ని చూసుకునేవాడు అయితే అక్కడ ఆ టైం లో గుజియా సేల్స్ అంతగా లేవు. కాబట్టి శివకిషన్ అగర్వాల్ మహారాష్ట్రలో ఉండే కస్టమర్స్ ల ఫుడ్ హ్యాబిట్స్ గురించి తెలుసుకోవడానికి మార్కెట్ రీసెర్చ్ చేశాడు. అప్పుడు అతనికి అర్థమైనది ఏంటంటే ఆ మహారాష్ట్ర జనాలు ఎక్కువగా స్నాక్స్ అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఇష్టపడుతున్నారని కాబట్టి అతనికి ఇష్టమైన కాజు కట్లీని మార్కెట్ లో లాంచ్ చేశాడు. మహారాష్ట్ర జనాలకి ఈ కాజు కట్లీ కొత్త స్వీట్ కావడం వలన అందరికీ ఫ్రీ శాంపిల్స్ ఇచ్చాడు. తన షాప్ కి వచ్చే అందరి కస్టమర్స్ తో టేస్ట్ చేపించేవాడు. శివ కిషన్ మార్కెటింగ్ స్ట్రాటజీ వలన కేవలం కొన్ని రోజుల్లోనే కాజు కట్ నాగ్పూర్ మొత్తం స్ప్రెడ్ అయింది. అలా స్వీట్ సేల్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆ తర్వాత ఇంకొన్ని స్వీట్స్ ని కూడా మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేశాడు ఈ బిజినెస్ స్ట్రాటజీ వల్ల కేవలం మూడు సంవత్సరాల్లోనే హల్దీ రమ్స్ బిజినెస్ సేల్స్ ఆకాశానికి అందాయి. అలానే నాగపూర్ జనాలు సౌత్ ఇండియన్ ఫుడ్ అయిన ఇడ్లీ, ఉప్మా, దోసని ఇష్టంగా తినేవారు. కాబట్టి స్వీట్స్ తో పాటు శివకిషన్ అగర్వాల్ ఈ సౌత్ ఇండియన్ ఫుడ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా ఈయన వాళ్ళ ప్రొడక్ట్స్ ని క్వాలిటీగా అందించడం వలన కస్టమర్స్ పెరిగి సేల్స్ పెరిగాయి. కాబట్టి శివకిషన్ అగర్వాల్ గారు తన హల్దీరామ్ బిజినెస్ ని బుజియా నుండి స్వీట్స్ అండ్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ వరకు ఎక్స్పాండ్ చేశారు.
ఇక్కడ మీరు శివ కిషన్ గారి బిజినెస్ స్ట్రాటజీని గమనిస్తే ముందు ఆయన మహారాష్ట్రలో కస్టమర్స్ కి కావలసిన ఫుడ్ ని ఇచ్చి వాళ్ళ నమ్మకం గెలిచారు. ఆ తర్వాత ఆయన వాళ్ళ ఫుడ్ ప్రొడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేసి హల్దీరామ్ గ్రోత్ కి కారణమయ్యారు. శివకిషన్ గారి తర్వాత మనోహర్ లాల్ అగర్వాల్ గారు మరో మెట్టు పైకి ఎక్కించారు. ఆయన చేసినటువంటి చేంజెస్ ఏంటంటే ప్యాకేజింగ్ అండ్ మార్కెటింగ్ మనోహర్ గారు. ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వకముందు ఈ బుజియా నార్మల్ ప్యాకేజింగ్ లో ఉండేది.
