లులూ ఫౌండర్ సక్సెస్ స్టోరీ – Success Story of Lulu Group Owner
ఇవ్వాల్టి టాపిక్ లో Success Story of Lulu Group Owner గురించి తెలుసుకుందాం రండి.
కిరాణా వ్యాపారం చేసిన వ్యక్తి బిలియనీర్ ఎలా అయ్యాడు
నార్మల్ కిరాణ షాప్ ఓనర్ బిలియన్ బిలియన్ల ఆదాయాన్ని ఎలా సంపాదించాడో తెలుసుకోండి. రీసెంట్ గా మన హైదరాబాద్ లో లూలు మాల్ చేసిన హల్చల గురించి తెలియని వాళ్ళు లేరు లూలు మార్కెట్ ని ఒక భారతీయుడు యూఏఈ నుండి ప్రారంభించినప్పటికీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. అది భారతదేశానికి చేరుకోవడానికి కొంత సమయం పట్టింది. ఈ లూలు మార్కెట్ వ్యవస్థాపకుడు గురించి మరియు ఇది భారతదేశంలోకి ఎలా వచ్చిందో తెలుసుకుందాం.
ఎంఏ యూసెఫ్ అలీ 1955 వ సంవత్సరంలో భారతదేశంలోని కేరళలోని నటిక అనే ప్రదేశంలో జన్మించాడు. అతడు కేరళాలోనే తన చదువు పూర్తి చేసుకున్నాడు అప్పుడు అతను వాళ్ళ పెద్దనాన్న దగ్గర ఉండేవాడు. ఎందుకంటే అతని తండ్రి గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఒక చిన్న కిరాణా దుకానం నడిపేవాడు. మొదట్లో లాయర్ కావాలనుకున్నాడు కానీ కుటుంబం మొత్తం వ్యాపారంలో ఉండడంతో చివరికి అతను కూడా వ్యాపారంలోకి వెళ్ళాడు. అతను 16 వయసులో ఉన్నప్పుడే అహ్మదాబాద్ కు వెళ్లి తన తండ్రి వ్యాపార వ్యాపారాన్ని నేర్చుకోవడం మరియు సహాయం చేసేవాడు అతను 18 సంవత్సరాల వయసులో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిప్లమా కూడా పూర్తి చేశాడు. అతను డిప్లమా చదువుతున్నప్పుడు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఫైనాన్షియల్ గా తక్కువగా ఉండడం వలన దుబాయ్ వెళ్ళాలని అనుకున్నాడు. అతనికి అక్కడ చిన్న కిరాణా దుకానం ఉన్న మేనమావ ఉన్నాడు. అలా తన 18 వ ఏట 1973 డిసెంబర్ 26న దుబాయ్ వెళ్ళిపోయాడు. యూసఫ్ అలీ తన మేనమావ ఎం కే అబ్దుల్లా కిరాణ దుకానంలో ఉద్యోగం చేస్తూనే వ్యాపారం స్టార్ట్ చేశాడు. అతను కష్టపడి పని చేసేవాడు మరియు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడేవాడు అతను పని చేస్తున్నప్పుడు తన చుట్టూ ఉన్న మార్కెట్ పై దృష్టి పెట్టాడు. వస్తువులను ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయడానికి చాలా అవకాశం ఉందని తెలుసుకున్నాడు. తర్వాత ఆస్ట్రేలియా హాంగ్కాంగ్ మరియు సింగపూర్లకు వెళ్లి సూపర్ మార్కెట్ మరియు హైపర్ మార్కెట్ల గురించి తెలుసుకున్నాడు. ఒక టైం లో ఎన్ఐ అందరూ తమ ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు యూసఫ్ అలీ దేశంలోనే ఉండి వ్యాపారాన్ని విస్తరించడంలో మునిగిపోయాడు. 