కోపం రావడం వలన జరిగే నష్టాలు – Disadvantages of Anger in Telugu
ఇవాళ్టి టాపిక్ లో Disadvantages of Anger in Telugu గురించి తెలుసుకుందాం.
ప్రతి చిన్న విషయానికి కోపం రావడం వలన జరిగే నష్టాలు
మామూలుగా చాలా మంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే నవ్వు నాలుగు విధాలుగా చేటు అంటారు. అంటే ఎక్కడ నవ్వాలి ఎలా నవ్వాలి టైమింగ్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ నవ్వుకి నువ్వు రాంగ్ టైమింగ్ లో రాంగ్ గా నవ్వావు అనుకో దాని అర్థమే మారిపోతుంది. అలాగా నవ్వు నాలుగు విధాలుగా సేటు అంటారు, కానీ ఈ కోపం అనేది అన్ని విధాల సేటు. ఈరోజు మన టాపిక్ కూడా అదే. మనకి కోపం రావడం వల్ల ఎవరు లాభపడుతున్నారు ఎవరు నష్టపోతున్నారు అనే పాయింట్ గనక మాట్లాడుకుంటే 100 కి 100% నష్టపోయేది మనమే.
ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్తే అసలు కోప్పడటం వల్ల మనం ఎలా నష్టపోతాం అనుకుంటే మాత్రం. ఫస్ట్ అఫ్ ఆల్ మన కోపం యొక్క ఎఫెక్ట్ శారీరక ఆరోగ్యం మీద పడుతుంది మనకు కోపం వచ్చినప్పుడు ఏమైపోతుంది మన శరీరం అనేది ఒత్తిడికి లోనవుతుంది హార్ట్ బీట్ మారిపోతుంది రక్తపోటు పెరిగిపోతుంది. నిజం చెప్పాలంటే మన శరీరం అతలాకుతలం అయిపోతుంది. అవతల వాడు ఎంత ఇబ్బంది పెట్టిన సరే మీరు సైలెంట్ గా ఉండండి అని అయితే నేను చెప్పట్లేదు. నేను ఏమంటున్నానంటే మీ కోపానికి ఒక అర్థం ఉండాలి మీ కోపంలో న్యాయం కూడా ఉండాలి. అలా కాకుండా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వెనకాల ఎవడో హార్రర్ కొట్టాడు అని చెప్పి దానికి కోప్పడిపోయి అంతే కాకుండా మనం ఏదైనా పని నుండి బయటికి వెళ్ళినప్పుడు క్రౌడ్ బాగా ఉందనుకోండి అక్కడ దాన్ని చూసి కూడా మనకు కోపం వచ్చిందంటే ఈ ప్రపంచంలో మనల్ని ఎవ్వడు మార్చలేడు మన కోపానికి ఒక అర్థం ఉండాలి. అందులోనూ మనకి కోపం రావటం వల్ల కొన్ని పనులు జరగాలి అంతే కానీ మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టేసుకొని మీ శారీరక ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటే ఆ నష్టం మీకు కలుగుతుంది కానీ అవతల వాడికి అస్సలు కలగదు. నేను ఏమంటానంటే కోపం వచ్చినా కూడా దాన్ని కంట్రోల్ చేసుకొని ఆ సమస్యకి సొల్యూషన్ వెతుక్కోవడం వల్ల మన శారీరక ఆరోగ్యం అనేది ఒత్తిడికి గురవదు హార్ట్ రేట్ పెరగదు రక్తపోటు రాదు ఇలా చాలా విషయాలు మన శరీరంలో జరగకుండా ఉంటాయి. కాబట్టి మీరు కోపం వచ్చినా కూడా ఆ కోపం ఎందుకు వచ్చింది. మాకు మళ్ళీ కోపం రాకుండా అంటే ఏం చేయాలి అని చెప్పేసి ప్రాపర్ గా అనాలసిస్ చేసుకోండి ప్రాక్టికల్ గా ఉండండి. దాని వల్ల ఆల్మోస్ట్ మనకి కోపం రాకుండా ఉండడానికి ఛాన్సులు ఉంటాయి ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మనకి తరచు కోపం రావడం వల్ల మన శారీరక ఆరోగ్యం కాకుండా మన మానసిక ఆరోగ్యం కూడా చాలా నష్టపోతూ ఉంటాం మనం.