1980 సంవత్సరంలో ఎవరు కూడా స్నాక్ మంచిగా ప్యాకేజ్ తో అమ్మేవారు కాదు. ఫుడ్ నార్మల్ ప్యాకేజ్ లో ఉంటే ఎక్కువ రోజులు ఉండదు ఎక్స్పైర్ అయిపోతాయి. కాబట్టి దీన్ని రెక్టిఫై చేయడానికి మనోహర్ గారు ప్యాకేజింగ్ స్టైల్ మార్చారు ఎలా అంటే అందులో నార్మల్ ఎయిర్ కాకుండా నైట్రోజన్ గ్యాస్ ఫిల్ చేయించేవారు. దీనివల్ల ఫుడ్ త్వరగా పాడవ్వదు అలాగే ఆ ప్యాకింగ్ కి అట్రాక్టివ్ కలర్స్ యూస్ చేసేవారు. సీజనల్ అండ్ ఫెస్టివల్స్ కి తగ్గట్టుగా ప్యాకింగ్ చేసేవారు. దానివల్ల కస్టమర్స్ అట్రాక్ట్ అయ్యేవారు సేల్స్ కూడా పెరిగాయి. అయితే మనోహర్ లాల్ గారు ప్యాకేజింగ్ అండ్ ప్రెసెంటేషన్ లో చాలా పెద్ద మార్పు తెచ్చారు ఎలా అంటే వాళ్ళ స్నాక్స్ ని హల్దీరామ్స్ బ్రాండ్ తెలిసేలాగా మంచి ప్యాకేజ్ చేసి మార్కెట్ లోకి వదిలారు. దీనివల్ల హల్దీరామ్స్ బిజినెస్ సేల్స్ 100% పెరిగాయి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్, మాల్స్ లో హల్దీరామ్స్ ఫ్రాంచైజీలు ఓపెన్ చేశారు. అప్పుడు విపరీతంగా హల్దీరామ్స్ ప్రొడక్ట్స్ అమ్ముడిపోయాయి. హల్దీరామ్ ప్రొడక్ట్స్ తమ ఊరిలో లేని వారు సిటీస్ కి వచ్చినప్పుడల్లా స్పెషల్ గా హల్దీరామ్ స్వీట్స్ అనే స్నాక్స్ ని అడిగి మరి కొనేవారు. ఇంతలా హల్దీరామ్ బ్రాండ్ ని సక్సెస్ఫుల్ గా మనోహర్ గారు బ్రాండ్ ప్యాకేజింగ్ ద్వారా తీసుకెళ్లారు.
కొన్ని సంవత్సరాల్లోనే హల్దీ రామ్ కంపెనీ రాష్ట్రాలు దేశాలు కాకుండా వెస్టర్న్ కంట్రీస్ లో కూడా అడుగుపెట్టింది. అంతేకాకుండా విదేశాల్లో కూడా సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేస్తుంది. 1997 లో గంగాభిషణ్ అగర్వాల్ అనే వ్యక్తి జస్ట్ కారపూస అమ్ముతూ స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ ఈరోజు నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ తో పాటు 80 దేశాల్లో ఎక్స్పాండ్ చేసి 400 కి పైగా ఫుడ్ ప్రొడక్ట్స్ తో ఇండియాలోనే లార్జెస్ట్ స్నాక్ మేకింగ్ కంపెనీగా ఎదిగిపోయింది. ఈ రోజుల్లో కల్మ్ వాల్యూ 10 బిలియన్ డాలర్స్ కి క్రాస్ చేసిందంటే మీరు నమ్మగలరా, అగర్వాల్ కుటుంబానికి చెందిన ఈ మూడు వ్యక్తుల వాళ్ళ కష్టం మరియు వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ తో ఈ కారపూస వ్యాపారాన్ని ఇంత పెద్ద బిజినెస్ ఎంపైర్ గా మార్చారు. ఇది నిజంగా ఆశ్చర్య పోవాల్సిన విషయం కాబట్టి మీరు ఈ బిజినెస్ సక్సెస్ స్టోరీ నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ లో ఎంత కాంపిటీషన్ ఉన్నా మీ ప్రొడక్ట్ లో యూనిక్నెస్ ఉంటే అది ఖచ్చితంగా కస్టమర్ ని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు చేస్తున్న బిజినెస్ వేరే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీకు లాభాలు రావు అని నిరాశ పడకండి. ఎప్పుడైతే మీ ప్రొడక్ట్ ని బెటర్ చేయడంలో ఫోకస్ చేస్తారో అప్పుడు అదే కస్టమర్స్ ని మీ దగ్గరికి వచ్చేలా చేస్తాది. అలాగే ఎప్పుడైతే ఒక కొత్త ప్లేస్ లో స్టార్ట్ చేస్తారో అప్పుడు డైరెక్ట్ గా మీ ప్రొడక్ట్ ని లాంచ్ చేయకుండా ముందు ఆ ఏరియాలోని కస్టమర్స్ కి అవసరాన్ని తెలుసుకొని దాన్ని బేస్ చేసుకుని మీ ప్రొడక్ట్ ని లాంచ్ చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది హల్దీ రామ్ సక్సెస్ స్టోరీ. తిరిగి మళ్ళీ నెక్స్ట్ టాపిక్ లో కలుద్దాం..