1990 సంవత్సరంలో అరబ్ లో రీటేల్ సెక్టార్ మంచి ఊపులో ఉంది ఆ సమయంలో ఇండియా నుంచి వెళ్ళిన చాలా మంది రీటేల్ బిజినెస్ లు చేసి విజయం సాధిస్తున్నారు. అదే సమయంలో అరబ్ గవర్నమెంట్ వేరే దేశం నుంచి కూడా రీటేల్ బిజినెస్ చేయడానికి అరబ్ లో ఇన్వైట్ చేశారు. అలా చాలా మంది విదేశాల నుంచి అరబ్ లో రీటేల్ బిజినెస్ స్టార్ట్ చేశారు ఎక్కువ మంది దుబాయ్ లో రీటేల్ స్టోర్స్ పెట్టారు. కానీ పక్కన ఉన్న అబుదాబిలో ఎక్కువ స్టోర్స్ పెట్టలేదు. దాంతో యూసఫ్ అలీకి అబుదాబిలో సూపర్ మార్కెట్ పెట్టాలని ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనని మేనమామకి చెప్తే ఆయన ఒప్పుకోలేదు దాంతో అలీ తన మేనమామ సూపర్ మార్కెట్ నుండి బయటకు వచ్చి తన దగ్గర ఉన్న కొద్ది డబ్బుతో సొంతంగా అబుదాబి లో సూపర్ మార్కెట్ స్టార్ట్ చేశాడు. అదే టైం లో అరబ్ గవర్నమెంట్ అబుదాబి సముద్రంలో మానవ నిర్మిత ద్వీపాన్ని నిర్మిస్తుంది దానికి అక్కడ గవర్నమెంట్ లూలు ఐలాండ్ అనే పేరు పెట్టింది. దాంతో అలీ ఆ ఐలాండ్ రాబోయే రోజుల్లో బాగా ఫేమస్ అవుతుంది అని భావించి అదే పేరుతో తన రీటేల్ బిజినెస్ కి రిజిస్ట్రేషన్ చేయించాడు. దాంతో ఆయన సూపర్ మార్కెట్ లూలు స్టోర్ గా మారింది అలా 1995 సంవత్సరంలో కేవలం 34 సంవత్సరాల్లోనే అబుదాబిలో సొంతంగా ఒక ఇండియా లూలూ సూపర్ మార్కెట్ స్టార్ట్ చేశాడు. అలా 1995 లో అబుదాబి కేంద్రంగా ప్రారంభమైన ఆయన వ్యాపార సామ్రాజ్యం అంచలంచులుగా ఎదిగింది. కేవలం స్టార్ట్ చేసిన 15 సంవత్సరాల్లోనే అరబ్ లోనే అతి పెద్ద రీటేల్ సంస్థగా ఎదిగిపోయింది దాంతో 2010 నుంచి రీటేల్ బిజినెస్ ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లి సూపర్ మార్కెట్ కాస్త హైపర్ మార్కెట్ లాగా మార్చాడు అలీ. సూపర్ మార్కెట్ అంటే సరుకులు, కూరగాయలు, పండ్లు, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ ఉంటాయి. అదే హైపర్ మార్కెట్ లో అయితే వీటి వీటితో పాటు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ బ్రాండెడ్ వస్తువులు, ఫర్నిచర్, కాఫీ స్టాల్స్ లాంటివి కూడా ఉంటాయి. అంటే హైపర్ మార్కెట్ లో దొరకని వస్తువు అంటూ ఉండదు. ఆ విధంగా తన బిజినెస్ ని మరో స్థాయికి తీసుకెళ్ళాడు. హైపర్ మార్కెట్ ను ఈ అబుదాబి దుబాయ్ తో పాటు యూఏఈ, కువైట్, కతర్, ఒమెన్, యమెన్ మరియు ఇండియాలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అలా లూలు కి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. 2022 నాటికి లూలు గ్రూప్ కు జీససి లో 200 కంటే ఎక్కువ లూలు హైపర్ మార్కెట్లు ఉన్నాయి. భారతదేశంలో నాలుగు మాల్, మలేషియాలో ఒకటి మరియు ఇండోనేషియాలో నాలుగు ఉన్నాయి. లూలో గ్రూప్ లో 50000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో 38 విభిన్న దేశాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. ఇందులో 70% పైగా