ఉదాహరణకి కోపం అనేది శరీరాన్ని మాత్రమే కాదు మనసును కూడా ప్రభావితం చేస్తుంది. ఊరుకోరుకునే కోపం వచ్చేయడం వల్ల మనం ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటాం భయపడుతూ ఉంటాం నిరాశ చెందుతూ ఉంటాం. నిజం చెప్పాలంటే డిసిషన్ మేకింగ్ అనేది మనలో మెల్లగా సన్నగిలిపోతూ ఉంటుంది. ఒక విషయం మీద ప్రాపర్ అవగాహన మనకు ఉండదు వరకునే కోపం వచ్చేస్తుంది అలా కోపం వచ్చినప్పుడు ఆలోచించే అంత టైం ఎక్కడ ఉంటుంది మనకి. కాబట్టి మెంటల్ హెల్త్ కూడా ఈ కోపం వల్ల చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇంకా మెంటల్ హెల్త్ ఏ డిస్టర్బ్ అయినప్పుడు మనకి డిసిషన్ మేకింగ్ ఏముంటుంది మనం ఒక విషయం మీద ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు దాని మీద ప్రాపర్ అవగాహన ఉండాలి కదా అలా కాకుండా కోపంలో డిసిషన్ తీసుకుంటే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి కోపం వల్ల ఫస్ట్ ఫస్ట్ మనం కోల్పోయేది మన శారీరక ఆరోగ్యం అంతే కాకుండా మన మానసిక ఆరోగ్యం సరే వీటితో పోయిందిలే అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే మనం మన చుట్టూ ఉండే వాళ్ళ సంబంధాలు కూడా కోల్పోతూ ఉంటాం అంటే రిలేషన్షిప్స్ అన్నమాట. వాళ్ళతో మనం కోపంగా మాట్లాడటం వల్ల వాళ్ళు మనల్ని అర్థం చేసుకునే విధానం మారిపోతుంది వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మనతో పాటు పని చేసే వాళ్ళు అవ్వచ్చు వాళ్ళందరితో మనం కొన్ని కొన్ని సార్లు కోపంగా మాట్లాడే మాటల వల్ల వాళ్ళు మనకి శాశ్వతంగా దూరం అవ్వచ్చు లేకపోతే మీకు దూరం అవ్వకపోయినా కూడా మీ గురించి వాళ్లకున్న ఒపీనియన్ మొత్తం మారిపోయింది పోయి మీతో నవ్వుతూ మాట్లాడుతారు కానీ పక్కకి వెళ్ళిన తర్వాత వీడో షార్ట్ టెంపర్ గాడు అని చెప్పేసి మీ గురించి వాళ్ళు మిగతా వాళ్ళకి ప్రచారం చేస్తూ ఉంటారు. నేను ఏమంటానంటే వాళ్ళు మిమ్మల్ని అలా అర్థం చేసుకున్నారు మీరు కూడా వాళ్ళ దగ్గర అలాగే బిహేవ్ చేశారు. కాబట్టి ఈ కోపం వల్ల మన రిలేషన్షిప్ అనేది చాలా డామేజ్ అవుతుంది.
ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఈ కోపం వల్ల చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి. కోపంలో మనం తీసుకునే నిర్ణయం ఏమైపోతుందో మీ అందరికీ తెలుసు అని ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలి అంతేకాకుండా దాని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఎన్ని నిరుపయోగాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రాపర్ అనాలసిస్ చేసుకొని మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ కోపంలో ఉన్నప్పుడు హటాత్తుగా తీసేసుకుంటాము అలా తీసుకోవడం వల్ల మనకు నష్టం జరిగిన తర్వాత మనమే మళ్ళీ బాధపడుతూ ఉంటాము. కాబట్టి కోపం వల్ల మనకి తెలియకుండా మన జీవితంలో ఇన్ని ధోరణాలు జరుగుతున్నాయి. నేనేమంటానంటే కోపాన్ని ఒకేసారి మనం తగ్గించుకుంటాం అంటే తగ్గించుకోలేము అది జరగని పని కానీ కోపాన్ని తగ్గించుకునే మార్గాలు మాత్రం చాలా చాలా ఉన్నాయి. అందులో ఆధ్యాత్మికంగా ఉండటం అవ్వచ్చు లేకపోతే ధ్యాన మార్గం ఇంకా ముఖ్యంగా మంచి మంచి మ్యూజిక్ వింటూ మీ మనసుని ప్రశాంతంగా ఉండేలా చేసుకోవడం మరీ ముఖ్యంగా మంచి మంచి పుస్తకాలు చదవడం వల్ల కూడా ఈ ప్రపంచం మనకి ప్రాపర్ గా అర్థమవుతుంది జీవితం యొక్క విలువ తెలుస్తుంది. మనం ఎన్ని రోజులు ఉంటాం చెప్పండి భూమి మీద ఉండే ఈ నాలుగు రోజులు చంపడానికి మళ్ళీ కోప్పడటం కూడానా చెప్పండి. కాబట్టి ఇలాగ ప్రాపర్ గా మనం ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయడం వల్ల అది బుక్ చదవడం వల్ల అవ్వచ్చు మంచి మంచి మాటలు పెద్దవాళ్ళు చెప్పినవి వినటం అవ్వచ్చు లేకపోతే ఇంకేదో ఏదైనా మార్గం వచ్చు అలా వాటిల ద్వారాగా మనం ఏంటంటే ఈ ప్రపంచాన్ని ఈ మనుషుల్ని ప్రాపర్ గా అర్థం చేసుకుంటే మీకు అసలు కోపమే రాదండి బాబు ఇది మాత్రం గ్యారెంటీ. కాబట్టి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోండి మనుషుల్ని అర్థం చేసుకోండి చక్కగా ఆధ్యాత్మికంగా ఉండండి ఎక్కువ పుస్తకాలు చదవండి నాలెడ్జ్ ని గెయిన్ చేయండి లైఫ్ లో హ్యాపీగా ఉండండి. కోప్పడటం వల్ల మనకి నష్టాలు ఎక్కువ ఉన్నాయి తప్ప అవతల వాళ్ళకి అస్సలు లేవు. కాబట్టి మాక్సిమం కోప్పడకుండా ఉండటానికి ట్రై చేయండి. అలా చేయటం వల్ల మీరే జీవితంలో హ్యాపీగా ఉంటారు.
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.