భారతీయులే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 260 రీటేల్ స్టోర్స్ నడుపుతుంది. ఈ లూలు గ్రూప్ అలాగే 64వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. యూసఫ్ అలీ ఆ తర్వాత అలీ తన బిజినెస్ ని కేవలం రీటేల్ రంగంలోనే కాకుండా ఫైవ్ స్టార్ హోటల్స్ రంగంలో కూడా విస్తరించారు. ప్రతి హైపర్ మార్కెట్ లో కన్వెన్షన్ తెచ్చాడు. అలా లూలు గ్రూప్ గ్రాండ్ హయత్ మరియట్ మిలియన్ హోటల్స్ లాంటి దాదాపు 10 కి పైగా విలాసవంతమైన హోటల్స్ ని నడుపుతుంది. కొచ్చిన్ లో ఉన్న గ్రాండ్ మ్యారియట్ హోటల్స్ లూలు గ్రూప్ కి చెందినవి. అంతేకాకుండా లూలు గ్రూప్ హెల్త్ కేర్ సెక్టార్ లో అడుగుపెట్టింది. లూలు గ్రూప్ కేరళ ఢిల్లీలో హాస్పిటల్ ఫార్మా వ్యాపారం చేస్తుంది, అయితే ఈ అలీ కేరళాకి చెందిన వాడు కావడంతో ఇండియాలో మొదటగా ఆయన వ్యాపారాన్ని కేరళాలో స్టార్ట్ చేశాడు. 2013 లో కొచ్చిన్ లో లూలు హైపర్ మార్కెట్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత త్రివేండ్రం లో మరో లూలు హైపర్ మార్కెట్ స్టార్ట్ చేశాడు. అలా 2013 లో ఇండియాలో లూలు గ్రూప్ తన వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది ఇప్పటివరకు లూలు గ్రూప్ కొచ్చిన్, త్రివేండ్రం, కోయంబత్తూర్, లక్నౌ, హైదరాబాద్ ఇలా మొత్తం ఐదు సూపర్ మార్కెట్లు ఇండియాలో స్టార్ట్ చేసింది. వాటితో పాటు నోయిడా, కాన్పూర్, జైపూర్, శ్రీనగర్ లో హైపర్ మార్కెట్లు స్టార్ట్ చేయబోతుంది. అలా లూలో గ్రూప్ ఇప్పటివరకు 40 కి పైగా దేశంలో రీటేల్ బిజినెస్ స్టార్ట్ చేసింది. అంతేకాదు యూసఫ్ అలీ అనేక సామాజిక కార్యాల్లో పాల్పొంచుకున్నాడు. వీటిలో ఎర్త్ క్వేక్ రిలీఫ్ ఫుడ్ రిలీఫ్ భోజనం అందించడం మరియు స్కూల్స్ ని దత్త తీసుకోవడం లాంటివి చాలా చేశాడు. 2019 ఫోబ్స్ లిస్ట్ లో ఇండియాలోనే 19వ ధనవంతుడిగా నిలిచాడు. ఆయన వ్యాపారంలో సాధించిన గుర్తింపుగా 2008 లో సెంట్రల్ గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డ్ కూడా ఇచ్చింది. అలాగే 2021 లో అబుదాబి నుంచి హైయెస్ట్ సివిలియన్ అవార్డు అందుకున్నాడు. ఒక మామూలు మధ్య తరగతి భారతీయుడు బయట దేశంలో సాధించిన విజయం ఇది చాలా మందికి ఖచ్చితంగా స్ఫూర్తినిస్తుంది. మీ బిజినెస్ చిన్న వ్యాపారమా లేదా పెద్ద వ్యాపారమా ఆలోచించక్కర్లేదు మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే మీరు చేసే పని మీద శ్రద్ధ పెడితే మీరు విజయాన్ని సాధిస్తారు. మీరు ఇలానే విభిన్న రకాల బ్రాండ్ యజమానుల గురించి తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మళ్ళీ తరువాత టాపిక్ లో కలుద్దాం.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
1 thought on “లులూ ఫౌండర్ సక్సెస్ స్టోరీ | Success Story of Lulu Group Owner”